మద్దిపాడు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మద్దిపాడులోని పొగాకు రెండో వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. సరైన ధర లభించకపోవటంతో గిట్టుబాటు కావటం లేదని రైతులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు జోక్యం చేసుకున్నారు.
ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి, సరైన ధర చెల్లించాలని కోరారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించటంతో గంట తర్వాత కేంద్రంలో కొనుగోళ్లు మొదలయ్యాయి.