కలెక్టరేట్ ఏవో ప్రశాంత్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ ప్రతినిధులు
ఖలీల్‌వాడి: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని, కురుకురే ప్యాకెట్లు కొనాలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏవో ప్రశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కురుకురే ప్యాకెట్లు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తామని దేశాయ్ బీడీ యజమాన్యం కార్మికులను బెదిరిస్తున్నారని, 1000 బీడీలకు రూ.9చొప్పున తీసుకుంటున్నారని ఆరోపించారు. యజమాన్యంపై చర్యలు తీ సుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు. నాయకులు లక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, విమలమ్మ, పద్మ, వసంత తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment