చెట్టును ఢీకొన్న డీసీఎం  | 10 Members Injured In Road Accident At Chegunta Medak District | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న డీసీఎం 

Published Sat, Jun 13 2020 2:19 AM | Last Updated on Sat, Jun 13 2020 2:19 AM

10 Members Injured In Road Accident At Chegunta Medak District - Sakshi

రోడ్డు కిందికి దూసుకెళ్లిన డీసీఎం

చేగుంట: పెళ్లి విందుకు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్‌ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన సంఘటనలో 10 మంది గాయపడ్డారు. మెదక్‌ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్‌ శివారులో  శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  కామారెడ్డి జిల్లా బాగిర్తిపలికి చెందిన ఎర్రగుంట మల్లేశం కూతురు వివాహం గురువారం జరిగింది. శుక్రవారం వధువు బంధువులు వరుడి గ్రామమైన తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో విందుకు డీసీఎం వ్యాన్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో జప్తిశివునూర్‌ శివారులోకి రాగానే వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎర్రగుంట మల్లేశంతో పాటు లక్ష్మి, బక్క మల్లేశం, రాజన్నగారి శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలు కావడంతో వారిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement