రాష్ట్రవ్యాప్తంగా మరో 1,20,419 మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ నుంచి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 1,20,419 మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ నుంచి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో 2.56 లక్షల మంది బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం పింఛన్ ఇస్తుండగా, తాజాగా ఎంపికైన వారితో కలిపి ఈ సంఖ్య 3.77 లక్షలకు చేరింది. తాజా ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ జిల్లా నుంచి 48 వేలు, కరీంనగర్ జిల్లా నుంచి 44,882, మెదక్ జిల్లా నుంచి 13వేలు, అదిలాబాద్ జిల్లా నుంచి 8,700, వరంగల్ నుంచి 6,237 మంది బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్ మంజూరు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.