'కేసీఆర్ పాలన రైతులకు శాపం'
'కేసీఆర్ పాలన రైతులకు శాపం'
Published Thu, Sep 7 2017 1:57 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్: కేసీఆర్ పాలన రైతులకు శాపంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వస్తే లాభం జరుగుతుందని, గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఆశించారు. కానీ రైతుల ఆత్మహత్యలు, గిరిజన రైతులకు సంకెళ్లు వేయడం, రైతులను దూషించడం అవమానించడం తప్పా ఒరింగిందేమి లేదు.
రైతుల విషయంలో కేసీఆర్ పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారు. రుణమాఫీతో మొదలు అన్నీ మోసాలే. ఏ పంటకు కూడా మద్దతు ధర దక్కడం లేదు. ఎలక్షన్ స్టంట్, గిమ్మిక్ లాగా.. ఎకరాకు రూ.4 వేలు ఇస్తా అంటున్నారు. ముడున్నరేళ్లుగా రైతులకు ఏం ఇవ్వకుండా ఎలక్షన్స్ ముందే ఎందుకు ఇస్తున్నారో అందరికీ తెలుసు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం.. ఎందుకు కంపెనీల నుంచి నష్ట పరిహారం ఇప్పించలేదు? పోడు భూములు బలవంతంగా లాక్కున్న ఘనత కేసీఆర్‌ది.
ప్రజా డబ్బుతో..రాజకీయ లబ్ది పొందాలనే జీవో 39 విడుదల చేసారు.. ఈ రాష్ట్రంలో 35 లక్షల మందిలో ఎవరికన్నా పాస్ బుక్ వెనక్కి వచ్చిందా.. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, లీగల్ వ్యవస్థ ద్వారానే రైతుల భూముల జోలికి వెళ్ళాలి.. ఈ డబ్బు ఎవరి అబ్బ సొత్తు కాదు.. ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే చేయాలి. 4000 ఎకరానికి స్కీం అన్ని రకాల భూములకు వర్తించాలి.. అసైన్డ్ భూములకు కూడా ఇవ్వాలి.. రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా కూడా మద్దతు ధర ఇవ్వలేదు.. కానీ వచ్చే బడ్జెట్ కు ప్లాన్ చేస్తున్నారు.. రైతు సమన్వయ కమిటీలు పూర్తిగా తెరాస కమిటీలు. అవి రైతులకు, రైతు సంఘాలకు ఆమోద యోగ్యం కాదు..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, లేని చోట ఇంచార్జిలు చెప్పిన వారికి ఇవ్వడం మంచిది కాదు. ఇలాంటి పదజాలంతో ఎన్నడూ జీవోలు విడుదల చేయలేదు.. రైతాంగానికి అన్యాయం చేస్తే సహించేది లేదు.. కాంగ్రెస్ ఊరుకోదు.. టీఆర్‌ఎస్ ఒత్తిడికి నిరసనగా 11న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ధర్నా, అన్ని రైతు సంఘాలు, పార్టీ లతో రైతు సంరక్షణ సమితిలు వేయబోతున్నాము. రైతులకు మేలు జరిగేలా.. రైతులను రక్షించు కోవడానికి కాంగ్రెస్ పని చేస్తుంది' అని తెలిపారు.
Advertisement