Tobaco
-
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
బీడీ కార్మికులకు న్యాయం చేయండి
ఖలీల్‌వాడి: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని, కురుకురే ప్యాకెట్లు కొనాలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కురుకురే ప్యాకెట్లు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తామని దేశాయ్ బీడీ యజమాన్యం కార్మికులను బెదిరిస్తున్నారని, 1000 బీడీలకు రూ.9చొప్పున తీసుకుంటున్నారని ఆరోపించారు. యజమాన్యంపై చర్యలు తీ సుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు. నాయకులు లక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, విమలమ్మ, పద్మ, వసంత తదితరులున్నారు. -
కేజీఎఫ్ 2 టీజర్ ఎఫెక్ట్: యశ్‌కు నోటీసులు
బెంగళూరు: కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక యూట్యూబ్‌లో కూడా కేజీఎఫ్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ టీజర్ 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రోజు వరకు యూట్యూబ్‌లో 147 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి పది రెట్లు అదిరిపోయేలా కేజీఎఫ్-2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. (చదవండి: కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!) అయితే రికార్డులు సృష్టిస్తోన్న`కేజీఎఫ్-2` టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్‌తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. దాంతో స్టేట్ యాంటీ టొబాకో సెల్ వారికి నోటీసులు జారీ చేసింది. -
ఏం చేస్తారో?
నేడు పొగాకు బోర్డు సమావేశం రైతుల ఆశలన్నీ సమావేశం పేనే మర్రిపాడు: రాష్ట్రంలో 2016–17 పంట కాలానికి రైతులకు పొగాకు పండించేందుకు అనుమతులు, పొగాకు పంట పరిస్థితి, గిట్టుబాటు ధరలపై బుధవారం గుంటూరులో పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుండటంతో రైతుల ఆశలన్నీ సమావేశంపైనే ఉన్నాయి. పరిస్థితేంటంటే 2015–16 పంట కాలంలో దక్షిణ ప్రాంత తేలిక నేలలైన (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలోని పొదిలి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో ఒక్కో బ్యారెన్‌కు 3400 కిలోలు పొగాకు పండించేందుకు అనుమతి ఇచ్చారు. అయినా అధిక శాతం రైతులు నష్టాల పాలయ్యారు. మార్కెట్లో ధరలు అంతంత మాత్రం ఉండడంతో రైతుల బాగోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పొగాకు పంటపై శీతకన్ను వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాదైనా పరిస్థితి మారుతుందా? ఈ ఏడాది ప్రస్తుతం పొగాకు పంట అదును సమీపిస్తుండడంతో రైతుల పరిస్థితి ఏమిటోనంటూ సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి కలిగిరి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు రైతులు పంట పండించేందుకు విస్తీర్ణం తగ్గిస్తారని, అంతే కాకుండా పొగాకు పంటకు అనుమతి కూడా తగ్గిస్తారని ప్రచారం సాగుతుండడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. 3400 కిలోలు బ్యారెన్‌కు అనుమతిస్తేనే గిట్టుబాటు కావడం లేదని, ఇంకా తగ్గిస్తే గిట్టుబాటు కాక పొగాకు పంటను సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పొగాకు పంటను తగ్గించాలనే ఆశయంతోనే పొగాకు బోర్డుపై ఒత్తిడి తెచ్చి రైతులు పంట పండించేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది పంట అనుమతి తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కనికరం చూపి పంట అనుమతిని తగ్గించుకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
నిలిచిన పొగాకు వేలం
ప్రకాశం: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం మరోసారి నిలిచిపోయింది. వ్యాపారస్థులు కొనుగోళ్లను నిలిపివేశారు. తాము తీసుకొచ్చిన పొగాకును బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంపై ముళ్లమూరు మండలం పోలవరం, బత్తూరివారిపాలెం క్లస్టర్‌కు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన పొగాకు బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేడుకు ఐదారు కేజీల వరకూ తరుగు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల గుమస్తాలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో పొగాకు బేళ్లను వేలం కేంద్రం వద్దే వదిలేసి వెళ్లిపోయారు. -
మద్దిపాడులో నిలిచిన పొగాకు కొనుగోళ్లు
మద్దిపాడు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మద్దిపాడులోని పొగాకు రెండో వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. సరైన ధర లభించకపోవటంతో గిట్టుబాటు కావటం లేదని రైతులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి, సరైన ధర చెల్లించాలని కోరారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించటంతో గంట తర్వాత కేంద్రంలో కొనుగోళ్లు మొదలయ్యాయి.