నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇసుక మాఫియాను అరికట్టాలని లేదంటే మరో ఉద్యమం ప్రారంభిస్తామని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాసుల బాలరాజు హెచ్చరించారు.
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇసుక మాఫియాను అరికట్టాలని లేదంటే మరో ఉద్యమం ప్రారంభిస్తామని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాసుల బాలరాజు హెచ్చరించారు. సోమవారం ఎమ్మార్వో ఆఫీసును ఆయన ముట్టడించారు. ఇసుక లారీలు మోతాదుకు మించి అధికలోడ్‌తో వెళ్తున్నాయన్నారు. అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. కోటగిరి మండల మహిళలు, వృద్ధులు పింఛన్లు ఇప్పించాలని బాలరాజును వేడుకున్నారు.