Chegunta
-
Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్..
సాక్షి, చేగుంట/ మెదక్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలో మంత్రి కళ్లెదుటే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట మండలం రెడ్డిపల్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన కేటీఆర్ వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. తన వెంట ఉన్న వైద్యుడితో బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బాధితులను తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా కేటీఆర్ చూపిన చొరవకు అక్కడున్న వారు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ' మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు. pic.twitter.com/AgDdpFf55K — KTR News (@KTR_News) July 16, 2023 -
మెదక్ జిల్లా: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
-
సీసీటీవీ దృశ్యాలు: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
సాక్షి, మెదక్: జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు చెలరేగిపోయారు. మక్క రాజుపేట గ్రామానికి చెందిన చింతల రమేష్ వద్ద నుంచి రూ.6 లక్షల 70 వేలు కొట్టేశారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి రమేష్ 6 లక్షల 70 వేల రూపాయలు తీసుకొని బయటకు వచ్చాడు. తన హోండా యాక్టీవా డిక్కీలో ఆ సొమ్ము పెట్టి లాక్ చేశాడు. అనంతరం సమీపంలోని హీరో షాప్‌లో పని ఉండటంతో అక్కడే రోడ్డు పక్కన బండి నిలిపి వెళ్లాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన దొంగలు నిముషాల వ్యవధిలో రమేష్ యాక్టీవా ఉన్న చోటుకి చేరుకున్నారు. సెకండ్ల వ్యవధిలో లాక్ ఓపెన్ చేసి డబ్బులున్న బ్యాగ్‌తో పరారయ్యారు. హీరో షాప్‌లోకి వెళ్లి వచ్చిన రమేష్ వాహనం లాక్ ఓపెన్ చేసి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. సొమ్ము కనిపించకపోవడంతో లోబోదిబోమన్నాడు. చదవండి👉 హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. అక్కడే ఉన్న కొందరి సూచనతో వెంటనే పోలీసులకు తన గోడువెళ్లబోసుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన చేగుంట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు విచారిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘరానా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి👇 ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి కోర్టును ఆశ్రయించిన ప్రజ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ -
కూలీ పనుల కోసం వెళ్లారు.. అంతలో
చేగుంట (తూప్రాన్): రోడ్డు పక్కన నిలిపిన ఆటోను ఓ లారీ వెనక వైపు నుంచి ఢీకొట్టిన ఘటనలో అందులో కూర్చున్న 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట వద్ద ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చేగుంట మండలం మక్కరాజ్‌పేట గ్రామానికి చెందిన మహిళలు మసాయిపేటలోని సీడ్ కంపెనీలో కూలీ పనులకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న ఆటోలో కూర్చోగా అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో మైలారం సుశీల, పుట్ట పద్మ, కొరివిపల్లి నర్సమ్మ, శ్యామల, ఆటో డ్రైవర్ పంబల్ల భిక్షపతి, ఎర్రగొల్ల నాగమని, కొరివిపల్లి రేణుక, మైలారం సంతోష, సుశీల, చింతకింది దుర్గమ్మ, లక్ష్మి గాయపడ్డారు. క్షతగ్రాతులను గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో విషమంగా ఉన్న సుశీల, భిక్షపతి, లక్ష్మిలను హైదరాబాద్ తరలించి వైద్యం అందిస్తున్నారు. గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ( చదవండి: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ) -
చెట్టును ఢీకొన్న డీసీఎం
చేగుంట: పెళ్లి విందుకు వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన సంఘటనలో 10 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బాగిర్తిపలికి చెందిన ఎర్రగుంట మల్లేశం కూతురు వివాహం గురువారం జరిగింది. శుక్రవారం వధువు బంధువులు వరుడి గ్రామమైన తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో విందుకు డీసీఎం వ్యాన్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో జప్తిశివునూర్ శివారులోకి రాగానే వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎర్రగుంట మల్లేశంతో పాటు లక్ష్మి, బక్క మల్లేశం, రాజన్నగారి శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురికి గాయాలు కావడంతో వారిని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. -
కాపాడమని చేతులెత్తి మొక్కినా..
సాక్షి, మెదక్/హైదరాబాద్ : మహమ్మారి కరోనా వైరస్ భయం మనుషుల్లోని మానవత్వాన్ని చంపేసింది. కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కినా ఎవరూ పట్టించుకోలేదు.. సాయం చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ నిండు ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ హృదయవిదారకర ఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నేరేడ్మెట్కు చెందిన ఆర్ శ్రీనివాసబాబు అనే వ్యక్తి బస్సులో వెళుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ప్రాథమిక చికిత్స కోసం మార్గమధ్యలో చేగుంటలో దిగాడు. కొద్ది దూరం నడిచాక ఓపిక లేక రోడ్డు పక్కన పడిపోయాడు. అనంతరం తనను కాపాడాలంటూ అక్కడున్న వారిని చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నాడు. అత్యవరస చికిత్స అవసరమని త్వరగా ఆస్పత్రిలో చేర్పించాలని బతిమిలాడుకున్నాడు. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరికి శ్రీనివాస బాబు రోడ్డు పక్కనే కన్నుమూశాడు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
దండం పెడతా.. నన్ను బతికించండి
-
కరోనా నుంచి కోలుకొని ఇంటికొస్తే..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా చేగుంటలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకొని సంతోషంతో పుట్టిన ఊరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చేదు ఘటన ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చేగుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆస్పత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని హోం ఐసోలేషన్‌కు వచ్చిన సదరు వ్యక్తులను గ్రామస్థులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరు గ్రామంలోకి రావద్దంటూ చేగుంట గ్రామపంచాయతీ ముందు ధర్నాకు దిగారు. దీంతో అధికారులు గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఎంతకీ వినడం లేదు. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రాణాంతక కరోనా నుంచి కోలుకొని వచ్చిన వారిపై కనీస సానుభూతి ప్రదర్శించకుండా గ్రామస్థులు నిర్దాక్షిణ్యంగా అడ్డుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. -
స్వరాష్ట్రానికి వెళ్తూ రోడ్డుపై మహిళ ప్రసవం
చేగుంట (తూప్రాన్): కూలీపనుల కోసం హైదరాబాద్‌కు వచ్చి లాక్డౌన్ సందర్భంగా తమ సొంత రాష్ట్రానికి వెళ్తున్న ఓ గర్భిణి దారిలో రోడ్డుపక్కనే ప్రసవించింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో కూలికోసం అనితాబాయి లోకేశ్ దంపతులు కొంతకాలం కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చారు. లాక్డౌన్ నిబంధనలను కేంద్రం సడలించడంతో తమ రాష్ట్రానికి వెళ్లాలనుకున్న అనితాబాయి కుటుంబీకులు ఓ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు. నార్సింగి వద్ద అనితాబాయికి పురిటి నొప్పులు రావడంతో వాహన డ్రైవర్ వారిని జప్తిశివునూర్ శివారులో దింపేసి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం అనితాబాయి రోడ్డుపక్కనే ప్రసవించి పాపకు జన్మనిచ్చింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న నార్సింగి ఎస్ఐ రాజేశ్ ఉన్నతాధికారుల సూచనలతో తల్లిపాపలను అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రామాయం పేట సీఐ నాగార్జునగౌడ్ ఆస్పత్రికి చేరుకొని తల్లీపాపల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానికుల సాయంతో బేబీకిట్‌ను అందజేసి ఎలాంటి అవసరం ఉన్నా తాము ఆదుకుంటామని సీఐ అనిత కుటుంబీకులకు హామీ ఇచ్చారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో తల్లీపాపలకు మెరుగైన వైద్యం అందించినట్లు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
చేగుంట: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చేగుంట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్టు లెక్చరర్ ప్రమోద్ తెలిపారు. ఇటీవల చేగుంటలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో కళాశాలకు చెందిన వి.శ్రీలత, డి.సంధ్య ప్రతిభ కనబరిచారన్నారు. త్వరలో కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ శశిధర్ అభినందించారు. -
16న జిల్లా స్థాయి యోగా పోటీలు
చేగుంట: అండర్ 19 జిల్లాస్థాయి యోగా పోటీలను ఈనెల 16న చేగుంటలో నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ యోగా ఆర్గనైజింగ్ కార్యదర్శి స్టేట్ అబ్జర్వర్ సురేందర్ సింగ్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కర్నం గణేశ్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు 10వ తరగతి మెమో జీరాక్స్ ప్రతిని తీసుకు రావాలన్నారు. చేగుంట శ్రీకృష్ణవేణి పాఠశాలలో 16న ఉదయం 10 గంటల నుండి సాంత్రం వరకు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు సకాలంలో క్రీడాకారులు హాజరు కావాలన్నారు. -
'బ్రైట్మైండ్స్' కృషి అభినందనీయం
మెదక్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, రఘునందనందన్రావు చేగుంట: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారి భవిష్యత్తుకు కృషి చేస్తున్న బ్రైట్మైండ్స్ అకాడమీ కృషి అభినందనీయమని మెదక్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, రఘునందనందన్రావు పేర్కొన్నారు. బెల్ టౌన్‌షిప్‌లోని శ్రీరామచంద్ర మిషన్ భవనంలో ఆదివారం రాత్రి బ్రైట్మైండ్స్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ సెర్మనీ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని విద్యావిధానంలో వస్తున్న అనేక మార్పులు పోటీ తత్వంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటోందన్నారు. అదే తరుణంలో విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టి బంగారు భవిషత్తుకు బాటలు వేసేందుకు శిక్షణ కార్యక్రమాలు అవసరమన్నారు. అనంతరం కలెక్టర్లు రోనాల్డ్ రోస్, రఘునందన్‌రావు చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామకృష్ణ, బిందు, స్వప్న, బెల్ అధికారులు ధనుంజయ్‌రావు ఉమామహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
చేగుంట: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు కోసం హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. చేగుంటలో బుధవారం చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తమ డిమాండ్‌ను వినిపించడానికి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానం పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఎలాంటి భద్రత ఉండని కుటుంబ సభ్యులకు భరోసా లేని విధంగా ఉంటుందన్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల నుంచి నెలనెలా తీసుకునే డబ్బులను షేర్ మార్కెట్‌కు బదిలీ చేయడంతో పదవీ విరమణ అనంతరం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉద్యోగుల భవిష్యత్తు ఉందని వాపోయారు. ఈ విధానం రద్దు కోసం జరిపే పోరాటంలో అన్ని సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎస్ సంఘం నాయకులు నాగరాజు, లక్ష్మణ్, సిద్దిరాములు, మధన్, వారాల నర్సింలు, రాజేందర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రెడ్డిపల్లిలోని 44 వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ నల్లగుట్టకు చెందిన షేక్ బాహరలి (60) షేక్ నాజరలి (58) నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు ఓమినీ వ్యానులో వెళుతున్నారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి వద్దకు రాగానే వీరి ముందు వెళుతున్న ఓ బారీ వాహనాన్ని ఓమినీ వ్యాను డీకొట్టడంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఇరువురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందినట్లు ఏఎస్ఐ యాదవరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
‘వాన’ దేవుడా!
చేగుంటపై పగబట్టిన వరుణుడు! సాగుకు, తాగుకు తప్పని నీటి కష్టాలు 30 శాతానికే పరిమితమైన వరి సాగు బోసిపోయిన చెరువులు, కుంటలు అత్యంత లోతుకు పడిపోయిన నీటి మట్టాలు ఆందోళనలో రైతులు, జనం చేగుంట: మండల ప్రజలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక సాగు పనులు సాగక అటు రైతులు, తాగేందుకు నీరు దొరక్క ఇటు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణలోనే భూగర్భ జలాలు అత్యధికంగా పడిపోయిన పది మండలాల్లో చేగుంట ఒకటి. వానలు లేక, బోరుబావుల్లోని నీరు సైతం అత్యంత లోతుకు పడిపోయాయి. నీరు లేక రైతులు పంటలకు దూరంగా ఉంటున్నారు. కనీసం 30 శాతం కూడా వరి సాగులోకి రావడం లేదు. మిగతా ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నా ఒక్క చేగుంటలోనే వరుణుడు పగబట్టినట్టు ఉన్నాడు. వానల కోసం ఈ ప్రాంత రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తూ కాలం గడుపుతున్నారు. వర్షాభావ పరిస్థితులతోపాటు భూగర్భ జలమట్టాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఫలితంగా మండలంలో సాగుకు, తాగు నీటికి కష్టాలు ఎదురవుతున్నాయి. వరుసగా రెండేళ్లపాటు తగిన వర్షపాతం నమోదు కాకపోవడంతో మండలంలో కరువు ఛాయలు అలుముకున్నాయి.గత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం సాధారణం కన్నా తక్కువగా నమోదు కావడం ఈ సారి కూడా సరైన వర్షాలు లేకపోవడంతో కనీసం 30 శాతం కూడా వరిసాగు చేయలేకపోయారు. గత ఏడాది జూలై నెలాఖరుకు 398 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ ఏడాది జూలై చివరి నాటికి 401 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 248 మిల్లీ మీటర్లే కురిసింది. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వేయాల్సిన వరి నాట్లు ఆలస్యం కావడంతో మడుల్లోనే వరి నారు ముదిరి పోయే దశకు చేరుకుంది. గత ఏడాది వర్షాభావంతో ఎక్కడా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకోక పోవడంతో భూగర్భ జలాలు పైకి రాకపోవడంతో వ్యవసాయ బోర్లతోపాటు తాగునీటికి ఇతర అవసరాలకు ఉపయోగపడే బోరుబావుల్లో నీరు అడుగంటి పోయింది. చిన్నశివునూర్, పెద్దశివునూర్, రాంపూర్, పోతాన్‌పల్లి గ్రామాల్లో వరి పంటలు ఎండిపోవడంతో పశువులను మేపాల్సిన పరిస్థితి నెలకొంది. తగ్గుతున్న పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది ఖరీఫ్‌లో 2,200 హెక్టార్లలో వరి వేసుకోవాల్సి ఉండగా 1,700 హెక్టార్లలో, 6 వేల హెక్టార్లలో వేసుకోవాల్సిన మొక్కజొన్న 4 వేల హెక్టార్లలో మాత్రమే వేశారు. గత ఏడాది రబీలో నీటి కొరతతో ఆరుతడి పంటలనే సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2,200 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 630 హెక్టార్లలోనే వరి నాట్లు వేసినట్టు అధికారులు తెలిపారు. 4,500 హెక్టార్లలో మొక్కజొన్న పంట వేయగా చివరి వరకు వర్షం సహకరిస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లపై నిషేధం ఉన్నా... చేగుంట పట్టణంలో బోరుబావుల్లో 500 ఫీట్ల వరకు, గ్రామాల్లో 400 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడతాయనే నమ్మకం లేదు. బోరు బావుల తవ్వకంపై నిషేధం ఉన్నా రిగ్గు యజమానులు గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఎడాపెడా బోరుబావులను తవ్వుతున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడే జరిమానా విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వర్షాకాలంలోనూ మండలంలోని చాలా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేయాల్సిరావడం నీటి ఎద్దడికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆగస్టు మొదటి వారానికి చేరుకున్నా సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు బోసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు తప్పకపోవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి కరువు ఎన్నడు చూడలే... 2002లో వర్షాలు కరువై పంటలకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. మళ్లీ ఇప్పుడు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నం. మా పొలంలో గత ఏడాది సగం పంట మాత్రమే పండించగా ఈసారి ఇంకా వరి నాట్లు ప్రారంభించలేదు. ఈ పదిహేను రోజుల్లో వర్షం కురువకుంటే వరి పంటలకు కష్టకాలమే. - గడ్డమీద రాములు రైతు, చేగుంట ఆరుతడికీ నీరు కరువే మా గ్రామంలో భూగర్భ జలాలు పడిపోవడంతో ఆరుతడి పంటలు వేశాం. జూన్‌లో కూరగాయల పంటలను వేసుకొని తక్కువ నీటి వినియోగంతో పంటలు పండించాలని ప్రయత్నించినా వర్షాలు లేక బోర్లలో నీరు రావడంలేదు. నీటి కష్టంతో ఆరుతడి పంటలు సైతం సరిగ్గా దిగుబడి వస్తాయో లేదో అని భయపడుతున్నాం. - మహిపాల్‌రెడ్డి, రైతు, గొల్లపల్లి -
తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి
చేగుంట (మెదక్) : కుటుంబ కలహాల నేపథ్యంలో కూతురితో సహా ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లయ్యకు ఐదేళ్ల క్రితం ఎల్లమ్మ(25)తో వివాహమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరిద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లమ్మ తన మూడేళ్ల కూతురు శృతితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో తల్లీ కూతుళ్లు కాలి బూడిదైనట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు ఎల్లయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తాం
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేగుంట: అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతి పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చేగుంటలో జీవనభృతి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఉపాధిమార్గం కేవలం బీడీల తయారీ మాత్రమేనన్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో బీడీలు చుట్టే మహిళలకు జీవన భృతి అందిస్తోందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారని కొనియాడారు. ఎంతోమంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీవనభృతి జాబితాలో లేని బీడీ కార్మికులు తమకు కూడా జీవనభృతి అందించేలా చూడాని సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అందరికీ జీవనభృతి కింద పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల వద్దనున్న ఆధారాలను పరిశీలించి పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని ఆయన ఎంపీడీఓ వెంక టేశ్వర్‌రెడ్డికి సూచించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి నగర పంచాయతీ నుంచి గ్రామపంచాయతీగా మారినందున గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదేశించారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లిరమ, సొసైటీ చైర్మన్లు వెంగళరావు, నారాయణరెడ్డి, నాయకులు ముదాం శ్రీను, అంజాగౌడ్, మాసుల శ్రీనివాసు, మంచుకట్ల శ్రీను, సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, నర్సింలు, హరిశంకర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎం పనితీరుపై వాట్స్ప్ కామెంట్లు!
చేగుంట : మండల పరిధిలోని చందాయిపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం పనితీరుపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వాట్సాప్‌లో కామెంట్లు చేశారు. మంగళవారం పలువురు ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను ఫొటోలు తీసి చందాయిపేట పాఠశాల రిజిస్టర్ పరిస్థితి ఈ విధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా హెచ్ఎంపై ఉపాధ్యాయులు వేధింపులకు గురిచేస్తుండడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సైతం కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి హెచ్ఎంను గౌరవించి ఉపాధ్యాయులంతా స్నేహపూరితంగా ఉండాలని సూచించారు. అయినా ఉపాధ్యాయుల వంకర బుద్ధులు మానలేదు. మంగళవారం సైతం ఉపాధ్యాయులు.. హెచ్ఎంపై ఉపాధ్యాయులు పలువురు వాట్సప్‌లో కామెంట్లు చేశారు. ఇదే విషయాన్ని మంగళవారం చేగుంటకు వచ్చిన డిప్యూటీ డీఈఓ శోభను న్యూస్‌లైన్ వివరణ కోరగా పాఠశాల వివరాలు బహిర్గతం చేయడం సైబర్ నేరం కిందకు వస్తుందని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా పాఠశాల విషయాలను వాట్సప్‌లో పొందుపరిచిన విషయంలో ప్రధానోపాధ్యాయురాలు గంగాబాయి మంగళవారం డీఈఓ రాజేశ్వర్రావ్కు ఫిర్యాదు చేశారు. -
వడియారంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా కృషి
చేగుంట: వడియారం రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వడియారంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రైల్వే సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే చెరకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తానని, పాఠశాలల ప్రహరీ నిర్మాణంతో పాటు అటెండర్, స్వీపర్ పోస్టుల నియామకం, గ్రామస్థాయి గోదాములకు కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. కమిటీలో తనకు కేటాయించిన పర్యాటక, రవాణ, ఆరోగ్య, సాంసృ్కతిక విభాగాల గురించి చర్చించి తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. అక్కన్నపేట రైల్వేస్టేషన్లో సమస్యలు పరిష్కరిస్తా రామాయంపేట: రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన రామాయంపేట వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అజంతా ఎక్స్‌ప్రెస్ అక్కన్నపేటతోపాటు చేగుంట స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారని, ఈదిశగా ప్రయత్నిస్తానన్నారు. అక్కన్నపేట స్టేషన్లో స్టాక్ పాయింట్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటానన్నారు. ఆర్టీసీ బస్సులు గ్రామాలకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఆర్టీసీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కాలేదని, ప్రక్షాళన తరువాత పరిస్థితులు చక్కబడతాయన్నారు. అంతకుముందు ఎంపీ స్థానిక అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్ ఎంపీని సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం ప్రతినిధి గొర్రె వెంకటరెడ్డి, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య
చేగుంట, న్యూస్‌లైన్: అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండల పరిదిలోని పోతాన్‌పల్లి గ్రామంలో అది వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి శ్యామల, భర్త అంజనేయు లు వారికి ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన వ్యవసాయ భూమిలో బోరుబావిని తవ్వించారు. దానికొసం కొంత అప్పు చేశారు. అప్పులు తీర్చే విషయంలో మనస్థాపం చెందిన శ్యామల(35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వినాయక్‌రెడ్డి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
చేగుంటలో ఆరోగ్య కార్యదర్శి హల్చల్
చేగుంట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చేగుం టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు శనివారం సందర్శించారు. ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కూడా ఆస్పత్రి పనితీరును తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్యసేవల గురించి స్థానిక డాక్టర్ రాకేశ్‌ను ప్రశ్నిం చారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్ఎంలు ఉండేందుకు క్వార్టర్లు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఆస్పత్రులకు ఉన్నాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధి లో 135 సబ్‌సెంటర్లు ఉండగా 16 కేంద్రాల్లో క్వార్టర్ల నిర్మాణం జరిగిందని సీహెచ్ఓ సునీల్ తెలిపారు. 135 సబ్ సెంటర్లలో క్వార్టర్ల ఏర్పాటుకు 20 ఏళ్లు పడుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పలు విభాగాలను పరిశీలించి పనితీరు తెలుసుకున్నారు. చేగుంట జాతీయ రహదారిపై ఉన్నందున పనివేళలను పెంచి 24 గంటల వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కమిషనర్లను కోరారు. త్వరలోనే చేగుంటలో 24గంటల సేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు కమిషనర్లు సూచించారు. ఆయన వెంట ఇన్చార్జ్ కలెక్టర్ శరత్, కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్యాధికారి పద్మ, ఎన్ఆర్ హెచ్ఎం డీపీఓ జగన్నాథ్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవి తదితరులు పాల్గొన్నారు. వంటశాల నిర్వహణపై ఆగ్రహం వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట అంగన్వాడీ కేంద్రంలోని వంటగది నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటశాల నిర్వహణ బాగా లేదని, గ్యాస్ పొయ్యిపైనే వంట చేయాలని ఆదేశించారు. శనివారం మాసాయిపేటలో మార్పు సమన్వయ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన అంగన్వాడీ కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు. పొగచూరి నల్లగా ఉన్న గోడలు, కట్టెల పొయ్యి, రాళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుదల, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత తదితర విషయాలను పరిశీలించారు. అమృతహస్తం పథకం కింద అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న గర్భిణులను, బాలింతలను ఆయన పలకరించారు. పాలు, గుడ్లు ఎలా సరఫరా చేస్తున్నారనే విషయాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. -
‘సిద్దిపేట రెవెన్యూ’కే చేగుంట
సాక్షి, సంగారెడ్డి: చేగుంట మండలం ఇక నుంచి సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో రానుంది. ఆ మండలాన్ని మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌కు పరిధిలోకి మారుస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా బుధవారం తుది ఉత్తర్వులు (జీవో ఎంఎస్.నెం.553) జారీ చేశారు. అదే విధంగా మంథూర్, అనాజీపూర్ గ్రామాలను దౌల్తాబాద్ మండలం నుంచి తొలగించి, చేగుంట మండలం పరిధిలోకి మార్చినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నవంబర్ 1న జిల్లా గెజిట్‌లో తుది ప్రకటన జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఈ మార్పులను ప్రతిపాదించడమే కాక.. పట్టుబట్టి సాధించుకున్నట్లు చర్చ జరుగుతోంది.