సదాశివనగర్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని బీడీ కార్మికులు జీవన భృతికోసం గురువారం మధ్యాహ్నం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రగతి శీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. దాదాపు 300 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.
దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తమకు జీవన భృతి రూ.1000 ఇవ్వాలని, పనిదినాలు 26 రోజులకు పెంచాలని కోరారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీకార్మికుల వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి యాదయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.