మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్
జీడిమెట్ల: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ వేస్తూ చిన్న చిన్న పరిశ్రమలపై వివక్ష చూపుతోందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం షాపూర్‌నగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఐఎఫ్‌టీయూ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 727ను వెంటనే రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి ఇవ్వాలని కోరారు.
కార్మికుల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలను పోత్సహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు జేఏసీ పోరాడుతుందనిన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతరావు, శేణు, రాజ్యలక్ష్మి, జీవన్, పద్మ, శోభారాణి, వజ్రమణి, శోభ, నాగమణి, పుష్ప, భారతి, ప్రమీల, అంజమ్మ, జన్నిబాయి తదితరులు పాల్గొన్నారు.