హైదరాబాద్: " సీఎం కేసీఆర్ ఇంట్లో ముగ్గురు మంత్రులు ఉండవచ్చు కానీ మా ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తే తప్పవుతుందా .." అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు.. అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా ఏడో మహాసభలు గురువారం సిరికొండ మండల కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సభలో ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగం ప్రారంభించగానే బీడీ కార్మికులు లేచి తమకు జీవనభృతి రావడం లేదంటూ వాపోయారు. ఒక్కొక్కరు మాట్లాడాలని సూచించగా.. గడ్కోల్ గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలు మాట్లాడుతూ.. "కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి పదవులు ఉండగా లేనిది.. తమకు ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తే ఏంపోతుంది" అని ప్రశ్నించింది.