Beedi workers
-
బీడీ బతుకులు మారలే...
మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న బీడీ పరిశ్రమ మసకబారిపోతున్న క్రమంలో తమ బాగుకు పనిచేసే వారి కోసం ఆ కార్మికులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించేంతటి శక్తి ఉన్న తమను ఏ రాజకీయ పార్టీలు ఆదరిస్తాయా.. అని బీడీ కార్మికులు లెక్కలు వేసుకుంటున్నారు. బీడీ కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న జీవనభృతిని నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే, కార్మికుల కనీస వేతనం, పింఛన్ పెంపుతో పాటు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం, సంక్షేమం, వైద్య సౌకర్యాల అమలు హామీలు దిశగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కంపెనీలను కట్టడి చేసేదెవ్వరు? కార్మికులకు వేతనాల పెంపు అంశంలో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన కంపెనీలపై స్థానిక సర్కారు అజమాయిషీ అంతంతమాత్రమే కావడంతో న్యాయం జరగడం లేదు. 2010 నవంబర్‌లో వేతనాల పెంపు కోరుతూ కార్మికులు బంద్ పాటించారు. సుమారు 32 రోజులపాటు సమ్మె సాగిన క్రమంలో అప్పటి సర్కార్ కార్మికుల కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ 2011 డిసెంబర్లో జీఓ 41 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీఓ అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దాంతో కార్మిక సంఘాలు మరోసారి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జీఓ 81 జారీ అయ్యింది. ప్రస్తుతం వేయి బీడీలకు రూ.231 మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి జీఓ 41 అమలైతే ప్రస్తుత పరిస్థితుల్లో వేయి బీడీలకు కనీసంగా రూ.600 వస్తాయనికార్మికులు చెబుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వస్థాయిలో సైతం ఒత్తిడి తెచ్చి కంపెనీల యాజమాన్యాలను ఒప్పించేలా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. తగ్గుతున్న అమ్మకాలు.. పనిదినాలపై ప్రభావం తెలంగాణలో సుమారు 4,74,438 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లలోకి వచ్చి చేరుతున్న మినీ సిగరెట్లతో బీడీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే కార్మికులకు ఆకు, తంబాకు ఇస్తూ మిగిలిన రోజుల్లో కంపెనీలు బంద్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి 312 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం 100 నుంచి 120 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తున్నాయి. వాస్తవానికి సిగరెట్లపై నిబంధనల మేరకు ప్రచారం కల్పిస్తుండగా, బీడీలపై కనీసంగా ప్రచారం లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తమ పనిదినాలూ తగ్గుతున్నాయని కార్మికులు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించే దిశగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దృష్టి సారించలేదన్న అసంతృప్తి కార్మికుల్లో నెలకొంది. ప్రధాన సమస్యలు.. ♦ పని దినాల కుదింపు.. ఫలితంగా వేతనం చాలడం లేదు జీఓ 41(కనీసవేతన చట్టం) అమలు కాలేదు. ♦ ఈఎస్ఐ వైద్య సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు. ♦ సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కరువు. పట్టించుకోని కార్మికశాఖ. ♦ 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యామ్నాయఉపాధి.. కానీ ఇంతవరకు చూపలేదు. ♦ బీడీ కట్టపై పుర్రెగుర్తు తొలగింపు అమలుకాలేదు. ♦ జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండాలని కార్మికుల దీర్ఘకాల డిమాండ్ ఆసరా పింఛన్ రావడం లేదు నేను ఏడేళ్లుగా బీడీలు చేస్తున్నా. పీఎఫ్ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని అంటున్నారే తప్ప.. మంజూరు చేయడం లేదు. – బోండ్ల స్రవంతి, రాచర్లబొప్పాపూర్ -ముజఫర్ -
బీడీ కార్మికులకు న్యాయం చేయండి
ఖలీల్‌వాడి: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని, కురుకురే ప్యాకెట్లు కొనాలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కురుకురే ప్యాకెట్లు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తామని దేశాయ్ బీడీ యజమాన్యం కార్మికులను బెదిరిస్తున్నారని, 1000 బీడీలకు రూ.9చొప్పున తీసుకుంటున్నారని ఆరోపించారు. యజమాన్యంపై చర్యలు తీ సుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు. నాయకులు లక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, విమలమ్మ, పద్మ, వసంత తదితరులున్నారు. -
ఆదుకున్న ‘భృతి’
కోరుట్ల: అసలే అరకొర పనులతో అవస్థలు పడుతున్న బీడీ కార్మికుల ఉపాధికి కరోనా గండికొట్టింది. బీడీలు చేసి కుటుంబాలను పోషించుకోవడం తప్ప ఇతర పనులు చేసుకోలేని కార్మికులకు జీవనభృతి ఆసరాగా నిలిచింది. మినీ సిగరేట్లతో బీడీ కార్మికుల ఉపాధి ఇప్పటికే ప్రశార్థకంగా మారగా..కరోనా లాక్డౌన్ మరింత సమస్యల్లోకి నెట్టింది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో బీడీ కార్మికుల ఉపాధి అవకాశాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. రెండురోజులకోసారి.. గతేడాది సుమారు 9 నెలలపాటు సాగిన కరోనా లాక్డౌన్ ఫలితంగా పూర్తి స్థాయిలో బీడీ కంపెనీలు బంద్ కాగా చాలా మంది కార్మికులు వర్ధి బీడీలు చేసి కంపెనీలు ఇచ్చినంత కూలి తెచ్చుకొని కాలం గడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం మొదట నైట్ కర్ఫ్యూ ప్రక టించింది. మేలో పాజిటివ్ కేసులు మరింత పెరగడంతో 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సమయంలో రెండురోజులకోసారి బీడీ కంపెనీలు కార్మికులకు పనులు కల్పించాయి. నెలకు పదిరోజులకు మించి బీడీ కార్మికులకు పని దొరకలేదు. మే 12 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌తో కంపెనీలు బంద్ చేయడంతో కార్మికులకు పూర్తిగా ఉపాధి కరువై నానాతిప్పలుపడ్డారు. మూడునెలలపాటు.. లాక్డౌన్లో సుమారు 3 నెలలపాటు అరకొర పనులు ఉండడంతో ఇబ్బందులుపడ్డ బీడీ కార్మికులను సర్కార్ అందిస్తున్న జీవన భృతి ఆదుకుంది. జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా 84 వేల మందికి పింఛన్ కింద ప్రతీ నెల రూ.2వేల జీవనభృతి అందుతోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో బీడీ తయారీ కుంటుపడిన కాలంలో కార్మికులు పింఛన్ డబ్బుతో కాలం వెల్లదీశారు. పింఛన్ రాకుంటే తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినా బీడీ కంపెనీలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడం లేదు. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీనెల 26 రోజులపాటు పనులు కల్పించాల్సి ఉంటుంది. బీడీ పింఛనే దిక్కయింది కరోనాతో బీడీ కంపెనీలు రెండునెలలపాటు బంద్ పాటించాయి. రోజు 800 నుంచి వెయ్యి బీడీలు చేసి నెలకు రూ.4 వేల దాకా సంపాదించుకునే మేము రెండునెలలు పనులు లేక తిప్పలు పడ్డాం. అంతో ఇంతో బీడీ పింఛన్ రూ.2వేలు రావడం మాకు ఆసరా అయింది. – పొలాస లక్ష్మి, కోరుట్ల పూర్తి పనులు కల్పించాలి కరోనా లాక్డౌన్ ఎత్తివేసి వారంరోజులు గడుస్తుంది. ఇప్పటికీ బీడీ కంపెనీలు రోజు విడిచి రోజు ఆకు తంబాకు ఇస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేసినట్లే కానీ కంపెనీలు మాత్రం పూర్తిగా పనివ్వడం లేదు. నెలరోజుల్లో కనీసం 20 రోజులైనా పని ఇస్తే బీడీల తయారీపై ఆధారపడిన మాకు కొంత మేలు జరుగుతుంది. – గోనె సరోజ, బీడీ వర్కర్, కోరుట్ల -
రెట్టింపైన ఆసరా
దుబ్బాకటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది బీడీ పరిశ్రమ. జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ పరిశ్రమ రోజురోజు నిరాదరణకు గురవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వారికి ఆసరా పింఛన్ ద్వారా వెయ్యి రూపాయలు అందిస్తున్నారు. కాగా ఈ నెల నుంచి ఆసరా పింఛన్ రూ.2,016కు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఈ పరిశ్రమపై ఆధారపడి 10 లక్షలకు పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 1960 ప్రాంతంలో వెళ్లూనుకున్న బీడీపరిశ్రమ అనతి కాలంలోనే లక్షలాది మందికి జీవనోపాది కల్పిస్తూ తెలంగాణలో అతిముఖ్యమైన రంగంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రధానంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు బీడీ పరిశ్రమకు పుట్టినిల్లు. కొన్నేళ్లుగా పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కేన్సర్ సోకుతుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై ఆంక్షలు విధించింది. బీడీకట్టలపై పుర్రె గుర్తులు, 85 శాతానికి పైగా డేంజర్ బొమ్మలు ముద్రించాలని బీడీ యాజమాన్యాలకు ఆంక్షల విధించారు. అలాగే బీడీలు తాగవద్దని పెద్దఎత్తున ప్రచారం చేయడంతో బీడీ పరిశ్రమ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొన్నేళ్లుగా బీడీలు తాగేవారు తగ్గడంతో చాలా కంపెనీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో లక్షలాది మంది ఆధారపడ్డ బీడీ పరిశ్రమ నెలకు 10 రోజులు కూడా పని కల్పించని దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆగమ్యగోచరంగా మారిన బీడీ కార్మికుల కష్టాలను చూసిన తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు వర్తింప చేసి గత నాలుగేళ్లుగా నెలకు వెయ్యి రూపాయలు అందిస్తుంది. జిల్లాలో 34,464 మంది బీడీ కార్మికులకు ఫించన్లు సిద్దిపేట జిల్లాలో సుమారుగా 50 వేలకు పైగా బీడీకార్మికులుండగా వీరిలో పీఎఫ్ ఉన్న కార్మికులను గుర్తించి గత నాలుగేళ్లుగా ఆసరా పింఛన్లు అందిస్తోంది. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 34,464 మంది బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తున్నారు. బీడీ పరిశ్రమలో బీడీలు చుట్టేవారు, బీడీ కట్టల ప్యాకింగ్, గంపచాట్, బట్టివాలా తదితర రకాల కార్మికులకు ఆసరా పింఛన్లు ఇంకా 10 వేల వరకు కొత్తగా పింఛన్లు పొందిన వారు, నాన్ పీఎఫ్ కార్మికులు పింఛన్లు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లుపొందుతున్నవారు 1,66,145మంది జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు పొందుతున్న వారు 1,66,145 మంది ఉన్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 57,665 మంది, వితంతువులు 50,878, దివ్యాంగులు 14,946 మంది, గీతా కార్మికులు 2,253 మంది, బీడీ కార్మికులు 34,461 మంది, చేనేత కార్మికులు 2,702, ఒంటరి మహిళలు 3,240 మంది లబ్ధిదారులు ఉన్నారు. జూన్ నుంచి ఆసరా ఫించన్లు రెట్టింపు.. జూన్ నెల నుంచి ఆసరా పింఛన్లు రెట్టింపు అవుతుండటంతో బీడీకార్మికుల కుటుంబాలు సం తోషం వ్యక్తం చేస్తున్నాయి. జూన్ నుంచి రెట్టింపు చేస్తూ జూలైలో వారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా బీడీలు చేస్తున్నా.. నేను 30 ఏండ్లకు పైబడి బీడీలు చేస్తున్నా. మాకు వ్యవసాయ పోలం ఉన్నా కాలం సరిగా కాక పంటలు పండడం లేదు. దీంతో బీడీలు చేసుకుంటా బతుకుతున్నాం. ఆసరా పింఛన్ రెట్టింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. బీడీకార్మికులు చాలా ఆనందంగా ఉన్నారు. – అనితారెడ్డి, బీడీ కార్మికురాలు ప్రభుత్వం అండగా ఉంటుంది బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. బీడీ కార్మికుల కష్టాలు స్వయంగా చూసిన వారు కావడంతో ఆసరా పింఛన్లలో అవకాశం కల్పించారు. ఇప్పుడు పింఛన్లు రెట్టింపు చేస్తుండటంతో బీడీకార్మికుల కుటుంబాలకు ఆర్థింకంగా చాలా భరోసా కల్గుతోంది. బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటుంది. – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక. రెట్టింపుతో చాలా మేలు తెలంగాణలో 10 లక్షలకు పైగా కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతుండ్రు. బీడీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షభంలో కూరుకపోవడంతో నెలకు 10 రోజులు కూడా చేతినిండా పని కల్పించని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తుండడం సంతోషకరం. ఇప్పుడు ఆసరా రెట్టింపైతే బీడీ కార్మికులకు చాలా మేలు చేకూరుతుంది. ఇంకా రాష్ట్రంలో పింఛన్లు రాని కార్మికులకు ఆసరా వర్తింపచేసి ఆదుకోవాలి – తుమ్మ శంకర్, తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది ఆసరా పింఛన్లు వెయ్యిరూపాయల నుంచి రూ. 2016కు పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఖార్ఖానాలు ఇప్పుడు 10 రోజులు కూడా పని కల్పించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. 2,016 పెంచడంతో మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. – జరీనా, బీడీ కార్మికురాలు దుబ్బాక -
పదునెక్కుతున్న ప్రచారాస్త్రాలు
ఎన్నికల వేళ ఏం చేయాలో అభ్యర్థులకు బాగా తెలుసు. అందుకే ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయో చిత్రిక పడుతున్నారు. ప్రధాన సమస్యలు గుర్తించి...తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పుకుంటున్నారు. ఇదే కోవలో ముందస్తు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినవిధంగా ‘మేం అది చేశాం..ఇది చేశాం’ అంటూ అధికార పక్షం చెబుతుండగా..నెరవేర్చని హామీలను గుర్తించి వాటిపై ఏం చేశారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కరీంగనర్ జిల్లాలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన పలు అంశాలు అధికార, విపక్షాలకు ఇప్పుడు ప్రచారాస్త్రాలు అవుతున్నాయి. మేనిఫెస్టోలో అంశాల అమలు అధికార పార్టీకి అనుకూలంగా మారనుండగా.. అమలు కాని, అసంపూర్తి పథకాలపై విపక్షాలు విమర్శలు గుప్పించనున్నాయి. ప్రధానంగా బీడీ కార్మికుల సమస్యలు, ముత్యంపేట చక్కెర కర్మాగారం, పసుపు బోర్డు ఏర్పాటు, ప్రవాస పాలసీ, కరీంనగర్లో మెడికల్ కాలేజ్, లెదర్‌పార్కు, పరిశ్రమలు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్రూమ్, దళితులకు మూడెకరాలు భూమి, రైతుబంధు, బీమా, ఆసరా, కాళేశ్వరం, మిడ్‌మానేరు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం తదితర అంశాలు ఇరు పార్టీలకు ప్రచారాస్త్రాలు కానున్నాయి. - ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్షా 50 వేల మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. - వీరి కోసం సిరిసిల్లలో ఈఎస్ఐ ఆస్పత్రి కట్టిస్తామని చెప్పినా జరగలేదు. గృహనిర్మాణ పథకం కూడా అమలు కాలేదు. - చాలా చోట్ల బీడీలను బ్యాన్ చేయడంతో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ప్రత్యామ్నాయం దొరకడం లేదు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. - 1,29,681 మంది బీడీ కార్మికులకు మాత్రం నెలనెలా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. - ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ప్రాంతంలోని నిజాం దక్కన్ షుగర్స్ ప్రై .లిమిటెడ్ చెరుకు ఫ్యాక్టరీ ఈ ఎన్నికల్లోను ప్రధానాంశం కానుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది. చెరకు రైతులకు పెద్ద మొత్తంలో (రూ.12 కోట్ల మేరకు) బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. - అయితే ముత్యంపేట ప్యాక్టరీ మూసివేయడంతో రైతులు ఇతర పంటల వైపు వెళ్లారు. ప్రభుత్వం ప్రయత్నం ఇంకా కొనసాగుతుండగా... ఇదే అంశాన్ని కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. - కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పసుపు పంట దాదాపు 35 వేల ఎకరాల వరకు సాగవుతుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. దీన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకు వస్తోంది. - జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలు గల్ఫ్ వలసలకు కేరాఫ్‌గా చెప్పొచ్చు. వందలాది గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40 వేల మంది సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్‌లో ఉంటున్నారు. - వీరిలో మంచి హోదాలో ఉన్న వారు నాలుగు వేలకు మించి ఉండరు. మిగిలిన వారందరూ కార్మికులుగా పనిచేస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. - గల్ఫ్‌లో కార్మికుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవాస పాలసీని అమలు చేస్తామని చెప్పింది. కొంత ప్రగతి సాధించింది. అయితే అధికారికంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదనే అంశాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ‘బీడీ కార్మికుల ఆస్పత్రి’ కూడా ప్రచారాస్త్రమే.. - ఏడు పూర్వ జిల్లాల్లో 16.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఆశలు పెట్టుకున్నారు. - మంథని, పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీరు అందడం లేదు. ప్రతియేటా ఈ నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంకు శంకుస్థాపన చేయగా, కాళేశ్వరం ప్రాజెక్టుతో ‘పునరుజ్జీవం’ ముడిపడి ఉంది. - సిరిసిల్లలో బీడీ కార్మికుల ఆస్పత్రి, నేతన్నలకు అమల్లోకి రాని వర్కర్ టూ ఓనర్ పథకం, మహిళల ఉపాధికి అపెరల్ పార్క్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, వేములవాడ రాజన్న ఆలయ అభివద్ధికి ఏటా వంద కోట్లు.. ఇలాంటి హామీలు, పథకాలన్నీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రచారాస్త్రాలవుతాయి. - కరీంనగర్ కేంద్రంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కలగానే మిగిలింది. పర్యాటక అభివృద్ధి నేపథ్యంలో మానేరు రివర్‌ఫ్రంట్, బృందావన్ గార్డెన్, తీగెల వంతెన పనులు సాగుతున్నాయి. కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణం సాగుతున్నా, ఉద్యోగావకాశాలపై చర్చ జరగనుంది. - పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ కోటాల కింద 14,500 ఇండ్లు మంజూరైనట్లు ప్రకటించినా పూర్తిస్థాయిలో నిర్మించలేదు. - కోల్‌బెల్టు (రామగుండం) ప్రాంతంలో సింగరేణి అధికారులకు ఇస్తున్న విధంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కోసం 3 గుంటల స్థలం కేటాయింపు, కేసీఆర్ హామీ ఇచ్చిన మారుపేర్లను వెంటనే మార్చే ప్రక్రియ, సింగరేణిలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు, రామగుండంలోని రాముని గుండాలు, శ్రీపాద ప్రాజెక్టు పర్యాటక కేంద్రాలు, బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు తదితర అంశాలు ఎన్నికల తెరపైకి రానున్నాయి. - సుమారు 5.89 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.612 కోట్ల మేరకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రైతుబీమా కింద మొదటి విడతలో 3.19 లక్షల మంది అర్హులైన రైతులకు బీమా బాండ్లను అందజేశారు. ప్రతినెలా 5,44,215 మందికి పింఛన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 1,92,563 మంది వృద్ధులు, 1,31,226 మంది వితంతవులు, 67,804 మంది వికలాంగులు, 9074 మంది చేనేత కార్మికులు, 11,615 మంది గీత కార్మికులు, 1,29,681 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా రూ.59.09 కోట్లు చెల్లిస్తోంది. ప్రధానాంశాలివే... - బీడీ కార్మికుల సంక్షేమం - పసుపు బోర్డు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ - గల్ఫ్ వలస బాధితులు - కాళేశ్వరం, మధ్య మానేరు ‘పునరుజ్జీవం’, ఎస్సారెస్పీ - డబుల్ బెడ్రూం, రైతుబంధు,బీమా, ఆసరా సంక్షేమ పథకాలు - మెడికల్ కళాశాల, అపెరల్ పార్క్, వర్కర్ టు ఓనర్ పథకం - సింగరేణి కార్మికులకు సొంతింటి స్థలం - కె.శ్రీకాంత్‌రావు, నెట్వర్క్ ఇన్చార్జి -
పొగచూరిన బతుకులు!
నంద్యాలటౌన్: బీడీ కార్మికుల బతుకులు రోజురోజుకు దీన స్థితికి చేరుకుంటున్నాయి. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబమంతా కష్టపడి బీడీలు చుట్టినా తగినంత కూలి రావడం లేదు. దీంతో కటుంబపోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం, సంక్షేమ పథకాలు అందకపోడవడంతో ఆర్థిక ఇబ్బందులతో తమతమవుతున్నారు. పట్టణంలో బీడీలు తయారు చేసే మూడు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. బీడీ తయారీకి కావాల్సిన ఆకు, పొగాకు, లేబుళ్లను, బస్తాల రూపంలో కార్మికులకు అందజేస్తారు. ఈ ముడిసరుకులను తీసుకొని కార్మికులు తమ ఇళ్ల వద్దనే బీడీలు తయారు చేస్తారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్, శ్రీనివాససెంటర్, ఖలీల్థియేటర్, ముల్లాన్‌పేట, వీసీకాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 500 మంది బీడీలు చుట్టుతూ జీవనం సాగిస్తున్నారు. కష్టానికి దక్కని ప్రతిఫలం... ఏజెన్సీలు కార్మికులకు వెయ్యి బీడీలు తయారు చేస్తే రూ.100 నుంచి రూ.150 వరకు కూలీ చెల్లిస్తున్నారు. దీంతో ఓ కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా రోజుకు వెయ్యి బీడీల కన్నా ఎక్కువ చుట్టలేమని కార్మికులు చెబుతున్నారు. దీంతో చాలీచాలని కూలిలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నా మని వాపోతున్నారు. పిల్లల చదువులు కూడా భారంగా మారడంతో మధ్యలోనే ఆపివేసి పనులకు పంపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పాలకులు బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఆరోగ్య పథకాలు, రుణాల మంజూ రు, పక్కా గృహాలు, తదితర పథకాలతో ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. కూలీ గిట్టుబాటు కావడం లేదు కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతున్నా. ఈ పని తప్ప వేరే పని తెలియదు. రోజుకు 500 నుంచి 700 వరకు బీడీలు చుడుతాను. రోజుకు రూ.100 కూడా గిట్టడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారుతుంది. – నూర్జహాన్, నంద్యాల ప్రభుత్వం ఆదుకోవాలి బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి రుణాలు, సంక్షేమ పథకాలు అందజేయడం లేదు. ఇతర వృత్తుల కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. – ఫాతిమాబీ, కార్మికురాలు, నంద్యాల -
బీడీపై జీఎస్టీ వద్దు
లక్షల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు ⇒ సిరిసిల్లలో కదం తొక్కిన బీడీకార్మికులు ⇒ పట్టణంలో నిరసన ర్యాలీ ⇒ కలెక్టరేట్ ముందు ధర్నా సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని కార్మికులు నినదించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని, తమ పొట్టకొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత భూమేశ్వర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పుర్రెగుర్తుతో డీలాపడిన బీడీ పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారుతోందని, ఏకంగా పరిశ్రమే ఖాయిలా పడేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు. దీంతో లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. పుర్రె గుర్తుతో ఇప్పటికే కార్మికులకు పనిదినాలు తగ్గాయన్నారు. జీఎస్టీతో నెలకు పదిరోజులు కూడా పనిదినాలు దొరికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ.. సామాన్యుడు బీడీలు కూడా తాగలేని పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించవద్దని డిమాండ్ చేశారు. అనంతరం బీడి కార్మికుల కష్టనష్టాలను వివరిస్తూ..కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల రాములు, జిందం ప్రసాద్, మణెమ్మ, రాధ, బాలక్కతో పాటు కార్మిక సంఘాల నాయకులు, బీడి కార్మికులు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలు లక్షన్నర లోపే!
- ఆర్థిక భృతికోసం ముగిసిన దరఖాస్తు గడువు - 50 వేలకు చేరువైన బీడీ కార్మికుల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఆదివారం వరకు 1,41,769 మంది ఒంటరి మహిళలు దరఖాస్తులు సమర్పించగా, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు 49 వేలమంది బీడీ కార్మికులు కూడా ఆర్థిక భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.రెండు వేలను) జూన్ 2న లబ్ధిదారు లకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇదిలా ఉంటే.. ఒంటరి మహిళలుగా అర్హత ఉన్నవారు తమకు అభయహస్తం పింఛన్ బదులు ఆర్థ్ధిక భృతిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 వేలమంది అభయహస్తం పెన్షనర్లు ఉండగా, వీరిలో సుమారు 10వేలమంది దాకా ఒంటరి మహిళలున్నట్లు సమాచారం. రాష్ట్రం లో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవ చ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా 1,41,769 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సర్కారు నిర్ణయం మేరకే! ప్రస్తుతం అభయహస్తం పథకం కింద నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందుతున్న వారిలో ఒంటరి మహిళలుగా ఆర్ధిక భృతి (రూ.1,000)ని పొందేందుకు అర్హత ఉన్న వారు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అభయహస్తం బదులు ఆర్థిక భృతిని ఇచ్చే అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు జూన్ 2న ఆర్థిక భృతిని అందజేస్తాం. – పౌసమి బసు, సెర్ప్ సీఈవో -
చేనేత పరిస్థితిపై సర్వే
ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల వివరాలను గ్రామాలవారీగా సేకరించి, చేతిమగ్గాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆదేశించారు. దీనిపై 14 అంశాలతో ప్రొఫార్మా పంపామని, మార్చి 5లోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో 2015–16కు సంబంధించి నియో జకవర్గానికి 1,000 ఇళ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరిలోగా సమర్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల వివరాలు పంపాలి బీడీ కార్మికులకు గతంలో కేంద్రం ద్వారా మంజూ రు చేసిన వివరాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 25లోగా సమర్పించాలని సీఎస్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు, డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. పరిహారం చెల్లింపులో పెండింగ్ వద్దు అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చూడడంతోపాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మిషన్ భగీరథ ట్రంక్ వర్క్స్‌తోపాటు ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామా ల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. -
నామమాత్రపు పెంపు
- రూ.4 వేతనం పెంపు - యాజమాన్యాలతో ముగిసిన కార్మిక సంఘాల చర్చలు - బీడీ కార్మికుల్లో నిరాశ కోరుట్ల: బీడీ కంపెనీల యాజమాన్యాలు ఎట్ట కేలకు చేయి విదిల్చాయి. నామమాత్రపు వేతన పెంపుతో బీడీ కార్మికులు సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం బీడీ యాజ మాన్యాలు కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం 2016 మే నెలతో ముగి సింది. మళ్లీ వేతన పెంపు కోసం కార్మిక సంఘాలుజాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీడీ కంపెనీలకు నోటీసులిచ్చి ఉద్య మించాయి. మంగళవారం హైదరాబాద్‌లో యాజమాన్యాలు చర్చలు జరిపాయి. వేతన పెంపు రూ.4 మాత్రమే వేతన పెంపు కోసం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, బీఎంఎస్) ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు బీడీ కార్మికుల మూల వేతనం రూ.101లో సగం మేర వేతనం రూ.50 వరకు పెంచాలని డిమాండ్ చేయగా బీడీ కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. యాజమాన్యాలు ససేమిరా అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేయి బీడీలకు రూ.4 వేతనం పెంపునకు కార్మిక సంఘాల యాక్షన్ కమిటీ ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సమాన పనికి సమాన వేతనం లెక్కన ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.1,100 చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని జగి త్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు 5.50 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కొత్తగా మంగళవారం బీడీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కంపెనీలతో చేసుకున్న వేతన ఒప్పందం బీడీ కార్మికుల్లో నిరాశను నింపింది. ఒప్పందం అసంతృప్తిని మిగిల్చిందని తెలగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింత భూమేశ్వర్ అన్నారు. -
బట్వాడా రాక.. బతుకు బండి సాగక..
• మూడు నెలలుగా బీడీ కార్మికులకు వేతనాల్లేవు • పెద్ద నోట్ల రద్దుతో చితుకుతున్న బతుకులు • పూట గడవడమే కష్టమవుతోందంటున్న కార్మికులు.. బీడీలు చుడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలి పేరు తాటికొండ పుష్పవ్వ. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. భర్తతో కలసి కోటగల్లిలో నివాసముంటున్న ఈ వృద్ధురాలు రోజుకు పావుషేరు (250) బీడీలు చేస్తుంది. ప్రతినెలా సుమారు రూ.రెండు వేల బట్వాడా వస్తుంది. కానీ, మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వచ్చే రెండు వేలను బ్యాంకులో వేస్తే ప్రతినెలా రెండు మూడు రోజులు బీడీలు చేయడం మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తోంది. సాక్షి, నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు బీడీ కార్మికుల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని చుట్టిన బీడీల కష్టం చేతికందక పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా మూడు నెలలుగా బీడీ కార్మికులకు బట్వాడా (వేతనం) నిలిచిపోవడంతో బీడీ కార్మిక కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. వేతనాలు అందక బతుకు బండిని నడిపేదెలా అని వారు వాపోతున్నారు. తక్షణం తమకు వేతనాలు అందకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీడీ పరిశ్రమపై ప్రభావం.. నిజామాబాద్ కేంద్రంగా బీడీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉండగా, ఒక్క నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోనే సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. అలాగే.. జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల బీడీ కార్మికులున్నారు. పెద్ద, చిన్న కంపెనీలు కలిపి అత్యధికంగా నిజామాబాద్‌లో 82 బీడీ కంపెనీలుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 400 వరకు ఉంటాయి. అయితే, ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేస్తూ నవంబర్ 8వ తేదీన తీసుకున్న నిర్ణయం బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. అక్టోబర్ నుంచి వారికి వేతనాలు అందలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రతినెలా 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కార్మికులకు బట్వాడా ఇస్తుంటాయి. ఒక్కో కంపెనీ నెలలో ఒక్కో వారంలో వేతనాలు ఇస్తుంది. అయితే అక్టోబర్ మాసం నుంచి వేతనాలు నిలిచిపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘కష్టం’ ఖాతాల్లోకి.. ఇకపై బీడీ కార్మికులు ప్రతినెలా చెల్లించే బట్వాడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. అయితే చాలా మంది కార్మికులకు బ్యాంకు ఖాతాలు లేవు. ఖాతాల వివరాలు ఇచ్చిన కార్మికులకు కూడా ఇప్పటికీ వేతనాలు జమ కాలేదని కార్మికులు వాపోతున్నారు. బ్యాంకు ఖాతాలో జమ చేస్తే వాటిని డ్రా చేసుకునేందుకు ప్రతినెలా రెండు, మూడు రోజులు పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అంటున్నారు. ఎప్పటిలాగే నగదు రూపంలోనే బట్వాడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ ధర్నా.. తమకు ప్రతినెలా ఇచ్చే బట్వాడా బ్యాంకులో కాకుండా, నగదు రూపంలో చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సుమారు పది వేల మంది బీడీ కార్మికులు నిజామాబాద్ నగరంలో భారీ ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీడీ కార్మికులు కలెక్టరేట్‌ను దిగ్బంధించారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నిజామాబాద్‌లోని ఆర్ఎన్ చాండక్ బీడీ కార్ఖానా. సుమారు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు వెయ్యి బీడీలు చుడితే నెలకు రూ.మూడు నుంచి రూ.నాలుగు వేల వేతనం వస్తుంది. ప్రతినెలా 7వ తేదీలోగా వేతనాలు ఇస్తారు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వీరికి యాజమాన్యం అక్టోబర్ నుంచి బట్వాడా నిలిపివేసింది. బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నా.. ఇప్పటికీ తమకు అందలేదని కార్మికులు వాపోతున్నారు. -
బీడీ కార్మికుల గోడు వినేదెవరు?
చేతినిండా పనిలేక తిప్పలు అందని ఆసరా పథకం ఆస్పత్రి లేక ఇబ్బందులు భైంసా : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బీడీకార్మికులు పనిచేస్తున్నారు. అందులో నిర్మల్ జిల్లాలోనే లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చేతినిండా పనిలేక బీడీ కార్మికులు అలమటిస్తున్నారు. పెద్ద సంఖ్యలోనే ఉన్న కార్మికులకు స్థానికంగా ఆసుపత్రి కూడా లేదు. కార్మిక ఆసుపత్రి లేక రోగాలభారినపడుతున్న వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సివస్తుంది. తెలంగాణ ఏర్పడకముందే బీడీ కార్మికుల ఇబ్బందులు తెలిసిన ఈ ప్రభుత్వం కార్మికులందరికి జీవనభృతి చెల్లిస్తుంది. ప్రతినెల రూ. 1000 జీవనభృతిని ఆసర పథకం కింద అందిస్తున్నా కొంత మంది కార్మికులకే ఇది వర్తిస్తుంది. పూర్తిస్థాయిలో ఉన్న బీడీకార్మికులకు ఆసర పథకం కింద ప్రతినెల రూ. 1000 జీవనభృతి అందిస్తే వీరి కుటుంబాలు గడుస్తాయి. ప్రధాన ఉపాధి జిల్లాలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమయే ప్రధాన ఆధారం. ఈ పరిశ్రమపై జిల్లాలో లక్ష మందికిపైగా కార్మికులు ఉపాది పొందుతున్నారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా బీడీకార్మికులు ఉన్నారు. శివాజీ, షేర్‌షాప్, దేశాయి, రాజ్‌కమల్, చార్బాయ్, మారుతి ఇలా చెబుతుపోతే అన్ని బీడీ కంపెనీలు సగం రోజులే పని ఇస్తున్నాయి. నెరవేరని డిమాండ్లు బీడీ కార్మికుల కోసం ప్రభుత్వం జీఓ నం. 41 విడుదలచేసిన ఇప్పటికీ డిమాండ్లు నెరవేరలేదు. యాజమాన్యం ఒత్తిడితో ప్రభుత్వం మరో జీఓను విడుదలచేసింది. దీంతో కార్మికులు తరచు పోరాటాలుచేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీడీ అమ్మకాలపై నిషేదాలు విదిస్తుంది. పుర్రెగుర్తు సైజును ప్రతియేటా పెంచుతూ వస్తుంది. ఈ గుర్తును తగ్గించాలని యాజమాన్యం సమ్మెకు దిగిన కార్మికులే నష్టపోతున్నారు. ఇటు ప్రభుత్వానికి అటు యాజమన్యానికి కార్మికుల ఇబ్బందులు పట్టడంలేదు. దీంతో చేసేదేమిలేక ఎవరికి చెప్పుకోలేక సగంరోజులే పనిచేసి కార్మికులంతాపస్తులుంటున్నారు. -
చిన్న పరిశ్రమలపై చిన్నచూపు తగదు
జీడిమెట్ల: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ వేస్తూ చిన్న చిన్న పరిశ్రమలపై వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం షాపూర్‌నగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఐఎఫ్టీయూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 727ను వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి ఇవ్వాలని కోరారు. కార్మికుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలను పోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు జేఏసీ పోరాడుతుందనిన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతరావు, శేణు, రాజ్యలక్ష్మి, జీవన్, పద్మ, శోభారాణి, వజ్రమణి, శోభ, నాగమణి, పుష్ప, భారతి, ప్రమీల, అంజమ్మ, జన్నిబాయి తదితరులు పాల్గొన్నారు. -
'బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ రద్దు చేయాలి'
హైదరాబాద్: బీడీ కార్మికుల పొట్టకొట్టే జీఓ నెం 727(e) ను రద్దు చేయాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మహిళలు, బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని జగద్గిరిగుట్టలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇటీవల బీడీ కట్టలపై ఉండే పుర్రె బొమ్మను 40 శాతం నుంచి 80 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని నిరసిస్తూ..వెంటనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. -
బీడీ కార్మికులకు కేంద్ర నిధులతో ఇళ్లు
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి ♦ పెన్షన్, పీఎఫ్ సెటిల్మెంట్లకు ‘శ్రమ్ సువిధ’ పోర్టల్ ♦ కింగ్‌ఫిషర్ ఉద్యోగుల హక్కుల కోసం స్క్వాడ్ సాక్షి, హైదరాబాద్: బీడీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర నిధులతో పక్కా గృహాలు కట్టిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్, సిద్దిపేటలను గుర్తించామని, రాష్ట్రం ప్రభుత్వం స్థలం ఇస్తే మోడల్ హౌస్‌లు నిర్మిస్తామన్నారు. అలాగే ఏపీలో ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భవిష్య నిధి కార్యాలయంలో తెలంగాణ, ఏపీలకు చెందిన ఈపీఎఫ్ అధికారులతో దత్తాత్రేయ సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్, క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లను పారదర్శకంగా నిర్వహించేం దుకు ‘శ్రమ్ సువిధ’ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్మిక సేవలను సులభతరం చేస్తున్నామన్నారు. తెలంగాణలో 29,269 పరిశ్రమలలో 36.91 లక్షల మందికి, ఏపీలో 22,706 పరిశ్రమల్లో 13.29 లక్షల మందికి భవిష్య నిధి సభ్యత్వం ఉందన్నారు. యాజ మాన్యాలతో సంబంధం లేకుండా వీరికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ద్వారా పీఎఫ్ సొమ్ము నేరుగా పొందేలా కృషి చేస్తున్నామన్నారు. కార్మికుల కనీస వేతనాన్ని పెంచాలని భావిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టామన్నారు. బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ‘కింగ్‌ఫిషర్’ యజమాని విజయ్‌మాల్యా విదేశాలకు పారిపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఒక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ శాఖ తరఫున వేసిన కమిటీ నివేదిక ఆధారంగా ‘కింగ్‌ఫిషర్’ నుంచి ఏ మేరకు నిధులు రావాల్సి ఉందో.. వాటన్నింటినీ రాబట్టి ఉద్యోగులకు అందిస్తామన్నారు. పార్లమెంటులో ఆధార్ బిల్లుకు ఆమోదం వల్ల కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. కానీ కాంగ్రెస్, వామపక్షాలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తూ కీలక బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గుంటూరు రీజనల్ అధికారులు ఎం.ఎస్.కె.వి.వి. సత్యనారాయణ, కె.నారాయణ, పి.వీరభద్రస్వామి పాల్గొన్నారు. -
‘సంక్షేమానికి’ ఆధార్ తప్పనిసరి చేయొద్దు
లోక్‌సభలో బిల్లుపై చర్చలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పంపిణీకి ఆధార్ కార్డును తప్పనిసరి చేయరాదని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభలో ఆధార్ బిల్లు-2016పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కూలీలు.. ముఖ్యంగా బీడీ కార్మికులు, గని కార్మికుల సహజమైన వృత్తికారణంగా వారి బయోమెట్రిక్ గుర్తులను సేకరించడం సాధ్యపడదని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి ఆధార్‌ను తప్పనిసరి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులను పంపితే మళ్లీ ఆధార్ కార్డు రావడం లేదన్నారు. దీంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సులువుగా ఆధార్ కార్డు పొందడం, మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. -
‘పుర్రె’ పోటు
♦ బీడీ కార్మికుల ‘ఉపాధి’పై దెబ్బ ♦ పది రోజులు ఆందోళన చేసినా స్పష్టత ఇవ్వని సర్కారు ♦ 2.50 లక్షల బీడీ కార్మికుల్లో అభద్రత ♦ మళ్లీ ఏప్రిల్ నుంచి పోరుకు సన్నద్ధం ♦ చిత్రంలో కనిపిస్తున్న వాళ్లు మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌కు చెందిన కంఠం సాయమ్మ. ఈమె వయసు 70 సంవత్సరాలు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో తనపై ఆధారపడి ఉన్న కూతురు రూప, కొడుకు భరత్‌ల కోసం రోజు బీడీలు చుడుతుంది. సాయమ్మ కూతురు, కొడుకుల మానసిక స్థితి బాగులేక పోవడంతో అన్ని తానై కుటుంబాన్ని ఆ వృద్ధురాలు నెట్టుకొస్తుంది. సాయమ్మ చిన్న తనం నుంచి బీడీలు చుడుతోంది. రోజుకు వేయి బీడీలు చుడితే నెలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు లభిస్థారుు. ఈమెకు బీడీలు తప్ప మరో పని తెలియదు. మొన్నటి వరకు బీడీ పరిశ్రమలు బంద్ కావడంతో చాలా అవస్థలు పడ్డామని తెలిపింది. పుర్రె గుర్తును తొలగించాలని వేడుకుంటోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పల్లె జీవనంలో వివిధ వృత్తులు, ఉపాధి ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న మహిళలకు ‘పుర్రె’ గుర్తు ప్రతిబంధకం అవుతోంది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న ఉత్తర్వులపై ప్రభుత్వాలు ఏటూ తేల్చక పరిశ్రమను నమ్ముకున్న వారిని అభద్రతలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు బీడీ తయారీ కంపెనీలు.. మరోవైపు కార్మిక సంఘాలు తరచూ ఆందోళనలకు దిగుతుండటంతో బీడీ పరిశ్రమను నమ్ముకున్న కార్మికుల ‘ఉపాధి’కి భరోసా లేకుండా పోతుంది. ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ది తెలంగాణ బీడీ మాన్యుప్యాక్చరర్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమల బంద్‌కు పిలుపునివ్వడం.. బీడీలు చుట్టి ఉపాధి పొందే మహిళలకు పిడుగు పాటులా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బీడీ పరిశ్రమలను బంద్ పెట్టడంతో జిల్లాలో బీడీలు చుడుటూ జీవించే 2.50 లక్షల మంది ఉపాధిపై దెబ్బ పడింది. ఈ బీడీ పరిశ్రమపై మహిళలతోపాటు బట్టివాలా, ప్యాకింగ్ కార్మికులు, వార్మెన్లు, గంపావాలా, గుమాస్తాలు, అకౌంటెంట్ల కుటుంబాల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అసలు కారణం 85 శాతమే.. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉప సంహరణ ప్రధాన డిమాండ్‌గా బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెరపైకి తెచ్చింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 41 శాతం పుర్రె, ఎముకల గుర్తులను ముద్రించాలని ప్రకటించింది. ఈ ఉత్తర్వులపై బీడీ కార్మికులు, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఫలి తం లేదు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్య్లర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో మళ్లీ బడీ కంపెనీలు ఆందోళనకు దిగాయి. బీడీ కట్టలపై 85 శాతం పుర్రెగుర్తు ముద్రించాలని జారీ చేసిన జీఎస్ఆర్ 727(ఈ)ను నిరసిస్తూ బీడీ కంపెనీల మూసివేతకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది బీడీలు చుట్టే బీడీ కార్మికులు ఉం టే.. ఆ పరిశ్రమలో ఇతర పనులు చేసే వారు 1.30 కోట్ల మంది కార్మికులు ఉన్నారనేది అంచనా. కాగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8 లక్షల మంది బీడీ కార్మికులు, లక్ష మంది వరక తునికాకు సేకరించే కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. మళ్లీ ఏప్రిల్ నుంచి ఆందోళనకు బీడీ కార్మికులు సిద్ధం అవుతున్నారు. -
ఉపాధిపై పుర్రె పోటు
ఆదుకోని చట్టాలు.. ఆకలి తీర్చని పని. పొద్దంతా కష్టం.. రోగాలతో సతమతం.. ఇదీ క్లుప్తంగా బీడీ కార్మికుల జీవితం. విరామం లేకుండా కష్టిస్తున్నా జీవితమంతా దుర్భరమే. పండగలు, పబ్బాలకు దూరమై.. కుటుంబ పోషణలో లీనమై.. అవసరానికి ఆదుకోని సంపాదనతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ లేక శాపగ్రస్తులు కాగా.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరి ‘పుర్రె’లు పగిలిపోయేలా ఉన్నాయి. * శ్రమ దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికులు * ఆదుకోని యాజమాన్యాలు.. ఆసరా ఇవ్వని వేతనాలు * కేంద్ర ప్రభుత్వ ‘పుర్రె’ నిర్ణయంపై నిరసన జ్వాలలు * నష్టపోతున్నామని.. ఇబ్బందులు పెట్టొద్దని వేడుకోలు మిరుదొడ్డి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది కార్మికులు బీడీ రంగాన్నే నమ్ముకున్నారు. వీరిలో అధిక శాతం మహిళలు కావడం గమనార్హం. జిల్లాలో సుమారు 82 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 60 వేల మందికి ఫీఎఫ్ నంబర్లు ఉండగా.. 22 వేల మంది నాన్ పీఎఫ్ నంబర్లు కలిగి ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, నంగునూరు, గజ్వేల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, అందోల్, జోగిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఒక కార్మికుడికి వెయ్యి బీడీలు చుట్టినందుకు రూ.152 చెల్లించాలి. ఇందులో పీఎఫ్ కటింగ్ పోను రూ.139 ఇస్తున్నారు. టేకే దారులు అందులోనూ రూ.3 నుంచి రూ.5 వరకు తగ్గించి అందజేస్తున్నారు. పీఎఫ్ కార్డులు లేవన్న సాకుతో వారి శ్రమను దోచేస్తున్నారు. నెలకు కనీసం 26 రోజుల పని దినాలను కల్పించాలన్న నిబంధన ఉన్నా 15 రోజులు కూడా వర్క కల్పించడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సరిపడని ఆకు, తంబాకు బీడీ యాజమాన్యం ప్రతి వెయ్యి బీడీల తయారీకి 650 గ్రాముల ఆకు, దానికి సరిపడా తంబాకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే, ఆకు తూకంలో తాము మోసపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లేని ఆకు అందిస్తుండటంతో అదనంగా కిలోకు రూ.100 నుంచి లేక రూ.120లు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నామన్నారు. వైద్య సేవలు నిల్ మహిళా బీడీ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడుతూనే ఉంటారు. దీంతో వారికి శ్వాస సంబంధిత వ్యాధులు, మెడ.. వెన్ను నొప్పులు వెంటాడుతున్నాయి. వీరికి డెస్పెన్సరీలతో పాటు మొబైల్ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాల్సి ఉన్నప్పటికీ అవేమీ అమలులో లేవు. దీంతో అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తెర మీదకి ‘పుర్రె’ గుర్తు ఇప్పటికే అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికుల జీవితాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలన్న నిర్ణయంతో కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధికి చిచ్చుపెట్టే పుర్రె గుర్తును తొలగించాల్సిందేనని పలు బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తొలగింపుపై తీర్మానం బీడీ కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉన్న పుర్రె గుర్తును కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మిరుదొడ్డి మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బలపరిచారు. తెలంగాణలో ఎక్కువ శాతం బీడీ రంగాన్ని నమ్ముకున్నారని.. బీడీ కట్టలపై పుర్రెగుర్తును ముద్రించాలన్న యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. - దుబ్బాక ఎమ్మెల్యే ఉద్యమాలు చేస్తాం బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నాం. కార్మికుల ఉపాధిపై దెబ్బ కొట్టడం సరికాదు. సంక్షోభంలో ఉన్న బీడీ కార్మిక రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టడం ఎంత వరకు సమంజసం. పుర్రె గుర్తును తొలగించే వరకు బీడీ కార్మికులతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - గొడ్డుబర్ల భాస్కర్, తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పరేషాన్ చేస్తున్నరు ఆకు తూకంలో తేడాలు వస్తున్నయ్. నాణ్యత లేని ఆకే ఎక్కువగా ఉంటుంది. వెయ్యి బీడీలు చేయాలంటే గగనంగా మారుతోంది. అదనంగా ప్రైవేటుగా రూ.120 తో ఆకు కొంటున్నం. గివ్వన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతుంటే పుర్రె గుర్తు పెడ్తమని మమ్మల్ని పరేషాన్ చేస్తున్నరు. - బోయిని కనకవ్వ, బీడీ కార్మికురాలు పట్టించుకునేటోళ్లు లేరు బీడీలు చుట్టేటప్పుడు తంబాకుతో రోగాల పాలైతున్నం. మెడ నొప్పులు, వెన్ను నొప్పులతో మస్తు ఇబ్బందులు పడుతుంటం. రోగాల పాలై మంచాన పడ్డా ఎవరూ పట్టించుకోరు. చేసేది లేక వ్రైవేటు దవాఖానల చూపెట్టుకుంటున్నం. - అక్కమ్మ బాలమణి, బీడీ కార్మికురాలు పుర్రెగుర్తు తొలగించాలి పొగ తాగితే కాన్సర్ వస్తదనే సాకుతో బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెడతారా? మద్యం మీద లేని ఆంక్షలు బీడీలపైనే ఎందుకు? మద్యంతో సంసారాలు గుల్ల అవుతున్నాయి. జీవనోపాధి కలిగించే బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టుడు సరికాదు. మా పొట్టలు కొట్టొద్దు, పుర్రెగుర్తు తొలగించాలి. - వనం పద్మ, బీడీ కార్మికురాలు నిర్వీర్యం చేయడానికే... బీడీ రంగాన్ని నిర్వీర్యం చేయడానికే కేంద్రం పుర్రె గుర్తును తెరమీదికి తెచ్చింది. దీని వల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్రభుత్వం వెంటనే పుర్రెగుర్తు ముద్రించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇందుకోసం మండల సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. - పంజాల కవిత, ఎంపీపీ మిరుదొడ్డి -
బీడీకార్మికుల ర్యాలీ
ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు తొలగించాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ముథోల్ మండల పరిషత్ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ తీశారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ దత్తుకు వినతిపత్రం అందజేశారు. -
ఆదిలాబాద్‌లో బీడీ కార్మికుల ఆందోళన
ఆదిలాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న దాదాపు 100 మంది కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తమ జీవనోపాధిని దెబ్బతీయవద్దని, పుర్రె గుర్తును చిన్నదిగా ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అధికారులకు వినతిప్రతం అందజేశారు. -
సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ
నిజామాబాద్ : బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ గుర్తు పరిమాణాన్నితగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని నినదిస్తూ బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిప్యూటి తహశీల్దార్ విక్రమ్‌కు వినతి పత్రం అందజేశారు. -
బీడీ పరిశ్రమకు ‘పుర్రె’ భయం
సిరిసిల్ల/గంభీరావుపేట: బీడీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోంది. బీడీ కట్టలపై పుర్రె, డేంజర్ గుర్తులు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలోని బీడీ పరిశ్రమ మూతబడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా పది జిల్లాల్లో బీడీ పరిశ్రమను సోమవారం నుంచి మూసివేయాలని బీడీ కంపెనీలు నిర్ణయించాయి. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 297 ద్వారా బీడీ కట్టలపై 40 శాతం పుర్రె, ఎముకల గుర్తును ముద్రించాలని ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేశారు. అప్పటినుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. కార్మికుల ఆందోళనలు పట్టించుకోకుండా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్క్యులర్ జీవో 727(ఈ) ద్వారా 85 శాతం డేంజర్ గుర్తును ఏప్రిల్ నుంచి ముద్రించాలని కోరడంతో బీడీ కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. మినీ సిగరెట్ల ప్రభావంతో బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే నడుస్తుండగా, కొత్తగా పుర్రె, ఎముకల గుర్తులతో పరిశ్రమ మూతబడే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. పరిశ్రమ మూత.. ఉపాధికి కోత ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బీడీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. రాష్ట్రంలో 400 బీడీ కంపెనీలుండగా ఎనిమిది లక్షల మంది కార్మికులు ఉన్నారు. పుర్రెగుర్తు ముద్రణపై ప్రభుత్వం పునరాలోచించాలని యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతో కంపెనీలు మూసివేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బీడీ ఉత్పత్తిని నిలిపివేసేందుకు బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ టొబాకో మర్చంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఎనిమిది లక్షల మంది కార్మికులకు ప్రత్యక్షంగా బతుకుదెరువు కరువు కానుంది. కరీంనగర్ జిల్లాలో రెండులక్షల మం ది కార్మికులు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆదిలాబాద్‌లో లక్ష, వరంగల్‌లో 80 వేలు, మెదక్‌లో మరో 60 వేలు, నల్గొండ, మహబాబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మరో లక్ష మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వెయ్యి బీడీలకు సగటున రూ.153 ఇస్తున్నారు. నిత్యం 50 కోట్ల బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. కంపెనీల మూసివేతతో బీడీ తయారీదారులతోపాటు బట్టీవాలా, ప్యాకింగ్ కార్మికులు, వాచ్మెన్లు, గంపావాలా, గుమస్తాలు, అకౌంటెంట్లు వంటి ఉద్యోగులకు ఉపాధి దూరం కానుంది. -
బీడీ కార్మికులకు ‘పుర్రె’ భయం
జగిత్యాల రూరల్: బీడీ కార్మికులకు మళ్లీ ‘పుర్రె’ భయం పట్టుకుంది. బీడీ కట్టల ప్యాకింగ్‌పై 85 శాతం మేరకు పుర్రె గుర్తును ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో జీవో 729 విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బీడీకట్టలపై ఈ మేరకు పుర్రె గుర్తు ఉండాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ బీడీ కంపెనీలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు గత యూపీఏ ప్రభుత్వం 25 శాతం పుర్రెగుర్తు ముద్రిం చాలని ఆదేశించగా... ప్రస్తుత ప్రభుత్వం ‘పుర్రె’ సైజును 85 శాతానికి పెంచింది. దీంతో రానున్న రోజుల్లో బీడీల వినియోగం తగ్గి, ఆ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది బీడీకార్మికులున్నారు. కరీంనగర్ జిల్లాలో 50 కంపెనీల్లో సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తుండగా, నిజామాబాద్ జిల్లాలో వంద కంపెనీల్లో 2.80 లక్షల మంది, ఆదిలాబాద్ జిల్లాలో పది కంపెనీల్లో 40 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు బీడీ కంపెనీల్లో ప్యాకర్స్, టేకర్స్, బట్టీవాలాలు పనిచేస్తుంటారు. వీరిలో మహిళలే అధికం. బీడీకట్టలపై పుర్రెగుర్తు ముద్రించడం తో వ్యాపారం తగ్గి.. బీడీ కంపెనీలు మూతపడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్షేమం మరిచిన సర్కారు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మహిళలు అధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు వేతనాలు పెంచకపోగా.. ఇప్పుడు పుర్రె గుర్తును తెరపైకి తేవడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో బీడీ కార్మికురాలు వెయ్యి బీడీలు చుడితే వారి నుంచి సుంకం పేరుతో రూ.16 వసూలు చేస్తోంది. దేశంలో ఉన్న బీడీ కార్మికులకు గత ఇరవై ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తప్ప కొత్తగా పథకాలు తీసుకురాకపోవడంతో తమ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధిన పడతాం.. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. బీడీల కంపెనీలు మూతపడితే వీధిన పడతాం. - గొడుగు అంజవ్వ, బీడీ కార్మికురాలు,హన్మాజీపేట, జగిత్యాల మండలం ‘పుర్రె’ను తీసేయాలి వ్యవసాయ పనులు లేక బీడీలపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నాం. పుర్రెగుర్తును తీసేసి బీడీ పరిశ్రమలు మూతపడకుండా చూడాలి. - బోధనపు లక్ష్మి, బీడీ కార్మికురాలు, పొరండ్ల, జగిత్యాల మండలం -
కేసీఆర్ బోళాశంకరుడు
మీ తప్పు వల్లే పింఛన్లు రాలేదు.. బీడీ కార్మికులతో ఎంపీ కవిత కరీంనగర్: సీఎం కేసీఆర్ బోళాశంకరుడిలా అడిగిన వారికల్లా వరాలు ఇస్తాడని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్గల్లో సోమవారం ‘మన ఊరు-మన ఎంపీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు బీడీ కార్మికులు తమకు పింఛన్ రావడం లేదని ఎంపీకి విన్నవించగా ‘సమగ్ర సర్వే చేసినప్పుడు బీడీల చాటను దాచిపెట్టి ‘మేం బీడీలు చుట్టడం లేదు’ అని చెప్పుకున్నారు. కొందరేమో తెలివిగా బీడీ కార్మికులు కాకపోయినా ‘మేం బీడీలు చుడుతున్నాం’ అని రాయించుకున్నరు. దీంతో సర్వేలో ఉన్న వాళ్లకే పింఛన్లు వస్తున్నాయి.’ అని స్పష్టం చేశారు. సౌదీలో తన కుమారుడు చనిపోతే ఇప్పటి వరకు శవాన్ని కూడా తీసుకురాలేదని ఓ మహిళ విలపిస్తుండగా ‘సౌదీలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు శవాన్ని పంపించడం లేదు. ఆ దేశంతో భారత్‌కు ఎలాంటి ఒప్పందాలూ లేవు. ఈ విషయంపై పలుమార్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడుతూనే ఉన్నాం.’ అని చెప్పారు. -
సవరిస్తే సహించేది లేదు
వినాయక్‌నగర్: కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడానికి పూనుకుంటే సహించేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల అనుంబంధ బీడీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను చైతన్య పర్చడానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.