Persons with disabilities
-
దివ్యాంగులు ఎవరికీ తీసిపోరు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైకల్యం అనేది శరీరానికే కానీ..సంకల్పానికి కాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం(డిసెంబర్ 3) వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’అని వైఎస్ జగన్ తన పోస్టులో తెలిపారు.వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మస్థైర్యంతో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2024 ఇదీ చదవండి: రైతులను రోడ్డున పడేశావ్: వైఎస్ జగన్ -
చూపును మించిన ‘దృష్టి’ : గంగాధర్ స్ఫూర్తిదాయక స్టోరీ
కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ను కలుద్దాం. అతను ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని తన సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు.ఆయన శారీరక వైకల్యం ఉన్న నూకరత్నంను వివాహం చేసుకున్నారు, వారు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను, అతని తల్లిదండ్రుల సహాయంతో తమ కుటుంబ ఖర్చులను వెళ్లదీస్తున్నారు.2013 నుండి రిలయన్స్ ఫౌండేషన్‌తో లబ్ది పొందుతున్న గంగాధర్, ఈ ఫౌండేషన్ హెల్ప్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మరియు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.అంతేకాదు బయోమెట్రిక్ కార్డ్‌ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హతలున్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో తన సంఘానికి సహాయం చేస్తాడు. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు గంగాధర్.అంకితభావం, కృషితో గంగాధర్ తన కమ్యూనిటీకి సహాయం చేస్తున్న తీరు, ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు, ప్రపంచంలో ఎలా మార్పు తీసుకురాగలడనే దానిపై అందరికీ స్ఫూర్తినిస్తుంది. గంగాధర్ కథ సంకల్పం, దయ శక్తిని గుర్తు చేస్తుంది, నిజమైన ‘దృష్టి’ హృదయం నుండి వస్తుందని రుజువు చేస్తుంది, అది చూపును మించిన దృష్టి.దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి మరియు వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తాం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది. 2024 లో ఈ దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. -
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్‌తోపాటు జాబ్స్..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon) దివ్యాంగులకు (PwDs) శుభవార్త చెప్పింది. వీరికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్..) దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రధాన శ్రామిక స్రవంతిలోకి తీసుకురావడానికి 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. (Airbus jobs: గుడ్ న్యూస్.. ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు) అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (PXT) డైరెక్టర్ లిజు థామస్ మాట్లాడుతూ.. "అమెజాన్ ఇండియాలో వృద్ధికి అనుకూలమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిఒక్కరూ తమ సామర్థ్యాలను నిరూపించుకునేలా సమాన అవకాశాలను కల్పిస్తున్నాం" అన్నారు. ఈ చొరవ కింద అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో మూడు సంవత్సరాల వ్యవధిలో దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్ నెట్వర్క్ పరిధిలోని ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో దివ్యాంగులకు స్టోవింగ్, పికింగ్, ప్యాకింగ్, సార్టింగ్ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు. -
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు బీమా ప్లాన్
న్యూఢిల్లీ: పిల్లల మానసిక ఆరోగ్యం కోసం పని చేసే మామ్స్బిలీఫ్ సంస్థ ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం (ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్, నేర్చుకోలేకపోవడం తదితర) బీమా ప్లాన్‌ను తీసుకొచి్చంది. ‘మామ్స్ బిలీఫ్ కేర్–ఆది్వక్ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్’ను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో గురువారం ఆవిష్కరించింది. ప్రత్యేక అవసరాలతోపాటు, శ్రద్ధ అవసరమైన చిన్నారుల చికిత్సా వ్యయాలకు రూ.1.5–4 లక్షల మధ్య కవరేజీనిస్తుంది. ఈ ప్లాన్‌లో రూ.1.5 లక్షల కవరేజీకి ప్రీమియం సుమారు రూ.22,000గా ఉంది. ‘‘ఎదుగుదలకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల అభివృద్ధే మా డీఎన్ఏ. 0–15 ఏళ్ల మధ్యనున్న ఉన్నవారి కోసం ప్రతి నెలా 30,000 సెషన్లు నిర్వహిస్తున్నాం’’ అని మామ్స్ బిలీఫ్ సీఈవో నితిన్ బిండ్లిష్ తెలిపారు. -
ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ.. వారి కోసం ఆర్టిఫిఫియల్ ఇంటిలిజెన్స్
డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు చేతిలో పట్టుకుని ఉద్యోగాల కోసం వెతికితే సరైన జాబ్ దొరకం కష్టం. అలాంటిది ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి ఉద్యోగాలు రావడం మాట అటుంచి అప్లై , ఇంటర్వ్యూలో సరైన రీతిలో కమ్యూనికేట్ చేయడం చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. దివ్యాంగుల ఇబ్బందులు తీర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని ఉపయోగించారు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు. ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వరాజ్ఎబిలిటీ పేరుతో ప్రత్యేక యాప్, పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా చూపు, వినికిడి, కదలికలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా స్వరాజ్ఎబిలిటీని రూపొందించారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఉద్యోగాలకు అప్లై చేయడం, ఇంటర్వ్యూ ఇవ్వడం వంటి పనులు దివ్యాంగులకు తేలిక అవుతుంది. ఫిబ్రవరి 4న ఈ యాప్/వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. టెక్నాలజీని అవసరమైన వారికి చేరువ చేసేలా ప్రయత్నించిన ఐఐటీ హైదరాబాద్‌ని కేంద్రం ప్రశంసించింది. -
దివ్యం..మీ ఓటు..
సాక్షి, కడప : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం కంటే పదునైనది. ఓటును నమోదు చేసుకోవడంతోపాటు ఓటు వేయడం అర్హులైన ప్రతి ఒక్కరి బాధ్యత. కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా వారు సులభతరంగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. అలాగే ఓటింగ్ రోజున వీరికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలను కల్పించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. కాగా ఇన్నాళ్లు సరైన సౌకర్యాలు లేకపోవడంతో దివ్యాంగులు ఓటు నమోదుకు, ఓటును సద్వినియోగం చేసుకోవడానికి కొంత దూరమయ్యారు. ఇప్పుడు వారిలో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. నమోదు.. సౌకర్యాలు ఇలా.. ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టిన యాప్ విధానం ఇలా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సీడబ్ల్యూడీ అని టైప్ చేస్తే ఎన్నికల సంఘం రూపొందించిన పర్సన్స్ విత్ డిజెబిలిటి యాప్ వస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే.. అందులో ఉన్న సౌకర్యాలు కనిపిస్తాయి. కొత్త ఓటు నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, తొలగింపు వివరాలు ఉంటాయి. అలాగే ఓటింగ్ రోజున వీల్‌చైర్ అవసరం అయితే ఆ సదుపాయాన్ని పొందవచ్చు. అదే విధంగా పోలింగ్ బూత్ చిరునామా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికి అప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఓటరు పేరు, తండ్రి పేరు నియోజకవర్గం పేరు నమోదు చేసి సెర్చ్ చేస్తే ఓటు ఉందో.. లేదో..? తెలుసుకోవచ్చు. ప్రయాస లేకుండా ఓటు వేసి ఇంటికి... దివ్యాంగులు యాప్ ద్వారా అందించిన సమాచారం ఆధారంగా అధికారులు చర్యలు చేపడుతారు. వారున్న చోటికి వాహనాలను పంపిస్తారు. ఆ వాహనం పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. సదరు వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత తిరిగి వారింటి వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పోలింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అలాగే అవసరమైన వారికి వీల్‌చైర్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇలా ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా అన్ని చర్యలు చేపట్టింది. కాగా ఈ ఓటరు నమోదుపై జిల్లా విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది. రండి.. ఓటెత్తుదాం.. ఓటు హక్కు నమోదు గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇంకా ఓటు నమోదును చేసుకోని వారు త్వరపడాలి. ప్రత్యేక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. -
సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి?
పెండింగ్‌లో రూ. 2 లక్షలు రెండేళ్లుగా ఇదే పరిస్థితి కలెక్టర్ ఆదేశించినా కదలని ఫైల్ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రభుత్వం అందజేసే ఆస రా పెన్షన్సలో అర్హులైన వికలాంగులను ఎంపిక చేసేం దుకు వైకల్యశాతం నిర్ధారణ కోసం ప్రభుత్వం నిర్వహిం చిన సదరం క్యాంపుల్లో పనిచేసిన సీఆర్పీలకు చెల్లించాల్సిన చెల్లింపు విషయంలో డీఆర్డీఏ అధికారులు రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. పనిచేసిన వారికి రోజు వారి లెక్కన చెల్లింపులు చేస్తామని చెప్పిన అధికారులు 2015 డిసెం బర్ నుంచి ఇదిగో.. అదిగో... బడ్జెట్ రాలేదు... రాగానే ఇస్తాం.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటి వరకు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా కలెక్టర్ అమ్రపాలికి ఇటీవల గ్రీవెన్సలో కూడా ఫిర్యాదు చేశారు. డబ్బులడిగితే క్రిమినల్ కేసులా... తమకు రావాల్సిన డబ్బుల కోసం తిరుగుతున్న బాధితులు పదేపదే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డీఆర్డీఏ అధికారులు బెదిరింపులకు పాల్పడతున్నారని సీఆర్పీలు తెలిపారు. ఇంకోసారి డబ్బులకు వస్తే మీపై క్రిమినల్ కేసులు పెడతామని, అధికారులు తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాజు, శ్రీనివాస్‌లు తెలిపారు. మరోసారి ఫిర్యాదు.. తాజాగా బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్డీఏ అధికారులు మరో కొత్తవిషయం తెరమీదకు తీసుకువచ్చారు. పనిచేసిన వారికి ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. దీంతో సాక్షాధారాలు తమ ముందు పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు ముట్టినట్లరుుతే మరోసారి ఫిర్యాదు చేయవద్దని సీఆర్పీలను హెచ్చరించారు. డబ్బులు ఇచ్చిన ఆధారాలు ఇస్తామని అధికారులు చెబుతున్న ప్రతిసారి పరస్పర విరుద్ద సమాచారం ఇవ్వడం ఏమిటని బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అవసరం అరుుతే ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిగి తమకు న్యాయం చేయాలని సీఆర్పీలు కోరుతున్నారు. కాగా ఈ విషయంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. రూ. 2 లక్షలు పెండింగ్.. సదరం క్యాంపులో సుమారు 64 మంది సీఆర్పీలు పనిచేశారు. రెండు క్యాంపుల్లో వికలాంగుల సంఘాలు, మహిళా సంఘాలు, సీఆర్పీలు పాల్గొన్నారు. అరుుతే వీరికి సెర్ఫ్ నుంచి నిధులు రాలేదని అధికారులు చెల్లింపులు చేయలేదు. దీంతో బాధితులు కలెక్టర్‌కు గ్రీవెన్సలో పదేపదే ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ డీఆర్డీఏ పీఈ వెంకటేశ్వర్‌రెడ్డిని తక్షణమే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. అరుుతే ఆ సమయంలో ఉన్న ఓ అధికారికి డబ్బులు ఇచ్చామని అతనే చెల్లింపులు చేయాల్సి ఉందని డీఆర్డీఏ అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. పెండింగ్‌లో ఉండగా రిలీవ్ చేశారా? లక్షల్లో డబ్బుల వ్యవహారం పెండింగ్‌లో ఉండగా సదరు అధికారిని ఎలా రిలీవ్ చేశారన్నది అధికారులకే తెలియాలి. ఏ అధికారి అరుునా బదిలీ అరుున సమయంలో లెక్కలు క్లియర్ చేసి రిలీవ్ అవుతారు. కానీ ఈ విషయంలో డీఆర్డీఏ అధికారులు చెబుతున్న కారణాలు కూడా వాస్తవానికి దగ్గరగా లేకపోవడం గమనార్హం. -
ఎవరి మాటా వినలేదు
‘నువ్వు చెయ్యలేవు’ ‘నీతో కాదు’ ‘ఎంత కష్టమో తెలుసా?’... ఇలా... ఎవరేం చెప్పినా, ఎవరెన్ని చెప్పినా వీరు వినలేదు! అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకే మనం అనేక జాగ్రత్తలు చెబుతాం. ఇక వీళ్లలా వైకల్యం ఉన్న పిల్లలకి ఎన్ని చెప్పాలి? చెప్పారు. తల్లిదండ్రులు చెప్పారు. అయినవాళ్లూ చెప్పారు. అయినా వీళ్లు వినలేదు. జీవన పోరాటంలో ధైర్యంగా ముందుకు దూసుకెళ్లారు. ఏ జాగ్రత్తలను, ఏ హెచ్చరికలను, ఏ భయాలనూ... లెక్క చెయ్యక ... మౌనంగా ఎదుగుతున్నారు. ధీశాలురైన ఈ యువరాజులకు సాక్షి సలామ్. మూర్తి స్వస్థలం నెల్లూరు జిల్లా. పుట్టుకతోనే వికలాంగుడు. డిగ్రీ పూర్తి చేశాడు. తెలిసిన వారి ద్వారా ఓ కాల్ సెంటర్‌కి జాబ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. తల్లీతండ్రీ కూడా కొడుకుతో పాటు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. మూర్తి జాబ్‌కు ఎంపికయ్యాడు. అయితే పేరెంట్స్ వద్దన్నారు. ‘పట్టణంలో ఒక్కడివే ఉండగలవా, ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే ఒక్కడివే వెళ్లాలి. అంత దూరం కర్ర పట్టుకొని ఎలా వెళతావు? బస్సులల్లో తిరగగలవా..? ఎందుకింత కష్టం.. ఇన్నాళ్లూ బతికించలేదా.. మేమున్నంతవరకు నీకే లోటూ రాకుండా చూసుకుంటాం..’ అని తిరిగి ఊరికి తీసుకెళ్లారు. ఇప్పుడు మూర్తి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఏ పనీ లేదు. భవిష్యత్తు బెంగతో ఉన్నాడు. నల్లగొండకు చెందిన వెంకట్‌దీ ఇలాంటి కథే. చిన్నప్పుడు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయాడు. ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చింది. ఉండటానికి, తినడానికి వసతి సదుపాయాలు ఆ కంపెనీయే కల్పిస్తోంది. అందుకు సరే అంటే ఉద్యోగంలో చేరచ్చు అని చెప్పారు కంపెనీవాళ్లు. దీంతో వెంకట్ పేరెంట్స్ -‘చిన్నప్పటి నుంచి మా వాడు మమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండింది లేదు. వాడు అలా ఉండలేడు. ఇంటికి-ఆఫీస్‌కు అప్ అండ్ డౌన్ చేసే జాబ్ అయితే చేస్తాడు. తనుగా ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. కాబట్టి క్యాబ్ సదుపాయం ఇస్తే బాగుంటుంది’ అన్నారు.’ కంపెనీ రూల్స్ ఒప్పుకోవన్నారు. సెలక్ట్ అయిన జాబ్ పోయింది. ఏడాది పూర్తయినా వెంకట్‌కి ఇంకా జాబ్ రాలేదు. నిజానికే అంగవైకల్యం శరీరానికే గానీ మనసుకు కాదు. నేటి రోజుల్లో అంగవికలురు ఎన్నింటిలోనో తమ సత్తా చాటుకుంటున్నారు. కుటుంబసభ్యుల మీద ఆధారపడి బతుకు భారంగా నెట్టుకురాకుండా కొత్త ఆశలతో తమకు తాముగా నిలబడుతున్నారు. కొందరు తమలాంటి వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అయితే, ‘అంగవైకల్యం ఉన్నవారిని వారి కుటుంబసభ్యులే భయంతో వెనక్కి లాగుతున్నారు’ అంటున్నారు హైదరాబాద్‌లోని ‘యూత్‌ఫర్ సేవా అనేబుల్ వింగ్’ కి కో ఆర్డినేటర్‌గా ఉన్న విజయ్. ‘పెద్ద పెద్ద కంపెనీల వాళ్లు కూడా డిసేబుల్ వాళ్లను పనిలో పెట్టుకోడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. వికలాంగులు పనులు నిబద్ధతో చేయడమే అందుకు కారణం’ అని ఆయన అంటున్నారు. స్వేచ్ఛ ఇస్తేనే ఎదుగుదల... వ్యాపారం, వృత్తి, ఉద్యోగం.. ఏదైనా నచ్చిన పని చేయడానికి తగినంత స్వేచ్ఛ ఉండాలి. అందుకు తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. వికలాంగులు అవడం వల్ల పిల్లలు కష్టపడతారేమో అని వారు ఆలోచిస్తున్నారు కానీ, ‘వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకుంటూ... మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వస్తాయే రావో అనే సందిగ్ధంలోనే మాలో చాలామంది రోజులను వెళ్లబుచ్చుతున్నాం’ అంటున్నారు మూర్తి. వికలాంగుడైన మూర్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అమ్మానాన్నలకు ఉన్న భయాల కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. ‘నాకేం అవసరం.. అమ్మవాళ్లే అన్నీ చూస్తున్నారు కదా అనే ఫీలింగ్‌లో మరికొందరు ఉంటున్నారు. ‘నాకు నేనుగా బతకాలనే ఆలోచన కలగడం లేదు. పెద్ద చదువులు చదివాను, ఈ జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిద’ని సూచిస్తున్నారు మహేష్. బధిరుడైన మహేష్ డిగ్రీ వరకు చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నారు. మహేష్‌తో పాటు మరో ఎనిమిదిమంది బదిరులు ఈ హోటల్లో ఉద్యోగం చేస్తున్నారు. వికలాంగ పిల్లల పెంపకంలో చాలామంది తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలతో వారి ప్రతి అడుగుకూ భయంతో అడ్డు పడడం సహజమే కానీ... అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ప్రేమ, రక్షణ వలయాలు పిల్లల చుట్టూ ఒక సన్నని పొరలా మాత్రమే ఉండాలే తప్ప అవి ఇనుపకంచెలా మారకూడదు. పిల్లలు తడబడే అడుగులేస్తున్నపుడు పడిపోతారని భయపడి ఎపుడూ ఎత్తుకుని తిప్పితే నడక వస్తుందా..! ఎప్పుడూ తామే వెంట ఉండాలనుకుంటే జీవితం విలువ తెలుస్తుందా..! వికలాంగుల తల్లిదండ్రులూ ఈ విషయాన్ని గుర్తించాలి. - నిర్మలారెడ్డి పనులన్నీ పెద్దలే ఎందుకు చేస్తారు? మేం చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాం కాబట్టి మా పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాలి అనుకుంటారు తల్లీతండ్రి. అందుకని పిల్లల పనులన్నీ తామే పూర్తి చేయాలని చూస్తారు. పిల్లలకు సంబంధించిన వార్తలు చూసి లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. పిల్లలు ఒంటరిగా బయటకు వెళితే వారికేదైనా కీడు జరుగుతుందేమో అని ఇంటికే పరిమితం చేస్తారు. పిల్లలను స్నేహితులతో కలవకుండా కట్టడి చేసే తల్లిదండ్రులున్నారు. ఇది పిల్లల భావి జీవితానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను దూరం చేస్తుంది.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమీ తెలియదని, అనుక్షణం వెయ్యి కళ్లతో కాచుకోవల్సిందేనని భావిస్తుంటారు. ఇష్టంతో చేరాలి... నేను ఇంజనీరింగ్ చేశాను. యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థలో డీటీపీ ఆపరేటర్ గా చేరాను. నాలాంటి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడే డిసేబుల్డ్ వింగ్‌ని ఎంచుకున్నాను. ఇప్పటి వరకు డిసేబుల్ పర్సన్స్‌కి వందల మందికి ఉద్యోగాలు రావడానికి శిక్షణ ఇచ్చాం. వికలాంగులైనా సరే ఇష్టంతో పనిచేయడం మొదలుపెడితే అది ఎంత కష్టమైనా భరిస్తారు. మా సంస్థ వికలాంగులకు ఆంగ్లం, గణితం, కంప్యూటర్ విద్యలలో ఉచిత శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తయ్యాక వ్యాపార సంస్థలలో (కె.ఎఫ్.సి, మ్యాక్స్, లైఫ్‌స్టైల్, హాలీడ్ ఇన్...వంటి వాటిలో) అర్హతను బట్టి నియామకాలు ఉంటాయి. - విజయ్, యూత్‌ఫర్ సేవా డిజేబుల్ వింగ్ కో ఆర్డినేటర్ మానసిక ఎదుగుదల చూడాలి... ఎంత వయసు వచ్చినా పిల్లలు తమనే అంటి పెట్టుకుని ఉండాలనుకుంటారు చాలామంది పేరెంట్స్. ఎప్పుడూ వెంటే ఉండటం వల్ల తల్లిదండ్రులతో పిల్లల అనుబంధాలు బాగుండవచ్చు. కానీ, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం కావచ్చు. మానసిక ఎదుగుదల లేకపోతే జీవితాంతం వారికి వారే భారం కావచ్చు. - గీతా చల్లా, సైకాలజిస్ట్ మాది మహబూబ్‌నగర్ జిల్లా. బధిరుడిని కావడంతో ఎలా బతుకుతానో అని అమ్మనాన్నలకు బెంగగా ఉండేది. నేను ఇంటి నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నాను. గచ్చిబౌలి దగ్గర ఓ పెద్ద హోటల్లో జాబ్‌లో చేరాను. నెల జీతం 10 వేలు. ఆరువేల రూపాయలు ఇంటికి పంపిస్తాను. - హరి ఓబులేషు మాది మెదక్ జిల్లా. ఇంటర్‌తో చదువు ఆపేశాను. మా ఫ్రెండ్ జాబ్ ద్వారా విజయ్ అన్నను కలిశాను. ఈ హోటల్లో హౌజ్‌కీపింగ్ ఎంచుకున్నాను. నాకు తెలుగులో రాయడం మాత్రమే వచ్చు. ఎలా అని మొదట చాలా భయపడ్డాను. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. - మహేష్ ఎక్కువ చదివాను.. నాకు ఫలానా జాబే వస్తుందని.. ఇంటి దగ్గరే కూర్చోవడం కన్నా చిన్నవైనా సరే బతుకుదెరువు ప్రయత్నాలు చేయడం మంచిది. మూగవాడిని అని కూర్చుంటే నా భుక్తి ఎప్పటికీ అమ్మనాన్నలమీదే ఆధారపడి ఉండేవాడిని. అలా ఉండకూడదనే హోటల్లో జాబ్ చేస్తున్నాను. - హరిబాబు అమ్మనాన్నలకు వారి భయాలు వారికుంటాయి. అది సహజమే. కానీ, నిలబడగలం అనే ధైర్యం.. ముందు మనలో ఉండాలి. ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్నాను. పనిలో మంచి పేరు తెచ్చుకున్నాను. ముందు జీవితం అంతా ఎలాగైన బతకగలనన్న ధీమా ఉంది. - మధు ఏమీ రాదని కూర్చుంటే జీవితం ఇలాగే గడిచిపోతుంది. మా స్నేహితుల ద్వారా హోటల్లో ఉద్యోగం సంపాదించాను. సొంత కష్టం ద్వారా సంపాదించినది ఎప్పుడూ ఇంకా ఇంకా బలాన్నే ఇస్తుంది. ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది. - జహీర్ -
‘ఇరాకు బ్రాండ్ అంబాసిడర్ గుర్తింపు హర్షణీయం’
హైదరాబాద్: వికలాంగులకు సానుభూతి అవసరం లేదని.. అర్థం చేసుకునే సమాజం కావాలని మెట్రో ైరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఇరా సిం ఘాల్‌ను కేంద్రం బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తించటం హర్షణీయమన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సివిల్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇరా సింఘాల్‌కు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ సకలాంగులకంటే వికలాంగులు దేనిలో తీసిపోరని సింఘాల్ నిరూపించారన్నారు. అంగవైకల్యం మన శక్తికి ఆటంకం కాదని ఇరా సింఘాల్ నిరూపించారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇరా సింఘాల్ మాట్లాడుతూ వైకల్యం సామర్థ్యానికి అడ్డుకాదన్నారు. -
పింఛను వంచన
కమిటీ పేరుతో గిట్టనివారి పేర్లు తొలగించిన తెలుగు తమ్ముళ్లు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వికలాంగులు, వృద్ధులు {పభుత్వం నుంచి అనుమతి రావాలంటున్న అధికారులు తెలుగు తమ్ముళ్ల పుణ్యమాని పింఛను కోల్పోయిన వృద్ధులు, వికలాంగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం కుదించి, తమకు అనుకూలమైనవారికి పింఛను కోసం సిఫారసు చేయడంతో ఇన్నాళ్లూ పింఛను తీసుకున్నవారు అనర్హులైపోయారు. తమ గోడు చెప్పుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు. వారేమో ప్రభుత్వం అనుమతిస్తే పింఛన్లు ఇస్తామని సెలవిస్తున్నారు. ఏలూరు (టూటౌన్) : జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా పిం ఛన్లు తీసుకుంటున్న వికలాంగులు, వృద్ధులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వారిని అధికారులు తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. గ్రామస్థాయిలో తెలుగు తమ్ముళ్లతో వేసిన కమిటీ తమకు అనుకూలంగా ఉండనివారికి సంబంధించిన పింఛన్లను తొలగిస్తోంది. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వృద్ధులకు లక్షా 61వేల 737, వికలాంగులకు 43వేల 667, వితంతువులకు 96వేల 196, అభయహస్తం కింద 25వేల 624, కల్లుగీత కార్మికులకు 17వేల 44, చేనేత కార్మికులకు 3వేల 170 పింఛన్లను అందచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జన్మభూమి కమిటీల పేరుతో 24 వేల పింఛన్లను తొలగించారు. వాటి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్నవారికి పింఛన్లు కేటాయిస్తూ తెలుగు త మ్ముళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. బాధితులు తమకు తిరిగి పింఛన్లు ఇవ్వమని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వయసు సరిపోలేదని, అంగవైక ల్య ధ్రువీకరణ పత్రం లేదని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మరోపక్క అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ రాజకీయ నేతలు చెబితేనే పింఛన్లను ఇస్తున్నారు. అంతేకాకుండా జన్మభూమి కమిటీలలో గ్రామ సర్పంచ్‌లు ఉండటంతో పింఛనుదారులకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అధికారులు మాత్రం జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన లబ్ధిదారుల జాబితానే ప్రభుత్వానికి పంపుతున్నామని, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తరువాత పింఛన్లు ఇస్తామని చెబుతున్నారు. పింఛన్లు కోల్పోయిన వారు మాత్రం ఆశ చావక ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు అందిస్తూనే ఉన్నారు. అధికారులు వీరికి ఎప్పటికి పింఛన్లు మంజూరు చేస్తారో చూడాలి. అర్హత ఉన్నా పింఛను రావడం లేదు నేను అర్హురాలిని అయినప్పటికీ పింఛను రావడం లేదు. అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు పింఛను వస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుంది. - షేక్ బీబ్, జంగారెడ్డిగూడెం. పింఛను నిలిపేశారు నాకు నాలుగేళ్లు వృద్దాప్య ఫించను వచ్చింది. 10 నెలల నుంచి ఆపేశారు. నా వయస్సు 65 సంవత్సరాలు. అయితే ఆధార్‌కార్డులో వయసు తక్కువగా ఉందని పింఛను ఇవ్వడంలేదు. అధిరులకు ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నాను. కానీ ఎవరూ న్యాయం చేయడంలేదు. ఇదిగో ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుందని తిప్పుతున్నారు. పింఛను రాకపోవడంతో, చేతిలో రూపాయి కూడా ఉండటంలేదు. నాకు పింఛనువస్తుందో, రాదో తెలియడంలేదు. - ఎ.అచ్చాయమ్మ, నరసాపురం -
వికలాంగురాలికి వితంతు పింఛన్!
మల్కాజిగిరి సర్కిల్లో పింఛన్ల ప్రహసనం జాబితాలన్నీ తప్పుల తడకే.. అధికారుల నిర్లక్ష్యం... అర్హులకు అన్యాయం మల్కాజిగిరి : భర్త బతికుండగానే ఒక వికలాంగురాలికి విడో పింఛన్ మంజూరు చేశారు. మరో మైనర్ బాలికకు కూడా వితంతు కోటాలోనే పింఛన్ మంజూరైంది. ఇలాంటి సంఘటనలు మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చాలా చోటు చేసుకుంటున్నాయి. అర్హులైన పింఛన్‌దారులను గుర్తించడంలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాలకు ఈ ఉదంతాలే నిదర్శనం. మల్కాజిగిరి దుర్గానగర్‌లో నివాసముంటున్న వినయ్ అలియాస్ వినేందర్, శాంతాబాయిలిద్దరూ భార్యాభర్తలు, వీరిద్దరూ అంగవైకల్యం ఉన్నవారే. సదరం సర్టిఫికెట్ అందజేసిన వైద్యాధికారులు వినయ్‌కి 89 శాతం, శాంతాబాయికి 86 శాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధృవీకరించారు. గతేడాది నవంబర్ నెల వరకు వీరిద్దరూ వికలాంగుల కోటాలో పింఛన్ పొందారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత నాలుగు నెలల నుంచి వారికి పింఛన్ రావడం లేదు. ఇటీవల ఫిబ్రవరి నెల జాబితాలో మాత్రం శాంతాబాయి పేరు నమోదు అయింది. అయితే, ఆమెకు వికలాంగుల కోటాలో కాకుండా భర్త చనిపోయారని పేర్కొంటూ వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఇక వినయ్‌కుమార్ పేరు జాబితాలో లేనేలేదు. ఆశ్చర్యకర విషయమేమిటంటే... వినయ్‌కుమార్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మల్కాజిగిరి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
వికలాంగుల కోసం హ్యాండ్స్ ఫ్రీ ఫోన్
జెరూసలేం: వికలాంగుల కోసం తొలిసారిగా పూర్తి హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్‌ఫోన్ ‘సెసామే’ను రూపొందించామని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. తల కదలికల ద్వారా ఈ ఫోన్‌ను నియంత్రించవచ్చని పేర్కొంది. చేతులు సరిగ్గా పనిచేయని వారికి ఈ ఫోను ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ ధర సుమారు 60 వేల రూపాయలు. కాగా, ఈ ఫోనును అభివృద్ధి చేసిన జియోర లివ్నె కూడా వికలాంగుడు కావడం విశేషం. -
నీడలేక.. నిలువలేక..
పింఛన్ల కోసం వృద్ధులు... వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. గౌలిపురా మేకల మండీలోని ఓ కేంద్రంలో పింఛను కోసం వెళ్లిన వికలాంగ బాలిక సోమవారం ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయింది. విజయనగర్ కాలనీకి చెందిన గంగాధర శాస్త్రి పింఛను రాలేదని తెలిపేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్యూలో వేచి ఉన్న ఆయన కొద్దిసేపటి తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కుత్బుల్లాపూర్, మెహదీపట్నం, చార్మినార్ : హైదరాబాద్ నగరంలో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, పోలీసులు బాధ్యతా రాహిత్యం కారణంగా పింఛన్ పంపిణీ కేంద్రాలు ముష్ట్టియుద్ధాలు చేసే గోదాలను తలపిస్తున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు లేక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం తాజాగా ఓ వృద్ధుడు పింఛన్ కోసం వచ్చి మృత్యువాత పడ్డాడు. నగరంలోని విజయనగర్‌కాలనీకి చెందిన గంగాధర్‌శాస్త్రి(75) గత మూడు నెలలుగా తీసుకుంటున్నాడు. ప్రతి నెల పోచమ్మ బస్తీలో పింఛన్ డబ్బులు తీసుకునే అతను ఈ నెల పింఛన్ కోసం సోమవారం పంపిణీ కేంద్రానికి వెళ్లగా పింఛన్ రాలేదని తెలిపారు. దీంతో అతను ఉన్నతాధికారులకు మొరపెట్టుకునేందుకు విజయనగర్‌కాలనీలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అయతే అప్పటికే పింఛన్ కోసం వచ్చిన లబ్ధిదారులు బారులు తీరి ఉండడంతో కొద్దిసేపు క్యూలో నిలుచున్న గంగాధర్ అలసి పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఆ వెంటనే పక్కకు ఒరిగి ప్రాణాలు వదిలాడు. జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్ కమ్యూనిటీ హాలులో ఒకే ఒక కౌంటర్ ఏర్పాటు చేయటంతో పింఛన్‌దారుల మధ్య తొక్కిసలాట జరగడంతో కుత్బుల్లాపూర్ చెందిన గుడ్డి సత్తమ్మ అనే మహిళ కాలు విరగగా, దత్తాత్రేయనగర్‌కు చెందిన చంద్రమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. పాతబస్తీలోని చార్మినార్, బండ్లగూడ, బహదూర్‌పురా తహసీల్ధార్ కార్యాలయాల్లోని పింఛన్ల పంపిణి కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో పలువురు వృద్ధులు , వికలాంగులు గాయపడ్డారు. నగరంలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఎందుకిలా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ పింఛన్ల పంపిణీకి అధికారులు సరైన వసతులు చేపట్టకపోవడంతో లబ్థిదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరతా కారణంగా కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికితోడు ఈ నెల 10వ తేదీ నుంచే పింఛన్లు పంపిణి చేపట్టాల్సి ఉన్నా, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 13 వ తేదీ నుంచి పంపిణీ చేపట్టారు. హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 14.67 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 104 కేంద్రాలు ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిపై పర్యవేక్షణ చేపట్టక పోవడంతో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. దరఖాస్తులప్పడూ అంతే... పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలోనూ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసీఫ్ నగర్లో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ఒక వృద్ధుడు చనిపోగా, సైదాబాద్ మండలంలో మరొకరు క్యూలోనే ప్రాణాలు వదిలారు. రోడ్డు దాటుతుండగా మరొకరు దుర్మరణం పాలయ్యాయి. ఈ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని అధికారులు పంపిణీ కేంద్రాల వద్ద సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోవడం లేదు... పింఛన్ కోసం పంపిణీ కేంద్రానికి వస్తే..ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదు. రోజూ వస్తున్నా పట్టించుకోవడం లేదు. వచ్చిన వారికందరికీ పంపిణీ ఇచ్చేలా చూడాలి. - ఎస్. విశ్వేశ్వరచారి, కందికల్‌గేట్. మంచినీళ్లు కూడా లేవు పంపిణీ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎండ కొడుతుంది. కనీసం టెంట్లు కూడా వేయలేదు. ఇబ్బందులకు గురవుతున్నాం. - కళమ్మ, గౌలిపురా. పర్యవేక్షణ లోపం... పంపిణీ కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో.... లేవో.. తెలుసుకునేందుకే లబ్ధిదారలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాయంత్రం వరకు లైన్లో ఉన్నా... లిస్టులో మీ పేరు లేదు... రేపు మరో సెంటర్లో ఇస్తాం అక్కడికి రావాలని చెబుతుండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల తీసుకునే సెంటర్లో కాకుండా... ఇంటికి దూరంగా ఉండే మరో ప్రాంతానికి బదలాయించడం వల్ల వృద్దులు, వికలాంగులు ఆందోళనకు గురవుతున్నారు. 90 వేల మందికే బ్యాంకు ఖాతాలు.. హైదరాబాద్ జిల్లాలో 1,30,305 మంది పింఛన్ దారులుండగా, వారిలో 90 వేల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మిగతా వారందరు బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు సూచిస్తున్నా....ఫలితం కనిపించటంలేదు. మార్చిలోగా బ్యాంకు ఖాతాలు తెరవాలని హుకుం జారీ చేసిన అధికారులు ప్రస్తుతం పంపిణి కేంద్రాల వద్ద పింఛన్లు అందజేస్తున్నారు. -
‘ప్రత్యేక’ విధానాలు అమలు చేయండి
ప్రత్యేక ప్రతిభావంతులతో వ్యవహరించాల్సిన విధి విధానాల్ని త్వరితగతిన రూపొందించి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల గడువును ఇస్తూ, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సాక్షి, చెన్నై:అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వంటి అంగ వైకల్యం కలిగిన వారందరినీ ప్రత్యేక ప్రతిభావంతులుగా పరిగణిస్తున్నారు. ఇటీవల వీరు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షల రూపంలో తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తూ ఇక్కట్లకు గురవుతున్నారు. ఆందోళనలు చేసే క్రమంలో వీరిని పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. నెల న్నర క్రితం చెన్నైలో రోజుకో చోట చొప్పున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించిన ప్రత్యేక ప్రతిభావంతులపై పోలీసులు కన్నెర్ర చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కల్గించే రీతిలో వ్యవహరిస్తున్న ఈ ప్రత్యేక ప్రతిభావంతుల్ని అరెస్టు చేసి, నగర శివారులో వదిలిపెట్టి వచ్చారు. అయితే, చూపు లేని వాళ్లు, నడవ లేని వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వ్యవ హారం తన దృష్టికి రావడంతో న్యాయవాది నజీరుల్లా మద్రాసు హైకోర్టుకు ఓ లేఖ రాశారు. పోలీసుల చర్యలతో ప్రత్యేక ప్రతిభావంతులు పడ్డ అష్టకష్టాలను వివరించారు. ఆయన లేఖను పిటిషన్‌గా భావించిన హైకోర్టు కేసు విచారణకు ఆదేశించింది. వికలాంగుల్ని అరెస్టు చేసే క్రమంలో వారితో ఎలా వ్యవహరించాలో అన్న అంశంపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అమల్లో విధి విధానాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని మొదటి బెంచ్ ముందు గురువారం కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరుపున కొన్ని విధానాల్ని రూపొందించి బెంచ్ ముందు ఉంచారు. అయితే, ఆ విధానాల అమలు కేవలం చెన్నైకు పరిమితం చేశారంటూ వికలాంగుల సంఘాలు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న బెంచ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రతిభావంతులు తమ డిమాండ్లు, హక్కుల సాధన కోసం ఆందోళనలకు దిగిన పక్షంలో, వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలోకి తరలించడం కన్నా, వారి చిరునామా తదితర వివరాల్ని సేకరించి సమీపంలోని బస్టాండ్‌కు తీసుకెళ్లి బస్సు ఎక్కించి పంపించాలని సూచించారు. మరికొన్ని విధి విధానాలను త్వరితగతిన రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులతో సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసి, డిమాండ్లను, హక్కుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే రీతిలో ఆ కమిటీలకు మార్గదర్శకాల్ని నిర్దేశించాలని సూచించారు. నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో విధి విధానాల్ని రూపొందించి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమలు చేసిన విధి విధానాల్ని పిటిషన్ రూపంలో కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
పోలియో చుక్కలు వేసిన క్రికెటర్ లక్ష్మణ్
అమరావతి : ప్రముఖ అమరారామ కేంద్రమైన అమరావతిలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కలమందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలబాలికలు భవిష్యత్‌లో వికలాంగులు కాకుండా పోలియోను నిర్మూలించటానికి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను వేయించడం భాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అంతేకాక, పోలియో వ్యాధిని దేశంలోని ప్రజలందరూ కలసి కట్టుగా పారదోలాలన్నారు. డాక్టర్ శ్రీధర్‌చంద్, డాక్టర్ ప్రసాదనాయక్, డాక్టర్ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
పింఛను కోసం పండుటాకుల పాట్లు
కర్నూలు(జిల్లా పరిషత్): పెరిగిన పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఐదురెట్లు పింఛన్ పెరిగినా కష్టాలు పదిరెట్లు పెరిగాయని లబ్ధిదారులు వాపోతున్నారు. నిబంధనలు పేరుతో చాలామందిని పెన్షన్ జాబితా నుంచి తొలగించారు. పింఛన్ మంజూరైన వారు పోస్టాఫీసు వద్దకు వెళ్లే సరికి డబ్బులు రాలేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. వేలిముద్రలు సరిగ్గా పడడం లేదని, ఆధార్ నెంబర్ తప్పుగా పడిందని, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదని, వీఆర్వో నంబర్ పడలేదని చెబుతూ లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. గందరగోళంగా మారిన హెల్ప్‌డెస్క్ పింఛన్ రాని, వచ్చినా పలు రకాల కారణాల చేత నగదు అందని వారి కోసం కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో వారం రోజులుగా హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్నారు. నగర నలుమూలల నుంచి పలు పోస్టాఫీసుల్లో పింఛన్ అందని వారు మున్సిపల్ కార్యాలయం వస్తున్నారు. వీరిలో రెండు, మూడు, నాలుగు, 8 నెలలుగా పింఛన్ అందని వారు అనేక మంది ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు ముగ్గురు మున్సిపల్ సిబ్బంది ఉండి లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. మొదట్లో 20 నుంచి 30 మంది వరకు హెల్ప్‌డెస్క్‌కు వచ్చేవారు. క్రమేణా వీరి సంఖ్య వందల్లోకి చేరుకుంది. ఒక్కసారిగా వందల కొద్దీ పింఛన్‌దారులు కార్యాలయూనికి చేరుకుని పింఛన్‌పై సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమాధానం చెప్పేవారే కరువు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న వారికి సరైన సమాధానం చెప్పేవారే కరువయ్యారు. లబ్ధిదారులు తెచ్చిన పత్రాలపై ఇంగ్లీషులో అక్కడి సిబ్బంది రాసిస్తున్నారు. తెలుగేరాని లబ్ధిదారులకు ఇంగ్లీషులో ఏమిరాశారో తెలియక లబ్ధిదారులు బిక్కమొహం వేస్తున్నారు. -
పింఛనిప్పించండి సారూ..
ప్రగతినగర్ : పింఛన్ కోసం సోమవారం ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి బారులుదీరి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ సమస్యలపై 183 ఫిర్యాదులు రాగా కేవలం పింఛన్ కోసం 476 ఫిర్యాదులు అం దాయి. అదనపుజేసీ శేషాద్రి, డీఆర్ఓ మనోహర్, పీడీ వెంకటేశం ఫిర్యాదులు స్వీకరించారు. ఆసరాను అందించండి... అర్హులైన వికలాంగులందరికీ ఆసరాను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వికలాంగులు ధర్నకు దిగారు. ఈ సంధర్బంగా బీహెచ్పీఎస్ నాయకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలన్నారు.ఎంతో మంది వికలాంగులు అర్హులుగా ఉన్నా సదరం నిర్వాహకుల వల్ల వికలాంగులకు పింఛన్ అందకుం డా పోతుందన్నారు.నిజమైన వికలాంగులు పింఛన్‌రాక తిప్పలు పడుతున్నారన్నారు. ‘ఉగాదే’ కొత్త సంవత్సరం తెలుగునామ సంవత్సర ఉగాదే మన కొత్త సంవత్సరమని హిందూ జన జాగృతి ఆధ్వర్యంలో ఏజేసీని కలి సి వినతి పత్రాన్ని సమర్పించారు.అంతకుముందు స్థానిక శివాజీనగర్‌లోని శివాజీ చౌక్ నుంచి ర్యాలీ చేపట్టారు. హిందూవులకు ఉగాదే ఉత్తమమైన పండుగని, జనవరి ఒకటి మన నూతన సంవత్సర పండుగ కాదని జాగృతి ప్రతినిధులు పేర్కొన్నారు. అందువల్న జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉగాదిని పండుగను ప్రభుత్వం నూతన సంవత్సరంగా ప్రకటించాలన్నారు. సర్పంచ్‌పై ఫిర్యాదు నిజమాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్, కార్యాదర్శి కలిసి ఆసరా పథకంలో మంజూరు అయి న పింఛన్ ఇవ్వకుండా ఇంటి ట్యాక్సును వసూలు చేస్తున్నారని గ్రామస్తులు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రైసైకిళ్ల పంపిణీ వికలాంగులకు సోమవారం ప్రజావాణిలో ఏజేసీ శేషాద్రి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.వికలాంగులైనా రవి,సాయమ్మ, గౌస్‌లు ట్రైసైకిల్లకోసం దరఖాస్తు చేసుకోగా వారికి అందించారు. ఏజేసీ మాట్లాడుతూ వికలాంగులు ట్రైసైకిళ్లు,వినికిడి యంత్రాలు,చేతి కర్ర లు ఇతర వికలాంగులకు సంబంధించిన పరికరాల కోసం వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
వికలాంగురాలును గర్భవతి చేసిన దుండగులు
అనంతపురం: ఒంటిమిద్దెలో దారుణం జరిగింది. మానసికి వికలాంగురాలను కొందరు గుర్తు తెలియని దుండగులు గర్భవతిని చేసారు. అయితే అశోక అనే యువకుడుపై అనుమానం రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పండుటాకులకు ‘పింఛన్ పరీక్ష’
మొరాయిస్తున్న పీవోటీడీ మెషీన్లు వేలిముద్రలు సరిపోలక పంపిణీలో ఆలస్యం సర్వర్లు చాలా నిదానంగా పనిచేయడమూ మరో కారణం రోజుకు వంద మందికి ఇవ్వలేకపోతున్నామంటున్న తపాలా సిబ్బంది పని ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురవుతున్న పోస్టల్ ఉద్యోగులు సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో పోస్టాఫీసుల ద్వారా ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు చోట్ల పోస్టాఫీసుల్లోని వేలిముద్రల (బయోమెట్రిక్) యంత్రాలు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు రోజుల తరబడి పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సివస్తోంది. వికలాంగులు, కదల్లేని పండుటాకులకు ఇది పరీక్షగానే మారింది. పోస్టాఫీసులకు వెళ్లి రావడానికి ఆటోల ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని, ఎండల్లో పడిగాపులు పడాల్సివస్తోందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లను పారదర్శకంగా, వేగంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విధానంలో ఇస్తోంది. తొలి విడతగా 11 జిల్లాల్లోని (కడప, నెల్లూరు మినహా) 32,12,114 మందికి పింఛన్ల పంపిణీని ప్రారంభించింది. బయోమెట్రిక్ విధానం కోసం ఏపీ ఆన్లైన్ సంస్థ పోస్టాఫీసులకు పీవోటీడీ యంత్రాలను సరఫరా చేసింది. అయితే, చాలా చోట్ల యంత్రాలు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో పడిగాపులుగాసినా పింఛన్ రావడంలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో యంత్రాలు లబ్ధిదారుల వేలి ముద్రలను సవ్యంగా తీసుకోవడంలేదు. ఆధార్ సీడింగ్ సరిగా లేకపోతే యంత్రంలో వివరాలు ప్రాసెస్ కావడంలేదు. ఆధార్ సీడింగ్ సమయంలో తీసుకున్న వేలిముద్రలతో పోస్టాఫీసులో తీసుకునే వేలిముద్రలు సరిపోతేనే పింఛను వస్తుంది. చాలా మంది వృద్దుల వేళ్లు అరిగిపోయి ముద్రలు మారిపోవడంతో యంత్రాలు వాటిని తీసుకోవడంలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా వారికి పింఛన్ రావడంలేదని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. మరోపక్క పలు ప్రాంతాల్లో సర్వర్లు చాలా నిదానంగా పనిచేస్తున్నాయి. దీంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని తపాలా ఉద్యోగులు చెబుతున్నారు. వేలి ముద్రలు తీసుకోవడం, వారి ఖాతాను ఓపెన్ చేసి సొమ్ము పంపిణీ చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. రోజుకు వంద మందికి కూడా ఇవ్వడం సాధ్యం కావడంలేదని చెబుతున్నారు. గుంటూరు, నర్సరావుపేట, మదనపల్లి, కావలి, రాజమండ్రి, భీమవరం పోస్టల్ డివిజన్లలో చాలా చోట్ల సర్వర్లు సరిగా పనిచేయడంలేదు. తపాలా శాఖ ఐడియా 2జీ నెట్వర్క్ ఉపయోగిస్తోందని, బీఎస్ఎన్ఎల్ 3జీ సేవలను ఉపయోగిస్తే వేగం పెరుగుతుందని ఏపీ ఆన్లైన్ అంటోంది. అంతేకాకుండా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సరిగా పనిచేయని అటవీ, మారుమూల ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు సిగ్నల్స్ సరిగా అందక బయోమెట్రిక్ మెషీన్లు గంటల తర బడి ఆగిపోతున్నాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 3,65,403 మందికి రూ. 45.45 కోట్లు అందించేందుకు ఏపీ ఆన్లైన్ 1,261 యంత్రాలను పోస్టాఫీసుల్లో ఉంచింది. వీటిలో నాలుగో వంతు మెషీన్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో పని ఒత్తిడి పెరిగి పోస్టల్ ఉద్యోగులు ఒత్తిడికి గురికావడం, సహనం కోల్పోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులు, ఉద్యోగుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. గురువారం గుంటూరు నగరంలో ఇద్దరు ఉద్యోగులు ఒత్తిడి కారణంగా ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని లబ్ధిదారులు, పోస్టల్ ఉద్యోగులు కోరుతున్నారు. -
పింఛన్ పంచాయితీ
పింఛన్ల కోసం జిల్లాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం సైతం వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు. పింఛన్ కోసం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అన్ని అర్హతలున్నా తమకు ఎందుకు మంజూరు చేయరంటూ బాధితులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు.. రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహావేశాలతో పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకూ వెళ్లేది లేదంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. పలుచోట్ల వివిధ రాజకీయ పక్షాల నాయకులు వారికి అండగా నిలుస్తుండడంతో పరిస్థితి మరింత వేడెక్కుతోంది. నేను అర్హుడిని కాదా..? మర్పల్లి: 80 ఏళ్లకు పైగా ఉన్న ఇతను మండల పరిధిలోని బూచన్‌పల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి పెంటయ్య. మొన్నటివరకూ వృద్ధాప్య పింఛన్ వచ్చింది. ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే జాబితాలో పేరు రాలేదు. దీంతో సోమవారం ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు. తమ లాంటి వృద్ధులకు కాకుండా ఎవరికి పింఛన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నాడు. అధికారుల తప్పిదంతో పింఛన్ కట్ .. తాండూరు రూరల్: ఈ చిత్రంలో సదరం సర్టిఫికెట్ చూపిస్తున్న యువతి పేరు కుర్వ విజయలక్ష్మి (21). మండల పరిధిలోని గోనూర్ గ్రామానికి చెందిన ఈమెకు రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 2011లో అధికారులు విజయలక్ష్మికి (ఐడీ నంబర్ -15201230300122013) సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే నంబర్ మీద అదే గ్రామానికి చెందిన వికలాంగురాలు కావలి ఎల్లమ్మకు సైతం సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో ఇద్దరికీ రూ.500 పింఛన్ వచ్చింది. అయితే కుర్వ విజయలక్ష్మి సర్టిఫికెట్‌పై ఫొటో మాత్రమే ఆమెది ఉంది. పేరు కావలి ఎల్లమ్మ అని ఉంది. దీంతో విజయలక్ష్మి సదరం సర్టిఫికెట్ తప్పుగా ఉందని అధికారులు ఆమె పేరును పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఆందోళనతో తండ్రి కుర్వ బిచ్చప్ప కూతురును ఎత్తుకుని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. వింతలెన్నో..! యాలాల: పింఛన్లలో రోజుకో వింతలు.. ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. చోటుచేసుకుంటోంది. అన్ని అర్హతలున్నా పింఛన్ రానివారు కొందరుంటే.. భర్త ఉన్నప్పటికీ ఓ మహిళ వితంతువు అంటూ పింఛన్ మంజూరు చేశారు. భర్త ఉన్నా వితంతు పింఛన్.. మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాములు, ఈశ్వరమ్మ దంపతులు. రాములు కుమ్మరి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పింఛన్ల పంపిణీలో భాగంగా గ్రామానికి ఈఓపీఆర్డీ వసంతలక్ష్మితో పాటు స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, సర్పంచ్ హాజరయ్యారు. ఈశ్వరమ్మ వితంతు పింఛన్‌కు అర్హురాలిగా పేర్కొంటూ జాబితాలో ఫొటో వచ్చింది. పింఛన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో ఎంపీటీసీ సభ్యుడు వీరేశం ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే జరిగిన పొరపాటును ఈఓపీఆర్డీకి తెలియజేయడంతో ఆమె పేరును జాబితా నుంచి తొలగించారు. వికలాంగురాలైనా జాబితాలో పేరు లేక.. యాలాల మండల కేంద్రానికి చెందిన శారదకు కుడిచేయి లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో సదరం సర్టిఫికెట్ కూడా జత చేసింది. కానీ ఆమెను జాబితాలో చేర్చలేదు. పింఛన్ డబ్బులు వస్తాయనే ఆశతో పంచాయతీ కార్యాలయం వద్ద ఎదురుచూసిన శారదకు జాబితాలో పేరు రాలేదని తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. సదరం ఉన్నా..పింఛన్ రాలేదు.. యాలాలకు చెందిన వర్ల సాయికుమార్ మానసిక వికలాంగుడు. తన పనిని తాను స్వతహాగా చేసుకోలేని దుస్థితి. సదరం క్యాంపులో భాగంగా వైద్యుడు సాయికుమార్‌కు 64 శాతం మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించాడు. సాయికుమార్ పేరు సైతం పింఛన్ జాబితాలో రాలేదు. -
ఆసరా లేక ఆందోళన..
ఆసరా పింఛన్లు అందక జిల్లాలో లబ్ధిదారులు ఇంకా ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనా.. పలువురి పేర్లు జాబితాల్లో కనిపించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టాల్సి వస్తోంది. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. గురువారం కాగజ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వికలాంగ యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆసిఫాబాద్, కెరమెరిలో ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్ : ‘ఆసరా’ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఆందోళనలు కొనసాగుతున్నా యి. గురువారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట, బూర్గుడ, కొమ్ముగూడ, ఆసిఫాబాద్‌కు చెందిన వృద్ధులు స్థానిక ఎంపీడీవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. పింఛన్‌పై ఆధారపడి బతుకుతున్న తమ పేర్లు తొలగించ డం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే స మయంలో అక్కడికి చేరుకున్న జెడ్పీటీసీ సభ్యు డు కొయ్యల హేమాజీ, ఎంపీడీవో శ్రీనివాస్ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హా మీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో గుండక్క, పోశక్క, తార, సౌమ్యరాణి, రాజక్క, తిరుపతి, అలీమా, వృద్ధులు పాల్గొన్నారు. కెరమెరిలో..కెరమెరి : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద గ్రా మాలైన పరందోళి, కోటా, ముకందంగూడ, మ హరాజ్‌గూడ, తాండ గ్రామాలకు చెందిన వృ ద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువా రం కెరమెరి ఎంపీడీవో కార్యాలయంలో గంట న్నరపాటు ధర్నా నిర్వహించారు. పింఛన్లు నిలి పివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ రావడం లే దని ఆవేదన చెందారు. అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు అబ్దుల్‌కలాంకు తమ సమస్యను విన్నవించారు. అధికారులతో మాట్లాడి పింఛ న్లు ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యాక్రమంలో ఎ.కిషన్, బాపూరావు, దేవాజీ, వి.కిష న్, మిట్టు, చంద్రభాగా, గంగాబాయి, తుల్సాబాయి, శ్యామలాబాయి పాల్గొన్నారు. -
ఈ తిప్పలు తప్పేదెన్నడో?
నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల (వికలాంగులు) సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2009లో అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి వీరికి సాధారణ తరగతి గదులలో మిగతా విద్యార్థులతోపాటే ప్రత్యేక శిక్షకుల ద్వారా (సమ్మిళిత విద్య) విద్యాబోధన చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. వైకల్యంతో జన్మించిన తమ పిల్లలకు కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా పాఠశాల విద్య అందుతుందేమోనని ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తన డ్రీమ్ ప్రాజెక్టు అంటూ పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు ప్రణాళిక సైతం రూపొందిం చుకొని ముందుకు సాగుతున్నారు. కా నీ అవే ప్రభుత్వ పాఠశాలలలో నిరాద రణకు గురవుతున్న తమ పిల్లల గురిం చి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఐదేళ్లవుతున్నా ప్రచార ఆర్భాటమే విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదేళ్లవుతున్నా అందరికీ విద్య అనే నినాదం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోంది. వైకల్య పిల్లలకు విద్యనందించడానికి అంకిత భావంతో స్పెషల్ ఎడ్యూకేషన్ చదివినవారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఇబ్బం దులు ఎదుర్కొనేవారిని వికలాంగులు గా (ప్రత్యేక అవసరాలు గలవారిగా) గుర్తిస్తారు. 2014-15 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, సర్వశిక్షా అభియాన్ సంయుక్తంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలలో 1.50 లక్షలకు పైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్న ట్లు గుర్తించారు. వారిలో సుమారు 69 వేల మంది విద్యార్థులు పాఠశాలలలో ఉంటే మిగతావారు పాఠశాలల బయ ట ఉన్నట్లు తేలింది. సాధారణ పాఠ శాలలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలా బోధించాలో అక్కడి ఉపాధ్యాయులకు తెలియదు. దీంతో చాలా మంది పిల్లలు బడి మానేస్తున్నారని నిర్ధారించారు. వైకల్య బాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయు లు మాత్రమే బోధించడానికి అర్హులని గతంలో భారత పునరావాస మండలి తీర్మానించింది. కేవలం ఏడు పాఠశాలలే వాస్తవాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1.50 లక్షల మం ది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేవలం ఏడు పాఠశాలలనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో బధిరులకు మిర్యాలగూడ, కరీంనగర్, హైదరాబాద్‌లో నాలుగు పాఠశాలలు ఉన్నాయి. అంధులకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్లో కలిపి మూడు పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఎక్కడా అందుబాటులో లేవు. ఏటా ఉద్యోగ నియామకాలలో మూడు శాతం రిజర్వేషన్‌ను వికలాంగుల కోసం కేటాయిస్తుంటారు. చదువుకోవడానికి విద్యా సంస్థలే అందుబాటులో లేని పరిస్థితులలో వారు ఉద్యోగం పొం దే స్థాయికి ఎప్పుడు వెళ్తారో ప్రభుత్వాలే ఆలోచించాలి. జిల్లాలో 8,603 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ ఐదుగురు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒక ప్ర త్యేక ఉపాధ్యాయుడు అవసరం ఉండగా, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కేవలం 42 మందిని కాంట్రాక్టు రిసోర్స్పర్సన్లను నియమించి బోధన అందిస్తున్నారు. మోక్షం లేని ప్రత్యేక పాఠశాలలు సాధారణ విద్యార్థుల కోసం కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల అన్న ప్రభుత్వం నిర్ణయం హర్షించదగ్గదే. అయితే, అడుగు తీసి అడుగు వేయలేని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం కనీసం ప్రతీ వంద కిలో మీ టర్లకు ఒక ప్రత్యేక పాఠశాలనైనా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుం చి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికి ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. ప్రత్యే క అవసరాలు గల పిల్లలకు బోధించడానికి జిల్లావ్యాప్తంగా ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేడు. ఒక్క ప్ర భుత్వ ప్రత్యేక పాఠశాల లేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆధర్వం లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. అది విచారణలో ఉంది. ఇప్పటికైనా ఈ పిల్లలకు, తల్లిదండ్రు లకు న్యాయం చేకూరుతుందా! -
ఎన్నాళ్లు బాంచెన్!
పాత పింఛన్ లేక, కొత్తగా పింఛన్ అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఆధార్, ఎస్కేఎస్, ఆన్లైన్ తదితర కారణాలతో అనేకమందిలో గందరగోళం నెలకొంది. పింఛన్ రాదేమోననే బెంగతో డిచ్పల్లి మండలం సుద్దుపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (68) మృతి చెందింది. 30 రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాలలో ఇలా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకోచోట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలో లోకేష్ అనే వికలాంగుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ అవస్థలు ఎన్నాళ్లో తెలియడం లేదు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిబంధనలు మారడం, నూతనంగా ఆసరా పథకం తెరపైకి రావడంతో పింఛన్దారులలో అయోమయం ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా రూ.1000 పిం ఛన్ అమలు కోసం చేపట్టిన సర్వే, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రక్రియలు గందరగోళంగా మారాయి. దరఖాస్తు చే సుకున్నవారిలో అర్హులు చాలా మంది పింఛన్లు రాక అవస్థ పడుతున్నారు. గ తంలో పింఛన్ పొంది, కొత్త జాబితాలో పేర్లు లేనివారు విలపిస్తున్నారు. తామె లా బతికేదంటూ రోడ్డెక్కుతున్నారు. జి ల్లాలో గత నెల ఎనిమిదిన పింఛన్ల పం పిణీ ప్రారంభమైనా 61 మందికే అందజేశారు. ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆసరా పథకం లబ్ధిదారులకు న్యాయం చేకూర్చలేకపోయింది. అధికారులు దర ఖాస్తుదారుల పరిశీలనలో అయోమయానికి గురవుతున్నారు. అర్హులను గుర్తించడంలో తప్పులు దొర్లుతున్నాయి. సాంకేతిక కారణాల తో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్హులను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. మోర్తాడ్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి ప్రాంతాలలో పరిశీలన నత్తనడకన సాగుతుంది. అక్టోబర్ 30లోగా దరఖా స్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని భావించారు. ఆచరణలో ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ తేదీని నవంబరు ఆరు వరకు పొడిగించారు. ఎనిమిద వ తేదీ నుంచి పింఛన్లు అందించాలని నిర్ణయించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఇపుడు ఆ గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. మండల, పట్టణ, నగర స్థాయిలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా గందరగోళం మాత్రం తొలగడం లేదు. నగర పరిధిలోనూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పింఛన్ల పరిశీలన నేటికీ వరకు కొనసాగుతోంది. ఇక్కడ పింఛన్ల కోసం 35 వేల దరఖాస్తులు, ఆహార భద్రత కార్డుల కోసం 86 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన నేటి వరకు ముగియలేదు. కేవలం 60 శాతం పరిశీలన మాత్రమే జరిగింది. దీంతో పింఛన్ల పంపిణీ జరుగలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో 3,67,101 మంది పింఛన్‌దారులు ధరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అ నంతరం అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో కంప్యూటరీకరించా ల్సి ఉంది. వీటి కోసం కంప్యూటర్ కౌంటర్లు ఏర్పాటు చేసినా దరఖాస్తులు ఇంకా పూర్తిగా రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచి పోయిం ది. వృద్ధాప్య పింఛన్లలో వయసు నిర్ధార ణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మంది అర్జీలు వయసు తక్కువ అంటూ తిరస్కారానికి గురయ్యాయి. వితంతు పింఛన్ల విషయంలో భర్త మరణ ధ్రువీక రణ పత్రం కావాలంటూ, ఆసుపత్రికి రావాలంటూ కొంతమందికి కత్తెర పెట్టారు. ఇక వికలాంగులకు సదరం ఐడి నంబర్ ఉంటేనే పింఛన్ ఇస్తామంటూ గొళ్లెం తగిలేశారు. సదరం శిబిరానికి హజరైన ఇంకా 30 శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు అందాల్సి ఉంది. ఆగని ఆందోళనలు గత కొన్ని రోజులుగా జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పింఛన్ల కోసం గాంధారిలో వృద్ధులు ధర్నా, రాస్తారోకో చే పట్టారు. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో వృద్ధులు, వికలాం గు లు, వితంతువులు ఆందోళన నిర్వహించారు. సోమవారం దోమకొండ మండలం బీబీపేటకు చెందిన వికలాంగుడు లోకేశ్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఇంతకు ముందు ధర్పల్లి మం డ లంలో రెండుసార్లు ఎల్లారెడ్డిపల్లి, అంసాన్పల్లి గ్రామాలకు చెందిన పం డుటాకులు రాస్తారోకో నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ పంచాయతీని గత నెలలో ముట్టడించారు. ఆర్మూర్‌లో అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎ దుట ధర్నా నిర్వహించారు. కల్లెడ, ఢీకంపల్లి గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు మాక్లూర్ మండల కార్యాలయానికి తాళం వేసి నిజామాబాద్-నందిపేట రోడ్డుపై బైఠాయించారు. ఇదే మండలం అడవిమామి డిపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఎల్లారెడ్డికి చెందిన పింఛన్‌దారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎడపల్లి మండల కేంద్రలో రాస్తారోకో చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో నిరసనలు కొనసాగాయి. -
విల‘పింఛన్’
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసరా పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితాపై రెండో రోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిరస న తెలిపారు. పింఛన్ జాబితాలో పేరు లేక పోవడం తో చేర్యాల మండలం కిష్టంపేటలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అధికారుల పొరపాట్లతో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. పాలకుర్తి : పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆసరా పథకం పింఛన్ రాలేదని మనస్థాపంతో బైరపాక బచ్చమ్మ(80) ఆకస్మికంగా మరణించింది. ఇదే గ్రామం ఎర్రకుంట తండాకు చెందిన లకావత్ బుచ్చి(70) బమ్మెర గ్రామ పంచాయతీ దగ్గర పింఛన్ జాబితాలో తన పేరు లేదని అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న గత లబ్ధిదారుల పేర్లు తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామాల్లో పింఛన్లు మంజూరు కానివారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. ములుగు : ఆసరా పింఛన్ జాబితాలో పేర్లులేని వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం ఆయా మండలాల్లో ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. పత్తిపల్లి శివారు కొడిశలకుంట గ్రామానికి చెందిన భూక్య సింధల్ కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైంది. స్థానిక వీఆర్వోకు ఆమె వినతిపత్రం అందించారు. వినతిపపత్రం అందజేశారు. భూపాలపల్లి : రేగొండ మండలంలో అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 200 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మంగళవారం పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. భూపాలపల్లి, గణపురం, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఆసరా పథకంలో పింఛన్లు మంజూరు చేయలేదంటూ ఎవరూ గోడవలు, ఘర్షణలు, ధర్నా, రాస్తారోకో, నిరసనలకు దిగలేదు. అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలో అర్హులై వారందరికి పింఛన్లు అందించాలని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషనర్ రాజలింగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లికుదురు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పింఛన్లు అందించాలని ధర్నా నిర్వహించారు. నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు వుండలాల్లో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 1415 వుంది దరఖాస్తులు చేసుకున్నారు. సోవువారం జరిగిన గ్రావుసభల్లో 1,342 వుంది, వుంగళవారం 73 వుంది దరఖాస్తు చేసుకున్నారు. పరకాల : ఆసరా పథకం కోసం అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు జాబితాలో పేరు రాకపోవడంతో మంగళవారం కార్యాలయాల చుట్టూ బారులు తీరారు. జాబితాల్లో పేర్లు లేకపోవడంతో అధికారుల విజ్ఞప్తి మేరకు మారోమారు దరఖాస్తులను అందిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని గ్రామ పంచాయతీల్లో పెన్షన్‌దారుల జాబితాలు అందుబాటులో లేవు. కంప్యూటర్ తప్పులు, సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) ఫారాలు లేవంటూ తిప్పి పంపుతున్నారు. అధికారులు దరఖాస్తులను స్వీకరించడానికి అందుబాటులో లేరు. గీసుకొండ మండలం వ్యాప్తంగా 450 మంది వరకు రెండోసారి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సంగెం మండలంలో జాబితాలో పేర్ల రాని వారు అక్కడక్కడ రెండోసారి దరఖాస్తులు చేసుకున్నారు. జనగామ : జనగామ మునిసిపాలిటీ కార్యాలయం ఎదుట ఎస్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పింఛన్ల ఎగవేతపై మండిపడ్డారు. చేర్యాల మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మండలంలోని కిష్టంపేటలో పింఛన్ రాకపోవడంతో నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ తూర్పు : కాశిబుగ్గ చౌరస్తా ఐదో డివిజన్‌కు చెందిన అడుప వెంకట నర్సయ్య(80)కు సోమవారం ప్రకటించిన పింఛన్ల జాబితాలో పేరు లేకపోవడంతో మానసిక వేదనతో గుండెపోటుతో మంగళవారం నిద్రలోనే చనిపోయారు. పేర్లులేని అర్హులైనవారు మళ్ళీ ధరఖాస్తు చేసుకుంటున్నారు. వరంగల్ పశ్చిమ : అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని కోరుతూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో లష్కర్సింగారంలోని నోడల్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. డోర్నకల్ : డోర్నకల్ ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్‌రాని వితంతువులు, వృద్ధులు, వికలాంగులు దరఖాస్తులు చేసుకోవడం కోసం భారీ ఎత్తున తరలివచ్చారు. కురవి మండలం నల్లెల్లలో పింఛన్ జాబితాలో పేర్లు లేకపోవడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవోను అడ్డుకున్నారు. పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. కాళ్లు చేతులు, నడుము పనిచేయని స్థితిలో ఉన్న ఎనిమిది ఏళ్ల చిన్నారి బాలిక పేరు పింఛన్ జాబితాలో లేక పోవడంతో నల్లెల్లకు చెందిన నక్క స్వరూప తన కుమార్తెను తీసుకొని వచ్చి ఎంపీడీవో కార్యాలయం మెట్లపై పడుకోబెట్టి నిరసన వ్యక్తం చేసింది. -
కలెక్టర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్లు రాలేదని చెప్పుకునేందుకు వెళ్లిన వికలాంగుల పట్ల కలెక్టర్ దౌర్జన్యంగా వ్యవహరించడం గర్హనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో వీహెచ్పీఎస్ నేతలపై జిల్లా యంత్రాంగం చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్, ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు వచ్చిన పలువురు వికలాంగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వికలాంగులను కించపర్చేలా వ్యవహరించిన కలెక్టర్ శ్రీధర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుడైన వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కాళ్ల జంగయ్యను కలెక్టర్ తన చాంబర్‌నుంచి సిబ్బందితో గెంటివేయించారని అన్నారు. దళితునిపట్ల అనుచితంగా వ్యవహరించిన కలెక్టర్, సిబ్బందిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీధర్ 24గంటల్లో వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్నాలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వికలాంగుల పట్ల కలెక్టర్ చేసిన పరుషపదజాలానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కలెక్టర్‌పై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా వికలాంగుల సంఘ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ.. కలెక్టర్ సేవలను కొనియాడుతూ టీఎన్జీఓ నేతలు బుధవారం ప్రతికా ప్రకటన చేయడం కొసమెరుపు. -
పింఛన్ ఇప్పించండి సారూ..
జిల్లా నలుమూలాల నుంచి ప్రతీ సోమవారం ఫిర్యాదుల విభాగానికి వచ్చే అర్జీదారుల సమస్యలపై అధికారులు స్పందించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. తమకు గతంలో పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం రావడం లేదని వికలాంగులు, వితంతులు, వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు వ్యవసాయ భూమిని ఇప్పించాలని, ఇంటి స్థలం ఇప్పించేలా చూడాలని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.- ఆదిలాబాద్ రూరల్ టవర్ నిర్మాణం రద్దుచేయాలి ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిర్మాణ పనులను వెంటనే రద్దు చేయాలని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గంగారెడ్డి, మామిడి లక్ష్మణ్, సభ్యులు మామిడి భాస్కర్, చిలుక స్వామి, మునేశ్వర్, రవి, జి.శ్రీనివాస్, సాయ్యన్న ఫిర్యాదు చేశారు. తమ కాలనీలో గృహ సముదాయంలో నిర్మిస్తున్న సెల్‌టవర్ నిబంధనాలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో రేడియేషన్ ప్రభావంతో గర్భిణులకు, మానసిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించి సెల్‌టవర్ నిర్మాణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పింఛన్ కట్ అయింది కొన్నేళ్ల నుంచి మొన్నటి వరకు నాకు పింఛన్ వచ్చింది. ప్రస్తుతం పింఛన్ రావడం లేదు. వితంతువులం, వృద్ధులం. మాకు ఎవరు అన్నం పెడుతారు. కనీసం పింఛన్‌తోనైనా బతుకుదామని ఆశతో ఉంటే వస్తున్న పింఛన్ కూడా కట్ అయింది. వెంటనే మాకు పింఛన్ వచ్చేలా చూడాలి. - సుశీల, అడేల్లా, దేవమ్మ, వితంతువులు, జందాపూర్, ఆదిలాబాద్ ఏఏఈవో ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న 440 పోస్టుల్లో ఏఏఈవో ఉద్యోగాల్లో మాకు సైతం అవకాశం కల్పించాలి. మరికొన్ని రోజులైతే మా కోర్సు పూర్తవుతుంది. ఈ నోటిఫికేషన్లో తమకు అవకాశం కల్పించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జిల్లాలో సుమారు 5 వేల మంది ఈ కోర్సు పూర్తి చేసిన వారము ఉన్నాం. మాకు అవకాశం కల్పించకుండా కేవలం అగ్రికల్చర్ డిప్లొమా, పాలిటెక్నిక్ చేసిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారితో పాటు తమకు కూడా అవకాశం కలిగేలా చూడాలి. కాగా, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో అగ్రికల్చర్ విద్యార్థులు సుధాకర్, స్వాగత్, సునీల్, నర్మద, శైలజ, పద్మ, శ్రీలత ఉన్నారు. - అగ్రికల్చర్ అసిస్టెంట్ విద్యార్థులు పోలీసులు జర పట్టించుకోవాలి ఆగస్టులో మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటే నా భార్యతో కలిసి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఎవరో దొంగ నా భార్య మెడలోంచి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు దొంగలించుకుపోయాడు. అప్పుడు సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశాను. దొంగతనం జరిగినప్పటి దృశ్యం రిమ్స్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నా దొంగను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలి. దొంగను పట్టుకుని మా బంగారం మాకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. - నాయిని సుదర్శన్, ఖుర్షీద్‌నగర్, ఆదిలాబాద్ -
పింఛన్ వస్తుందో.. రాదోనని ఆందోళన
సామాజిక సీలింగ్ నిబంధనతో కులాల వారీగా తుదిజాబితా రెండు రోజులు పడుతుందంటున్న అధికారులు ఇంటికొకరికేనంటూ మరికొందరి పేర్లు గల్లంతు ఆధార్‌కార్డులో 65 ఏళ్లు లేకపోతే నో పింఛన్ పింఛన్.. పింఛన్.. పింఛన్... వారంరోజులుగా జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట. ‘ఆసరా’ పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి కార్మికులకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామాల్లో రచ్చబండల నుంచి కలెక్టరేట్ దాకా చర్చ జరుగుతోంది ఈ పింఛన్ల గురించే. దరఖాస్తుల ఆహ్వానంనుంచి.. పంపిణీ ప్రారంభం వరకు అంతా హడావిడిగా, వాడీవేడిగా జరుగుతున్న పింఛన్ల ప్రహసనంపై ‘సాక్షి’ ఫోకస్... క్షేత్రస్థాయిలో ఎన్నో ఆటంకాలు, అనుమానాలు, ఆందోళనలు, ఆవేదనల నడుమ ‘ఆసరా’ పిం ఛన్ల పంపిణీ సాగుతోంది. వాస్తవానికి దరఖాస్తుదారుల సంఖ్య ఈసారి భారీఎత్తున పెరగగా, అందులో కూడా ప్రభుత్వంటార్గెట్ విధించి కోత పెడుతోందన్న ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే కొత్తగా తెరపైకి వచ్చిన ‘సామాజిక సీలింగ్’ నిబంధన గ్రామస్థాయిలో వృద్ధులను కలవరపెడుతోంది. మరోవైపు సమగ్రసర్వే, ఆధార్‌కార్డుకు లింకులు పెట్టి ఏదోసాకుతో పింఛన్ కోసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. అసలు తుది జాబితాలు సిద్ధంకాక ముందే పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం, ఎంపిక చేసిన వారికి పెన్షన్లు ఇస్తుండడంతో, మిగిలినవారు తమకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో అర్హులెంతమంది ఉన్నా, ఒక్కరికే పింఛన్ ఇస్తామని, వివిధ కేటగిరీల్లో ఉంటేనే అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది తమకు పింఛన్ రాదేమోననే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, డ్వాక్రాగ్రూపుల్లో తమవంతు వాటా చెల్లించి పింఛన్ పొందుతున్న ‘అభయహస్తం’ లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.500 పింఛన్ వస్తుండగా, ఇప్పుడు వీరికి రూ.1000 పింఛన్ అమలుచేస్తారా లేక అదే కొనసాగిస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. ఇక, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి విషయంలో కూడా సామాజిక సీలింగ్ అమలు చేస్తున్నారన్న ప్రచారమే నిజమైతే కుష్ఠు ఎయిడ్స్ రోగులకు కూడా పింఛన్లో కోతపడే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధిం చిన వివరాలన్నీ ఆన్లైన్లో అన్ని మండలాల్లో నమో దు కాకుండానే సర్వేకు, పింఛన్‌కు లింకుపెడుతున్నారని, ఆధార్ కార్డులో 65 ఏళ్ల వయసు నమోదు కాకపోయినా పింఛన్ తీసేస్తున్నారని జరుగుతున్న ప్రచారం వృద్ధులను రోడ్లెక్కేలా చేస్తోంది. రెండు రోజులుగా పింఛన్ల పంపిణీపై ఆందోళనలు జిల్లావ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తికార్మికులు తమ పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులంటున్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కలెక్టర్ చిరంజీవులు అధికారికంగా ప్రకటనలు చేస్తుం డడం కొంత భరోసా కలిగిస్తున్నా, అధికారిక తుది జాబితాలు వచ్చి తమ పేర్లను చూసుకునేంతవరకు దరఖాస్తుదారుల్లో ఇదే ఆవేదన కొనసాగనుంది. -
ఆరంభం మాత్రమే..అంతం కాదు..
ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. సమైక్యాంధ్ర పాలనలో అన్నిరంగాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు వృద్ధులు, వితంతులకు ఇచ్చిన రూ. 200 పింఛన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రూ.వెయ్యికి పెంచిందని, వికలాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను రూ.1500లకు పెంచుతూ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులను ఎవరూ పోషించకున్నా భరోసా కల్పించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేలలోపు సంవత్సర ఆదాయం ఉన్న వారికే పింఛన్లు అందజేసేవని, కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంత వాసులకు రూ. 2 లక్షలలోపు ఆదాయం ఉన్న పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. 2015 మార్చికల్లా భూమిలేని ఎస్టీలకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు లేనివారికి స్థలాలు, పక్కాగృహాలు నిర్మించి ఇస్తామన్నారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి సదరం క్యాంపులకు వచ్చే వికలాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా మండల కేంద్రాల్లోనే సదరం క్యాంపులను నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధాప్య 1,10,565, వితంతు 72,552, వికలాంగ 27,909 మందికి పింఛన్ల కోసం రూ. 22 కోట్ల 49 లక్షల 80 వేల 500 అందించామని చెప్పా రు. ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం అర్హులైన తాంసి, తలమడుగు, బేల, ఆదిలాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వల్లకొండ శోభారాణి, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, కలెక్టర్ ఎం. జగన్మోహన్, ఆదిలాబాద్ జెడ్పీటీసీ అశోక్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నైతం లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
ఫింఛన్... టెన్షన్
బాన్సువాడ: ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఫించన్ల పంపిణీ ఎట్టకేలకు ప్రారంభమైంది. గతంలో వివిధ రకాల సామాజిక ఫించన్లు పొందుతున్నవారితో పాటు, కొత్తవారికి ఫిం చన్లు పంపిణీ చేసేందకు ప్రభుత్వం ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, తమకు ఫించన్లు వస్తాయో రావోననే ఆందోళన కొందరు లబ్ధిదారులను వెంటాడుతోంది. వయోభారంలో ఉన్న పండుటాకులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వివిధ వృత్తిదారులు ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నా రు. ఇటీవల ఫించను మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో పోటీ పెరిగింది. కొత్త జాబితాతో కలవరం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శని వారం నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభిం చారు. కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చాలా చోట్ల లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఫించన్ల కోసం ప్రతీ గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నేటికీ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. గత నెల 20 నుంచే ఆయా గ్రామాలలో దరఖాస్తుల విచారణ ప్రారంభించారు. మున్సిపాలిటీలలో విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అధికారుల రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు వృద్ధులు వారు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తహ శీలు కార్యాలయాలకు త ండోపతండాలుగా తరలి వచ్చి వాకబు చేస్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఉదయం ఎనిమిది గంటలకే పరగడుపున అధికారుల వద్దకు చేరుకుని తమ గురించి విచారణ జరపాలని వేడుకొంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. విచారణ నత్తనడకన సాగుతోంది. ఎక్కువ మందిని విచారించాల్సి రావడంతో బృందాలుగా వెళ్తున్న రెవెన్యూ సిబ్బంది, దరఖాస్తుదారుల చిరునామా లభిం చక ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులకు తలనొప్పి అనేక గ్రామాలలో నిర్ణీత లక్ష్యం కన్నా అధికంగా అర్హులు ఉండడంతో ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. సీలింగ్ మించి ఎంపిక చేయరాదని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతి గ్రామంలో ఐదు శాతం వృద్ధులు, ఐదు శాతం వితంతువులు, మూడు శాతం వికలాంగులను మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. గ్రామ జనాభా ఆధారంగా ఎస్సీలు 80 శాతం, ఎస్టీలు 75 శాతం, బీసీలు 50 శాతం, ఓసీలు 20 శాతం మేర ఫించన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించారు. కొన్ని గ్రామాలలో ఓసీలు 20 శాతానికి మించి అర్హులున్నప్పటికీ వారు ఎంపికయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం మండలానికి వెయ్యి ఫించన్లను అందించేందుకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఫించన్లు పొందుతున్నవారిలో సుమారు 50 వేల మంది తమ ఫించన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎందరు లబ్ధిదారులను ఎంపిక చేశారనే విషయం అధికారికంగా వెల్లడించలేదు. -
అష్టకష్టాలు
రిమ్స్‌లో అందజేసే సడేరాం సర్టిఫికెట్ల కోసం వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. వికలాంగులకు రిమ్స్‌లో పరీక్షలు నిర్వహించి వారికి ధృవీకరణ పత్రాలను అందజేసి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఉపయోగపడేలా ప్రతి సంవత్సరం సడేరాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, రిమ్స్ ఆధ్వర్యంలో వైఎస్ హయాంలో 2007లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని వేల మంది వికలాంగులు అర్హత పత్రాలు పొంది పింఛన్‌కు అర్హులయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనెల 4వ తేదీ నుంచి రిమ్స్‌లో సడేరాం కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. సర్టిఫికెట్ల అందజేయిస్తామని వందలాది వికలాంగులను డీఆర్డీఏ అధికారులు బస్సులలో రప్పిస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం కుటుంబసభ్యులు, బంధువుల సహాయంతో వికలాంగులు రిమ్స్‌కు చేరుకుంటున్నారు. రిమ్స్‌కు చేరుకున్నప్పటి నుంచి వారి కష్టాలు మొదలవుతాయి. ఓపీ టిక్కెట్ రాయించుకోగానే డీఆర్డీఏ వారు ఆన్లైన్లో వాటిని నమోదు చేస్తారు. ఉదయం 9 గంటలకు నమోదు కార్యక్రమం మొదలవుతుంది. ఆయా విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 10 గంటల నుంచి వికలాంగులను పరిశీలిస్తారు. ఒక్కో వైద్యుడు 20మందిని చూడగానే పరీక్షలు చేయడాన్ని నిలిపేస్తారు. ఇదేమిటని వికలాంగులు ప్రశ్నిస్తే తాము 20 మందినే చూస్తామని, అంతకంటే ఎక్కువగా చూడటం తమ వల్ల కాదని, ఈ విషయాన్ని డీఆర్డీఏ వారికి చెప్పామని తెలుపుతున్నారు. తమ ప్రైవేట్ క్లినిక్ వద్ద రద్దీగా ఉందని ఫొన్ రావడమే ఆలస్యం హడావిడిగా వెళ్లిపోతారు. వికలాంగులకు పరీక్షలు చేస్తే తమకేమీ ఒరుగుతుందనే ఆలోచనలో కొంతమంది వైద్యులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు రిమ్స్‌లోనే పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను దళారులుగా పెట్టుకుని సర్టిఫికెట్‌కు రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చిన రోజే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పే అధికారులు వారానికో పదిరోజులకో వచ్చి తీసుకోవాలని చెబుతుండటంతో వికలాంగులు ఉసూరుమంటున్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధి నుంచి రెండు బస్సులలో దాదాపు 100 మందికి పైగా వికలాంగులు శుక్రవారం రిమ్స్‌కు వచ్చారు. చెప్పాపెట్టకుండా మానసిక వైద్య నిపుణులు సెలవు పెట్టడంతో మూడు రోజుల తర్వాత రమ్మని మానసిక వికలాంగులకు చెబుతున్నారు. రేషన్‌కార్డు లేకపోతే అనర్హులే! రేషన్‌కార్డులో పేరు ఉంటేనే వికలాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే ఫలితం లేదని తెలుపుతున్నారు. పదేళ్ల క్రితం రేషన్ కార్డు ఇచ్చారని, పుట్టిన పిల్లల నుంచి పదేళ్ల వయస్సున్న పిల్లలకు ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్టులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌కార్డు తీసుకొచ్చినా సంబంధిత మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకుని రావాలని చెప్పడంతో అర్హులైన వికలాంగులు కూడా చేసేదేమీ లేక వెనుదిరుగుతున్నారు. -
చిరు ఆసరాపై పెనుగాభరా
- పింఛన్ సర్వే కేంద్రాలకు ఎగబడ్డ లబ్ధిదారులు - భారీవర్షంలోనూ వృద్ధులు, వికలాంగుల ఉరుకులు - తొలిరోజు జరిగింది 25 శాతం పరిశీలనే - అస్తవ్యస్తంగా, హడావుడిగా సాగిన ప్రక్రియ - ఎన్నడో ‘చెరిగిన బొటు’కు సర్టిఫికెట్ అడగడంతో - కలత చెందుతున్న వితంతువులు సాక్షి, రాజమండ్రి / మండపేట : పూలవాన కురిపిస్తామని బులిపించి, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు సర్కారు.. అనంతరం బడుగుల బతుకుల్లో పిడుగులు కురిపిస్తోంది. మాఫీ మాయ నాటకంలో రోజుకో ఆటంకపు అంకాన్ని రచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పింఛన్ల మొత్తం పెంపు వాగ్దానం అమలుకు ముందు అసలుకే ఎసరు పెట్టే తంతును మొదలు పెట్టింది. బతుకు పడమటి పొద్దున పండుటాకులకు, విధి వెక్కిరించిన వికలాంగులకు, వితంతువులకు పీడకలలా పింఛన్ల సర్వేను ప్రారంభించింది. సకాలంలో వెళ్లి తమ పత్రాలు చూపకపోతే గోరంత ఆసరాను ఎక్కడ రద్దు చేస్తారోనన్న కొండంత ఆందోళనతో.. పింఛన్‌దారులు కుండపోతగా వాన కురుస్తున్నా సర్వే జరుగుతున్న తావులకు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాము పింఛన్లకు అర్హులమన్న రుజువులు చూపించేందుకు ఎగబడ్డారు. గుండెలు గుబగుబలాడుతుండగా.. ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల సర్వే శుక్రవారం జిల్లాలో ప్రారంభమైనా కొన్నిచోట్ల అపశ్రుతులు ఎదురవడంతో వాయిదా పడింది. అనర్హుల పేరిట పింఛన్‌దారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ లబ్ధిదారుల గుండెల్లో ముందే గుబులు రేపగా.. ఓ ప్రామాణికత లేకుండా సాగిన సర్వే వారిని ఏమవుతుందోనన్న దిగులులోకి నెట్టింది. తొలిరోజు జిల్లాలో సుమారు 25 శాతం మాత్రమే సర్వే జరిగిందని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలతో పాటు పలు మున్సిపాలిటీల్లో సాయంత్రం మూడు గంటల వరకూ పింఛనుదారుల డేటా కంప్యూటర్లలోకి ఆన్లైన్ ద్వారా చేరలేదు. సర్వే కేంద్రాల వద్ద ఉదయం నుంచి లబ్ధిదారులు బారులు తీరి, కూడూనీళ్లూ లేకుండా పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సాంకేతిక సిబ్బంది చేతులెత్తేయడంతో తొలిరోజు చేయాల్సిన సర్వేను 21కి వాయిదా వేశారు. మామిడికుదురు తదితర మండలాల్లో కూడా డేటా రాక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛ న్ల అర్హత పత్రాలను తీసుకుని సర్వే కేంద్రాలకు రావాలనడంతో వాటి నకళ్ల కోసం ఉదయం నుంచి జిరాక్సు సెంటర్ల వద్ద పింఛనుదారులు క్యూలు కట్టారు. మండపేట, జగ్గంపేట, పెద్దాపురం, రాజానగరం మండలాల్లోని పలుచోట్ల వర్షంలోనూ పింఛన్‌దారులు బారులు తీరారు. వేర్వేరు జాబితాలు ఎగనామానికేనా..? పరిశీలనలో క్రమపద్ధతి లోపించడంతో ఆ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. మండపేటలోని కొన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద సర్వే నిర్వహించారు. ధృవీకరణ పత్రాలను అందజేసిన వారి పేర్లను ఓ జాబితాలో, అవి లేని వారి పేర్లను మరో జాబితాలో నమోదు చేశారు. దీంతో పత్రాలు ఇవ్వని పింఛన్‌దారులు ఏమవుతుందోనని కలత చెందుతున్నారు. సర్వే తీరును బట్టి కూడా పింఛన్లకు పెద్ద సంఖ్యలో ఎగనామం పెట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వితంతు పింఛన్ల లబ్ధిదారులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. రేషన్, ఆధార్ కార్డులున్నా భర్త మరణ ధృవీకరణ పత్రం అడగడంతో చాలామంది వితంతువులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంటున్నారు. తన భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడని, ఇప్పటికిప్పుడు ధృవీకరణ పత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఓ మహిళ వాపోయింది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి రేషన్, ఆధార్ కార్డుల్లో దేనిలో వయసు ఎక్కువగా ఉంటే దానినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రెండింటిలో వయసు తక్కువగా ఉన్న వృద్ధులు తమ పింఛన్లకు ఎసరు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 శాతం వరకూ రేషన్ కార్డులకు, ఆధార్ కార్డులకు పొంతన లేకుండా వయసు నమోదు జరిగింది. సర్వేకు దూరంగా టీడీపీ ప్రజాప్రతినిధులు అనర్హత సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టడమే సర్వే లక్ష్యమన్న ఉద్దేశంతో.. ఆ నింద తమపై పడకుండా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వేకు దూరంగా ఉన్నారు. కాగా కమిటీల్లో సామాజిక కార్యకర్తలను తొలగించి అన్ని చోట్లా టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించారు. నియోజక వర్గాల ఎమ్మెల్యేలు నేరుగా పిలిచి ఆదేశాలిస్తుండడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పింఛన్‌దారులకు న్యాయం చేయాలంటే వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాలంటే సర్వే మరో మూడు రోజులైనా కొనసాగించాల్సిన అవసరం ఉందని అధికారులే అంటున్నారు. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల తప్ప ఇతర ప్రాంతాల్లో శనివారంతోనే సర్వే ముగించేయనుండడంతో ఈ హడావుడి వల్ల అర్హులు కూడా పింఛన్లు కోల్పోతామని భయపడుతున్నారు. -
ఏడి‘పింఛెన్’..
తొలి రోజు ఆలస్యంగా పింఛన్ల సర్వే ప్రారంభం జగ్గయ్యపేట, గుడివాడ, తిరువూరులోఅసలు మొదలు కాలేదు మచిలీపట్నం, నూజివీడులలో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అన్ని కేంద్రాల వద్ద పండుటాకుల పడిగాపులు సర్వే కేంద్రాల వద్ద టీడీపీ నాయకుల హవా మచిలీపట్నం : ప్రభుత్వం సర్వే పేరుతో జిల్లా వ్యాప్తంగా పింఛనుదారులను తొలి రోజు ఏడిపించింది. లబ్ధిదారులందరూ ఉదయం తొమ్మిది గంటలకే పంచాయతీ కార్యాలయాలు, పింఛను పంపిణీ కేంద్రాలకు రావాలని ప్రచారం చేసిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అసలే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పండుటాకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయారు. కూర్చునేందుకు చోటు లేక, తాగేందుకు మంచినీరు దొరక్క వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పింఛనుదారుల సర్వే కార్యక్రమం శుక్రవారం అనేక ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో అసలు ప్రారంభం కాలేదు. సర్వే జాబితాలు సకాలంలో అందకపోవడంతో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కూడా సర్వే ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది వచ్చినా సామాజిక కార్యకర్తలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచిలు, కౌన్సిలర్లు సకాలంలో రాకపోవటంతో సర్వే ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. దీంతో లబ్ధిదారులు పడిగాపులు పడ్డారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికుల పింఛన్లకు సంబంధించిన వివరాలను సర్వే కమిటీ సభ్యులు సేకరించారు. సర్వే జాబితాలో ఉన్న వివరాలు, లబ్ధిదారుల వద్ద ఉన్న పత్రాలను సరిచూసుకున్నారు. వితంతు పింఛన్లు తీసుకునే వయసు మళ్లిన వారి వద్ద భర్త డెత్ సర్టిఫికెట్లు లేకపోవటంతో శనివారం వాటిని చూపించాలని నిబంధన విధించారు. ఆ సర్టిఫికెట్ ఏదో తమకు తెలియదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. టీడీపీ నేతల హడావుడి.. ఈ సర్వే ప్రక్రియలో టీడీపీ నేతల హడావుడి ఎక్కువగా ఉంది. వైఎస్సార్ సీపీ సర్పంచిలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు తమ హవాను కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థులకే పెత్తనం అప్పగించారు. సర్వే కమిటీలో సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సభ్యులను ఇద్దరు చొప్పున నియమించే అవకాశం ఉంది. ఈ నలుగురు స్థానాల్లో టీడీపీ సానుభూతిపరులకే అవకాశం ఇచ్చారు. కమిటీల నియామకం మొత్తం ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సర్వే ప్రక్రియ సాగిందిలా.. మచిలీపట్నం పురపాలక సంఘం, బందరు మండలంలో సాయంత్రం 4.30 గంటలకు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. పింఛను పొందే లబ్ధిదారుల జాబితాలు సకాలంలో అందకపోవటంతో ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. పట్టణంలో టీడీపీ నాయకుల హడావుడే ఎక్కువగా ఉంది. జాబితాలు ఆలస్యంగా రావటంతో పట్టణంలో 1 నుంచి 30 వార్డుల వరకు మాత్రమే సర్వే ప్రారంభమైంది. మిగిలిన 12 వార్డుల్లో సర్వే శనివారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో కూడా సాయంత్రం 4 గంటలకు సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పత్రాలతో ఉదయం తొమ్మిది గంటల నుంచి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు మండలాల్లో మధ్యాహ్నం 2గంటలకు సర్వే ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లోనూ కమిటీ సభ్యులుగా సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను టీడీపీ సానుభూతిపరులనే నియమించారు. పెడన నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల హడావుడే అధికంగా కనిపించింది. గ్రామ స్థాయిలో ఎవరికి ఎంత భూమి ఉందో వివరాలు తెలిసే అవకాశం ఉన్నందున, టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న వారి పత్రాలను పరిశీలించే సమయంలో నోరుమెదపని కమిటీ సభ్యులు.. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు వస్తే వారి భూమి, ఇతర వివరాలు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల, పెదపారుపూడి, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు మండలాల్లో కూడా సర్వే ఆలస్యంగానే ప్రారంభమైంది. పామర్రులో జరిగిన సర్వేలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు, టీడీపీకి చెందిన బీఏఎం లాజరస్ తనదైన శైలిలో సొంతపార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించారు. గుడివాడ పురపాలక సంఘంలో సర్వే ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాలేదు. జాబితాలు రాలేదని అధికారులు తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సర్వే ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లోనూ సర్వే ఉదయం 11గంటల తరువాతే ప్రారంభమైంది. అధిక సంఖ్యలో పింఛనుదారులు రావటంతో తాగేందుకు నీరు, కూర్చునేందుకు వసతి లేక వృద్ధులు ఇక్కట్ల పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల హడావుడి స్పష్టంగా కనిపించింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో సర్వే ప్రారంభం కాలేదు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వే ప్రక్రియ మొదలైంది. నందిగామ నియోజకవర్గంలో వీరులపాడులో మధ్యాహ్నం 3గంటలకు సర్వే ప్రారంభమైంది. చనిపోయిన వారి పేర్లను కమిటీ సభ్యులు సేకరించారు. నందిగామ పురపాలక సంఘంలో సర్వే ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కాలేదు. కమిటీ సభ్యుల నియామకం, వారికి విధివిధానాలు వివరించే సమావేశం ఏర్పాటు చేశారు. సర్వే సందర్భంగా ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛను వస్తుంటే ఒకరికి మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో సర్వే ప్రక్రియ సకాలంలోనే ప్రారంభమైంది. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, తిరువూరు పురపాలక సంఘం, తిరువూరు మండలం, ఎ.కొండూరులలో సర్వే ప్రక్రియ ప్రారంభం కాలేదు. గంపలగూడెంలో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. నూజివీడు పురపాలక సంఘంలో శుక్రవారం సాయంత్రం 5గంటలకు సర్వే ప్రక్రియ నిర్వహించారు. ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లో ఆలస్యంగా సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. -
ప్రజలకు అండదండగా ఉండాలి
వారిలో విశ్వాసం కలిగించాలి మనోధైర్యం నింపాలి పోలీస్ అధికారుల వర్క్‌షాప్‌లో డీఐజీ కాంతారావు కేయూ క్యాంపస్ : ‘పోలీసులు ప్రజలకు అం డగా నిలుస్తారని, వారిలో విశ్వాసాన్ని కలిగిం చాలి.. మనోధైర్యం నింపాలి.. ఆ విధంగా మన సేవలు ఉం డాలి...’అని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు ఆ శాఖ అధికారులకు సూచిం చారు. అర్బన్ పోలీస్ విభాగం కమిషనరేట్‌గా రూపాంతరం చెందనున్న నేపథ్యంలో పోలీసు ల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కు మరింత చేరువ కావాల్సి ఉంటుందని, అప్పుడే పోలీసు శాఖ ప్రతిష్ఠ ఇనుమడిస్తుం దని పేర్కొన్నారు. ఈ మేరకే వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాకతీయ యూనివర్సి టీ సెనేట్ హాలులో గురువారం ఏర్పాటు చేసి న ఈ వర్క్‌షాపును ఆయన ప్రారంభించి.. ప్రసంగించారు. సమాజంలో పోలీసుల కదలికలను, నడవడికను ప్రతీ వ్యక్తి గమనిస్తుంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాల్సిన అవరం ఉందని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్లకు వచ్చే మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి కి పోలీస్‌శాఖ అండగా ఉంటుందనే విశ్వాసం కలిగించేలా ప్రవర్తన ఉండాలని చెప్పారు. అప్పుడే.. ప్రజలు ఆశించిన వ్యవస్థ : అర్బన్ ఎస్పీ పోలీసులపై ప్రజలు ఎప్పుడూ భారీ అంచనాలతో ఉంటారని, వారి ఆలోచనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. అప్పుడే వారు ఆశించిన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతామని స్పష్టం చేశారు. వ్యామోహంతోనే ఒత్తిళ్లు : డాక్టర్ పట్టాభిరామ్ సమాజంలో ప్రతీ వ్యక్తికి ఒత్తిళ్లు అనేవి సహజమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పట్టాభిరామ్ తెలిపారు. వ్యామోహాలు తగ్గించుకుంటే ఒత్తిళ్లకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఈ వర్క్‌షాపులో పోలీసు అధికారులకు ‘విధులు.. ఒత్తిళ్లు.. పరివర్తన’ అనే అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. పోలీసు వ్యవస్థ సవాళ్లతో కూడుకున్నదని, వాటిని కఠినతరంగా భావించవద్దని, నిర్మలంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకేస్తే విజయం సాధించవచ్చని, ఒత్తిళ్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అర్బన్ ఎస్పీ యాదయ్య, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, ఏఆర్ డీఎస్పీలు దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేశ్‌కుమార్, రామమహేంద్రనాయక్, ప్రభాకర్, రమేష్, ఇన్స్పెక్టర్లు,సబ్ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తొలగింపులపై తిరుగుబావుటా
ఎమ్మిగనూరు రూరల్: స్మార్ట్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆందోళనకు కారణమవుతోంది. ఎమ్మిగనూరు మండలంలో ఒక్క జూన్ నెలలోనే 410 పింఛన్లను తొలగించడంతో బాధితులు రోడ్డెక్కారు. సోమవారం గుడేకల్ గ్రామానికి చెందిన 170 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు సోమప్ప సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. పింఛన్లను పునరుద్ధరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. వీరికి వివిధ ప్రజా సంఘాల నేతలు రాముడు, జబ్బార్ మద్దతు పలికారు. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోగా.. ఏకంగా తొలగించడం పట్ల వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు ఇంతియాజ్‌బాషా, నల్లప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వారు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీడీఓ పద్మజ అక్కడికి చేరుకుని పింఛన్లను పునరుద్ధరించే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పడంతో బాధితులు శాంతించారు. -
రెండు రాష్ట్రాల్లోనూ రూ. 1,500 పింఛన్ ఇవ్వాలి
వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు వికలాంగులందరికీ రూ. 1,500 పింఛన్‌ను ఒకే విడతలో అందజేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అందె రాంబాబు డిమాండ్ చేశారు. వికలాంగత్వపు శాతాన్ని బట్టి పింఛన్ జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుండగా, తెలంగాణలో కేసీఆర్ ఇంకా ఈ విషయంపై ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయకపోవడాన్ని తప్పుబట్టారు. వికలాంగులు నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. -
పింఛను పాట్లు
కొవ్వూరు/పెరవలి/నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం వృద్ధులతోపాటు వికలాంగులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. వృద్ధుల్లో కొందరి వేళ్లపై ముద్రలు అరిగిపోవడంతో రెండు నెలలుగా వారికి పింఛన్లు అందటం లేదు. బయోమెట్రిక్ మెషిన్‌పై వేలిముద్ర వేస్తే తప్ప పింఛను ఇచ్చే అవకాశం లేదని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలో సుమారు 15వేల మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలోను కనీసం 10 మంది వృద్ధులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 830 మంది వేలిముద్రలు బయోమెట్రిక్ మెషిన్‌పై పడకపోవడం వల్ల పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను తీసుకోకపోతే రద్దు చేసే పరిస్థితి ఉండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వికలాంగుల్లోనూ కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. నేటికీ పూర్తికాని వేలిముద్రల సేకరణ పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చి మూడు నెలలు కావస్తోంది. నేటికీ లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. దీనివల్ల ఈ నెలలో కొవ్వూరు మండలంలో 322 మందికి, చాగల్లు మండలంలో 205 మందికి, తాళ్లపూడి మండలంలో 203 మందికి, కొవ్వూరు మునిసిపాలిటీలో సుమారు 100 మందికి పింఛన్లు అందలేదు. గత నెలలో నియోజకవర్గంలో సుమారు 3,700 మందికి పింఛన్లు అందలేదు. బయోమెట్రిక్ మెషిన్లో వేలిముద్రలు సక్రమంగా నమోదు కాలేదని కొందరికి.. సొమ్ములు విడుదల కాకపోవడంతో మరికొందరికి పింఛను సొమ్ము ఇవ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది. అనంతరం ఫినో సంస్థ ద్వారా పింఛన్లు బట్వాడా చేసేవారు. అనంతరం ఆరునెలలపాటు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇచ్చారు. రెండు నెలల క్రితం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇక్కడ నుంచే ఫించను లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియను ముగించనున్నారు. ఈ ఏడాది వరుసగా రెండుసార్లు పంపిణీ విధానాలు మార్చడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు మొదలయ్యూరుు. నాలుగు నెలలుగా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛను నాకెంతో ఆసరాగా ఉండేది. నాలుగు నెలలుగా పింఛను డబ్బు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. వేలిముద్రలు పడకపోవడంతో రోజూ మునిసిపల్ కార్యాలయూనికి వెళ్లి గంటల తరబడి వేచివుంటున్నాను. అరుునా ప్రయోజనం లేదు. ఈ విధానాన్ని మార్చి పాత పద్ధతిలోనే పింఛను ఇప్పించాలి.- బందెల పవన్శేఖర్, కొవ్వూరు ఇంకు ముద్ర తీసుకోవాలి బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా పింఛను ఇవ్వటం లేదయ్యా. గతంలో ఇంకు ముద్ర నొక్కించుకుని పింఛను ఇచ్చేవారు. ఈమధ్య కాలంలోనే ఫించన్ కోసం తిప్పలు పెడుతున్నారు. డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. వచ్చే రెండొందలు మందు బిళ్లల ఖర్చుకు ఉపయోగపడేది. - మజ్జి అన్నపూర్ణ, నరసాపురం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బయోమెట్రిక్ విధానం వల్ల 3 నెలలుగా పింఛను రావడం లేదు. వేలిముద్రలు పడలేదని పింఛను సొమ్ము ఇవ్వడం లేదు. నలుగురు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్న నాకు వితంతు పింఛను ఎంతో ఆసరాగా ఉండేది. చిన్న పిల్లలు కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాను. అధికారులు పాత పద్ధతిలోనే పింఛను ఇచ్చే ఏర్పాటు చేయాలి. - కవల భారతి, కొవ్వూరు -
‘ఆసరా’తో ఆటలు
1,756 పింఛన్ల తొలగింపు.. 514 మంజూరు ఎన్నికల వేళ మార్పులుచేర్పులు 3,30,660 పింఛన్లకు బడ్జెట్ విడుదల కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులకు ‘ఆసరా’ దూరమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనూ మార్పులు చేర్పులు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మార్చి నెలకు సంబంధించి సామాజిక భద్రత పింఛన్లలో మరికొంత కోత పెట్టారు. ఫిబ్రవరి నెలలో 3,32,017 పింఛన్లు ఉండగా.. మార్చిలో 813 డెత్ కేసులు, 943 శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తొలగించారు. అయితే కొత్తగా 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పింఛన్ల మంజూరు విదాస్పదమవుతోంది. తొలగింపులు పోను.. కొత్త పింఛన్లతో కలిపి మార్చి నెలలో 3,30,660 పింఛన్లకు రూ.7,50,29,100 మొత్తాన్ని బుధవారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేశారు. తొలగించిన పింఛన్లు తక్కువే అయినా బడ్జెట్లో భారీగా కోతపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల 13,100.. మార్చి నెలలో 1,756 పింఛన్లను తొలగించారు. ఇదిలాఉండగా మార్చి 29, 30 తేదీల్లో విడుదల కావాల్సిన బడ్జెట్ నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పింఛన్ల పంపిణీ కూడా జాప్యం కానుంది. -
బినామీ భాగోతం!
పెన్షన్.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా ఇచ్చే సంక్షేమ పథకం. ఏ ఆధారం లేనివారికి అందాల్సిన ఈ సొమ్మును కొందరు ప్రబుద్ధులు స్వాహా చేస్తున్నారు. మరణించిన వారు, గ్రామంలో నివసించని వారు, అసలు గ్రామానికి చెందినవారే కాని లబ్ధిదారుల పేరిట వంగర మండలం శ్రీహరిపురం గ్రామంలో పెన్షన్లు పంపిణీ అయిపోతున్నాయి. బినామీల వేలిముద్రలతోనే అక్విటెన్స్ రికార్డులు తయారవుతున్నాయి. చూడటానికి చిన్న మొత్తాలే అయినా ఏళ్ల తరబడి చిలక్కొట్టుడు సాగిస్తూ సర్కారు ఖజానాకు భారీ చిల్లు పెడుతున్నారు. అదే సమయంలో అర్హులైన కొత్తవారి అవకాశాలకు గండి కొడుతున్నారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్న చాలా గ్రామాలకు శ్రీహరిపురం ఒక కేస్ స్టడీ లాంటిది. అక్కడ జరుగుతున్న తతంగం ఎలా ఉందో చూద్దాం పదండి.. శ్రీహరిపురం(వంగర), న్యూస్‌లైన్: వంగర మండలం శ్రీహరిపురంలో 108 వృద్ధాప్య, 49 వితంతు, 10 వికలాంగ, 15 అభయహస్తం.. మొత్తం 182 మందికి పెన్షన్లు అందుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఏళ్ల తరబడి బినామీలకు చేరుతున్నాయి. లబ్ధిదారుల పేరుతోనే.. ఒకే రకమైన వేలిముద్రలతో వేరే వ్యక్తులు వీటిని కాజేస్తున్నారు. నాలుగేళ్లుగా గ్రామాల్లో పెన్షన్లు బట్వాడా బాధ్యతను బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్స్(సీఎస్పీ)లు నిర్వర్తించారు. మధ్యలో కొన్ని నెలలు పంచాయతీ కార్యదర్శులకు ఆ బాధ్యత అప్పగించినా, ఇప్పుడు మాత్రం పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ మార్పుతోనే బోగస్ లబ్ధిదారుల గుట్టు రట్టయ్యింది. ఇటువంటి వారిని గుర్తించిన పోస్టుమాస్టర్ పెన్షన్ ఇచ్చేందుకు తిరస్కరించారు. వాస్తవానికి స్మార్ట్‌కార్డుల ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేయాలనే నిబంధన ఉంది. అయితే గ్రామంలో ఆ విధానం అమలు కావడంలేదు. ఇదే అవకాశంగా బోగస్ లబ్ధిదారులు, గ్రామంతో సంబంధం లేనివారు దొడ్డిదారిన పెన్షన్లు పొందుతూ వచ్చారు. రాజకీయ నాయకుల అండతో సీఎస్పీ కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది. గ్రామంలో లేనివారు, మరణించిన పేర్లతో 30 మందికి పైగా ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నట్లు తెలిసింది. పెన్షన్ల జాబితాలో అక్రమాలు అన్ని రకాల పెన్షన్లలో అక్రమాలు జరుగుతున్నాయి. గ్రామంలో లేని వారికి అందిస్తున్నట్లు జాబితాల్లో రాసుకొని నిధులు కైంకర్యం చేస్తున్నారు. ఎప్పుడో చనిపోయిన వారి పేర్లతో తీసుకుంటున్నారు. సోషల్ ఆడిట్ బృందానికి, సామాజిక ప్రజావేదికలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -గుడివాడ రామారావుదొర, సర్పంచ్ నిజమైతే బాధ్యులపై చర్యలు పెన్షన్ల పంపిణీలో అవకతవకలపై గ్రామంలో దర్యాప్తు చేస్తాం. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామంలో లేనివారికి, గ్రామం కానివారికి, మరణించిన వారి పేర్లతో పెన్షన్లు తీసుకోవడం నేరం. -డి.రామ్మోహనరావు, ఎంపీడీవో -
చెదిరిన బతుకులు
నల్లని రహదారులు రోడ్డు ప్రమాదాల రూపంలో ఈ ఏడాది ఎరుపెక్కాయి. వాహనాలు నడపడంలో చేసిన చిన్న, చిన్న నిర్లక్ష్యాలు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఎంతో మంది వికలాంగులు, క్షతగాత్రులుగా మారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.అలక్ష్యంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం రోడ్డు ప్రమాదాలకు దారితీశాయి. అయిదేళ్లుగా మావోయిస్టుల భయం వీడినా... దోపిడీ దొంగల బీభత్సం పెరిగిపోయింది. బాలికలు, మహిళలపై వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షలు రగిలాయి. ఏసీబీ అవినీతి అధికారుల భరతం పట్టింది. - న్యూస్‌లైన్, మహబూబ్‌నగర్ క్రైం జిల్లాలో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై దాడులు, కేసులు పెరిగిపోయాయి. 2013లో జిల్లావ్యాప్తంగా 2963 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలపై 1550 కేసులు నమోదు కాగా, 783మంది మృత్యువాత పడ్డారు. మరో 361మంది వికలాంగులుగా మారారు. కొత్తకోట మండలం పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన వోల్వో బస్సు ప్రమాదం రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘటన. 45 మంది సజీవదహనమయ్యారు. హత్యలు... జిల్లాలో హత్యానేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాజకీయ హత్యలు కొన్నయితే, క్షణికావేశంలో , వివాహేతర సంబంధాల వల్ల కొన్ని చోటు చేసుకున్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో మద్దూర్ మండలం మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మను పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య చేశారు. ధన్వాడ మండలం పెద్దచింతకుంట సర్పంచ్ ఎన్నిక వివాదంలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సొంత సోదరుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 159 మంది హత్యకు గురయ్యారు. మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపులకు సంబంధించి ఇప్పటి వరకు 977 కేసులు నమోదయ్యాయి. 40 వరకట్న హత్యలు జరగగా, 70 వరకట్న కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ఈ ఏడాది 25 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 2012లో 165 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ వరకే 207 కేసులు నమోదయ్యాయి. అప్పులు, అవమానాలు భరించలేక, పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. పలుచోట్ల బాల్యవివాహాలను, జోగినీగా మార్చే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.