ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
చేగుంట: అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతి పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన చేగుంటలో జీవనభృతి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఉపాధిమార్గం కేవలం బీడీల తయారీ మాత్రమేనన్నారు.
బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో బీడీలు చుట్టే మహిళలకు జీవన భృతి అందిస్తోందన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారని కొనియాడారు. ఎంతోమంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జీవనభృతి జాబితాలో లేని బీడీ కార్మికులు తమకు కూడా జీవనభృతి అందించేలా చూడాని సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అందరికీ జీవనభృతి కింద పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల వద్దనున్న ఆధారాలను పరిశీలించి పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని ఆయన ఎంపీడీఓ వెంక టేశ్వర్‌రెడ్డికి సూచించారు.
గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి
నగర పంచాయతీ నుంచి గ్రామపంచాయతీగా మారినందున గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదేశించారు. చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లిరమ, సొసైటీ చైర్మన్లు వెంగళరావు, నారాయణరెడ్డి, నాయకులు ముదాం శ్రీను, అంజాగౌడ్, మాసుల శ్రీనివాసు, మంచుకట్ల శ్రీను, సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, నర్సింలు, హరిశంకర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తాం
Published Sat, Mar 7 2015 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement