- అందరికీ ‘భృతి చెల్లించాలంటూ చేగుంట-మెదక్ రహదారిపై రాస్తారోకో
ఎంపీపీ కార్యాలయం ముట్టడిచిన్నశంకరంపేట: బీడీ కార్మికులందరికీ జీవనభృతిని చెల్లించాలంటూ వివిధ గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఉదయం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీడీకార్మికులు చిన్నశంకరంపేట బస్‌స్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది బీడీ కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల ముందు బీడీ కార్మికులందరికి జీవనభృతిని అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొందరికే భృతి మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు.
అనంతరం కార్మికులు ర్యాలీగా బయలుదేరి ఎంపీపీ కార్యాలయం ముట్టడించారు. అందరికీ జీవనభృతి అందించాలని కోరుతూ ఈఓపీఆర్‌డీ కోటిలింగానికి వినతి పత్రం అం దజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్ కార్యాలయానికి వచ్చి తహశీల్దార్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోతరాజ్ రమణ, డీసీసీ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమన్‌రెడ్డి, జాలసాయిబాబా,కృష్ణాగౌడ్,కిష్టయ్య,మండల నాయకులు సత్యనారాయణగౌడ్,శివకుమార్, యాదగిరి, భరత్, గొండస్వామి,రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జీవనభృతి కోసం రోడ్డెక్కిన బీడీ కార్మికులు
Published Tue, Apr 28 2015 1:09 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM
Advertisement
Advertisement