సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి? | Pending Rs. 2 lakh | Sakshi
Sakshi News home page

సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి?

Published Tue, Nov 8 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి?

సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి?

పెండింగ్‌లో రూ. 2 లక్షలు
రెండేళ్లుగా ఇదే పరిస్థితి
కలెక్టర్ ఆదేశించినా కదలని ఫైల్

హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రభుత్వం అందజేసే ఆస రా పెన్షన్‌‌సలో అర్హులైన వికలాంగులను ఎంపిక చేసేం దుకు వైకల్యశాతం నిర్ధారణ కోసం ప్రభుత్వం నిర్వహిం చిన సదరం క్యాంపుల్లో పనిచేసిన సీఆర్పీలకు చెల్లించాల్సిన చెల్లింపు విషయంలో డీఆర్‌డీఏ అధికారులు రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. పనిచేసిన వారికి రోజు వారి లెక్కన చెల్లింపులు చేస్తామని చెప్పిన అధికారులు 2015 డిసెం బర్ నుంచి ఇదిగో.. అదిగో... బడ్జెట్ రాలేదు... రాగానే ఇస్తాం.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటి వరకు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా కలెక్టర్ అమ్రపాలికి ఇటీవల గ్రీవెన్‌‌సలో కూడా ఫిర్యాదు చేశారు.

డబ్బులడిగితే క్రిమినల్ కేసులా...
తమకు రావాల్సిన డబ్బుల కోసం తిరుగుతున్న బాధితులు పదేపదే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డీఆర్‌డీఏ అధికారులు బెదిరింపులకు పాల్పడతున్నారని సీఆర్‌పీలు తెలిపారు. ఇంకోసారి డబ్బులకు వస్తే మీపై క్రిమినల్ కేసులు పెడతామని, అధికారులు తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాజు, శ్రీనివాస్‌లు తెలిపారు.

మరోసారి ఫిర్యాదు..
తాజాగా బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్‌డీఏ అధికారులు మరో కొత్తవిషయం తెరమీదకు తీసుకువచ్చారు. పనిచేసిన వారికి ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. దీంతో సాక్షాధారాలు తమ ముందు పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు ముట్టినట్లరుుతే మరోసారి ఫిర్యాదు చేయవద్దని సీఆర్పీలను హెచ్చరించారు. డబ్బులు ఇచ్చిన ఆధారాలు ఇస్తామని అధికారులు చెబుతున్న ప్రతిసారి పరస్పర విరుద్ద సమాచారం ఇవ్వడం ఏమిటని బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అవసరం అరుుతే ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిగి తమకు న్యాయం చేయాలని సీఆర్పీలు కోరుతున్నారు. కాగా ఈ విషయంలో డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.

రూ. 2 లక్షలు పెండింగ్..
సదరం క్యాంపులో సుమారు 64 మంది సీఆర్పీలు పనిచేశారు. రెండు క్యాంపుల్లో వికలాంగుల సంఘాలు, మహిళా సంఘాలు, సీఆర్పీలు పాల్గొన్నారు. అరుుతే వీరికి సెర్ఫ్ నుంచి నిధులు రాలేదని అధికారులు చెల్లింపులు చేయలేదు. దీంతో బాధితులు కలెక్టర్‌కు గ్రీవెన్‌‌సలో పదేపదే ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ డీఆర్‌డీఏ పీఈ వెంకటేశ్వర్‌రెడ్డిని తక్షణమే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. అరుుతే ఆ సమయంలో ఉన్న ఓ అధికారికి డబ్బులు ఇచ్చామని అతనే చెల్లింపులు చేయాల్సి ఉందని డీఆర్‌డీఏ అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు.

పెండింగ్‌లో ఉండగా రిలీవ్ చేశారా?
లక్షల్లో డబ్బుల వ్యవహారం పెండింగ్‌లో ఉండగా సదరు అధికారిని ఎలా రిలీవ్ చేశారన్నది అధికారులకే తెలియాలి. ఏ అధికారి అరుునా బదిలీ అరుున సమయంలో లెక్కలు క్లియర్ చేసి రిలీవ్ అవుతారు. కానీ ఈ విషయంలో డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్న కారణాలు కూడా వాస్తవానికి దగ్గరగా లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement