పాత పింఛన్ లేక, కొత్తగా పింఛన్ అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఆధార్, ఎస్‌కేఎస్, ఆన్‌లైన్ తదితర కారణాలతో అనేకమందిలో గందరగోళం నెలకొంది. పింఛన్ రాదేమోననే బెంగతో డిచ్‌పల్లి మండలం సుద్దుపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) మృతి చెందింది. 30 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో ఇలా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకోచోట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో లోకేష్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ అవస్థలు ఎన్నాళ్లో తెలియడం లేదు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిబంధనలు మారడం, నూతనంగా ఆసరా పథకం తెరపైకి రావడంతో పింఛన్‌దారులలో అయోమయం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా రూ.1000 పిం ఛన్ అమలు కోసం చేపట్టిన సర్వే, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియలు గందరగోళంగా మారాయి. దరఖాస్తు చే సుకున్నవారిలో అర్హులు చాలా మంది పింఛన్లు రాక అవస్థ పడుతున్నారు. గ తంలో పింఛన్ పొంది, కొత్త జాబితాలో పేర్లు లేనివారు విలపిస్తున్నారు. తామె లా బతికేదంటూ రోడ్డెక్కుతున్నారు. జి ల్లాలో గత నెల ఎనిమిదిన పింఛన్ల పం పిణీ ప్రారంభమైనా 61 మందికే అందజేశారు. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చలేకపోయింది.
అధికారులు దర ఖాస్తుదారుల పరిశీలనలో అయోమయానికి గురవుతున్నారు. అర్హులను గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయి. సాంకేతిక కారణాల తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్హులను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. మోర్తాడ్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలలో పరిశీలన నత్తనడకన సాగుతుంది. అక్టోబర్ 30లోగా దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని భావించారు. ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ తేదీని నవంబరు ఆరు వరకు పొడిగించారు. ఎనిమిద వ తేదీ నుంచి పింఛన్‌లు అందించాలని నిర్ణయించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఇపుడు ఆ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. మండల, పట్టణ, నగర స్థాయిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా గందరగోళం మాత్రం తొలగడం లేదు.
నగర పరిధిలోనూ
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పింఛన్ల పరిశీలన నేటికీ వరకు కొనసాగుతోంది. ఇక్కడ పింఛన్ల కోసం 35 వేల దరఖాస్తులు, ఆహార భద్రత కార్డుల కోసం 86 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన నేటి వరకు ముగియలేదు. కేవలం 60 శాతం పరిశీలన మాత్రమే జరిగింది. దీంతో పింఛన్ల పంపిణీ జరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 3,67,101 మంది పింఛన్‌దారులు ధరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అ నంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరించా ల్సి ఉంది.
వీటి కోసం కంప్యూటర్ కౌంటర్లు ఏర్పాటు చేసినా దరఖాస్తులు ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోయిం ది. వృద్ధాప్య పింఛన్‌లలో వయసు నిర్ధార ణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అర్జీలు వయసు తక్కువ అంటూ తిరస్కారానికి గురయ్యాయి. వితంతు పింఛన్‌ల విషయంలో భర్త మరణ ధ్రువీక రణ పత్రం కావాలంటూ, ఆసుపత్రికి రావాలంటూ కొంతమందికి కత్తెర పెట్టారు. ఇక వికలాంగులకు సదరం ఐడి నంబర్ ఉంటేనే పింఛన్ ఇస్తామంటూ గొళ్లెం తగిలేశారు. సదరం శిబిరానికి హజరైన ఇంకా 30 శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు అందాల్సి ఉంది.
ఆగని ఆందోళనలు
గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పింఛన్ల కోసం గాంధారిలో వృద్ధులు ధర్నా, రాస్తారోకో చే పట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో వృద్ధులు, వికలాం గు లు, వితంతువులు ఆందోళన నిర్వహించారు. సోమవారం దోమకొండ మండలం బీబీపేటకు చెందిన వికలాంగుడు లోకేశ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఇంతకు ముందు ధర్పల్లి మం డ లంలో రెండుసార్లు ఎల్లారెడ్డిపల్లి, అంసాన్‌పల్లి గ్రామాలకు చెందిన పం డుటాకులు రాస్తారోకో నిర్వహించారు.
జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ పంచాయతీని గత నెలలో ముట్టడించారు. ఆర్మూర్‌లో అర్హులందరికీ పెన్షన్‌లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. కల్లెడ, ఢీకంపల్లి గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు మాక్లూర్ మండల కార్యాలయానికి తాళం వేసి నిజామాబాద్-నందిపేట రోడ్డుపై బైఠాయించారు. ఇదే మండలం అడవిమామి డిపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డికి చెందిన పింఛన్‌దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రలో రాస్తారోకో చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో నిరసనలు కొనసాగాయి.
ఎన్నాళ్లు బాంచెన్!
Published Wed, Dec 3 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement