pending
-
కోర్టు ఆదేశించినా ధిక్కరణ!
సాక్షి, హైదరాబాద్: కోర్టు మెట్లెక్కాలంటేనే ప్రజలకు భయం.. తీర్పు కోసం ఎన్నేళ్లు ఎదురుచూడాలో అని. అలాంటిది ట్రయల్ కోర్టులో తీర్పు వచ్చి, అక్కడి నుంచి హైకోర్టుకు చేరిన పిటిషన్లలోనూ తీర్పు వచ్చిన తర్వాత కూడా.. దాని అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అవును.. న్యాయస్థానాల ఉత్తర్వులను లెక్క చేయడం లేదు కొందరు అధికారులు. శిక్షలు విధించినా వారిలో మార్పు రావడంలేదు. కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలు పడినా అప్పీళ్లలో తప్పించుకుంటున్నారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది.కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలతో కింది కోర్టులు మానవతా దృక్పథంతో శిక్షలను మాఫీ చేస్తుండటంతో అధికారులు అదే అలుసుగా తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు ఇస్తే అమలు చేసి తీరాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసుల గణాంకాలే అందుకు నిదర్శనం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ –1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలు. సివిల్, క్రిమినల్. ఈ చట్టంలోని సెక్షన్ 1 (15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యే ధిక్కరణ కేసుల్లో సివిల్వే ఎక్కువ. ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించటాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. క్రిమినల్ కంటెంప్్టలో మూడు రకాలున్నాయి. ప్రచురణ రూపంలో, వ్యాఖ్యల రూపంలో, సంజ్ఞల రూపంలో కోర్టుల ఆదేశాలను ఉల్లంఘించినా, కోర్టులను అగౌరవపరిచినా, న్యాయ ప్రక్రియకు అడ్డుపడినా క్రిమినల్ కంటెంప్ట్ కిందికి వస్తుంది.ఎస్ఐకి జరిమానా.. ‘కోర్టు వద్దని చెప్పినా అరెస్టు చేస్తారా? న్యాయస్థానం ఉత్తర్వులంటే లెక్కలేదా? 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి ఉద్దేశపూర్వకంగానే ధిక్కరణకు పాల్పడ్డారు. సదరు సబ్ ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పినా ఆమోదయోగ్యం కాదు. వారంపాటు జైలుతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు.. బాధితుడికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.’ – ఒక ఎస్ఐ తీరుపై హైకోర్టు ఆగ్రహం.ఎంపీకి నోటీసులు.. ‘న్యాయవ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం క్షంతవ్యం కాదు. మీడియా సమావేశాల్లో ఇష్టం వచి్చనట్లు ఎలా మాట్లాడతారు? దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయండి.’ – ఒక ఎంపీకి కోర్టు ఆదేశం.కలెక్టర్‌కు జైలు.. ‘ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో కలెక్టర్ నెలరోజులు జైలుకు వెళ్లాల్సిందే. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలి. అలాగే మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నాం.’ ఒక కలెక్టర్ తీరుపై న్యాయస్థానం మండిపాటు.15 ఏళ్లయినా పరిష్కారం కాలేదు.. మా భూమిని ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. పరిహారం తర్వాత అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు పరిహారం అందలేదు. కోర్టు చుట్టూ తిరిగి ఆదేశాలు తెచ్చుకున్నా స్పందన లేదు. ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ వేశా. విచారణ కొనసాగుతోంది. 70 ఏళ్లు దాటిన వృద్ధుడిని. ఇంకా ఎన్నాళ్లు తిరగాలో.. – భువనగిరికి చెందిన ఓ బాధితుడు కఠిన చర్యలు తీసుకుంటేనే తీర్పుల అమలు సాధ్యం న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే.. అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ మాట న్యాయవ్యవస్థలో నేడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కిన సామాన్యుడికి వీలైనంత త్వరగా న్యాయం అందించాలి. కోర్టు తీర్పులను కూడా అధికారులు అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎన్నిసార్లు కోర్టులను ఆశ్రయించాలి? కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుంటే ఉద్యోగాలు పోతాయి అంటే తప్ప అధికారులు అమలు చేయరు. తీర్పులను అమలు చేయనివారికి కఠిన శిక్షలు విధించాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది -
ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.రిజిస్ట్రేషన్ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.డ్రైవర్లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్ -
అసంపూర్తిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబదీ్ధకరణ) దరఖాస్తుల్లో అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనివారు 75శాతం మంది దాకా ఉన్నారు. అధికారులు దరఖాస్తులు పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది. 2020 ఆగస్టు 26కు ముందు ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ంది. రూ.1,000 ఫీజుగా చెల్లించి దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.అయితే వివిధ కారణాల వల్ల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అప్పట్లో అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాగా గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2020 నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో జనవరి నుంచి దరఖాస్తుల పరిశీలన మొదలైంది. అరకొరగానే అప్లోడ్ దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్పట్లో అప్లోడ్ చేయలేదు. మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులను పక్కనబెడుతూ అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో కేవలం 60,213 దరఖాస్తులు మాత్రమే ఆమోదించినట్టు పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు. తద్వారా రూ.96.60 కోట్లు ఫీజు రూపంలో వసూలైనట్టు చెప్పారు. పరిశీలించిన దరఖాస్తుల్లో 75 శాతం పూర్తిస్థాయి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాటిని ఆమోదించడం లేదని దరఖాస్తుదారులకు చెప్పారు. షార్ట్‌ఫాల్స్ వివరాలను కూడా దరఖాస్తుదారులకు తెలియజేశారు.మరోసారి అవకాశం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి పురపాలకశాఖ మరో చాన్స్ ఇచ్చి ంది. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయడానికి, మున్సిపాలిటీ/కార్పొరేషన్/నగరాభివృద్ధి సంస్థల నుంచి అధికారిక షార్ట్ ఫాల్స్ లెటర్ కోసం వేచిచూడకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్లను ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సేల్‌డీడ్, ఈసీ, మార్కెట్ వ్యాల్యూ సర్టీ ఫికెట్, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామా లేదా ఇతర దరఖాస్తు వివరాలను మొబైల్ నంబర్ ఓటీపీని వినియోగించుకొని ఈ పోర్టల్ ద్వారా సవరించుకోవచ్చునని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.ఇందుకోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవడానికి లేదా వివరాల కోసం ఈ హెల్ప్‌డెస్క్‌లను సందర్శించవచ్చునని తెలిపారు. -
దేశంలోపెండింగ్ కేసులు ఐదు కోట్లకుపైనే: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి ఐదు కోట్లకుపైనే కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. శుక్రవారం(జులై 26) లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసుల్లో సుప్రీంకోర్టులో 85వేలు, వివిధ హైకోర్టుల్లో 60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.అత్యధికంగా జిల్లా స్థాయి, అంతకంటే దిగువకోర్టుల్లోనే 4కోట్ల54లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, న్యాయపరమైన చిక్కులు ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు. అత్యంత ఎక్కువగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
ఆ రెండూ ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీఆర్ఎస్కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శానంపూడికి ఖాయమేనా? నల్లగొండ సీటును బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 23న అభ్యర్థులతో కిషన్‌రెడ్డి సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. -
న్యాయస్థానాల్లో ‘పెండింగ్’ భారం ఎంత?
దేశంలోని పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయనే విషయం విదితమే. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు ఉన్నాయి. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ప్రధాన కారణం. 2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించే లేదా తీర్పునిచ్చే పనిలో ఉన్నారు. -
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున ఇంప్లీడ్ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్‌తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్‌లోని వివేక్ ఫాంహౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్‌లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
AP: ప్రభుత్వ ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కారుణ్యం చూపుతోంది. కోవిడ్‌తో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందగా.. వారి కుటుంబాల్లో ఒకరికి చొప్పున కారుణ్య నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. గతంలోనే కారుణ్య నియామకాల కోసం 2,744 మంది దరఖాస్తు చేసుకోగా 1,488 మందికి ఉద్యోగాలను కల్పించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 241 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. వీటిలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మిగతా 77 మంది అర్హత గల కుటుంబాల్లోని వారికి వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అందరూ ఉద్యోగాల్లో చేరిన నివేదికను ప్రభుత్వానికి సమరి్పంచాల్సిందిగా సీఎస్ సూచించారు. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇన్నాళ్లు పెండింగ్‌లోనా..!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంలో 2020లో సీఐడీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాలు దాదాపు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏడాది పెండింగ్‌లో ఉండటం తామెన్నడూ చూడలేదని తెలిపింది. ఇదే సమయంలో వాదనలు వినిపించేందుకు నారాయణ, ఇతరుల తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలానే వాయిదాలు కోరుతుంటే, నారాయణ తదితరులను అరెస్ట్ చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తామని, అప్పుడు తీరిగ్గా వాదనలు వినిపించుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని, ఇదే చివరి అవకాశమని నారాయణ తదితరులకు హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒకవైపు ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరో వైపు కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడంపైనా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఎలా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేస్తారని, అవి ఎలా నిలబడతాయని ప్రశ్నించింది. ఇలాంటి ఫైలింగ్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారు... తాజాగా ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. నారాయణ తదితరుల తరఫు న్యాయవాదులు ఎస్.ప్రణతి, అజయ్ తదితరులు స్పందిస్తూ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ తరఫున వాదనలు వినిపించాల్సి ఉందని, వ్యక్తిగత కారణాలరీత్యా ఆయన హాజరు కాలేకపోతున్నందున విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. సీనియర్ న్యాయవాది పేరుతో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏడాది కాలంగా ఇలాగే ఈ వ్యాజ్యాల్లో విచారణను సాగదీస్తూ వస్తున్నారని తెలిపారు. అరెస్ట్‌పై స్టేను అడ్డం పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారని కోర్టుకు ఏఏజీ నివేదించారు. ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ, ఇలా పదే పదే వాయిదాలు కోరుతుంటే ఏఏజీ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నారాయణ న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దాదాపు ఏడాదిగా ముందస్తు బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం ఎన్నడూ చూడలేదని, ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు సమాంతరంగా దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. దీనికి నారాయణ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి స్పందిస్తూ, రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయవచ్చునని, ఇందుకు సంబంధించిన తీర్పులను వాదనల సమయంలో కోర్టు ముందుంచి, సంతృప్తికర వివరణ ఇస్తామని తెలిపారు. ఆమె వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ వ్యాజ్యాల్లో తదుపరి ఎలాంటి వాయిదాలు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. వాయిదాలు ఇవ్వడం ఇదే చివరి సారి అని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఏక కాలంలో రెండు పిటిషన్లా.. సీఐడీ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సమీప బంధువులు, బినామీలు తమపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు వేశారు. నారాయణ కూడా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2023లో క్వాష్ పిటిషన్ వేశారు. 2022లో ముందస్తు బెయిల్ కోసం నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పట్లో విచారించిన హైకోర్టు, కేన్సర్ శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ సమీప బంధువులు, బినామీలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో స్పందించిన హైకోర్టు, సీఆర్పీసీ 41ఏను అనుసరించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ వ్యాజ్యాల్లో విచారణ పలుమార్లు వాయిదా పడింది. తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఉండటంతో నారాయణ తదితరులు ఏదో ఒక కారణం చూపుతూ వాయిదాల మీద వాయిదాలు కోరుతూ వచ్చారు. దర్యాప్తు సంస్థ న్యాయవాదులు కూడా ఒకటి రెండు సార్లు వాయిదాలు అడిగారు. -
బదిలీలు ఉంటాయో.. లేదో!?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 భయం వీడలేదు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి చేసినప్పటికీ... కేవలం గురుకుల విద్యా సంస్థల్లో మాత్రమే ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 30వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరందరికీ స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలో కేటాయింపులు జరిపారు. ఈ మేరకు నూతన కేటాయింపులతో కూడిన జాబితాలను గురుకుల సొసైటీలు సిద్ధం చేసినప్పటికీ 2022–23 విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలిగిస్తే ఇబ్బందులు వస్తాయన్న భావనతో ఈ ప్రక్రియను అప్పట్లో వాయిదా వేశారు. కానీ ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నా జీఓ 317 అమలు ఊసేలేదు. ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఎలా...? రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగ ఖాళీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ముందుగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఖాళీలపై స్పష్టత వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేసింది. ఈ క్రమంలో గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికత ఆధారంగా ఈ కేటాయింపులు జరపడంతో జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చింది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీల్లోనూ జీఓ 317 అమలు చేస్తేనే ఉద్యోగ ఖాళీల లెక్క తేలుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు చేపట్టాలని సొసైటీ కార్యదర్శులను ఆదేశించింది. దాంతో గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేసి ప్రాథమిక జాబితాలు రూపొందించినప్పటికీ... వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు. వాస్తవానికి 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడితే ఆ మేరకు ఉద్యోగులు విధుల్లో చేరే వీలుండేది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నాజీఓ 317 అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుండడం.... మరోవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ఉద్యోగులను కొత్త స్థానాలకు బదిలీ చేసే అవకాశంపై సొసైటీ వర్గాల్లో కొంత ఆనిశ్చితి కనిపిస్తోంది. ఇంకోవైపు గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల ఖాళీల లెక్కపైనా అయోమయం నెలకొంది. -
సీఏ మిస్‌కావడంతో ఫలితాలకు బ్రేక్
ముంబై: చార్టెడ్ అకౌంటెంట్ కనిపించకుండాపోవడంతో ఆర్థిక ఫలితాలను ప్రకటించలేకపోతున్నట్లు ఆఫీస్ ఫర్నీచర్ తయారీ కంపెనీ మైల్స్టోన్ ఫర్నీచర్ తాజాగా బీఎస్ఈకి తెలియజేసింది. సీఏ ఫోన్‌కాల్‌లో సైతం అందుబాటులోకి రావడంలేదని పేర్కొంది. మే 25న నిర్వహించిన సమావేశంలో కంపెనీ సీఏ భూపేంద్ర గాంధీ కనిపించకుండాపోవడం, ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఫలితాలు పెండింగ్‌లో పడినట్లు చైర్మన్ వెల్లడించినట్లు మైల్స్టోన్ బీఎస్ఈకి తెలియజేసింది. అయితే ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సాధ్యమైనంత త్వరగా బీఎస్ఈ, ఆర్వోసీ నిబంధనలు పాటించనున్నట్లు పేర్కొంది. కంపెనీ 2018లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయ్యింది. కాగా.. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ ఎలాంటి ఆదాయం ప్రకటించకపోగా.. రూ. 2.6 కోట్ల నికర నష్టం నమోదైంది. -
ఆలస్యంగా వస్తున్న జవాన్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్ దత్, దీపికా పదుకోన్ నటించారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్’ సినిమాను షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం ‘జవాన్’ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్ సమాచారం. -
న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది. ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. -
మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు
మోర్తాడ్: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ)లను తక్షణమే జారీ చేయడానికి హైదరాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మూడు రోజుల ముచ్చటగానే మిగిలాయి. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతుండడంతో విచారణ, పీసీసీల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో వారం వ్యవధిలో పీసీసీలను జారీ చేసేవారు. కరోనా భయాలు తొలగిపోవడంతో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. కొత్త పాస్‌పోర్టులు, రెన్యువల్‌తోపాటు పీసీసీల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం పరిధిలోని ఐదు సెంటర్లలో రోజుకు ఐదు వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువగా కొత్త పాస్‌పోర్టులకు సంబంధించినవే ఉంటున్నాయి. గతంలో రోజుకు 2 వేల స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చేవారు. ఈ సంఖ్యను ప్రస్తుతం ఐదు వేలకు పెంచారు. అయినా క్యూ తగ్గకపోవడంతో పీసీసీల కోసం గత నెలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినా ఆలస్యమవుతున్నాయి. పోస్టాఫీసులకు సేవలు విస్తరించినా.. గతంలో పీసీసీలు పూర్తిగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారానే జారీ చేసేవారు. తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాలు లేని జిల్లా హెడ్ పోస్టాఫీసుల ద్వారా కొత్త పాస్‌పోర్టులకు దరఖాస్తులు స్వీకరించారు. పీసీసీలను వేగంగా జారీ చేయడం కోసం ప్రధాన తపాలా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించేందుకు సెప్టెంబర్ చివరివారంలో అవకాశం ఇచ్చారు. పోస్టాఫీసులకు సేవలను విస్తరించడం వల్ల పీసీసీల జారీ సులభతరం అవుతుందని భావించారు. అయితే ఈ కార్యాలయాల్లోనూ రద్దీ పెరిగింది. పీసీసీల స్లాట్ బుకింగ్‌కే మూడు వారాల సమయం పడుతోంది. పీసీసీల జారీకి నెల రోజులకంటే ఎక్కువ సమయం పడుతోంది. పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తి అవుతుండగా పోస్టాఫీసుల్లో కోసం దరఖాస్తు చేసుకున్నవారి విచారణలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీల జారీ కోసం విదేశాంగ శాఖ వేగవంతమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (క్లిక్: ముగిసిన జోసా కౌన్సెలింగ్.. ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ) -
పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా?
మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది. ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం. వెంటాడుతున్న నిధుల కొరత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు. కార్యాలయాల చూట్టూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్‌లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు. పరిస్థితి ఇలా... హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం) -
గ్రేటర్ ఆర్టీసీలో వీఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఉద్యోగులు బారులు తీరుతున్నారు. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో నగరంలోని వివిధ డిపోలకు చెందిన సీనియర్ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణకు ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే ఒకసారి అవకాశం కల్పించింది. దాంతో అప్పట్లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. పదవీ విరమణకు చేరువలో ఉన్న సుమారు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకంపై అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచారు. అప్పటి నుంచి వీఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లతో పాటు కొత్తగా మరికొందరికి అవకాశం కలి్పంచేందుకు తాజాగా మరోసారి దరఖాస్తులు ఆహా్వనించారు. ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో వివిధ డిపోలకు చెందిన సీనియర్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వయోభారమే కారణం.. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయాల్సిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ.. చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, ఆ తర్వాత కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపో టు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవా ళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. అప్పట్లోనే సు మారు 1500 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా తాజా ప్రకటనతో మరికొంత మంది అదనంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. తగ్గనున్న ఆర్థిక భారం.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో వివిధ విభాగాల్లో సుమారు 18 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న సంస్థలో ఇంధనం, విడిభాగాల కొనుగోళ్లు, బస్సుల నిర్వహణతో పాటు ఉద్యోగుల జీతభత్యాలు కూడా భారంగానే మారాయి. ఈ క్రమంలో అదనపు భారాన్ని తగ్గించుకొనేందుకే మరోసారి ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. 2019లోనే వీఆర్ఎస్ ప్రస్తావన వచి్చనప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాలు గట్టిగా వ్యతిరేకించడంతో విరమించుకున్నారు. ఆ తర్వాత వీఆర్ఎస్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. అప్పటికి విధానపరమైన అంశాల్లో కారి్మక సంఘాల జోక్యం లేకపోవడంతో వీఆర్ఎస్ను ప్రతిపాదించారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ఒక అవకాశంగా భావిస్తున్న అధికారులు తాజాగా వీఆర్ఎస్ను ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిపోల నుంచి సేకరించడం గమనార్హం. (చదవండి: నవీకరణ.. నవ్విపోదురు గాక!) -
ఐదేళ్లయినా కరెంట్ ఇయ్యలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 905 దరఖాస్తులు ఐదేళ్లు, ఆపై కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు రూ.5వేలు డిపాజిట్ కట్టి దరఖాస్తు చేసుకుంటే, ఒక్కో కనెక్షన్‌పై డిస్కంలు రూ.70వేల వరకు ఖర్చు చేస్తాయి. పౌర సేవల పట్టిక ప్రకారం.. క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా సానుకూలతలుంటే, దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా కనెక్షన్ జారీచేయాలి. కొత్త విద్యుత్ లైన్‌తోపాటు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి వస్తే, క్షేత్రస్థాయి ఏఈ ఆధ్వర్యంలో అంచనాలను రూపొందిస్తారు. ఇందులో డిస్కంల వాటా రూ.70వేలు పోగా, దరఖాస్తుదారులు తమ వాటా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వాలి. రైతులు డీడీలు కట్టకపోవడంతో 7,219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, శాఖాపరమైన కారణాలతో ఏకంగా 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక శాతం రైతులు డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్లు జారీ కాకపోవడం గమనార్హం. రైతులకు వేధింపులు క్షేత్రస్థాయి అధికారుల అవినీతితో కనెక్షన్ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో.. డిస్కంలు 2016 జనవరి నుంచి ‘ఫస్ట్ ఇన్– ఫస్ట్ అవుట్ (ఫిఫో)’ అనే విధానాన్ని తెచ్చాయి. దీని ప్రకారం కస్టమర్ సర్వీస్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి, ముందు దరఖాస్తు చేసుకున్న ముందు కనెక్షన్లు జారీ చేయాలి. గ్రామాల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి డిస్కంల కార్యాలయాలు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించాలి. కానీ ఎక్కడా చేయడం లేదు. పంటలను కాపాడటానికి అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తేనే సీనియారిటీని పక్కనబెట్టాల్సి ఉంటుంది. చేతులు తడిపిన వారు, పైరవీలు చేసిన వారికే ముందు కనెక్షన్లు ఇస్తుండటంతో దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నట్టు ఆరోపణలు న్నాయి. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది లంచాల కోసం రైతులను వేధిస్తున్నారని ఇటీవల విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణల్లో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. డీడీలు కట్టి మూడేళ్లనా... వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామానికి చెందిన రావుల కిష్టయ్య, ఎం.వెంకటయ్య, ఎం.పోచయ్య అనే రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2019 ఏప్రిల్ 1న డీడీలు కట్టారు. అయినా ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో తక్షణమే లైన్‌వేయాలని ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చాలామంది రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ ఈఆర్సీకి లేఖలు రాశారు. విద్యుత్ మంత్రి ఇలాఖాలోనూ.. ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను విద్యుత్ సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా నల్లగొండలో 329, నాగర్‌కర్నూల్ జిల్లాలో 212, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సొంత ఇలాఖా సూర్యాపేటలో 203, గద్వాల్లో 89, యాదాద్రిలో 27, వనపర్తిలో 26, మేడ్చల్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, సైబర్సిటీలో 10, వికా రాబాద్‌లో 6, సరూర్‌నగర్, సంగారెడ్డిలో చెరో 5, రాజేంద్రనగర్‌లో 4 పెండింగ్‌లో ఉన్నాయి. -
కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని నగరవాసులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు పచ్చజెండా లభించినా టెండర్ల ప్రక్రియ దశలోనే ఉంది. సుమారు రూ. 15,700 కోట్ల ఖర్చుతో అతి భారీ ప్రాజెక్టు అయిన సబర్బన్ రైల్వే యోజనకు ఆరంభంలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్ధీని తగ్గించడంతో పాటు నగర శివార్లను సులభంగా కలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. నాలుగు ప్రాంతాలకు అనుసంధానం.. ► సబర్బన్ రైల్వే ప్రాజెక్టు పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్లో చేపట్టారు. మొత్తం 148.17 కిలోమీటర్ల దూరంలో నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ► బెంగళూరు–దేవనహళ్లి (41.40 కి.మీ.), బైయ్యప్పనహళ్లి–చిక్కబాణవర (25.01 కి.మీ.), కెంగేరి–బెంగళూరు కంటోన్మెంట్ (35.52 కి.మీ.), హీలలిగే– రాజనుకుంటే (46.24 కి.మీ.) రూట్లతో నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ► ఈ ప్రాజెక్టులో మొత్తం 62 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 101.7 ఎకరాల భూమి అవసరం. ఈ భూమి స్వాధీనం కోసం రూ. 1,419 కోట్ల ఖర్చు అవుతుంది. కేటాయింపులు ఈ విధంగా.. ప్రాజెక్టు నిధులను 20 శాతం చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించి, మిగతా 60 శాతాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 5,087 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3,242 కోట్లు ఇస్తాయి. రుణం ద్వారా రూ. 7,438 కోట్లను తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆకర్షణీయ హామీగా మారిందే తప్ప సాకారం అయ్యేదెన్నడు అనే ప్రశ్న వినిపిస్తోంది. చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం! -
కోవాగ్జిన్ రెండో డోసుపై ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ నిలిపి వేయగా.. కేంద్రం నుంచి సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి వ్యాక్సినేషన్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఆరోగ్యశాఖ వెల్లడించింది. ( చదవండి: కరోనాకు ధైర్యమే మందు అంటూ... ) -
చైనా పెట్టుబడులకు బ్రేక్..
ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్ అండ్ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రెస్ నోట్ 3 (పీఎన్3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్లకు భారత్‌తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సంస్థలు మాత్రమే భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడులు 72 శాతం డౌన్.. చైనా, హాంకాంగ్ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్‌లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 814 డీల్స్ కుదిరినట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్ రిటైల్, జియోలోకే వచ్చాయి. కొత్త మార్గదర్శకాలివీ .. పీఎన్3 ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది. కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ రవీంద్ర ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్‌టాక్, పబ్జీ వంటి 200కి పైగా చైనా యాప్‌లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు. -
బీపీఎస్‌లో మాయాజాలం
ప్రతి పని పారదర్శకంగా, వేగంగా చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ చేస్తోంది. అంతేకాకుండా స్థానికంగానే పనులు జరిగేలా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. కానీ నగరపాలక సంస్థలో మాత్రం సేవలు ఆఫ్‌లైన్ అయ్యాయి. అతిముఖ్యమైన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. కొందరు లైసెన్స్ ఇంజనీర్లు ఫైలు ఆన్లైన్ వరకూ కూడా రాకుండా చక్రం తిప్పుతున్నారు. సాక్షి, అనంతపురం : నగరపాలక సంస్థకు ఆదాయం తీసుకువచ్చే వాటిలో టౌన్ ప్లానింగ్ ప్రధానమైనది. సంస్థ పరిధిలో గృహ నిర్మాణం మొదలుకొని కాంప్లెక్స్, అపార్ట్మెంట్స్ నిర్మాణాల వరకూ టౌన్‌ప్లానింగ్ అనుమతులు తీసుకోవాలి. అనివార్య కారణాల వల్ల అనుమతి లేకుండా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టింది. దీని వల్ల అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు వీలుకలుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్ మేళా కూడా నిర్వహించింది. అయినా ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో గడువు కూడా డిసెంబర్ వరకూ పొడిగించింది. అయినా అనుకున్న మేర స్పందన కనిపించడం లేదు. కారణాలు ఆరా తీస్తే దీని వెనుక కొంతమంది లైసెన్స్ సర్వేయర్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం సేవలన్నీ సచివాలయాలకు అప్పగిస్తున్నారు. దీంతో కొందరు లైసెన్స్ సర్వేయర్లు టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ఫైళ్లను సచివాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లోనే మొకాలడ్డుతున్నారు. ఫైలు సచివాలయానికి వెళ్తే అక్కడ ఏదైనా కొర్రీలు వేస్తే తమకు అందాల్సిన అందకుండా పోతాయని తాత్సారం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉండే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమీపంలోనే సచివాలయాలను ఏర్పాటు చేసి వేగవంతమైన సేవలందిస్తోంది. నగరంలో 50 డివిజన్లుండగా దాదాపు 74 సచివాలయాలున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ద్వారా పొందే సేవలన్నీ సచివాలయాల ద్వారానే పొందవచ్చు. గృహ నిర్మాణ అనుమతులు కూడా ఇటీవల దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అందజేస్తున్నారు. అయితే తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది లైసెన్స్ ఇంజనీర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తులు సచివాలయాల్లోని ప్లానింగ్ సెక్రటరీల వద్దకు గానీ వెళ్లకుండా ఆన్లైన్ లాగిన్‌లో అప్లోడ్ చేయడం లేదు. ఇప్పటి వరకూ ఇలా 460 దరఖాస్తుల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా కనీసం రూ. 5 కోట్ల వరకూ నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే భవన యజమానుదారులను ఇబ్బందులు పెట్టడం వల్ల తమ చేయి తడుస్తుందనో... లేక మరో దురుద్దేశమో తెలియదు కానీ 460 దరఖాస్తులు లైసెన్స్ ఇంజనీర్లు లాగిన్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఇంజనీర్లవే దాదాపు 200 దరఖాస్తులు ఉండడం గమనార్హం. బీపీఎస్ ఇలా... *అనుమతలు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్ అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో భవన యజమాని లైసెన్స్డ్ ఇంజినీర్‌ను సంప్రదించాలి. * లైసెన్స్డ్ ఇంజినీర్ ఇంటి కొలతలు, ఇతర సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. *దరఖాస్తు వార్డు సచివాలయానికి వెళ్తుంది. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలించి రిమాక్స్ రాసి పంపుతారు. ఇది టౌన్‌ప్లానింగ్‌కు వెళితే...వారు వెళ్లి పరిశీలన చేస్తారు. *అన్నీ సవ్యంగా ఉంటే...ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే బీపీఎస్ పూర్తవుతుంది. * కానీ ఫైలు సచివాలయానికి వెళితే పని కాదని భావిస్తున్న కొందరు లైసెన్స్ సర్వేయర్లు దాన్ని పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. రెండు వారాలు గడువిచ్చాం బీపీఎస్ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొన్ని షార్ట్‌ఫాల్స్ గుర్తించాం. సరిచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ఇలా ఇప్పటి వరకూ 460 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లైసెన్స్ ఇంజనీర్లు వారి లాగిన్‌లోనే ఉంచుకున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. అందరికీ రెండు వారాలు గడువు విధిస్తూ నోటీసులు జారీ చేస్తున్నాం. ఆ తర్వాత వారి లాగిన్లను బ్లాక్ చేస్తాం. అనంతరం క్రమబద్ధీకరించుకోని భవనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రామలింగేశ్వర రెడ్డి, ఏసీపీ, నగరపాలక సంస్థ అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసరావు(పేరు మార్చాం) తన భవనాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. బీపీఎస్ మంజూరు చేసేందుకు ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ (షార్ట్‌ఫాల్) అధికారులు నోటీసులు పంపారు. దాదాపు రెండు నెలలుగా ఈ దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. సంబంధిత లైసెన్స్ ఇంజనీర్ బీపీఎస్ మంజూరులో నెలకొన్న ఇబ్బందులను భవన యజమానికి తెలియపర్చకుండా నాన్చుతూ వస్తున్నారు. ఇది తెలియని భవన యజమాని మాత్రం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ రోజూ తిరుగుతున్నారు. అలాంటి వారు నగరంలో వందల్లో ఉన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థ ఖజానాకు సకాలంలో డబ్బులు చేరక అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
పట్టాలెక్కని‘గట్టు’!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని పట్టాలెక్కించే పనులు మూలనపడ్డాయి. జూరాల నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని తీసుకుంటూ 30 రోజుల్లో కనీసం 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టు సమగ్ర సర్వే పనులునత్త నడకన సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు సర్వే ఏజెన్సీలకు రూ.2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ఫైలు పంపి ఆరు నెలలు గడిచినా ఇంతవరకూ మోక్షం లభించలేదు. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు 2018 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సమయంలో గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనిపై సమీక్షించిన సీఎం రేలంపాడ్‌కు బదులుగా నేరుగా జూరాల ఫోర్‌షోర్ నుంచే నీటిని తీసుకోవాలని, రిజర్వాయర్ సామర్థ్యాన్ని సైతం పెంచాలని, ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాథమిక సర్వే చేసిన అధికారులు జూరాల నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. నీటి నిల్వ కోసం 10 నుంచి 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. 2 మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వాటి సామర్థ్యం ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు. దీని కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాథమిక ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. భూసేకరణ అవసరాలను గుర్తించడంతో పాటు అలైన్మెంట్ ఖరారు చేయాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టుకు నీటిని అందించే అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. సమగ్ర సర్వే చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీకి గతంలో కేటాయించిన రూ. 50 లక్షలను సవరించి రూ.2 కోట్లు కేటాయించాలని ప్రాజెక్టు అధికారులు 6 నెలల కింద ప్రభుత్వ పరిశీలనకు ఫైలు పంపినా ఇంతవరకు దానికి మోక్షం లభించకపోవటంతో సర్వే పనులు చేస్తున్న ఏజెన్సీ సర్వే ప్రక్రియలో వేగం తగ్గించింది. దీంతో ఈ పనులు ఇప్ప ట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి ఉపయోగపడే గ్రీన్‌కార్డు పొందేందుకు దాదాపు 2.27 లక్షల మంది భారతీయులు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధికార గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల కోసం మొత్తంగా 40 లక్షల మంది వేచి చూస్తూంటే.. 15 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో, 2.27 లక్షలతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అంచనా. అమెరికా చట్టాల ప్రకారం ఏటా జారీ చేయగల గ్రీన్‌కార్డులు గరిష్టంగా 2.26 లక్షలు మాత్రమే. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్ట్‌లో 1.80 లక్షలతో చైనా మూడోస్థానంలో ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్న వారు తమ కుటుంబ సభ్యులకు (తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, కొన్ని పరిమితులకు లోబడి పిల్లలకు) పౌరసత్వం కల్పించేందుకు అవకాశముంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకమైన అవకాశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డులను పూర్తిగా నిషేధించాలని చూస్తూండగా ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో అత్యధికులు అమెరికన్ పౌరసత్వమున్న వారి తోబుట్టువులని గణాంకాలు చెబుతున్నాయి. వీరి సంఖ్య 1.81 లక్షలు కాగా, పెళ్లయిన సంతానం సంఖ్య 42 వేలుగా ఉంది. భార్య/భర్త, మైనర్ పిల్లలు సుమారు 2500 మంది శాశ్వత నివాసానికి ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్కార్డులుకు అదనంగా మరో 8.27 లక్షల మంది ఇతర రకాల గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. -
పెండింగ్ బిల్లులు రూ.10 వేల కోట్లకు పైనే..
సాక్షి, హైదరాబాద్: సాగు నీటిశాఖ పరిధిలో ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ పేరుకుపోతున్నాయి. ఆర్థిక మాంద్యం, ఇతర ప్రజా ప్రాయోజిత పథకాలకు నిధుల అవసరాలు బాగా పెరగడంతో ప్రాజెక్టు పనుల బిల్లులు చెల్లింపు కావడం లేదు. రుణ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నా, ఇప్పటికీ సాగు నీటి శాఖ పరిధిలో రూ.10,216 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టు ఏజెన్సీలన్నీ ఆ శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రూ.8 వేల కోట్లకు కుదింపు.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మార్చి నెలలో పెట్టిన బడ్జెట్లో రూ.14 వేల కోట్ల మేర కేటాయించగా, తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్లో దాన్ని రూ.8 వేల కోట్లకు కుదించారు. ఏప్రిల్ నుం చి ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర పద్దుల నుంచి రూ.6,756.41 కోట్లు చెల్లింపు చేశారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులకు రుణ సంస్థల ద్వారా మరో రూ.8,432.84 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు నీటి పారుదల శాఖ నివేదికలు చెబుతున్నాయి. కాళేశ్వరం కిందే రుణాల ద్వారా రూ.5,351 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రస్తుతం రూ.10 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులున్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టుల కిందే రూ.9,329 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల కిందే అధికంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.వెయ్యి కోట్ల మేర తక్షణ అవసరాలున్నాయి. ఈ నిధులను విడుదల చేసినా కొంత మేర ప్రాజెక్టులను వేగిరం చేసే అవకాశముంది. ఇక మిషన్ కాకతీయ చెరువులకు సంబంధించి రూ.700 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆ కాంట్రాక్టర్లు నీటిపారుదల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా తూముల నిర్మాణ పనులకు టెండర్లు వేసేందుకు వెనకాడుతున్నారు. -
నత్తనడకన.. పట్టణ మిషన్ భగీరథ
సాక్షి, బోధన్: ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు పనులు పురోగతిలో ఉన్నా, పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. పనుల పురోగతిపై అధికా ర యంత్రాంగం శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీ పరిధి లో చేపట్టిన పట్టణ మిషన్ భగీరథ పనులు నిలిచిపోయాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన పనుల్లో పురోగతి అంతంత మాత్రంగా నే ఉంది. భగీరథ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.10 కోట్లతో పనులు పట్టణంలో మిషన్ భగీరథ పనులకు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో కేటాయించారు. ఈ నిధులతో మున్సిపల్ పాత వార్డుల్లో (35) అంతర్గత పైప్‌లైన్ సుమారు 24 కిలోమీటర్ల పొడవులో వేసేందుకు ప్రణాళిక ఉంది. దీంతో పాటు పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌లో 5 లక్షల లీటర్ల సా మర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్, స్టంఫ్ ట్యాంక్, గంజ్ ప్రాంతంలో మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓటర్ హెడ్‌ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏడాది క్రిత మే పనులు చేపట్టారు. కానీ ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల పనులు సగం మేరకే పూర్తి చేశారు. స్టంఫ్ ట్యాంక్ నిర్మాణ పనులు పునాది దశలోనే ఉన్నా యి. అంతర్గత పైప్‌లైన్ పనులు 24 కిలోమీటర్లకు గాను 4 కిలోమీటర్ల మేరకే పూర్తి చేశారు. అంతర్గత పైప్‌లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనుల పర్యవేక్షణను మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది. ఈ పనులు నత్తననడకన సాగుతున్నా అధికార యంత్రాంగం పనుల పురోగతిపై సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయించడంలో చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పనుల నతనడకన సాగుతుండడానికి గల కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా పట్టణ జనాభా అనధికారికంగా లక్షా పైనే ఉంటుంది. పట్టణ శివారులో 5 కిలోమీటర్ల దూరంలో గల బెల్లాల్ చెరువు పట్టణ ప్రజల త్రాగు, సాగునీటికి ముఖ్య జలవనరుగా ఉంది. ఈ చెరువు ద్వారా పట్టణ ప్రజలకు పైప్‌లైన్ ద్వారా రాకాసీపేట్‌లోని మున్సిపల్ వాటర్‌వర్క్స్‌కు పైప్‌లైన్ ద్వారా తీసుకొచ్చి, ఇక్కడ ఫిల్టర్ చేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సుమారు 10 వేల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. రోజు 10 ఎంఎల్డీల తాగునీటి సరఫరా సాగుతోంది. అయితే నాలుగు నెలలుగా రోజు విడిచి రోజు ఉదయం వేళ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 12 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల బెల్లాల్ చెరువులో ప్రస్తుతం 10 అడుగుల నీళ్లు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను గుర్తించి రోజు విడిచి రోజు తాగునీటి సరాఫరా చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టణ తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లతో నింపుతారు. ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో తాగునీటి సరఫరాపై ప్రభావం పడనుంది. వేగంగా విస్తరిస్తున్న పట్టణం 2009లో రూ. 22 కోట్లతో పట్టణ తాగునీటి పథకం ద్వారా పైప్‌లైన్, ఓవర్హెడ్ట్యాంక్ల నిర్మాణం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న పట్టణ విస్తరణ నేపథ్యంలో శివారు కాలనీలు, ఆయా వార్డుల్లో కాలనీల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. తాగునీటి సమస్య ఎదురవుతున్న ఆయా వార్డుల పరిధిలోని కాలనీల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా అంతర్గత పైప్‌లైన్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. పనుల్లో జాప్యం వాస్తవమే.. పట్టణ మిషన్ భగీరథ పనుల పురోగతిలో జాప్యం జరుగుతున్న విషయం వా స్తవమే. అంతర్గపైప్లైన్ పనులు కొంత మేరకు పూర్తి చేశాం. వారం పది రోజుల్లో పనులు మళ్లీ మొదలవుతాయి. సత్వరంగా పనుల పూర్తికి దృష్టిసారిస్తాం. – తిరుపతిరావు, ఈఈ, మున్సిపల్ పబ్లిక్అండ్హెల్త్ డిపార్ట్మెంట్ -
మొండి బకాయిలకు వన్‌టైం సెటిల్మెంట్
సాక్షి, ఆదిలాబాద్: పెండింగ్ బకాయిలు విద్యుత్ శాఖకు పెను భారంగా మారాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.53 కోట్లు గ్రామపంచాయతీ బకాయిలు ఉండగా రూ.1.20 కోట్ల మున్సిపల్ బకాయిలు ఉన్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పెండింగ్ బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీ, మున్సిపల్‌తో పాటు విద్యుత్ శాఖకు ఊరట లభించనుంది. పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్గా చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా, విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఆయా శాఖల నుంచి స్పందన కరువైంది. సీఎం నిర్ణయంతో విద్యుత్ శాఖ అధికారులకు ఉపశమనం కలగనుంది. మొండి బకాయిలకు మోక్షం లభించే అవకాశం వచ్చిందని ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం రూ.130 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వీటిలో రైల్వే రూ.6లక్షల వరకు, టెలిఫోన్ రూ.25 లక్షల వరకు, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.62 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖ రూ.1.10 కోట్ల వరకు, రెవెన్యూ రూ.19 లక్షల వరకు, ఉన్నత విద్య శాఖ రూ.90లక్షల వరకు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.25 లక్షల వరకు, గిరిజన సంక్షేమ శాఖ రూ.43 లక్షలు, మున్సిపల్ రూ.1.20 కోట్లు, మేజర్ గ్రామపంచాయతీలు రూ.16.20 కోట్లు, మైనర్ గ్రామపంచాయతీలు రూ.36.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. నెలనెలా చెల్లించాల్సిందే... మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసిన తర్వాత జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, మున్సిపల్ అధికారులు నెలనెలా బిల్లులు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. పెండింగ్ విద్యుత్ బకాయిలు ప్రభుత్వం చెల్లించనుండడంతో నెలనెలా బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి మొండి బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా వసూలు చేయాలని గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు చేపట్టలేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాడలేని ప్రిపెయిడ్ మీటర్లు.. మొండి బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ శాఖ ప్రిపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు గతేడాది క్రితమే ప్రకటించినా ఇంతవరకు దాని జాడలేకుండా పోయింది. ప్రిపెయిడ్ మీటర్లు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమర్చలేదు. ప్రస్తుతం మ్యానువల్‌గానే బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రిపెయిడ్ మీటర్లు బిగిస్తే సిమ్‌కార్డు తరహాలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే దారిలేక తప్పనిసరిగా బిల్లులు చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు ప్రిపెయిడ్ మీటర్ల విధానం అమలుకు నోచుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించేందుకు.. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలకు స్విచ్‌లను ఏర్పాటు చేసేందుకు పూనుకుంటున్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. జీపీ బకాయిలే అధికం జిల్లాలో గ్రామపంచాయతీ బకాయిలే అధికంగా ఉన్నాయి. రూ.53 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. మున్సిపల్ బకాయిలు రూ.1.20 కోట్ల వరకు ఉన్నాయి. జిల్లాలో మొత్తం రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వీటిని వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ వినియోగదారులు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలి. – ఉత్తం జాడే, విద్యుత్ శాఖ ఎస్ఈ, ఆదిలాబాద్ -
కరెంట్ బిల్లులు ఎగ్గొట్టిన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ : పట్టణంలోని మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కరెంట్ బిల్లు చెల్లించకుండా తెలుగు దేశం నేతలు వెళ్లిపోయినట్లు యజమాని పొట్లూరి శ్రీధర్ తెలిపారు. రెండు నెలల నుంచి కరెంట్ బిల్లుల గురించి వారి వెంట తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. కరెంట్ బిల్లు లక్షల రూపాయల బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు శ్రీధర్. ఇప్పటికైనా టీడీపీ నేతలు విద్యుత్ బకాయి బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతానని శ్రీధర్ హెచ్చరిస్తున్నారు. గతంలో టీడీపీ ఆఫీసు లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి చివరకు విజయవాడకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో సెటిల్ మెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘కల్యాణలక్ష్మి’కి మళ్లీ బ్రేక్!
సాక్షి, ఆత్మకూర్ (ఎస్) : పేద, మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని.. వారి పెళ్లి ఖర్చులకు ఆర్థికసాయం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈ పథకాన్ని మొదట్లో ఎస్సీ, ఎస్టీల కోసమే ప్రవేశపెట్టి రూ.51 వేలు ఇవ్వగా.. తదనంతరం అన్ని వర్గాల్లోని పేదలకు వర్తింజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థికసాయాన్ని ప్రభుత్వం రూ.లక్షకు పెంచింది. అయితే ఏడాదిగా వివిధ కారణాలతో కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 463 దరఖాస్తులకు 325మందికి చెక్కుల మంజూరు.. కల్యాణలక్ష్మి పథకానికి మండల వ్యాప్తంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు 463మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఈబీసీలు 250మంది, ఎస్టీలు 90, ఎస్సీలు 110, ముస్లింలు 13మంది తమ దరఖాస్తులను మండల అధికారులకు సమర్పించారు. వీటిల్లో ఇప్పటివరకు కేవలం 325మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ నిధులను మంజూరు చేసింది. మిగిలిన 138 దరఖాస్తులు వివిధ దశల్లో అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నిధులు మంజూరైన 325 లబ్ధిదారుల్లోనూ అతికొద్ది మందికే చెక్కులను అందగా.. మిగతా వారికి మంజూరైన నిధులు ట్రైజరీ కార్యాలయాల్లోనే ఉన్నాయి. అమలులోకి ఎంపీ ఎన్నికల కోడ్ .. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరిశీలనలు పూర్తయి.. నిధులు విడుదలయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడం.. మూడు నెలలపాటు ఎన్నికల వాతావారణమే ఉండడంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి పంపిణీ ఆలస్యమైంది. దీనికి తోడుగా ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చి కల్యాణలక్ష్మికి మళ్లీకి బ్రేక్‌లు పడినట్లయింది. దీంతో ఏడాదిగా అప్పులు చేసి పెళ్లి చేసిన కుటుంబాలు కల్యాణలక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
ఈసారి పక్కా!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా వ్యాప్తంగా జనవరి 30తో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కానీ 30 పంచాయతీల్లో కోరం లేక పోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతనెల 30వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఆ మరుసటిరోజు సాయంత్రం వరకు ఉప సర్పంచులను ఎన్నుకోవడానికి గడువు ఉంటుంది. ఆ సమయం వరకు ఎన్నికలు పూర్తి కాకపోతే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాల్సిందే. నోటిఫికేషన్ జారీ జిల్లాలో మిగిలిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికకు సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ పదవికి పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతల్లో జరిగాయి. మొదటి విడుతలో కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట్, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలో కలిపి 249 పంచాయతీలు, 2,274 వార్డులో జనవరి 21వ తేదీన పోలింగ్ నిర్వహించారు. రెండో విడతలో మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట్, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో జనవరి 25వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక మూడో విడతలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దుర్, కోస్గీ మండలాల్లో 227 పంచాయతీలు, 2,024 వార్డులో జనవరి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహించారు. వాటిలో 30 స్థానాలు మినహా 689 గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచ్ ఎన్నికలను జిల్లా ఎన్నిల అధికారులు పూర్తి చేశారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. పెరిగిన పోటీ.. మొదటి విడతలో 13, రెండో విడతలో 7, మూడో విడదలో 10 స్థానాల్లోని ఉపసర్పంచ్‌కు ఎన్నిక నిర్వహించనున్నారు. అత్యధికంగా మక్తల్, అడ్డాకుల, నారాయణపేట, కోయిల్‌కొండ మూడేసి ఉప సర్పంచులు, దన్వాడ, హన్వాడ, కోస్గి, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఒక్కొక్క ఉప సర్పంచ్ ఎన్నిక జరుతుంది. అడ్డాకుల, బలీద్‌పల్లి, కన్మానూర్, బాల్నగర్ మండలంలో మన్నేగూడెంతండా, నేరళ్లపల్లి, సీసీకుంట మండలంలో నెల్లకొండి, ఉంద్యాల, దామరగిద్ద మండలంలో కంసాన్పల్లి, ధన్వాడలో కిష్టాపూర్, గండీడ్ మండలంలో చౌదర్పల్లి, ధర్మాపూర్, హన్వాడ మండలంలో బుద్దారం, జడ్చర్ల మండలంలో ఈర్లపల్లి, కోడ్గల్, కోయిల్‌కొండ మండలంలో అనంతపూర్, లింగాల్చేడ్, శేరివెంకటాపూర్, కోస్డి మండలంలో హన్మాన్‌పల్లి, మద్దూరు మండలంలో నందిగామ, ఎక్కామేడ్, మక్తల్ మండలంలో కర్ని, రుద్రసముద్రం, సంగంబండ, మిడ్జిల్ మండలంలో బోయినపల్లి, మసిగుండ్లపల్లి, నారాయణపేట్ మండలంలో అమ్మిరెడ్డిపెల్లి, అప్పిరెడ్డిపల్లి, షెమాపల్లి, నర్వ మండలంలో ఎల్లంపల్లి, ఊట్కూర్ మండలంలో పులిమామిడి గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచి ఎన్నిక జరగనుంది కోరం లేకున్నా.. ఉప సర్పంచ్ ఎన్నికకు ఎలాంటి కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహించనున్నారు. కోరం అవసరం లేకున్నా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దానికి అనుగుణంగానే 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చా యి. దానికి అనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశానికి వచ్చిన వారిలో ఒక్కరిని కచ్చితంగా ఉప సర్పంచ్‌గా ఎన్నిక జరుపనున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మిగిలి పోయిన 30 స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తాం. కోరం ఉంటేనా సరి.. లేకున్నా ఎన్నిక మాత్రం ఆగదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి -
సహకార సమరానికి బ్రేక్
సాక్షి, వరంగల్ రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ముచ్చటగా మూడో సారి వాయిదా పడ్డాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సమరానికి బ్రేక్ పడింది. ఇందుకు అనుగుణంగా కమిషనర్ నుంచి ఉన్నతాధికాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సహకార వ్యవస్థను ప్రారంభించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. అయితే సంఘాలు మరింత పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా ఫొటో ఓటరు జాబితాను ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్ 28న సహకార సంఘాల ఓటరు జాబితాను ప్రకటించారు. 32 సంఘాలు.. జిల్లాలో 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో 13, నర్సంపేట నియోజకవర్గంలో 13, వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో 3, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో 2, భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఒక సంఘం ఉంది. కాగా కొన్ని సహకార సంఘాల పాలకవర్గం గడువు 2018 జనవరి 30, మరి కొన్ని ఫిబ్రవరి 4వ తేదీ ముగిసింది. అయితే ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అవసరమైన సమయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గడువు ముగిసిన పాలక వర్గాలకే పర్సన్‌ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. తొలుత ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా సంగెం పాలక వర్గం మాత్రం 2020 ఆగస్టు వరకు కొనసాగనుంది. పార్లమెంట్ తర్వాతేనా.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే ముందే సహకార ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేసింది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. జీపీ ఎన్నికలు ముగిసిన తర్వాతనైన సహకార ఎన్నికలు జరుగుతాయని సంఘాల సభ్యులు, ఓటర్లు భావించగా మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరిలో నిర్వహించకుంటే మార్చిలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెనువెంటనే మునిసిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లేదా మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. గత డిసెంబర్ 28న సహకార సంఘాల సభ్యుల ఓటరు లిస్టులను ప్రకటించారు. దాదాపు ఎన్నికలకు కావల్సిన అన్ని ఏర్పాట్లను సహకార శాఖ ఏర్పాట్లను చేసింది. కొత్త జిల్లాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వాయిదా పడ్డాయి.. సహకార సంఘాల ఎన్నికలు వాయి దా పడ్డాయి. గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనే సహకార సంఘాల పాలకవర్గం గడువు ముగిసింది. డిసెంబర్ 28న ఓటరు జాబితను ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం. 31 సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – పద్మ, జిల్లా సహకార అధికారి -
‘సహకారం’ వాయిదా?
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డట్లు సమాచారం. నిన్నటి వరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఏర్పాట్లులో బిజీగా ఉన్న సహకార శాఖ అధికారులు పార్లమెంట్ ఎన్నికల అనంతరం నిర్వహించేలా మంగళవారం సూచనలు రావడంతో అంతా నిశబ్దం అయ్యారు. ఈనెలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం చేయాలని గతనెల 12న ఆదేశాలు అందాయి. రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్టర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకారశాఖ అధికారులకు ఓటరు జాబితా, ఎన్నికల అధికారులకు శిక్షణ, రిటర్నింగ్ అధికారుల నియామకం తదితర ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం సహకార ఎన్నికలు నిర్వహించేలా సూత్రప్రాయంగా ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచి ఎన్నికల నిర్వహణ పనులు నిలిపివేశారు. ఇప్పటికే ప్రాథమిక సహకార సంఘాల కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయంలో ఓటరు జాబితాను అంటించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా సిద్ధం చేశారు. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనుకున్న సమయంలో తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఎన్నికల ఏర్పాట్లకోసం నిధులను ఖర్చు చేయరాదని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ఎన్నికల ఖర్చు చేపట్టరాదని తెలపడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. సహకార ఎన్నికలు కొన్ని అభ్యంతరాలతో పాటు, పూర్తిస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల అనంతరం జూన్, జూలైలో నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గత జనవరిలోనే పాలక వర్గాల గడువును తొలి విడుతలో ఆరు నెలలకు పెంచింది. ఇప్పటికే రెండుమార్లు పెంచి మరోమారు పెంచేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మూడుసార్లు వాయిదా.. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పవవీకాలం రెండు సార్లు పొడిగించింది. ముచ్చటగా మూడోసారి కూడా గడువు పొడగించక తప్పేలా లేదు. ఈ మేరకు సంకేతాలందినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రస్తుతం కొనసాగుతున్న పర్సన్ ఇన్చార్జీలను మరో ఆరునెలలుపాటు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల గత ఫిబ్రవరి 3వ తేదీతో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరి 4 నుంచి 6 నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని పెంచారు. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించారు. వీరు సహకార కమిషన్ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్నీ పొడిగించారు. ఆగస్టుతో ముగిసింది. తిరిగి మళ్లీ ఆరు నెలల కాలం పదవీకాలన్నీ పొడిగించారు. సహకార సంఘాలకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించింది. 2017 ఫిబ్రవరితో గడువు ముగిసింది. పాలవర్గం పదవీకాలం రెండు మార్లు పెంచారు. ఈ గడువు వచ్చే ఫిబ్రవరి 3న గడువు ముగియనుండడంతో ఫిబ్రవరి 5 నుంచి 15లోగా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. కాని తాజా ఆదేశాలలో మళ్లీ ఇనాచార్జీల పాలన కొనసాగనుంది. తదుపరి ఆదేశాలు వచ్చాకే ఎన్నికలు ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు 12 జీవోలు విడుదల చేసింది. కాని ఎన్నికల నిర్వహణ నిధులు ఖర్చు చేయకూడదని సూత్రప్రాయంగా ఆదేశాలు అందాయి. ఇప్పటికే ఎన్నికల జరిపేందుకు సహకార కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓటరు జాబితా సిద్ధం చేశాం. ఎన్నికల అధికారుల నియామకం, శిక్షణ, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ ఒక్కటే మిగిలి ఉంది. ఇప్పటే వరకు ఎన్నికను నిలిపివేయాలని అధికారికగా ఆదేశాలు అందలేదు. – బి.సంజీవ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లాల సహకార శాఖ అధికారి -
ఎన్నాళ్లీ కష్టాలు!
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనుల కోసమంటూ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వి, పనులు చేపట్టకుండా వదిలేయడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కాలనీలో తవ్విన గుంతలతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఆరునెలల క్రితం గుంతలు తీసి.. ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మీ కాలనీలో రహదారులు నిర్మిస్తామని చెప్పిన నాయకులు..ఎస్బీఐ కాలనీలో రహదారులు వేయడానికి ఆరు నెలల క్రితం గుంతలు తీయించారు. కానీ ఇంత వరకు రోడ్లు వేయలేదు. దీనికి తోడు రహదారి పక్కన డ్రెయినేజీ కోసం గుంతలు తీసి మట్టిని రోడ్డుపైనే వేయడంతో వాహన దారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ కాలనీలో పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఐదు పాఠశాలలు, మూడు కాలేజీల విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో చిన్న ఆటో ఎదురుగా వచ్చినా ట్రాఫిక్ అంతా జాం అవుతుంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు, కాలేజీలకు ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. పాఠశాల బస్సు ఈ రహదారిపై వచ్చిందంటే 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోవాల్సిందే. రోడ్డు అంతా మట్టిమయం కావడం, పక్కన గుంతలు ఉండటంతో కనీసం సైకిళ్లు కూడా వెళ్లలేని పరిస్థితి. అంతేకాకుండా వర్షా కాలం కావడంతో రోడ్డుపై వేసిన మట్టి మీద నడుస్తూ వృద్ధులు, చిన్నారులు జారిపడుతున్నారు. ఆరు నెలలుగా పనులు కొనసాగుతున్నా ఒక్కపని కూడా సక్రమంగా చేయడంలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్‌నాథన్ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్‌శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్మెంట్లు అన్నీ పెండింగ్‌లో పడిపోయాయని తెలంగాణ పోలీస్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా.. రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్ కోటా కింద ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్ వన్ డీఎస్పీగా సెలక్ట్ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు. -
ఉప‘కారం’..!
సంక్షేమ పథకాలకు కత్తెర వేసుకుంటూ వస్తున్న సర్కారు తన కత్తిని మరోమారు విద్యార్థుల వైపు తిప్పింది. విద్యార్థులకు సాయం చేయడానికి అందించే ఉపకార వేతనాలను వీలైనన్ని తీసేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు పల్స్ సర్వేను సాకుగా చూపిస్తున్నారు. ఇదివరకు చేసిన పల్స్ సర్వే ఆధారంగా దాదాపు 19 వేల మంది విద్యార్థులకు స్కాలర్ రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గత ఏడాది దాదాపు 12 వేల మందికి ఇలాగే సాయాన్ని దూరం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. సాయం చేయాల్సింది పోయి ఇలా కక్షపూరితంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజాం/పాలకొండరూరల్ : ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తీసేసి.. ప్రజా సంక్షేమ పథకా లను తగ్గిస్తూ వస్తున్న టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలపై మళ్లీ గు రి పెట్టింది. నిబంధనలను మార్చుతూ కోత వేయడానికి సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 2015–16 ఆర్థిక సంవత్సరం వరకూ అన్ని గ్రామాల్లోని మహిళా సం ఘాలకు సంబంధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేవి. 2016–17 విద్యాసంవత్సరంలో మాత్రం పల్స్ సర్వే ప్రామాణికంగా స్కాలర్స్ ఇచ్చారు. ఫలితంగా ఆ ఏడాది 9–12 తరగతుల విద్యార్థులు 12 వేల మందికి మొండిచేయి ఎదురైంది. వీరంతా పల్స్ సర్వేలో లేరని సర్కారు చెప్పింది. అయితే మహిళా సంఘాల సభ్యులు అప్పట్లోనే దీనిపై మండిపడ్డారు. సంఘాల్లో ఉన్నా స్కాలర్లు ఇవ్వలేదని బహిరంగంగానే ఆరోపించారు. పెరగనున్న సంఖ్య.. నెలరోజుల కిందట విద్యార్థులకు ఇచ్చిన ఉపకార వేతనాలు నిజానికి 2016–17 విద్యాసంవత్సరం చివరిలో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఏడాది కాలంపాటు తాత్సారం చేశారు. చివరకు 12 వేలమందిని రిజెక్ట్లో పెట్టేశారు. తాజాగా ఈ ఏడాది (2017–18) విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకూ ఉపకార వేతనాలు అందించలేదు. ఈ ఉపకార వేతనాలు వచ్చే విద్యాసంవత్సరంలో అందించనున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరంలో 12 వేల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను బాధితులుగా చేయనున్నారు. దీనికి కూడా మళ్లీ ‘పల్స్’నే సాకుగా చూపెట్టనున్నారు. ఆందోళనలో విద్యార్థులు.. ఏటా అర్హత గల విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తూ పోతుండడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఊడుతుందో తెలీకపోవడం, అనర్హతకు నిర్దిష్టమైన కారణాలు చూపకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. మహిళా సంఘాల సభ్యులు తాము సంఘాల్లో ఉన్నా పిల్లలకు స్కాలర్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపకార వేతనాలు అందాల్సిన మొత్తం విద్యార్థులు : 1,04,698 మంది వీరికి అందించాల్సిన మొత్తం : రూ. 12,56,37,600 2016–17 విద్యాసంవత్సరంలో గుర్తించిన విద్యార్థులు : 92,462 మంది. వీరికి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది : రూ.11,09,54,400 2016–17 విద్యాసంవత్సరంలో ఉపకార వేతనాలకు నోచుకోని బాధిత విద్యార్థులు : 12,236, వీరికి చెల్లించాల్సిన మొత్తం : రూ. 1.46,83,200 ఉపకార వేతనాలు అందించే తరగతులు : 9 నుంచి 12వ తరగతి వరకూ ఒక్కో విద్యార్ధికి ఏడాదికి ఇచ్చేది : రూ. 1200లు 2017–18 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ఈ పధకానికి అర్హులైన విద్యార్థులు : 1,12,384 మంది (అంచనా వివరాలు). పల్స్ సర్వేలో ప్రస్తుతం అంచనాల ప్రకారం స్కాలర్ రాని విద్యార్థులు : 19 వేల మంది ఉపకార వేతనం రాలేదు.. నాకు ఉపకార వేతనం రావాల్సి ఉంది. కానీ రాలేదు. మా అమ్మ మహిళా సంఘంలో ఉంది. అయినా ఎందుకు ఇవ్వలేదని అర్థం కాలేదు. అడిగితే ఇప్పుడు నెట్లో అప్లై చేయమంటున్నారు. - సీహెచ్.జీవన్‌కుమార్, 9వ తరగతి విద్యార్థి మాకు రాలేదు.. మాకు ఉపకార వేతనం ఇంతవరకూ రాలేదు. దీంతో ఇబ్బందిగా ఉంది. ఈ ఉపకార వేతనం వస్తే పదో తరగతి పుస్తకాలు కొనుక్కుందామని అనుకున్నాను. ఇంతవరకూ ఇవి రాలేదు. నాపేరు కూడా లిస్టులో లేదని అంటున్నారు. – ఆబోతులు గణేష్, పాలకొండ. పేరు ఉన్నా డబ్బులు రాలేదు.. ఉపకార వేతనాలకు సంబంధించి నాకు ఈ ఏడాది డబ్బులు రాలేదు. మా స్నేహితులకు వచ్చాయి. ఈ వేతనాలకు సం బంధించి నెట్లో నా పేరు ఉంది. కానీ డబ్బులు రాలేదు. – వారణాశి పావని, కాకరాపల్లి, సంతకవిటి మండలం. చర్యలు తీసుకుంటున్నాం.. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు చెందిన విద్యార్థులకు ఏటా అందిస్తున్న ఉపకార వేతనాల్లో ఈ ఏడాది కొంతమందికి రాని విషయం వాస్తవమే. పల్స్ సర్వేను ప్రామాణికంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. బాధిత విద్యార్థులు 12 వేల మందికి పైబడి ఉన్నారు. వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డి.సీతారామయ్య, వెలుగుశాఖ డీపీఎం, శ్రీకాకుళం. -
నీళ్ల పన్ను నిల్
ఖమ్మంఅర్బన్ : జిల్లాలో నీటి తీరువా కోట్లలో పేరుకుపోయింది. సాగునీరు వాడుకున్నందుకు ఎకరానికి రైతులు కొంత మొత్తం నీటి తీరువా రూపంలో చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని సాగునీటి కాల్వల మరమ్మతు తదితర పనుల కోసం వినియోగిస్తుంటారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అందించిన సాగునీటి లెక్కల ప్రకారం.. ప్రతి ఏడాది నీటి తీరువా రైతుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. దాదాపు ఏడేళ్లుగా నీటి తీరువా వసూలు చేయకపోవడంతో వసూళ్లు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో ఖరీఫ్, రబీలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు పైగానే సాగర్ జలాలు అందుతున్నాయి. సాగర్‌లో నీరుంటే రెండు పంటలకు పుష్కలంగా నీరందుతుంది. ఆయకట్టుగా ఉన్న సుమారు 2లక్షల 60వేల ఎకరాల్లో సగానికి పైగా వరి, మిగతా సగం ఆరుతడి పంటలు సాగు చేస్తుంటారు. ఇవేకాక చెరువులు, ప్రాజెక్టుల పరిధిలో లిఫ్టులు, చెక్‌డ్యాంల పరిధిలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు పైగానే సాగవుతుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే 2012–13 నుంచి వరుసగా ఇప్పటివరకు నీటి తీరువా వసూలు కావడం లేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదని ఎన్నెస్పీ అధికారులు చెబుతుండగా.. చెరువుల పరిధిలో కొందరు వీఆర్వోలు అరకొరగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎకరానికి రూ.100, రూ.200 వరకు.. సాగర్ ఆయకట్టు పరిధిలో నీటిని వినియోగించుకున్నందుకు వరికి ఎకరానికి రూ.200, ఆరుతడి పంటలకు రూ.150, చెరువుల పరిధిలో వరికి రూ.150, ఆరుతడి పంటలకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో కాల్వలు, తూములు తదితర మరమ్మతు పనులకు వినియోగిస్తారు. ఇందులో 50 శాతం నీటి సంఘాల పరిధిలోకి, 20 శాతం డీసీల పరిధిలో, 20 శాతం ప్రాజెక్టు కమితీ పరిధిలోని కాల్వల మర్మతులకు వాడొచ్చు. 10 శాతం పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఆరేడు ఏళ్లుగా నీటి తీరువా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ నిధులతోనే పనులు చేపడుతున్నారు. మంత్రి, కలెక్టర్ ఆరా.. నీటి తీరువా వసూళ్లపై సంబంధిత అధికారులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ చర్చించినప్పుడు.. నీటిని వాడుకున్నందుకు ప్రతి ఎకరాకు నీటి తీరువా వసూలు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో లెక్కలు తీసి.. పక్కాగా పన్ను వసూళ్లు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో ఏడేళ్లకు సంబంధించిన బకాయిలు సుమారు రూ.18కోట్ల వరకు ఉన్నట్లు ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం. ఈ లెక్కల్లో కొద్ది తేడా ఉన్నట్లు నీటిపారుదల శాఖ వాదన. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు దృష్టి పెట్టకపోవడంతోనే నీటి తీరువా సరిగా వసూలు కావడం లేదని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. సాగర్, చెరువుల పరిధిలో సుమారు రూ.25కోట్లకు పైగా నీటి తీరువా ఉంటే.. ఇందులో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.5కోట్ల మేర నిధులు వచ్చేవని చెబుతున్నారు. ఎన్నెస్పీ లెక్కలిలా.. 2012–13, 2015–16, 2017–18లో ఖరీఫ్‌లో సాగునీరు అందించలేదని మధ్యలో ఒక ఏడాదికి సంబంధించి పన్నులు నమోదు చేయలేదు. మిగిలిన సంవత్సరాల్లో మొత్తంగా రూ.17.88కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఇవికాక చెరువులు, లిఫ్టులు, ప్రాజెక్టుల పరిధిలో కలిపి రూ.25కోట్ల వరకు వసూలు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు అందించాం.. సాగర్ నీటి విడుదల ప్రకారం తమ ఇంజనీర్లు ఇచ్చిన లెక్కల మేరకు నీటి తీరువా జాబితా ఇస్తాం. తాము కాల్వల వెంట తిరుగుతున్నప్పుడు రైతులు పొలాలకు నీరు వాడుకుంటున్నారు. పన్ను ఎందుకు చెల్లించడం లేదని అడిగితే.. తమ వద్దకు ఎవరూ రాలేదని కొందరు రైతులు సమాధానం ఇస్తున్నారు. వరుసగా పన్నులు వసూలు కాకపోవడంతో కోట్లలోనే బకాయిలు ఉన్నాయి. – ఎం.వెంకటేశ్వర్లు, ఎన్నెస్పీ ఈఈ చెరువుల పరిధిలో వసూలు చేశాం.. తన పరిధిలో చెరువుల పరిధిలో రైతుల నుంచి నీటి తీరువాను గత ఏడాది కూడా వసూలు చేశాం. తమ పరిధిలో సాగర్ ఆయకట్టు పెద్దగా లేదు. చెరువుల పరిధిలో ఉన్న మేరకు వసూలు చేశాం. – హుస్సేన్, వీఆర్వో ఏన్కూరు -
‘అవిశ్వాస’మంటే కేంద్రానికి భయం
సాక్షి, బెంగళూరు: పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానికి కేంద్రం భయపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మైసూరులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 10 రోజులుగా అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉందని, దాన్ని చర్చకు చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం ధైర్యం చేయడంలేదని విమర్శించారు. ఆంధ్రా పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ తరువాత కాంగ్రెస్ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేలా కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడమే బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఘనకార్యమని రాహుల్ ఆరోపించారు. బీజేపీ వల్లే కశ్మీర్లో అస్థిరత.. ఒకప్పుడు మనకు మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు లాంటి దేశాలు ఇప్పుడు చైనాకు దగ్గరయ్యాయని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదం వెన్నెముకను యూపీఏ ప్రభుత్వం విరిచేసిందని, కానీ ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో పీడీపీ అధికారంలోకి వచ్చాక ఉగ్ర దాడులతో హింస యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. నమో యాప్‌తో డేటా దుర్వినియోగం న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధికార ‘నమో యాప్’ ద్వారా ప్రజల అనుమతి లేకుండానే వారి సమాచారం విదేశీ కంపెనీలకు చేరుతోందని రాహుల్ ఆరోపించారు. ‘హాయ్..నేను భారత ప్రధానిని. నా అధికార యాప్‌ని వాడుకుంటే మీ సమాచారాన్నంతా అమెరికా కంపెనీల్లోని నా స్నేహితులకు ఇస్తా’ అని రాహుల్ ట్వీట్‌చేశారు. యాప్‌తో సమాచారం దుర్వినియోగమవుతోందన్న ఓ ఫ్రెంచ్ హ్యాకర్ ఆరోపణల ఆధారంగా ప్రచురితమైన కథనంపై రాహుల్ ఈ స్పందించారు. కాగా, రాహుల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి ఇంతకన్నా గొప్ప మాటలు ఆశించలేమని బీజేపీ తిప్పికొట్టింది. -
చీకట్లో పల్లెలు
పల్లెల్లో అంధకారం అలుముకుంది. వీధులన్నీ చీకట్లో మగ్గుతున్నాయి.బకాయిలు రాబట్టుకోవడం కోసం విద్యుత్ శాఖ జూలు విదిల్చింది.వీధి లైట్లు, పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. జిల్లా వ్యాప్తంగా 906 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 205 పంచాయతీల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు. అంటే శివారు గ్రామాలతో కలిపి సుమారు 300 గ్రామాలకు పైగా రాత్రిళ్లు అంధకారంలోకి వెళుతున్నాయి. కొవ్వూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించారు. తాగునీటి సరఫరా సర్వీసులకు బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముక్కుపిండి బకాయిలు వసూలు చేస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు రాబట్టు కోవడం కోసం కరెంటు సరఫరాను నిలిపివేస్తూ పల్లెలను చీకట్లోకి నెట్టింది. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికార్ల నుంచి కింది స్థాయి అధికారులకు బకాయిల వసూలుపై స్పష్టమైన ఆదేశాలందాయి. మార్చిలోపు నిర్దేశించిన మేరకు బకాయిలన్నీ వసూలు చేయాలని ఉన్నతాధికార్ల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఉద్యోగులు కార్యాచరణలోకి దిగారు. బకాయిలున్న పంచాయతీలకు కరెంట్ కట్ చేస్తున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన ఉన్న సమయంలో జనం నిలదీస్తారన్న భయంతో కొన్ని చోట్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఏకంగా 66 పంచాయతీల్లో విద్యుత్ కట్ చేశారు. గోపాలపురంలో 18, దేవరపల్లిలో 15, నల్లజర్లలో 23 పంచాయతీలలో కరెంటు సరఫరా ఆపివేశారు. విద్యుత్ శాఖ డివిజన్ల వారీగా భీమవరంలో 40, ఏలూరులో 34, తాడేపల్లిగూడెంలో 31, నిడదవోలులో 77, జంగారెడ్డిగూడెంలో 23 పంచాయతీలకు సరఫరా నిలిపివేశారు. కొంత మొత్తం చెల్లించిన వాటికి మళ్లీ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ట్రెజరీల్లో ఆంక్షల కారణంగా చెల్లింపులకు సైతం వీలు కానీ పరిస్థితి ఉంది. రూ.225 కోట్ల విద్యుత్ బకాయిల జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.225 కోట్ల మేరకు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల్లో వీధిలైట్లకు రూ.26.8 కోట్లు, తాగునీటి సరఫరా సర్వీసుల నుంచి రూ.74.28 కోట్లు బకాయిలున్నాయి. మైనర్ పంచాయతీలలో వీధిలైట్లకి రూ.29.15 కోట్లు, వాటర్ వర్క్స్‌కి రూ.95.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో గత నెలలో రూ.2.16 కోట్లు వసూలు చేశారు. ఈ నెల ఇప్పటి వరకు రూ.12 లక్షలు వసూలైంది. ఇంకా సుమారు రూ.225 కోట్ల మేరకు బకాయిలు పేరుకు పోయాయి. ప్రధానంగా పాత బకాయిలు కూడా అధిక మొత్తంలో ఉండడంతో రోజు రోజుకి ఈ బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉండడంతో తాగునీటి సర్వీసులకు బిల్లుల చెల్లింపు భారంగా మారిందని పంచాయతీల సర్పంచులు వాపోతున్నారు. బకాయిల్లో సింహభాగం రూ.169.76 కోట్లు తాగునీటి సరఫరా సర్వీసులకు చెందినవే ఉన్నాయి. కరెంటు సరఫరా నిలిపివేయడం సరికాదు పంచాయతీ వీధిలైట్లకు విద్యుత్ సరఫరా తొలగించడం సమజసం కాదు. పాత బకాయిల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీలకు విద్యుత్ బిల్లులు చెల్లింపు గుదిబండగా మారింది. ఉన్న వీధిలైట్లు తొలగించి ఎల్ఈడీ లైట్లు అమర్చమన్నారు. ఇప్పుడు నెలకి ఒక్కో లైటుకి రూ.50లు చొప్పున వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో కట్ చేసుకుని పంపుతున్నారు. – ముదునూరి జ్జానేశ్వరి, సర్పంచి, దొమ్మేరు మైనర్ పంచాయతీలకు వెసులుబాటు ఇవ్వాలి మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా ఉంది. అసలే ఆదాయ వనరులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారులు బిల్లులు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మూడు రోజులుగా సరఫరా నిలిపివేశారు. పంచాయతీలో ఉన్న మూడు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. దివంగత నేత వైఎస్సార్ ఇచ్చినట్టు మైనర్ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులో వెసులుబాటు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – కొండేపూడి రమేష్, సర్పంచి, పోచవరం, తాళ్లపూడి మండలం -
రీసేల్ ఫ్లాట్ కొంటున్నారా?!
నిడమర్రు : కొత్త ఫ్లాట్ అందుబాటు ధరలో లేకపోవడం, పెట్టుబడి తగ్గించుకుని తిరిగి అమ్మే ఉద్దేశం ఉన్న సమయంలో, తక్షణం గృహ ప్రవేశం చేయలనుకున్నప్పుడు లేదా మార్కెట్ విలువలో తక్కువ ధరకు లభిస్తున్నపుడు కారణం ఏదైనా రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా..? అయితే రీసేల్ ఫ్లాట్ విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం. ’రీసేల్ అంటే పాతదే కాదు రీసేల్ యూనిట్స్ అంటే పాతవే కాకుండా, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను ఓ వ్మక్తి కొనుగోలు చేసి అది పూర్తయిన తర్వాత విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. అలాగే నిర్మాణంలో ఉన్నవీ కావచ్చు. బిల్డర్ వద్ద ఒకరు కొని తిరిగి ఫ్లాట్ నిర్మాణం పూర్తవకపోయినా, విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. చట్టబద్ధత, పత్రాలు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్/ఇంటికి సంబంధించి చట్టబద్ధమైన హక్కుల విషయంలో ముందుగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. పాత అపార్ట్మెంట్ కొనేముందు చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ రికార్డుల్లో సరిగ్గా నమోదు చేశారా, పేరు, ఇతర వివరాలు సరిగానే ఉన్నాయా? అన్నవి పరిశీలించాలి. రీసేల్ ఫ్లాట్ టైటిల్ డీడ్‌ను చాలా స్పష్టంగా రాసుకోవాలి. కొనుగోలు ఒప్పందం, సేల్‌డీడ్, అపార్ట్మెంట్ సొసైటీ నుంచి నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ), బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ కాపీ అప్పటివరకు ఆ ఫ్లాట్‌కు యజమానులుగా వ్యవహరించిన వారి వివరాలు తెలియజేసే డాక్యుమెంట్లు అన్ని అవసరం అవుతాయి. ఎందుకు అమ్ముతున్నారో ఆరా తీయాలి ఆ ఫ్లాట్‌ను యజమాని ఎందుకు విక్రయిస్తున్నారన్న అంశాన్ని విచారించుకోవాలి. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే వదిలించుకునేందుకు ఆ ఫ్లాట్‌ను విక్రయిస్తున్నారా..? దానిపై మరెవరికైనా ఉమ్మడి హక్కులున్నాయా..? అన్నవి చూడాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకుని అది పూర్తి కాకముందే విక్రయిస్తుంటే కారణాలు అన్వేషించాలి. ఫ్లాట్‌పై రుణ బకాయిలు కొనుగోలు చేయబోతున్న ఫ్లాట్ లేదా ఇంటిపైన రుణాలు ఏవైనా ఉన్నాయా, లేదా..? అన్న అంశం కూడా చూడాలి. బ్యాంకు నుంచి తీసుకున్న ఎన్వోసీ పత్రాన్ని తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ బ్యాంకు తనఖాలో ఉంటే మాత్రం.. దానిపై ఉన్న రుణం మొత్తాన్ని తీర్చేసిన తర్వాత ఫ్లాట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసేందుకు సమ్మతేనని బ్యాంకు నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. కొనుగోలుకు రుణం.. రీసేల్ ఫ్లాట్/ఇంటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. రుణాన్ని ఇచ్చే ముందు సాంకేతికపరంగా ఆ భవనం నాణ్యతను పరిశీలిస్తారు. భవనం స్థితిగతులను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆస్తి కొనుగోలుకు ఎంత ఇవ్వాలన్నది బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రుణం సేల్ డీడ్ విలువ కంటే మించకుండా ఉంటుంది. ఏ అంతస్తు నయం..? 0–15 ఏళ్ల వయసున్న రీసేల్ ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తున్నట్టయితే పై అంతస్తునే ఎంచుకోవడమే నయం. అపార్ట్‌మెంట్‌ను నిర్మించి కొన్నేళ్లయితే డ్రైనేజీపరంగా లీకేజీలు చోటు చేసుకోవచ్చు. కింద ఫ్లోర్ నిర్మాణంలో మార్పులు జరగవచ్చు. పై అంతస్తులో కింద అంతస్తు మీద వెలుతురు వచ్చే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న ఫ్లాట్‌ను కొనడం వల్ల ధర, విలువపరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా పదేళ్ల వయస్సు ఫ్లాట్ వరకూ లాభసాటిగా ఉంటుంది. నిర్వహణ రీసేల్ ఫ్లాట్ విషయంలో మెయింటెనెన్స్ చార్జీలు గురించి వాకబు చేయాలి. నిర్మాణపరమైన నాణ్యత కూడా కీలకమే. ఎక్కడైనా నిర్మాణంలో నెర్రులు బారి ఉన్నాయేమో చూడాలి. రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న ప్లాన్ ప్రకారమే ఫ్లాట్ నిర్మించారా లేదా..? అన్నది చెక్ చేయాలి. పాతది అయితే ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ వంటి అంశాలు పరిశీలించుకోవాలి. నిర్మాణపరమైన మార్పులు చేయించాల్సి ఉంటే ఆ బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అపార్ట్మెంట్ సొసైటీ నిబంధనలు ఏంటన్నదీ తెలుసుకోవాలి. పన్ను ప్రయోజనాలు రీసేల్ ఫ్లాట్‌పైనా పన్నుపరమైన ప్రయోజనా లున్నాయి. రుణం తీసుకుని రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే (మొదటిసారి సొంతింటి కొనుగోలు), తిరిగి చేసే వాయిదాల చెల్లింపులో సెక్షన్ 80సీ కింద ఏడాదిలో రూ.లక్ష మినహాయింపు, వడ్డీ రూపంలో చెల్లింపులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లించే పనిలేదు. రీసేల్ వల్ల ప్రయోజనాలు మొదటిసారి విక్రయమవుతున్న ఫ్లాట్‌తో పాలిస్తే ధర తక్కువగా ఉంటుంది. వెంటనే ఇంట్లోకి చేరిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెలనెలా అద్దె ఇంటికి చేసే చెల్లింపులు మిగులుతాయి. కనిపించని చార్జీల భారం ఉండదు. వెంటనే ఇంట్లో చేరిపోతాం గనుక అప్పటి నుంచే పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. నిర్మాణంలో ఉన్నది కొనుగోలు చేస్తే లేబర్, మెయింటెనెన్స్ పన్ను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఇంటి పన్ను ఇతరత్రా చార్జీలపై స్పష్టత ఉండదు. రీసేల్ ఫ్లాట్‌కు సంబంధించి అన్ని చార్జీలు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
జాధవ్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది..
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని పాకిస్తాన్ గురువారం స్పష్టం చేసింది. తల్లి, భార్యను జాధవ్ కలసిన తర్వాత మరణశిక్షను అమలు చేయనున్నారని, జాధవ్‌తో వారికిదే చివరి సమావేశమని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. ‘మరణశిక్షను ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదు. ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది’ అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ చెప్పారు. ‘ఇస్లామిక్ సంప్రదాయాలు, మానవతా దృక్పథంతోనే జాధవ్ భార్య, తల్లికి పాక్ వీసాలిచ్చింది’ అని చెప్పారు. -
శ్రీకాకుళంలో పవర్‌ప్లాంట్ ఏర్పాటుపై సందేహాలు
-
అంతంత మాత్రమేనా?
డెల్టా ఆధునికీకరణ ఈ ఏడాదీ అనుమానమే అరకొరగా నిధులు విదిల్చిన సర్కారు కుదించుకుపోయిన క్లోజర్ గడువు అమలాపురం : గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది జరిగేది కూడా అంతంత మాత్రమేనని రైతులు భావిస్తున్నారు. నిధుల కేటాయింపులో భారీగా కోత పెట్ట డం.. కాలువల మూసివేత సమయం (క్లోజర్) కుదించుకుపోవడం రైతులు అనుమానాలను నిజం చేస్తున్నాయి. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు 2008లో ఆరంభమయ్యాయి. రూ.1,760 కోట్లతో చేపట్టిన పనులు నాలుగేళ్లలో అంటే 2012–13 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాల్సి ఉంది. చాలా ప్యాకేజీలకు టెండర్లు ఖరారు కాకపోవడం.. టెండర్లు ఖరారైన చోట కాంట్రా క్టర్లు మట్టి పనులు చేసి చేతులు దులుపుకోవడంతో పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.400 కోట్ల పనులు మించికాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని పనులు తొలగించాలి్సందిగా నివేదిక ఇవ్వగా అందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అయిన పనులు... తొలగించిన పనులు పూర్తి కాగా, ఇంకా రూ.689 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉందని అంచనా. ఈ ఏడాది క్లోజర్ సమయంలో కనీసం రూ.170 కోట్ల విలువైన 373 పనులు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. దెబ్బతిన్న లాకులు, స్లూయిజ్‌లు, డైరెక్ట్ పైప్‌ల షటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, మరమ్మతులు చేయడంతోపాటు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, వంతెన నిర్మాణ పనులున్నాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నిధులు సైతం రెండు జిల్లాల పరిధిలో డెల్టా ఆధునికీకరణకు కేటాయించారు. అంటే మనకు దీనిలో సగం మాత్రమే నిధులు రానున్నాయన్న మాట. గత ఏడాది రూ.325 కోట్లు ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం రూ.85 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇరిగేష¯ŒS అధికారులు ఈసారి పనులను కుదించి పంపినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం యధావిధిగా అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. కుదించుకుపోయిన గడువు క్లోజర్ గడువు ఈ ఏడాది కుదించుకుపోయింది. ఏప్రిల్ 15న కాలువలు మూసి జూ¯ŒS 15న తెరవడం ద్వారా 60 రోజుల క్లోజర్ గడువు అధికారులకు ఉండేది. కాని ఈ ఏడాది జూ¯ŒS ఒకటి నాటికి డెల్టాలో ముందస్తు సాగుకు నీరిస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో క్లోజర్ గడువు కేవలం 45 రోజులు మాత్రమే దక్కింది. ఉన్న సమయమే తక్కువ అనుకుంటే ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు ఆరంభం కాకపోవడం గమనార్హం. మధ్యడెల్టా పరిధిలో ఆత్రేయపురం మండలం లొల్ల– ముక్తేశ్వరం బ్రాంచ్ కెనాల్ పరిధిలో వాడపాలెం వెంకన్న ఆలయానికి వెళ్లేందుకు వీలుగా రూ.1.90 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు మాత్రమే కొంత వేగంగా సాగుతున్నాయి. మిగిలిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఆధునికీకరణ పనులు అటకెక్కినట్టేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
వడ్డీ రాయితీకి చంద్రగ్రహణం
మూడేళ్లలో రూ.90 కోట్లు పెండింగ్ సహకారం... రైతులకు రుణపాశం చేష్టలుడిగి చూస్తున్న ప్రజాప్రతినిధులు సహకార రంగానికి ప్రభుత్వ సహకారం కొరవడుతోంది ... ఊపిరి పోయాల్సిన సర్కారే ఊపిరితీస్తోంది. రుణాలపై వడ్డీ రాయితీకి రిక్త హస్తం చూపుతూ రైతుల ఆశలకు పాడి కట్టేయడానికే అడుగులు వేస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుల జీవితాలతో దాగుడు మూతలు ఆడడంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా పరిస్థితి తయారైంది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : సహకార రుణాలపై వడ్డీ రాయితీకి ప్రభుత్వం మంగళంపాడేసేలా కనిపిస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాయితీ సొమ్ము విడుదల చేయకుండా రైతులను, సహకార సంఘాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. మరో ఏడాది రాయితీ కోసం జీఓ కూడా విడుదలచేసి రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సహకార రంగంలో రైతుల రుణాలపై ఇవ్వాల్సిన సుమారు రూ.90 కోట్ల రాయితీ విడుదల చేయకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. శుక్రవారం(మార్చి 31)తో ఆర్థిక సంవత్సరం ముగిసినా ఈ ఏడాది రాయితీ విడుదల కోసం ఎటువంటి జీఓ విడుదల కాలేదు. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సర్కార్ సహకార రైతులను రాయితీ పేరుతో దగా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. ఏ రుణాలపైనా రాయితీ ఇవ్వక... సహకార సంఘాల్లో తీసుకున్న స్వల్ప కాలిక రుణాలపైనే కాకుండా దీర్ఘకాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడం లేదు. ప్రభుత్వ నిర్వాకంతో సహకార సంఘాలు ఆర్థికంగా పతనం వైపు పయనిస్తున్నాయి. సవాలక్ష కారణాలతో జిల్లాలోని 297 సహకార సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వలు తరిగిపోయాయి. 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి జీవో నెం.270 జారీ అయింది. ఆ తరువాత ఏడాది కూడా అదే జీవోతో వడ్డీ రాయితీని కొనసాగించింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సహకార రాయితీలకు గ్రహణం పట్టుకుంది. రాయితీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసి రైతులను నడిసంద్రంలో ముంచేసింది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో మెజార్టీ సహకార సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వడ్డీ రాయితీలను తను సొంత నిధులతో అమలు చేస్తూ వస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వం ఆ మేరకు రాయితీ సొమ్ము జమచేయడం సా«ధారణంగా జరిగేదే. బాబు గద్దెనెక్కాక రాయితీలను రైతులకు సహకార సంఘాలు అమలు చేస్తున్నా సంఘాల ఖాతాల్లో రాయితీ నిధులు ప్రభుత్వం జమ చేయకపోవటంతో సంఘాలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రెండున్నర నుంచి మూడు లక్షల మంది రైతులకు సుమారు రూ.90 కోట్ల రాయితీలు అందినా... ఆ మేర నిధులను ప్రభుత్వం తిరిగి సంఘాలకు జమ చేయలేదు. గత మూడేళ్ల రాయితీల బకాయిలు రూ.90 కోట్లు స్వల్ప కాలిక రుణాలపై ఇస్తున్న జీరోపర్సంట్ వడ్డీ రాయితీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రాయితీలు 2014 నుంచి విడుదల కావడం లేదు. ఇలా రాయితీల బకాయిలు గడచిన మూడేళ్ల నుంచి జిల్లాలో రూ.75 కోట్లు, దీర్ఘ కాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రూ.15 కోట్లు కూడా సహకార సంఘాలకు జమ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జీరో పర్సంట్ వడ్డీ రాయితీ అమలు చేస్తుందా లేదా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆర్థిక సంవత్సరం శుక్రవారం (మార్చి 31) ముగిసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస స్పందన లేకపోవడంతో జీరో పర్సంట్ వడ్డీ రాయితీకి మంగళంపాడినట్టేనా అని రైతులు అనుమానపడుతున్నారు. రాయితీ విడుదల చేయకుంటే జిల్లాలో రైతులు, సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సహకార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015–16లో పంట రుణాలు రూ.వెయ్యి 62 కోట్లు మంజూరు చేశారు. రుణాలు సకాలంలో జమ చేసిన లక్షా 66 వేల మంది రైతులు, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లించిన 66 వేల మంది రైతులకు వడ్డీ రాయితీ ఇంతవరకు మంజూరు కాలేదు. 2016–17లో 54 వేల మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు రూ.305 కోట్లు పంపిణీ చేశారు. 60 వేల మంది రైతులకు రూ.180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు.అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. ఇదేమి బరితెగింపు రైతులకు రుణ మాఫీ అమలు చేయడంతో వడ్డీ రాయితీలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నీటిమూటతో రుణమాఫీ అరకొరగా చేశారు. కానీ పూర్తిగా రుణమాఫీ చేసినట్టు చెప్పుకుంటూ రాయితీలకు మంగళం పాడేందుకు తెగబడటం ఎంత వరకు సమంజసమని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వడ్డీ రాయితీ భరించి రైతులకు అమలు చేసి తిరిగి ఆ నిధుల జమ కోసం ఎదురు చూస్తున్న సంఘాలకు ప్రభుత్వం మొండి చేయిచూపితే సంఘాల భవితవ్యం ఏమిటని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లలో వడ్డీ రాయితీ సంఘాలు, రైతులకు జమకాకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవివిప్పడం లేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్దకు వెళ్లి ధైర్యంగా ఈ సమస్యను వివరించి రాయితీ నిధులు విడుదల చేయించటంలో చేతులెత్తేశారు. సీఎంపై ఒత్తిడి తెస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు సహకార అధికారులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రాయితీ ఎత్తేస్తారేమో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రం మొత్తానికి వడ్డీ లేని రుణాలకు రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.5 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రం మొత్తానికి కేటాయించిన వడ్డీ రాయితీ మన జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్లకుపోగా మరొక జిల్లాకు కూడా సరిపోదు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు కేవలం రూ.9 కోట్లు కేటాయించి చేతులుదులుపేసుకుంది. అది ఏ మూలకు వస్తుంది. భవిష్యత్‌లో వడ్డీ రాయితీని ఎత్తేసే ఎత్తుగడ ఉన్నట్టుగా కనిపిస్తోంది. – జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డైరెక్టర్, అల్లవరం. -
కుప్పంకు కృష్ణమ్మ వచ్చేనా?
-
పేరుకుపోతున్నాయ్!
సాగునీటిశాఖలో రూ. 3,105 కోట్ల బిల్లుల పెండింగ్ సాక్షి, హైదరాబాద్: సాగునీటిశాఖ పరిధిలో ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ పేరుకు పోతున్నాయి. రాష్ట్ర ఆదాయం పెరిగినా, అదే స్థాయిలో ఇతర ప్రజా ప్రాయోజిత పథకాలకు నిధుల అవసరాలు గణనీయంగా పెరగడంతో ప్రాజెక్టు పనుల బిల్లులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ఇప్పటికే శాఖ పరిధిలో రూ.మూడు వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టు ఏజెన్సీలన్నీ శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 25 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రూ. 10,538 కోట్ల మేర పనులు జరిగినట్లు నీటిపారుదల రికార్డులు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు గరిష్టంగా మరో రూ. రెండు నుంచి రూ. మూడు వేల కోట్లు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. అధిక బడ్జెట్ కేటాయించినా.. మొత్తం బడ్జెట్లో నీటిపారుదల శాఖకే అధిక బడ్జెట్ కేటాయించినా, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్లకే రూ. ఆరు వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం, ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చించడంతో నీటిపారుదలశాఖకు అనుకున్న మేర నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం జరిగిన పనుల్లోనూ రూ. 3,105.67 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ. 2,680.91 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో రూ. 1,461 కోట్లు, పాలమూరు పరిధిలో రూ. 252 కోట్లు, కల్వకుర్తి పరిధిలో రూ. 150 కోట్లు, దేవాదుల పరిధిలో రూ.160 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెరువుల పునరుద్ధరణకు సంబంధించి సైతం రూ. 395.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పటికే శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిచోట్ల బిల్లులు ఇవ్వని పక్షంలో పనులు నిలిపివేస్తామనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. -
బకాయిలు కొండంత
నత్తనడకన ఆస్తిపన్ను వసూళ్లు పట్టణాలు, పల్లెల్లో అదే తీరు పంచాయతీల్లో రూ.102 కోట్ల బకాయిలు పట్టణాల్లో రావాల్సింది రూ.51.24 కోట్లు గ్రామాలను వేధిస్తున్న సిబ్బంది కొరత కొరవడుతున్న పర్యవేక్షణ పల్లెలు, పట్టణాలకు ప్రభుత్వం వివిధ రూపాల్లో ఇచ్చే నిధులతోపాటు.. ఆస్తిపన్నులు కూడా ముఖ్యమైన ఆదాయ వనరు. ఇంత కీలకమైన పన్ను వసూళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించడంలేదు. ఫలితంగా పన్ను వసూళ్లు ఇప్పటికీ నత్తనడకగా సాగుతున్నాయి. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల్లో పన్ను డిమాండు రూ.107.76 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గ్రామ పంచాయతీల పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ మొత్తం రూ.113 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.11 కోట్లు మాత్రమే వచ్చింది. మరో నలభై రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో.. మిగిలిన బకాయిలు వసూలు కావడం అనుమానమే. దీంతో ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : చాలీచాలని సిబ్బంది, పర్యవేక్షణ లోపాలతో గ్రామ పంచాయతీల్లో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అటు ప్రభుత్వం రూపాయి కూడా విదల్చకపోవడం, ఇటు పన్నులు కూడా సరిగా వసూలు కాకపోవడంతో.. గ్రామ పంచాయతీల అభివృద్ధి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జిల్లాలో 1,063 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో సగానికి పైగా పంచాయతీలు డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా మొత్తమ్మీద గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలు రూ.113 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రూ.102 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో కొద్ది రోజులు మాత్రమే గడువుంది. ఇంత తక్కువ వ్యవధిలో అంత పెద్ద మొత్తాన్ని అధికారులు ఏవిధంగా వసూలు చేయగలరనేది ప్రశార్థకంగా మారింది. గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాల మరమ్మతులు, వీధిదీపాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, బ్లీచింగ్, ముగ్గు వంటివాటి కొనుగోలుకు సాధారణ నిధులు వినియోగించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలు సైతం డబ్బులు లేక విలవిలలాడుతూండగా, మైనర్ పంచాయతీల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. డ్రైనేజీలు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తరలించేందుకు తాత్కాలిక సిబ్బందితో పనులు చేయించేవారు. ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలోని సుమారు 400 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. కార్యదర్శుల కొరత కారణంగా సిబ్బందిపై అజమాయిషీ లేదు. దీనికితోడు గత ఏడాదిన్నర కాలంగా పూర్తిస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కూడా లేరు. దీంతో పన్ను బకాయిలపై దృష్టి సారించేవారే కరవయ్యారు. 2015 నవంబర్‌లో డీపీఓగా పని చేసిన కె.ఆనంద్ బదిలీపై వెళ్లారు. అప్పటినుంచీ రెగ్యులర్ డీపీఓను నియమించలేదు. జిల్లా సహకారి అధికారి, సెట్రాజ్ సీఈవో, జిల్లా పరిషత్ సీఈవో, అమలాపురం డీఎల్పీవోలు ఇ¯ŒSచార్్జ డీపీవోలుగా పని చేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీలో పని చేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ కుమార్ ఇ¯ŒSచార్జ్ డీపీఓగా పని చేస్తున్నారు. బిల్లు కలెక్టర్‌తో సమావేశాలు లేవు గతంలో పన్ను వసూళ్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్లు కలెక్టర్లతో డీపీఓ దాదాపు ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర బిల్లు కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పన్నులు వసూలు చేయకుంటే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ డీపీఓ లేకపోవడంతో సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో గ్రామ పంచాయతీల్లో భారీగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. పట్టణాల్లో నత్తనడకే మండపేట : జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్థిక సం వత్సరం ముగిసేనాటికి నూరు శాతం వసూళ్లు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకూ 52 శాతం మాత్రమే వసూలయ్యాయి. 77.2 శాతంతో తుని మున్సిపాలిటీ ముందంజలో ఉండగా, 41.4 శాతంతో రామచంద్రపురం చివరి స్థానంలో ఉంది. మరో 40 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. నిధుల విడుదలకు నూరు శాతం పన్నుల వసూళ్లను కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కాకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది పట్టణ ప్రగతిపై ప్రభావం చూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతోపాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో 2,35,685 ప్రైవేటు భవనాలున్నాయి. వీటిద్వారా ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ మొత్తం రూ.107.76 కోట్లుగా ఉంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.56.52 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇది సుమారు 52 శాతంగా ఉంది. 77.2 శాతంతో తుని మున్సిపాల్టీ ముందంజలో ఉంది. మండపేట మున్సిపాల్టీలో 74.7, కాకినాడ నగర పాలక సంస్థలో 58, రాజమహేంద్రవరంలో 55, అమలాపురంలో 58.7, పెద్దాపురంలో 65.6, సామర్లకోటలో 62.5, పిఠాపురంలో 43.6, రామచంద్రపురంలో 41.4 శాతం చొప్పున పన్నులు వసూలయ్యాయి. గొల్లప్రోలు నగర పంచాయతీలో 75.7, ఏలేశ్వరంలో 73.1, ముమ్మిడివరంలో 59.4 శాతం మేర పన్నులు వసూలయ్యాయి. మొత్తం పన్ను డిమాండులో ఇంకా రూ.51.24 కోట్లు వసూలు కావాల్సి ఉంది. నూరు శాతం వసూలు జరిగేనా? 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థలు నూరు శాతం పన్నులు వసూలు చేయడం తప్పనిసరి. పన్నుల వసూలు ప్రాతిపదికనే నిధుల కేటాయింపు ఉంటుందని ఇప్పటికే స్థానిక సంస్థలకు ఆదేశాలున్నాయి. ఈ మేరకు పన్ను వసూళ్లపై ఉన్నత స్థాయి నుంచి నిరంతరం సమీక్ష జరుగుతోంది. దాదాపు మరో 40 రోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగియనుండగా.. పలు స్థానిక సంస్థల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల నుంచి నూరు శాతం వసూలు గగనమేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి పనులపై పడనుంది. -
పైసలేవీ సారూ!
కందులు అమ్మిన రైతులకు అందని సొమ్ము ►48 గంటల్లో బ్యాంకులో జమ చేస్తామన్న ప్రభుత్వం ►వారం పదిరోజులైనా దిక్కులేని వైనం ►ఇంకా రూ.152 కోట్లు పెండింగ్.. అటు కొనుగోళ్లూ తక్కువ ►పండింది 5 లక్షల టన్నులు.. ప్రభుత్వం కొన్నది 65 వేల టన్నులు ►విధిలేక దళారులకే తెగనమ్ముకుంటున్న రైతాంగం ►క్వింటాల్‌కు రూ. 800 నష్టం.. ఆందోళనలో అన్నదాత హైదరాబాద్ రాష్ట్రంలో కంది రైతుకు కష్టకాలం వచ్చింది. సరిగా వర్షాలు కురవక ఇప్పటికే పంట దిగుబడి తగ్గిపోగా.. వచ్చిన పంటకైనా సకాలంలో డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. కందులను కొన్న ప్రభుత్వ సంస్థలు వారం పదిరోజులైనా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు తక్షణావసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంస్థలకు అమ్మితే వెంటనే సొమ్ము చేతికందక.. మద్దతు ధరకన్నా తక్కువకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాల్ రూ.800 వరకు నష్టపోతున్నట్లు అంచనా. కేంద్ర సంస్థలు సకాలంలో సొమ్ము విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇవ్వకపోవడం వల్లే సకాలంలో సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ప్రచారం ఘనం.. చేయూత శూన్యం ‘పత్తి వద్దు.. సోయా, కంది పంటలే ముద్దు’అంటూ గతేడాది ప్రభుత్వం చేసిన ప్రచారానికి చాలా మంది రైతులు ఆకర్షితులయ్యారు. ధర కూడా ఎక్కువగా ఉండడంతో 2016 ఖరీఫ్‌లో 10.3 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఇది సాధారణం కంటే 4 లక్షల ఎకరాలు అదనం కావడం గమనార్హం. దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధర పడిపోయింది. గతేడాది కంది ధర మార్కెట్లో క్వింటాల్‌కు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4,200 వరకే పలికింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ. 5,050 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. కేంద్ర సంస్థలైన నాఫెడ్, ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా 95 వేల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 5 లక్షల టన్నుల వరకు కంది దిగుబడి వస్తుందని అంచనా. కానీ చాలా తక్కువగా 95 వేల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపైనే విమర్శలు వచ్చాయి. చివరికి నిర్ణయించిన స్థాయిలోనూ కొనుగోళ్లు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలన్నీ కలసి ఇప్పటివరకు 65,538 మంది రైతుల నుంచి 65,723 టన్నుల కందులే కొనుగోలు చేశాయి. ఇందుకోసం రైతులకు రూ.341 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ రూ.189 కోట్లే చెల్లించారు. మిగతా రూ.152 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలి. కానీ వారం పది రోజులైనా చెల్లించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్‌ఫెడ్ కోరగా.. రూ.30 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కూడా విడుదల కాకపోవడంతో రైతులకు సొమ్ము చెల్లింపు ఆలస్యమవుతోందని అంటున్నారు. దళారులే దిక్కయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతులు 2.5 లక్షల టన్నుల కందిని విక్రయించారని అంచనా. అందులో 65 వేల టన్నులకుపైగా ప్రభుత్వ సంస్థల కేంద్రాల్లో విక్రయించగా.. మిగతా 1.85 లక్షల టన్నులు దళారులకే అమ్మినట్లు తెలుస్తోంది. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,200 ధర మాత్రమే పలికినా.. తక్షణమే సొమ్ము చేతికి వస్తుందన్న భావనతో అమ్ముకున్నారు. ఇక సెకండ్ గ్రేడ్ కందులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. అందువల్ల కూడా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పలుచోట్ల అధికారులు, దళారులు కుమ్మక్కై.. గ్రేడ్–1 కందిని గ్రేడ్–2 అంటూ తిప్పి పంపినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఆ రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న దళారులు.. అదే కందిని మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసుకుంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మార్కెట్లోకి మరింతగా కంది పంట రానుంది. దీంతో దళారులు మరింతగా తెగించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరాలకు ఇబ్బందిగా ఉంది ‘‘ఈనెల 4న మార్క్‌ఫెడ్ కేంద్రంలో నాలుగు క్వింటాళ్ల కందులు అమ్మిన. మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. పది రోజులవుతున్నా డబ్బులు జమ కాలేదు. ఇంటి అవసరాలకు ఇబ్బందిగా మారింది..’’ – రైతు, మామిడి అంజిలప్ప, పగిడ్యాల్ (యాలాల) గతేడాదితో పోలిస్తే నష్టమే ‘‘గతేడాది కంది క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల దాకా ధర పలికింది. ఈసారి ధరలను అమాంతం తగ్గించేశారు. పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్ల కందులు పండాల్సి ఉండగా.. సరిగా వర్షాల్లేక రెండు మూడు క్వింటాళ్లే పండాయి. దీంతో నష్టమే మిగులుతోంది..’’ – రైతు శివారెడ్డి, అప్పక్‌పల్లి, నారాయణపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా 60 శాతం సొమ్ము చెల్లించాం: ‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన దాంట్లో ఇప్పటివరకు 60 శాతం వరకు నగదు చెల్లించాం. గతం కంటే ఇది ఎంతో ఎక్కువ. వాస్తవంగా దళారుల వద్దే రైతులకు చెల్లించడంలో ఆలస్యమవుతోంది..’’ – ఎం.జగన్మోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ -
పెండింగ్ ప్రజాసాధికార సర్వేకు చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్ కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షా 30 వేల మంది ప్రజాసాధికార సర్వేకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేట విజయవాడ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ అంశాలపై జిల్లాలో చేపట్టిన ప్రగతి, చేపట్టిన చర్యలను జేసీ వివరించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అనిల్ చంద్ర మాట్లాడుతూ రెవెన్యూ శాఖను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటి తహసీల్దార్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకూ ప్రతిఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. కైజాలా మొబైల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. పెండింగ్ లేకుండా మీసేవ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ల ప్యానల్‌ను తయారు చేసి వెంటనే పంపాలని సూచించారు. జిల్లాకు మంజూరైన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ప్రారంభిచాలని ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సర్వే శాఖ ఏడీ నూతనకుమార్, కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లుల భారం.. రూ.2000కోట్లు
-
విద్యుత్ బిల్లుల భారం.. రూ.2000కోట్లు
- గృహ వినియోగదారులకు మినహాయింపు - పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పడనున్న భారం - పెంపు ప్రతిపాదనలను ధ్రువీకరించిన ప్రభుత్వ వర్గాలు - చార్జీలు ఏప్రిల్ నుంచే అమల్లోకి వచ్చే అవకాశం - 6,857 కోట్లు డిస్కంల ఆదాయ లోటు అంచనా - 4,500 కోట్లకు పైగా ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ - మిగతా మొత్తం వినియోగదారులపైనే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర భారం పడబోతోంది. 7 నుంచి 8 శాతం దాకా చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచే ఈ పెంపు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే గృహ వినియోగదారులను ఈ విద్యుత్ చార్జీల పెంపు నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. నివాస కేటగిరీ వినియోగదారులపై చార్జీల భారానికి సీఎం కేసీఆర్ అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీలపై పెంపు భారం పడనుంది. సబ్సిడీ పెంచితే తగ్గనున్న భారం 2017–18కుగాను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కం) వార్షిక ఆదాయ అవసరాల అంచనా రూ.31,930 కోట్లు కాగా.. ప్రస్తుత చార్జీలతో రూ.6,857 కోట్ల లోటును ఎదుర్కోనున్నాయి. ఈ లోటును అధిగమించేందుకు డిస్కంల ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి.. ప్రభుత్వం డిస్కంలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పెంచడం. రెండు.. విద్యుత్ చార్జీల పెంపు. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.4,500 కోట్ల వరకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయగా.. 2017–18లో రూ.4,500 కోట్లకు పైనే ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో మిగతా లోటును అధిగమించేందుకు అటుఇటుగా రూ.2 వేల కోట్ల మేర చార్జీల పెంపును ప్రతిపాదించనున్నామని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ధ్రువీకరించాయి. విద్యుత్ చార్జీల పెంపు వినియోగదారులకు భారంగా మారకుండా ఉండేందుకు సబ్సిడీ పెంచాలని డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 6 నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యంలో విద్యుత్ సబ్సిడీని రూ.4,500 కోట్ల నుంచి రూ.8,000 కోట్లకు పెంచాలని కోరాయి. అయితే ఈ విజ్ఞప్తిని ఆర్థిక శాఖ తోసిపుచ్చినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీని రూ.5 వేల కోట్లకు మించి కేటాయించలేమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచే పెంపు... నిబంధనల ప్రకారం డిస్కంలు ఏటా నవంబర్ చివరిలోగా... రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)తో పాటు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించాలి. కానీ 2017–18కు సంబంధించిన ఏఆర్ఆర్లను మాత్రమే గత నవంబర్ 30న డిస్కంలు ఈఆర్సీకి అందజేశాయి. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను వాయిదా వేస్తూ వచ్చాయి. సాధారణంగా డిస్కంలు సమర్పించే టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాల స్వీకరించి, బహిరంగ విచారణ జరిపి కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేసేందుకు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుంది. డిస్కంలు ఇంకా టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించకపోవడంతో వచ్చే ఏప్రిల్(ఆర్థిక సంవత్సరం ప్రారంభం) నుంచి చార్జీల పెంపు సాధ్యం కాకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఏప్రిల్ నుంచే విద్యుత్ చార్జీల పెంపు అమలు ఉంటుందని ట్రాన్స్‌కో ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుపై సీఎంతో సంప్రదింపులకు అవకాశం లభించలేదని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆయనతో చర్చించి చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని తెలిపాయి. సీఎంతో ఇంకా చర్చించ లేదు: డి.ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి మూడుసార్లు తిరస్కరించి తిప్పి పంపారని కొన్ని పత్రికల్లో వచ్చింది అవాస్తవం. ఇంతవరకు ఈ విషయంపై సీఎంతో చర్చించనే లేదు. చార్జీల పెంపు అవసరాలపై ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చించి ఈఆర్సీకి కొత్త టారిఫ్ సమర్పిస్తాం. గృహాలకు చార్జీల పెంపుపై సీఎం అయిష్టత వ్యక్తం చేయవచ్చు. ఆదాయ లోటు పూడ్చుకునేందుకు కొంత మేర చార్జీలు పెంచక తప్పదు. ఎవరిపై ఎక్కువ భారం లేకుండా చార్జీల పెంపును అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. -
అభయం.. అందించరూ..!
తొమ్మిది నెలల అభయహస్తం పింఛన్లు విడుదల మరో మూడు నెలల పింఛన్లు పెండింగులోనే.. త్వరగా పంపిణీ చేయాలంటున్న లబ్ధిదారులు 2938 మందికి రూ.1.32 కోట్లు విడుదల మంచిర్యాల టౌన్/నెన్నెల : ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న అభయహస్తం పింఛన్లకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 2,938 మంది లబ్ధిదారులకు రూ.1.32కోట్ల నిధులు వచ్చాయి. 12 నెలల నుంచి పింఛన్లు పెండింగ్‌లో ఉండగా.. సర్కారు ఇటీవలే తొమ్మిది నెలలకు విడుదల చేసింది. మరో మూడు నెలల పింఛన్లు పెండింగ్‌లో పెట్టింది. విడుదలైన పింఛన్లు సైతం పంపిణీ చేయడంతో అధికారులు జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అధికారులను అడిగితే.. ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి అరవై ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్ అందజేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గలవారు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చెల్లించాలి. అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా చెల్లించి, 60 ఏళ్లు పూర్తయిన మహిళలకు ఒక్కొక్కరికి ప్రతినెల రూ.500 నుంచి రూ.2,200 వరకు వారి వయస్సును బట్టి బీమా కంపెనీ ద్వారా చెల్లించేటట్లు పథకం రూపకల్పన చేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం పింఛన్లకు నిధులు సరిగ్గా ఇవ్వలేదు. 2016 జనవరి నుంచి నిధులు రాని కారణంగా పంపిణీ పింఛన్లు చేయలేకపోయారు. వృద్ధులు మండల కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి వేసారిపోయారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొమ్మిది నెలల అభయహస్తం పింఛన్లు ప్రభుత్వం విడుదల చేయగా, మరో మూడు నెలల పింఛన్లను పెండింగులో ఉంచింది. ఎట్టకేలకు ప్రభుత్వం తొమ్మిది నెలలకు నిధులను మంజూరు చేయడంతో పండుటాకుల మొఖాల్లో సంతోషం కనిపిస్తోంది. ఇదివరకున్న లబ్ధిదారుల్లో కొందరికి ఆసరా పింఛన్లు వస్తుండగా, మరికొంత మంది చనిపోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని డీఆర్డీఏ అధికారి వెంకట్ పేర్కొన్నారు. ఎంపీడీవోల బ్యాంకు ఖాతాల్లోకి.. అభయహస్తం పింఛను నిధులను డీఆర్డీఏ అధికారులు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెపుతున్నారు. గడిచిన ఏడాది జనవరి నెల నుంచి సెప్టెంబర్ వరకు అభయహస్తం పింఛన్లు ఇస్తామని పేర్కొంటున్నారు. ఒక్కక్కరికి రూ.500 చొప్పున తొమ్మిది నెలలకు రూ.4,500 ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ అధికారి చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. -
తడారని కళ్లు
ఆదుకోని ‘ఆపద్బంధు’ సీఎం సహాయ నిధి కరువు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో 31 దరఖాస్తులు ఆదిలాబాద్ అర్బన్ : కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఆపద్బంధు పథకం బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవలేకపోతోంది. ఆపత్కాలంలోనూ వారిని ఆదుకోలేకపోతోంది. అయిన వారిని కోల్పోయి సహాయం కోసం కుటుంబ సభ్యులు చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నా వారికి నిరాశే మిగులుతోంది. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందడం లేదు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆపద్బంధు పథకం ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన ప్రభుత్వాలు పథకాన్ని పట్టించుకోకపోవడంతో బాధితులకు సాయం అందడం లేదు. ఫలితంగా లబ్ధిదారులకు చెల్లించే ఆర్థికసాయం నుంచి గతంలోనే ప్రభుత్వం వైదొలిగి.. ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించడం పథకంపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఏటా అక్టోబర్ 2నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ ఒకటి వరకు బీమా చెల్లింపు గడువు విధించి బీమా సంస్థల ద్వారా చెల్లింపులు చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఆర్థిక సాయం ఆలస్యమవుతోందని, ఇప్పటికైనా ప్రభుత్వమే నేరుగా అపద్భందు పథకం కింద ఆర్థికసాయం అందించాలని బాధిత కుటుంబాలవారు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని 18నుంచి 69ఏళ్లలోపు పోషకుడు, కుటుంబ పెద్ద చనిపోయినట్లయితే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందవచ్చు. విద్యుత్‌షాక్, ప్రమాదం, పాముకాటు, ప్రమాదవశాత్తు నీళ్లలో మునగడం, అగ్ని ప్రమాదం తదితర కారణాలతో మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా సాయం పొందవచ్చు. రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉండి ఆమ్ ఆద్మీ బీమా పథకం, అభయహస్తంలో బీమా పొందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలులేదు. కాగా.. ఏడాదిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 223 దరఖాస్తులు ఈ పథకం అధికారులకు అందాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపిన అధికారులు అందులోంచి 192 మందిని అర్హులుగా తేల్చి మంజూరు చేశారు. మిగతా 31 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బాధితులు దరఖాస్తుతో పాటు సరైనా వివరాలు అందించకపోవడం, దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం, పత్రాలు సరిగ్గా లేకపోవడం, డెత్ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉండడంతో దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. సరైనా వివరాలు అందిస్తే ఆర్థికసాయం మంజూరుకు ఏ ఆటంకాలు ఉండవని, వివరాలు సరిగ్గా లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పథకంపై అవగాహన శూన్యం ఆపద్బంధు పథకం కింద దరఖాస్తు చేసుకుని ఆర్థికసాయం పొందేందుకు ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించడంలేదనే ఆరోపణలున్నాయి. కొందరు దీనిపై అవగాహన లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ప్రజల్లో దీనిపై ప్రచారం లేకపోవడంతో పథకం అమలుకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. ఏయే వివరాలు అందించాలో.. తెలియక బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. దరఖాస్తు చేసేందుకు దూరప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పథకంపై ప్రజల్లో అవగాహన... బీమా అందించేందుకు అధికారులు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వాయిదాతో పందేనికి పండుగేనా?
సుప్రీం ఆదేశాలతో పందెగాళ్లకు ఉపశమనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి కోడి పందేల విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో మళ్లీ కోళ్లను దువ్వుతున్నారు. గత వారం ఉమ్మిడి హైకోర్లు ఇచ్చిన ఆంక్షలతో సందిగ్ధంలో పడిన పందెం సందడి సుప్రీం ఆదేశాలతో ఊరట చెందుతున్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని నాలుగో అంశంపై స్టే ఇస్తూనే తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో వారం రోజుల్లో వచ్చే సంక్రాంతి గడిచిపోతుందని, ఈలోగా పందేల దందా పూర్తి చేసుకోవచ్చునని పందెంగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవటంపై సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని పందెగాళ్లు స్వాగతిస్తున్నారు. అయితే సుప్రీం జారీ చేసిన రెండు ఆదేశాలతో జిల్లాలో కోడి పందేలను పూర్తి స్థాయిలో అదుపు చేయటంపై పోలీసులకు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోళ్లను స్వాధీనం చేసుకోవద్దంటే పరోక్షంగా కోడి పందేలకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంప్రదాయ ఒరవడిలో జరిగే కోడి పందేలను అడ్డుకోవటం సరికాదని తన పిటిష¯ŒSలో విన్నవించారు. సుప్రీం కూడా ఈ కేసును సంప్రదాయ కోణంలో విచారించి ఆయుధాల కోణంలో అభ్యంతరం చెప్పింది. ఆయుధాల పరంగా అభ్యంతరం, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దన్న ఆదేశం, విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయటంతో జిల్లాలోని పందెగాళ్లు ఆ ఉత్తర్వులను తమకు సానుకూలంగా తీసుకుంటుంటే.. జిల్లా పోలీసులు సున్నితంగా ఉన్న ఆ మూడు అంశాలతో పందేలను ఎంత వరకు నిలువరించగలమ ని తర్జన భర్జన పడుతున్నారు. ఇంతటి ఉత్కంఠలో పందెగాళ్లు, పోలీసులు ఇద్దరిలో ఎవరిది విజయమో సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. ప్రతి సంక్రాంతి పండుగలకు జిల్లాలో కోడి పందేలతో రూ.30 కోట్లు వరకూ చేతులు మారుతున్న క్రమంలో ఈసారి హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాలు, ఉత్తర్వులతో çపండుగ పందేలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. -
డిగ్రీ పరీక్షలు బాయ్‌కాట్..
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. అమలు మాత్రం జరగలేదని తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం తీవ్ర నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 నుంచి అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలను బాయ్‌కాట్ చేస్తున్నాన్నట్లు ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు తమకు అందలేదని డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం వెల్లడించింది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
రత్నగిరిపై రాజకీయనీడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయ నాయకులు అన్నంత పనీ చేశారు. దైవసన్నిధిలో రాజకీయాలు చొప్పించి సత్యదేవుని ప్రతిష్టను బజారున పడేశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే వ్రతాలు నిర్వహించే పుణ్యక్షేత్రం ఒక్క అన్నవరం సత్యదేవుని సన్నిధి మాత్రమే. అమెరికాలో కూడా వ్రతాలు జరిపించుకున్న ఖ్యాతి కూడా ఆయనకే సొంతం. అటువంటి దేవుని ప్రతిష్టను అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజకీయ స్వార్థం కోసం మసకబార్చారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబరు 30న ’అన్నవరానికి ధర్మకర్తల మండలి నియామకం’పై వార్తను ’సాక్షి’ ప్రచురించింది. పాలక మండలి నియామకం జరిగినా నేతల నిర్వాకంతో అది చాలా కాలం పెండింగ్‌లో పడింది. ఎట్టకేలకు ఏడాది తరువాత పాలకవర్గం ఏర్పాటవుతుందనుకుంటుండగా అధికార పార్టీ నేతల నిర్వాకంతో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు విడుదల చేసిన జీఓ రద్దయింది. ట్రస్టుబోర్డులో సభ్యుల ప్రాతినిధ్యంపై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ తోట నరసింహంల మధ్య వివాదం తలెత్తింది. ఎంపీ తోట ప్రతిపాదించిన వ్యక్తిని పక్కనబెట్టి జ్యోతుల ప్రతిపాదించిన వారికి స్థానం కల్పించడం, తుని నియోజకవర్గం నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం ఇవ్వడం, బీజేపీకి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా జాబితా సీఎంకు వెళ్లడంతో ఆ అంశం టీడీపీలో రచ్చకెక్కింది. ఇదే విషయాన్ని ’సాక్షి’ గత నెల 26న ’సత్తెన్నకు తప్పని ’దేశం’ సతాయింపు’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఆశావహులకు నిరాశే.. ట్రస్టుబోర్డులో సభ్యత్వం ద్వారా పవిత్రమైన సత్యదేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశం లభిస్తుందని చాలా మంది ఆశించారు. ఆ క్రమంలోనే 13 సభ్యత్వాలకు 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అందులో కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తడంతో రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాౖటెన ట్రస్టుబోర్డు రద్దుకు దారితీసింది.కనీసం ఈ సారి విడుదలచేసే నోటిఫికేష¯ŒSలో అయినా వివాదాలకు తావులేకుండా నేతలు తమ స్వార్థాన్ని వీడాలని, నియామకంలో పారదర్శకతను పాటించి సత్యదేవుని ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
సీఆర్పీల ‘సదరం’ డబ్బులేవి?
పెండింగ్‌లో రూ. 2 లక్షలు రెండేళ్లుగా ఇదే పరిస్థితి కలెక్టర్ ఆదేశించినా కదలని ఫైల్ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రభుత్వం అందజేసే ఆస రా పెన్షన్సలో అర్హులైన వికలాంగులను ఎంపిక చేసేం దుకు వైకల్యశాతం నిర్ధారణ కోసం ప్రభుత్వం నిర్వహిం చిన సదరం క్యాంపుల్లో పనిచేసిన సీఆర్పీలకు చెల్లించాల్సిన చెల్లింపు విషయంలో డీఆర్డీఏ అధికారులు రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. పనిచేసిన వారికి రోజు వారి లెక్కన చెల్లింపులు చేస్తామని చెప్పిన అధికారులు 2015 డిసెం బర్ నుంచి ఇదిగో.. అదిగో... బడ్జెట్ రాలేదు... రాగానే ఇస్తాం.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటి వరకు నాలుగు సార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా కలెక్టర్ అమ్రపాలికి ఇటీవల గ్రీవెన్సలో కూడా ఫిర్యాదు చేశారు. డబ్బులడిగితే క్రిమినల్ కేసులా... తమకు రావాల్సిన డబ్బుల కోసం తిరుగుతున్న బాధితులు పదేపదే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డీఆర్డీఏ అధికారులు బెదిరింపులకు పాల్పడతున్నారని సీఆర్పీలు తెలిపారు. ఇంకోసారి డబ్బులకు వస్తే మీపై క్రిమినల్ కేసులు పెడతామని, అధికారులు తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాజు, శ్రీనివాస్‌లు తెలిపారు. మరోసారి ఫిర్యాదు.. తాజాగా బాధితులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్డీఏ అధికారులు మరో కొత్తవిషయం తెరమీదకు తీసుకువచ్చారు. పనిచేసిన వారికి ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. దీంతో సాక్షాధారాలు తమ ముందు పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు ముట్టినట్లరుుతే మరోసారి ఫిర్యాదు చేయవద్దని సీఆర్పీలను హెచ్చరించారు. డబ్బులు ఇచ్చిన ఆధారాలు ఇస్తామని అధికారులు చెబుతున్న ప్రతిసారి పరస్పర విరుద్ద సమాచారం ఇవ్వడం ఏమిటని బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అవసరం అరుుతే ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిగి తమకు న్యాయం చేయాలని సీఆర్పీలు కోరుతున్నారు. కాగా ఈ విషయంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు. రూ. 2 లక్షలు పెండింగ్.. సదరం క్యాంపులో సుమారు 64 మంది సీఆర్పీలు పనిచేశారు. రెండు క్యాంపుల్లో వికలాంగుల సంఘాలు, మహిళా సంఘాలు, సీఆర్పీలు పాల్గొన్నారు. అరుుతే వీరికి సెర్ఫ్ నుంచి నిధులు రాలేదని అధికారులు చెల్లింపులు చేయలేదు. దీంతో బాధితులు కలెక్టర్‌కు గ్రీవెన్సలో పదేపదే ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ డీఆర్డీఏ పీఈ వెంకటేశ్వర్‌రెడ్డిని తక్షణమే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. అరుుతే ఆ సమయంలో ఉన్న ఓ అధికారికి డబ్బులు ఇచ్చామని అతనే చెల్లింపులు చేయాల్సి ఉందని డీఆర్డీఏ అధికారులు కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. పెండింగ్‌లో ఉండగా రిలీవ్ చేశారా? లక్షల్లో డబ్బుల వ్యవహారం పెండింగ్‌లో ఉండగా సదరు అధికారిని ఎలా రిలీవ్ చేశారన్నది అధికారులకే తెలియాలి. ఏ అధికారి అరుునా బదిలీ అరుున సమయంలో లెక్కలు క్లియర్ చేసి రిలీవ్ అవుతారు. కానీ ఈ విషయంలో డీఆర్డీఏ అధికారులు చెబుతున్న కారణాలు కూడా వాస్తవానికి దగ్గరగా లేకపోవడం గమనార్హం. -
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి కె రామాంజనేయులు డిమాండ్ ఆత్మకూరు: రాయలసీమ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటిప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, సిద్ధాపురం చెరువు, తెలుగు గంగ ప్రాజెక్టులను శనివారం సీపీఐ బందం పరిశీలించింది. అంతకు ముందు మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివద్ధి చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన సీమ జిల్లాలను కూడా పట్టించుకోవాలని కోరారు. 10 ఏళ్లుగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ఈ పథకం పూర్తయితే 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భారీ నీటిపారుదలశాఖ మంత్రిని ఈ నెల 3న కలిసి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకువస్తామన్నారు. స్పందించకపోతే రాయలసీమ రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు రసూల్, బాబా ఫకద్ధిన్, పద్మన్రాజు, రఘురాంమూర్తి, ఏఐఎస్ఎప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.9 కోట్లు ఇస్తేనే..
► చివర్లో వాయిదాపడ్డ టెండర్లు ► అయ్యో... రామ... కృష్ణా దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కమీషన్ల గోల జిల్లాల సరిహద్దులు చెరిపేసి టెండరింగుల్లో మావాట ఎంతో తేల్చండంటూ గిరిగీసి అవినీతి పైత్యానికి మరింత పచ్చ రంగులద్దుతున్నారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పనుల్లో 25 శాతం కమిషన్ ఇస్తేనే పనులంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుత్రరత్నం శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్‌పై దౌర్జాన్యానికి దిగిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే ఉదంతం. వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా కోట్లలో బేరం పెట్టి ఏకంగా ఆడియో టేపుల్లోనే అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ఈ జిల్లాలో అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి తమ్ముడు ఏకంగా రూ.9 కోట్లు చేతిలో పడితేనే ప్రపంచబ్యాంకు పనులంటూ హుకుం జారీ చేసి ఓ హోటల్లో పంచాయతీ పెట్టాడు. టెండరింగ్ తిప్పాడు. నాయకుల ద్వయం ఒత్తిడికి లొంగకుండా వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసేశారు. అయినా సరే వదలను బొమ్మాళీ అంటూ వెంటపడుతూనే ఉన్నారు. ఏమిటో ఈ ‘కృష్ణు’ల మాయంటూ జనం విస్తుబోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిధులు ఎక్కడివైనా... ఎవరు ఇచ్చినా మా కప్పం మాకు కట్టాల్సిందే.. అలా కడితేనే పనులు సాఫీగా చేసుకుంటారు... లేదంటే ఒక్క అడుగు పని కూడా చేయలేరు... చిన్న చిన్న కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లతో కలిసి టెండర్లు వేద్దామంటే కుదరదు. మేం చెప్పినట్టే అంతా కూర్చుని లాటరీ ద్వారా ప్యాకేజీలను కేటాయిద్దాం...ప్రపంచ బ్యాంకు నిధులు తేవడంలో మా అన్న ఎంతో కష్టపడ్డారు.. ముందు 10 శాతం కప్పం రూ.9 కోట్లు మా చేతిలో పెట్టండి.. అదంతా అయ్యాకే టెండర్లు వేయండి... మా మాట కాదని ముందుకు వెళ్లి టెండర్లు వేస్తే ఒక్క పని కూడా చేయలేరు. ఇదీ జిల్లాలో ఒక తెలుగు తమ్ముడు, కీలక మంత్రి సోదరుడు రూ.90 కోట్ల ప్రపంచ బ్యాంక్ పనులపై పెత్తనం కోసం చేసిన హంగామా. ఇక ఆ తొమ్మిది కోట్లు చేతిలోకొచ్చేస్తాయని ఆశగా నిరీక్షిస్తున్న సమయంలో అనుకోకుండా ‘డామిట్ కథ అడ్డం తిరిగింద’నే రీతిలో శుక్రవారం జరగాల్సిన ఆన్లైన్ టెండర్లు అక్టోబరు 10వ తేదీకి వాయిదా పడ్డాయి. ఇదీ టూకీగా జిల్లాలో హుదూద్ తుఫాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రూ.92 కోట్ల నిధుల పరిస్థితి. హుదూద్ తుపాన్‌తో దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రూ.92 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధుల్లో సింహభాగం మూడొంతులు రూ.60 కోట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునికి దక్కాయి. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురానికి రూ.20 కోట్లు, టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి రూ.12 కోట్లు కేటాయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనుల పర్యవేక్షణ బాధ్యత రోడ్లు, భవనాలశాఖది. ఈ పనులకు ఆర్అండ్బి ఇఎన్సీ ఆహ్వానించిన టెండర్లు తుది గడువు శుక్రవారం. టెండర్లు ప్రక్రియను తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న కీలక మంత్రికి వరుసకు సోదరుడైన తమ్ముడి వ్యూహం బెడిసికొట్టింది. పంచాయతీ ఇలా... తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్‌కె పాలెం, ఎఫ్‌కె పాలెం–దివిలి రోడ్లు, వంతెనల ఆధునీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఐదు ప్యాకేజీలుగా ఉన్న ఈ పనుల కోసం ఇరుగు, పొరుగు జిల్లాల కాంట్రాక్టర్లు సిద్ధపడ్డారు. ఆ పనులకు టెండర్లు గడువు శుక్రవారం మ«ధ్యాహ్నం. పనులకు టెండర్లు ఆన్లైన్లో ఆహ్వానించారు. అయినా తెలుగుతమ్ముడు బరితెగించి రాజమహేంద్రవరంలోని హోటల్లో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.92 కోట్లు తీసుకురావడంలో తన సోదరుని కష్టం ఎంతో ఉందని కాంట్రాక్టర్ల ముందుంచారు. కాంట్రాక్ట్ కావాలంటే ముందు 10 శాతం కప్పం రూ.9 కోట్లు కట్టాల్సిందేనని అక్కడ పంచాయతీ పెట్టారు. ఇందుకు తునిలోని మూడు ప్యాకేజీలకు టెండర్లలో 15శాతం అదనంగా కోడ్చేసుకునే వెసులుబాటు కూడా తమ్ముడు కల్పించాడు. విశాఖపట్నం నుంచి ఇద్దరు, పశ్చిమగోదావరి నుంచి ఒకరు, రావులపాలెం నుంచి ఇద్దరు కాంట్రాక్టర్లు ఆ భేటీకి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి వరుసకు సోదరుడైన తెలుగు తమ్ముడు చక్రం తిప్పి లాటరీ వేయించేశారు. 10 శాతం ఇవ్వడం సాధ్యంకాదని, ప్రపంచ బ్యాంకు పనులు నాణ్యతలో రాజీ కుదరదన్న కాంట్రాక్టర్లు ఐదు శాతానికి ఒకే అన్నారు. మెజార్టీ నిధులు తునిలో ఉన్నాయి, 10 శాతం ఇవ్వకుంటే పనులు ఎలా చేస్తారో చూస్తామని తమదైన శైలిలో బెదిరింపులకు కూడా దిగారని తెలిసింది. మాట కాదని టెండర్లు వేసేందుకు సిద్ధమైన పలువురికి ఆ తమ్ముడి అనుచరగణం రెండు రోజులుగా ఫోన్లో బెదిరింపులతో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు తెలిసి వాయిదా సాంకేతికంగా టెండర్ల నిబంధనలు అధిగమించడం కష్టమైన పని అని కొందరు, 10 శాతం కప్పం కట్టాలనే బెదిరింపుల విషయం ఆర్అండ్బి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శుక్రవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో టెండర్లు వాయిదా వేస్తున్నట్టు జిల్లాకు సమాచారం వచ్చింది. ఫలితంగా రెండు, మూడు రోజులుగా తమ్ముడు వేసిన పక్కా వ్యూహం కాస్తా బెడిసికొట్టింది. దీంతో అనుకున్నదొకటి అయినదొకటిగా మారి డామిట్ కథ అడ్డం తిరగడంతో అక్టోబరు 10 వరకు ఏమి చేస్తారో చూడాలి. -
‘ఉపాధి’ వేతనాలు నొక్కేశారు?
వెల్గటూరు : గ్రామీణ పేదలకు ఉపాధి కాల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులు అధికారులు నిర్లక్ష్యంతో దుర్వినియోగం అవుతున్నాయి. కూలీలు శ్రమదోపిడీకి గురువుతున్నారు. మండలంలోని పైడిపెల్లి గ్రామానికి చెందిన సుమారు 500 మంది కూలీలు గ్రామంలో ఉపాధి పనులు చేశారు. చేసిన పనులను ఎఫ్ఏ రికార్డు చేసి ఈజీఎస్ కార్యాలయానికి పంపించారు. ఈమేరకు కూలీలకు వేతనాలు విడుదలయ్యాయి. కానీ వీటిని ఫినో సిబ్బంది కూలీలకు పంపిణీ చేయలేదు. దీంతో రూ.2.93 లక్షల వేతనాలు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కంచే చేను మేసినట్లుగా వేతనాల ఇచ్చే∙సీఎస్పీలే వాటిని నొక్కేశారని కూలీలు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌లోని వేతనాల విషయంలో చర్యలు తీసుకోవాలస్సిన ఎంపీడీవో మీనమేషాలు లెక్కవేస్తున్నారు. నిధులు దుర్వినియోగం పైడిపల్లి గ్రామంలో ఈజీఎస్‌కూలీల వేతనాలు రూ.2.93 లక్షలు సీఎస్పీలే నొక్కేశారని ప్రజావేదికలో Ðð ల్లడయింది. వారం రోజుల్లో కూలీల పెండింగ్ వేతనాలు క్లీయర్ చేస్తానని ఏపీడీ అంజయ్యకు సీఎస్పీఅంజయ్య హామీ ఇచ్చారు. ఆ మేరకు కూలీల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించకుండా 1.12 లక్షలు మాత్రమే చెల్లింపు చేశారు. మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫినో జిల్లా కోఆర్డినేటర్ వెకటేశ్వర్లు శనివారం సమస్య పరిష్కరిస్తారని ఈజీఎస్ ఏపీవో చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఇంకెప్పుడో..?
అటకెక్కిన కలెక్టరేట్ నూతన నిర్మాణం ఎక్కడ నిర్మించాలన్నదే సమస్య నగరం బయటనే నిర్మించాలన్న సీఎం..? మురుగుతున్న రూ.35 కోట్ల నిధులు అనంతపురం అర్బన్ : జిల్లా కలెక్టరేట్ నిర్మాణం అటకెక్కింది. జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం కోసం రూ.35 కోట్లు మంజూరై ఏడాది దాటింది. అయితే నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా కలెక్టరేట్ నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతోనే ప్రక్రియ ముందుకు సాగడంలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. భవన నిర్మాణానికి సంబంధించి టెండర్ పిలిచి నెలలు గడుస్తున్నా ఇంకా స్థలం వ్యవహారం మాత్రం తేలడం లేదు. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు బదులుగా కొత్తగా కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం ఉన్న భవనం పక్కనే నూతన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు రూ.27 కోట్లతో టెండర్ పిలిచారు. తెరపైకి స్థల మార్పు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న స్థలం, దాని పక్కన ఉన్న ఓటీఆర్కి చెందిన కొంత స్థలం, కార్యాలయం వెనుకభాగంలో ఉన్న రాజేంద్ర మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన కొద్ది స్థలాన్ని తీసుకుని కలెక్టరేట్ నూతన భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్అండ్బీ శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఇంతతో స్థల మార్పు అంశం తెరపైకి వచ్చింది. కొత్తగా నిర్మించనున్న కలెక్టర్ కార్యాలయం నగరంలో కాకుండా నగరానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఏదేని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ పక్కనే కొత్త భవనం నిర్మించాలనే ప్రతిపాదనలకు బ్రేక్ పడిందని సమాచారం. ఫైనలైజ్ కాని టెండర్ కలెక్టరేట్ నూతన భవన నిర్మాణాని కి రూ.35 కోట్లు మంజురై తే ఇందులో రూ.27 కోట్లతో ఆర్అండ్బీ శాఖ టెండర్లు పిలిచింది. ఇంత వరకు సాఫీగానే సాగింది. అయితే నెలలు గడుస్తున్నా టెండర్ ఫైనలైజ్ చేయలేదు. స్థల మార్పు వ్యవహారం కొలిక్కిరాని కారణంగానే ఈ ప్రక్రియ నిలిపేశారని సమాచారం. టెండర్ అవార్డు కాలేదు : శ్రీనివాసమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్అండ్బీ కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి రూ.27 కోట్లతో టెండర్లు పిలిచాము. అ యితే టెండర్ని ఇంకా అవార్డు చేయలేదు. ఫైనలైజ్ అయిన తరువాత పనులు ప్రనులు ప్రా రంభమవుతాయి. -
పెండింగ్ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిచేస్తాం
∙ ఏపీ జెన్కో హైడల్ విభాగం డైరెక్టర్ నాగేశ్వరరావు ∙వేటమామిడి చిన్నతరహా విద్యుత్ కేంద్రం పరిశీలన అడ్డతీగల : అర్ధంతరంగా నిలిచిపోయిన పింజరికొండ, మిట్లపాలెం జలవిద్యుత్ కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో కృత నిశ్చయంతో ఉన్నాయని ఏపీ జెన్కో(హైడల్ ప్రాజెక్ట్స్) డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు వెల్లడించారు. పలువురు జెన్కో, ట్రిప్కో అధికారులతో కలిసి ఆయన మండలంలోని వేటమామిడి చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ రెండు ప్రాజెక్టుల వద్ద మిగిలి ఉన్న సివిల్ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రిప్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రత్నబాబు, పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొలగాని వీఎస్ఎన్ మూర్తిని ఆదేశించారు. గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధి కోసమే ప్రభుత్వం చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాల స్థాపనకు పూనుకుందని ఈ సందర్భంగా నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతానికి వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. ఈ కేంద్రాల్లోని విద్యుత్ విక్రయం ద్వారా వచ్చే లాభాల్లో 50 శాతం సొమ్మును ప్రాజెక్ట్ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి, మిగతా 50 శాతం మొత్తాన్ని ఐటీడీఏ ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి ఖర్చుచేస్తారని వీఎస్ఎన్ మూర్తిని వెల్లడించారు. జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికయ్యే మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 45 శాతం నాబార్డు, మిగతా ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని తెలిపారు. వేటమామిడి కేంద్రానికి వచ్చిన అధికారులను ప్రాజెక్ట్ కమిటీ బాధ్యురాలు బలువు సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు స్వాగతం పలికి, పలు సమస్యలను వివరించారు. ట్రిప్కో సూపరింటెండింగ్ ఇంజనీర్లు స్వామినాయుడు, రంగనాథన్ తదితర అధికారులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
సంక్షేమ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
వీడియో కాన్ఫెరెన్స్‌లో తహసీల్దార్లను ఆదేశించిన ఇన్చార్జ్ కలెక్టర్ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్: షాదీముబారక్,కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ అసైన్డ్ భూములకు సంబంధించి తహసీల్దార్లు సమర్పించిన సమచారం మేరకు భౌతికంగా క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, సర్వేయర్లు, డీటీలు, ఆర్ఐలు తనిఖీ చేయాలన్నారు. సాదాబైనామాలకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినా నోటీసులు జనరేట్ చేయలేదని వెంటనే వాటి గురించి చర్యలు తీసుకోవాలన్నారు. భూదాన్ భూములకు సంబంధించి పోజిషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ వివరాలకు సంబంధించి సబ్‌రిజిస్టర్, తహసీల్దార్లు ఏకికత మ్యాన్వల్ మార్పుల చేర్పులకే వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి రెవెన్యూ సేవలకు సంబంధించిన మ్యూటేషన్‌ను రేపు సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు.రుణ అర్హత కార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను అందించడానికి అర్హులైన వారికి కార్డులు జారీ చేసేందుకు గాను తహసీల్దార్లకు ఇప్పటికే సాంకేతిక డేటాను పంపడం జరిగిందని, అందుకు అనుగుణంగా విచారణ చేసి మీసేవ ద్వారా అందిన దరఖాస్తులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా పంపిణి చేస్తున్న రేషన్ అక్రమ రవాణా జరగకుండా ప్రతి రూట్‌కి ఒక రూట్ ఆఫీసర్ తప్పక ఉండాలని, రేషన్ దుకాణదారులతో సమావేశం నిర్వహించి అక్రమర వాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోరైటప్283:మాట్లాడుతున్న ఇంచార్జి కలెక్టర్ దివ్య -
కలెక్టర్ సీరియస్
– ఉదయం 8 గంటలకే పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్న కలెక్టర్ – ఎవరూ లేకపోవడంతో తీవ్ర అసంతప్తి – కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం శ్రీశైలం : కృష్ణా పుష్కరాల పనులు నత్తనడకన సాగుతుండటంతో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం జేఈఓ హరినాథ్‌రెడ్డి, తహసీల్దార్ విజయుడుతో కలిసి ఆయన గురువారం ఉదయం 8 గంటలకు రోప్‌వే ద్వారా పాతాళగంగ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఏమాత్రం పనులు జరగక పోవడంతో అధికారులు, కాంట్రాక్టర్లను పిలిచి సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. ఇలా వ్యవహరిస్తే ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుష్కర పనులకు కేటాయించిన కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తుండడంతో అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించాల్సిందిగా సూచించారు. అసలు కాంట్రాక్టర్‌ను పిలిపించినా రాకపోవడంతో సదరు కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాన ని హెచ్చరించారు. రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల పనులను పూర్తి చేస్తున్నారని అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులను అడుగగా, వారు తెల్ల మోహం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి లింగాలగట్టు వద్ద జరుగుతున్న ఘాట్ల నిర్మాణపు పనులను పరిశీలించారు. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో కలెక్టర్‌కే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అనంతరం టెలీకాన్ఫరెన్స్ ఉండడంతో తహసీల్దార్ కార్యాలయం చేరుకుని అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలానికి వస్తామని పనులు వేగవంతం చేసి డైలీ రిపోర్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
పన్ను ఎగవేతదారుల ఫోన్లు ఇకపై ట్యాప్!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల ఆట కట్టించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త కొత్త దారులు వెతుకుతోంది. తరచూ విదేశాలకు వెళ్లే వారి ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి పెట్టే యోచనలో ఉన్న శాఖ అధికారులు.. తాజాగా వ్యక్తుల ఫోన్లను ట్యాంపింగ్ చేసే యోచనను హోం మంత్రిత్వశాఖ అధికారుల ముందుంచారు. ఫోన్ ను ట్యాప్ చేస్తే కాల్ రికార్డుల ఆధారాలు దొరుకాతాయని, అప్పుడు నిందితులు తప్పించుకోలేరని ఓ సీనియర్ ఐటీ అధికారి అన్నారు. నల్లధనాన్ని అంతమొందించడం తమ లక్ష్యమని ఎన్డీయే సర్కారు ప్రకటించడంతో ఈ ఆలోచనకు ఆమోదముద్ర పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014-2015, 2015-2016 మధ్య కాలంలో ఐటీ దాడులు నిర్వహించి సరిగ్గా లెక్కలు లేనివారిని ఈ జూన్ 1 తర్వాత ఆదాయమార్గాలను చూపాలని ఆదేశించింది. ఈ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సింగిల్ విండో విధానంలో పరిశీలించనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో 398 కేసులకు, పనామా పేపర్ల నుంచి 53 కేసులకు సంబంధించిన లీకులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ ముఖ్ ఆధియా తెలిపారు. -
‘పెండింగ్’ తీరేదెలా?
అందరికీ తెలిసిన సమస్యే అయినా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఒక ప్రధాన అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ భావోద్వేగ ప్రసంగంతో మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశాన్ని ఆదివారం ప్రారంభిస్తూ ఆయన ఒకటికి రెండుసార్లు కంటతడి పెట్టుకున్నారు. దేశంలో జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేదని, ఈ విషయంలో ఎన్నిసార్లు పాలకులకు విన్నవించుకున్నా నిరుపయోగమవుతున్నదని ఆవేదనపడ్డారు. ఏటా ఇలాంటి సమావేశాలు జరగడం, సమస్యల గురించి చర్చించడం...పాలకులు ఏవో హామీలివ్వడం షరా మామూలే. కానీ క్రియకొచ్చేసరికి ఏమీ జరగడం లేదు. జస్టిస్ ఠాకూర్ చెప్పినట్టు పది లక్షలమంది జనాభాకు 10మంది న్యాయమూర్తులుండగా ఆ సంఖ్యను 50కి పెంచాలని 1987లో లా కమిషన్ సిఫార్సుచేసింది. మూడేళ్లక్రితం ఇలాంటి సదస్సే జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్...ప్రతి పది లక్షలమందికీ 15.5మంది జడ్జీలున్నారని లెక్కలు చెప్పారు. దీన్ని పెంచాల్సి ఉన్నదని కూడా అన్నారు. అలా అన్నాక కూడా ఈ విషయంలో ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు. చూడటానికి ఈ సమస్య ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య సాగుతున్న వివాదంగా కనిపిస్తుందిగానీ ఇందువల్ల ఇబ్బందులు పడుతున్నది అసంఖ్యాకులైన పౌరులు. న్యాయం పొందడానికి వారికి గల హక్కు అను నిత్యం ఉల్లంఘనకు గురవుతోంది. న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి కేసులు అతీగతీ లేకుండా పెండింగ్ పడుతుంటే కోట్లాది కుటుంబాలు దిక్కుతోచక విలపిస్తున్నాయి. అది సివిల్ స్వభావమున్నా కేసా...క్రిమినల్ కేసా అన్న అంశంతో నిమిత్తం లేదు. ఏ కేసైనా కోర్టు గడప తొక్కితే ఏళ్ల తరబడి అనిశ్చిత స్థితి ఏర్పడుతోంది. సకాలంలో విచారణ జరిగితే పడే శిక్షాకాలానికి మించి అనేకమంది నిందితులు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కేసు ఇందుకు తాజా ఉదాహరణ. ఆయనపై ఉన్న రాజద్రోహం కేసులో కనీసం రెగ్యులర్ బెయిల్ లభించడానికే రెండున్నరేళ్లు పట్టింది. మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులని రుజువు కావడానికి అయిదేళ్ల సమయం పట్టింది. సల్మాన్‌ఖాన్ ప్రమేయం ఉన్న కేసులు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉన్నాయి. సివిల్ కేసులు కావొచ్చు...క్రిమినల్ కేసులు కావొచ్చు ఇలాంటివి కింది కోర్టుల్లో 2.70 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 38 లక్షలు, సుప్రీంకోర్టులో 60,000కుపైగా కేసులు తేల్చాల్సినవి ఉన్నాయి. ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తులుండాలనుకుంటే తక్షణం 40,000మందిని నియమించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెబుతున్నారు. ప్రస్తుతం 16,238మంది న్యాయమూర్తులుండగా, మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల సంఖ్య 21,301. ఫలితంగా న్యాయమూర్తులపై పనిభారం అపారంగా పెరుగుతోంది. ఉన్న కేసులు అలాగే ఉండగా రోజురోజుకూ కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయి. పౌరులకు త్వరితగతిన న్యాయం అందించడానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో 1,734 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేశారు. ఈ కోర్టులకయ్యే వ్యయభారాన్ని రాష్ట్రాలపైనే మోపాలని 2011లో కేంద్రం నిర్ణయించడంతో వాటిలో దాదాపు 60 శాతం మూతబడ్డాయి. వాస్తవానికి ఏ రాష్ట్రమైనా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కోసం ఖర్చు చేయాల్సింది తమ బడ్జెట్ వ్యయంలో 0.01 శాతం మాత్రమే. అయినా ఈమాత్రం వ్యయాన్ని భరించడానికి అవి సిద్ధపడలేదు. 2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కొన్ని మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నిరుడు విడుదలైన లెక్కల ప్రకారం వాటి సంఖ్య 473. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల అనుకున్న ప్రయోజనాలు పెద్దగా నెరవేరడం లేదని నిపుణులు చెబుతారు. ఢిల్లీ ఉదాహరణే తీసుకుంటే అత్యాచారాల కేసుల విచారణ కోసం అక్కడ ఏర్పాటైన 9 కోర్టుల్లో గత మూడున్నరేళ్లుగా 93 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి! కనుక సమస్యకు సంబంధించిన మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్ధమవుతుంది. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ సక్రమంగా లేకపోవడం...వాయిదాలివ్వడంలో ఉదారంగా వ్యవహరించడంవంటివి కూడా కేసుల పెండింగ్‌కు కారణమవుతున్నాయి. అన్నిటికన్నా ప్రధానమైంది ప్రభుత్వాల నిర్లిప్తత. అత్యధిక కేసుల్లో ప్రధాన కక్షిదారుగా ప్రభుత్వమూ లేదా దాని అనుబంధ సంస్థలే ఉంటాయి. న్యాయస్థానాల్లో తాము నడిపిస్తున్న కేసుల్లో నిజంగా విచారణార్హమైనవెన్నో, కోర్టు వెలుపల సులభంగా పరిష్కరించుకోదగినవెన్నో, నిరర్ధకమైనవెన్నో సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ ఆ బాధ్యత నుంచి అవి తప్పుకుంటున్నాయి. ఒక కేసు కొనసాగితే ప్రభుత్వానికి లేదా సమాజానికి ఒనగూడే ప్రయోజనమేమిటో...వెనువెంటనే పరిష్కారం చేసుకుంటే ఖజానాకు కలిగే ఆదా ఎంతో సమీక్షించేవారు లేరు. ఏళ్ల తరబడి కేసులు సాగుతూనే ఉన్నా కారణమేమిటో తెలుసుకునేవారుండరు. ఈ వైఖరి కూడా పెండింగ్ కేసుల సంఖ్యను పెంచుతోంది. న్యాయవ్యవస్థ పరంగానూ లోపాలున్నాయి. కేవలం ప్రచారాన్ని ఆశించి లేదా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి దాఖలు చేస్తున్న కేసుల్ని స్వీకరణ దశలోనే కొట్టేయాల్సి ఉండగా ఆ పని సమర్ధవంతంగా జరగటం లేదు. ఆ పేరు మీద కొన్ని నిజమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎగిరిపోతున్నాయి. కోర్టులకుండే సెలవుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్లోనూ వాస్తవముంది. సుప్రీంకోర్టు వరకూ చూస్తే నెల్లాళ్లకుపైగా వేసవి సెలవులు...దసరా, దీపావళివంటి పండుగలకు ఆరేసి రోజుల సెలవులు...పది పన్నెండు రోజుల క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇతరత్రా ప్రభుత్వ సెలవు దినాలు వీటికి అదనం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోల్చినా ఇవి బాగా ఎక్కువ. 2009లో జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ నేతృత్వంలోని లా కమిషనే ఈ సెలవుల సంగతి ప్రస్తావించి, తగ్గించుకోవాలని సూచించింది. ప్రధాన సమస్య అయిన న్యాయమూర్తుల నియామకంతోపాటు ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ ఠాకూర్ ఈ అంశాన్ని లేవనెత్తిన తీరు చూశాకైనా సమస్యపై పాలకులు దృష్టి సారిస్తారని, దీనికొక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాలి. -
మళ్లీ తెరపైకి మాడ వీధులు
తిరుమల తరహాలో ఏర్పాట్లు కార్యరూపంలోకి రానున్న ప్రతిపాదనలు కొండపై ఉన్న కార్యాలయాలు దిగువకు మార్చేందుకు సన్నాహాలు దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై తిరుమల తరహాలో మాడ వీధుల నిర్మాణ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. కొండపై ఉన్న దేవస్థానం కార్యాలయాలను దిగువకు తర లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాడ వీధుల ఏర్పాటు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ : తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా మాడ వీధులు నిర్మించాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. కొద్దికాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తెచ్చేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్టే అనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆలయ ఆవరణలోని దేవస్థానం కార్యాలయాలను కొండ దిగువన ఉన్న ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్ (జమ్మిదొడ్డి)లోకి మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కార్యాలయాలన్నింటినీ తొల గించి అక్కడ మాడ వీధులు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు దేవస్థాన విభాగాలు ఇంద్రకీలాద్రిపై సుమారు 8వేల చదరపు అడుగుల్లో ఈవో కార్యాలయంతో పాటు స్టోర్స్, ప్రసాదాల తయారీ, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్, సమాచార కేంద్రం తదితర విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటినీ ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌కు తరలిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు కార్యాలయం, వీఐపీల కోసం నిర్మించిన సూట్లు, ఏసీ గదులు మార్చడం లేదు. రెండో అంతస్తుతో పాటు పైన తాత్కాలికంగా షెడ్లు వేసి విభాగాలన్నింటినీ తరలిస్తారని సమాచారం. ఆ తరువాత మరొక చోట స్థలం తీసుకుని శాశ్వత భవనం నిర్మిస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంద్రకీలాద్రిపై ఉన్న కార్యాలయ భవనాలను తొలగించి మాడ వీధులు నిర్మించాలని భావిస్తున్నారు. మాడపాటి గెస్ట్‌హౌస్‌లో ఆరు సూట్లు మాడపాటి గెస్ట్‌హౌస్‌లో 27రూములు ఉన్నా యి. పుష్కరాలకు వీవీఐపీలు వస్తే ప్రస్తుతం ఉన్న సూట్లు సరిపోవడం లేదు. అందువల్ల 12 రూములను ఆరుసూట్లుగా మార్చాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికోసం సుమారు రూ.50లక్షలతో ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేశారని, పనులు ఈ నెలాఖరులో ప్రారంభించాలని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. దుర్గమ్మ ఆలయానికి భద్రతెంత!? ప్రస్తుతం అమ్మవారి ప్రధాన దేవాలయానికి వెనుక వైపు కార్యాలయ భవనాలు ఉన్నాయి. కొండ పక్కగా ఎప్పుడో కట్టిన ఈ భవనాలు అడ్డుగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి కొండచరియలు విరిగిపడలేదు. ఇప్పుడు ఈ భవనాలను పగలగొడితే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కూలి బకాయి.. 32.82 కోట్లు
నిలిచిపోయిన ఉపాధి హామీ చెల్లింపులు ఫిబ్రవరి 12 నుంచి పెండింగ్ 6 లక్షల మంది కూలీల ఎదురుచూపు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటున్న అధికారులు హన్మకొండ అర్బన్ :గ్రామాల్లో కూలీలకు పని కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. కూలీలు పనులు చేసి నెలలు గడుస్తున్నా వారికి కూలి డబ్బులు చెల్లించడం లేదు. దీంతో రోజువారీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. 24గంటల్లో చెల్లింపులు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రసుతం 50రోజులు దాటినా కూలీలకు చెల్లింపులు చేయడం లేదు. డబ్బుల కోసం క్షేత్రస్థాయిలో కూలీలు ఆందోళనకు దిగుతున్నా సిబ్బంది, అధికారులు సర్ధిచెప్పి పనుల్లోకి తీసుకుంటున్నారు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఉపాధి హామీ కూలీల హాజరు శాతం కూడా తగ్గుతోంద ని క్షేత్రస్థాయి సిబ్బంది అంటున్నారు. ఫిబ్రవరి 12నుంచి పెండింగ్ జిల్లాలో ఈ సంవత్సరం ఫిబ్రవరి తరువాత నిధులు రాకపోవడంతో అధికారులు కూలీలకు డబ్బులు చెల్లించలేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 6.03లక్షల మంది కూలీలకు రూ.32.82 కోట్లు చెల్లింపులు చేయాల్సిఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడం వల్లనే కూలి చెల్లించలేక పోతున్నామని అధికారులు అంటున్నారు. ఈ విషయంలో అధికారులు స్పష్టమైన తేదీ కూడా చెప్పే పరిస్థితి లేదు. జిల్లాలో 911గ్రామ పంచాతీల పరిధిలో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా లక్ష మంది కూలీలు పనులకు హాజరయ్యారు. నిధులు రాకనే చెల్లింపులు చేయలేదు డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఫిబ్రవరి 12నుంచి బడ్జెట్ రాక కూలీలకు చెల్లింపులు చేయలేకపోయాం. సమస్యను ప్రభుత్వానికి ఎప్పటికప్పడు తెలియజేసున్నాం. నిధులు రాగానే చెల్లింపులు చేస్తాం. ప్రస్తుతం వేసవి తీవ్రత ఉన్న దృష్ట్యా ఉదయం మాత్రమే పనుల్లోకి వెళ్లాలని చెపుతున్నాం. పని ప్రదేశాల్లో అవసరమైన అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. పని కల్పించింది 41రోజులే.. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా 2015-16 సంవత్సరంలో కల్పించిన పనిదినాలు సరాసరిగా 41 రోజులే. రాష్ట్రం మొత్తంలో చూస్తే సగటు పని దినాలు 47 కాగా.. జిల్లాలో మాత్రం ఈ సంఖ్య 41 మాత్రమే ఉండటం గమనార్హం. జిల్లాలో పూర్తిగా 100 రోజుల పని 20,959 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. సంవత్సరంలో మొత్తం 5.90 లక్షల మంది కూలీలు పనులకు వచ్చారు. వీరికి మొత్తంగా 1.30కోట్ల పనిదినాలు అధికారులు కల్పించారు. ఇందుకోసం మొత్తం రూ.244.73కోట్లు చెల్లింపులు చేశారు. -
పీఆర్సీ బకాయిలకు 9 నెలలా?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం జీతాలను, జీవితాలను త్యాగం చేసి పోరాడిన ఉద్యోగులకు 9 నెలలుగా పీఆర్సీ బకాయిలను ఎందుకివ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఘనంగా ప్రకటించిన 43 శాతం ఫిట్మెంట్ ఏమైందన్నారు. రాష్ట్రం ఏర్పాటై 21 నెలలు దాటుతున్నా ఉద్యోగ విభజన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌కార్డులను జారీ చేసినా అవి ఏ ఆసుపత్రిలోనూ పనిచేయడం లేదన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పీఆర్సీ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులంతా సిద్ధం కావాలన్నారు. ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. -
నిరాశ..
వృథాగా మారిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు నాలుగేళ్లుగా కేటాయింపులు పెండింగ్ 15,500 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధుల మధ్య వివాదం {పభుత్వం చొరవ చూపాలని లబ్ధిదారుల విజ్ఞప్తి సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో 2007 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 50 వేల ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో హైదరాబాద్ జిల్లాకు 15 వేలు, రంగారెడ్డి జిల్లాకు 35 వేలు కేటాయించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.2.60 లక్షల నుంచి రూ 3 లక్షలు ఖర్చు కాగా, కేంద్ర ప్రభుత్వం వాటాగా 50 శాతం నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం(రూ.26 వేలు), మిగతా 30 శాతం నిధులు బ్యాంకుల నుంచి జీహెచ్ఎంసీ రుణం రూపేణా ఇప్పించాల్సి ఉంటుందని జేఎన్ఎన్యూఆర్ఎం పథక రూపకల్పనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో కుందన్‌బాగ్, కుర్మలగూడ, మాల్లాపూర్, కర్మన్‌ఘాట్, జవహర్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ఎనిమిది ప్రాంతాలను గుర్తించి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బహు ళ అంతస్తులతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అదేవిధంగా నగరంలో ఇళ్లు లేని నిరుపేదల నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు జీహెచ్ఎంసీ స్వీకరించింది. ఇళ్ల సంఖ్యకు సరిపడ 50 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారయంత్రాంగం దశల వారిగా 2010 వరకు సజావుగా 35 వేల మందికి బహుళ అంతస్తుల్లోని ఇళ్లు కేటాయించారు. ఆ తర్వాత వీటిపై దృష్టి సారించలేదు. దీంతో 15,500 ఇళ్లు ఎవరికీ కేటాయించకుండానే పెండింగ్‌లో పెట్టారు. దీంతో తమ వాటాగా రూ.26వేలు చెల్లించిన దా దాపు 15,500 మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కారణాలివే... వైఎస్ మరణానంతరం వరుసగా ముఖ్యమంత్రులు మారటంతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో ఆ ఇళ్ల జోలికి అప్పటి ప్రభుత్వం గాని, అధికారులు గాని వెళ్లలేదు. దీంతో అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పాటు ఎన్నికల హామీల్లో భాగంగా గ్రేటర్లో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలోని లబ్ధిదారులతో సహా వేల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. మరో వైపు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో 10 శాతం వాటా చెల్లించి ఇళ్లు పొందని లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవటంతోపాటు... కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గతంలో నిర్మించిన ఇళ్లను కేటాయించినా తీసుకుంటామని పేర్కొంటున్నారు. 15,500 ఇళ్లలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లబ్ధిదారులు 7,500 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు 8 వేల మంది ఉన్నారు. అయితే....పాలకులు మారటంతోపాటు ప్రజాప్రతినిధులు మారటం వల్ల రంగారెడ్డి జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న 8 వేల మంది లబ్ధిదారుల జాబితాపై మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధుల మధ్య వివాదం కొనసాగుతున్నది. గతంలోగుర్తించిన లబ్ధిదారులకే ఈ ఇళ్లు కేటాయించాలని మాజీ ప్రజాప్రతినిధులు పట్టుపడుతుండగా, తామిచ్చిన జాబితాకు అనుగుణంగానే ఇళ్లు ఇవ్వాలని ప్రస్తుత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నాలుగేళ్లుగా నానుతున్న ఈ ఇళ్ల కేటాయింపు సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం దష్టి సారిస్తే తప్ప పరిష్కారం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ విషయంలో మునిసిపల్ మంత్రి కేటీఆర్ చొరవ చూపరరాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ పెండింగ్ సమస్యకు మోక్షం లభిస్తే...గ్రేటర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల డిమాండ్పైర కూడా కొంత భారం తగ్గగలదని పేర్కొంటున్నారు. -
షాదీ ముబారక్‌కు గ్రహణం!
నెలల తరబడి విచారణలో దరఖాస్తులు పెళ్లికి ముందు అందని ఆర్థిక సహాయం నగరంలో 3 వేలకు పైగా పెండింగ్ హజ్ హౌస్ చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక చేయూత అందించేందుకు సర్కారు ఆర్భాటంగా ప్రకటిం చిన ‘షాదీ ముబారక్ ’ పథకానికి గ్రహణం పట్టుకుంది. ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడాశతో ముహూర్తం తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో దరఖాస్తులు విచారణకు నోచుకొకుండా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరోవైపు విచారణ జరిగి ఆర్థిక సహాయం మం జూరైనా ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. నిరుపేద కుటుంబాలు పెళ్లిల్లకు అప్పులు చేయక తప్పడం లేదు. పెళ్లికి ముందు ఏదీ ముబారక్? షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లికి నెలరోజుల ముందు పెళ్లి పత్రికతో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు...చివరకు పెళ్లి అయిపోయాక కూడా సహాయం అందని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి అయిన తర్వాత కూడా వెంటపడితే కానీ సాయం మంజూరు కావడం లేదు. పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల వెరిఫికేషన్ బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది ఇతరాత్రా విధుల్లో బిజీగా ఉండటంతో షాదీ ముబారక్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు ఉర్దూ అకాడమీ, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి వెరిఫికేషన్‌ను అప్పగించడంతో వారు చేతివాటం ప్రదర్శిస్తునట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని తాజాగా తప్పించి హజ్ కమిటీకి, రెగ్యులర్ ఉద్యోగులకు బాధ్యతలను అప్పగించారు. అయినప్పటికీ దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్‌లో పడి ఆర్థిక సహాయం మంజూరుకు అడ్డంకిగాా మారాయి. ఇదీ పరిస్థితి... షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 8600 పైచి లుకు దరఖాస్తులు అందగా అందులో సగానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు వెరిఫికేషన్‌కు నోచుకున్నప్పటికీ మంజూరు పెండింగ్‌లో పడిపోయిం ది. ఇటీవల 142 పెళ్లిల్లకు ఆర్థిక సహాయం మంజూ రైనా సాంకేతిక తప్పిదంతో రెండు పర్యాయాలు నగదు జమకావడం మరోవివాదానికి దారితీసింది. తప్పిదాన్ని సరిదిద్దుకునేందుకు బ్యాంక్ ఖాతాలనీ సీజ్ చేయడంతో నగదు ఉన్నా వినియోగించలేని పరిస్థితి నెల కొంది.ఈ వ్యవహారంతో గత నెల రోజులుగా ఎలాంటి ఆర్థిక సహాయం బ్యాంకులో జమ కాలేదు. పెళ్లి తంతు ముగిసినా అందలేదు.. షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత అందుతున్న ఆశతో నగరంలోని బహదూర్ పురాకు చెందిన అమీనుద్దీన్ తన కుమార్తె పెళ్లి ఖరారు చేసుకొని ఒక నెల ముందే సెప్టెంబర్ 14న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తు హార్డ్ కాపీలను హజ్‌హౌస్‌లోని ైమైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించారు. నిఖా నాటికి ఆర్థిక చేయూత అందకపోవడంతో అప్పు చేసి అక్టోబర్ 10న పెళ్లి జరిపించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి రెండు నెలలు దాటినా కనీసం విచారణకు ఎవరూ రాలేదు. నిరుపేద తండ్రి హజ్‌హౌస్‌కు వచ్చి గగ్గోలు పెడితే కాని అధికారులు స్పందించలేదు. దరఖాస్తు స్టేటస్‌ను ఆన్లైన్లో పరిశీలించగా ఎలాంటి విచారణ జరుగలేదని తేలింది. దీంతో సదరు అధికారి వెంటనే హజ్ కమిటీ సిబ్బందికి దరఖాస్తులు అప్పగించి విచారణకు పంపించాలని సెక్షన్ ఇన్చార్జికి ఆదేశించడం గమనార్హం. ఇదీ డిప్యూటీ సీఎం ప్రకటన... హైదరాబాద్ నగరంలో ఆర్థిక స్థోమత లేక పెళ్లి కాని 30 సంవత్సరాలు దాటిన నిరుపేద ముస్లిం యువతులు సుమారు 40 వేలకు పైగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. నిరుపేద తల్లితండ్రులను ఆదుకునేందుకు షాదీ ముబారక్ పథకం కింద వధువు పేరుతో రూ. 51 వేల నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాం. ప్రతి యేట 20 వేల పెళ్లిలకు ఆర్థిక చేయూత అదించాలని లక్ష్యంగా నిర్ణయించాం. - రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ -
దారి తప్పుతోన్న ఎన్కౌంటర్ విచారణ
-
వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2016 జూన్(ఖరీఫ్) నాటికి పూర్తిచేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్ణీత ఆయకట్టు లక్ష్యాలను చేరుకునేలా ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని, అవి పూర్తయితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుం దని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టుల పురోగతి, వాటిల్లో ఉన్న సమస్యలు, పరిష్కార మార్గాలు తదితరాలపై మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితోపాటు అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మారథాన్‌లా సమీక్ష జరిగింది. 146, 123 జీవోలను వాడుకుంటూ ముందుకు... కాంట్రాక్టర్లకు అదనపు ధరల చెల్లింపులకు సంబంధించిన జీవో 146, భూసేకరణ జీవో 123లను ఉపయోగించుకోవాలని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. 146 జీవో విడుదలైన నేపథ్యంలో కాంట్రాక్టు ఏజెన్సీలతో మాట్లాడి పనులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను 146 జీవోను ఉపయోగించుకొని పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1,400 ఎకరాల భూసేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని స్పెషల్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో 300 ఎకరాలను నవంబర్ 15 నాటికి సేకరించాలన్నారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం, జగన్నాథ్‌పూర్, నీల్వాయి, రాళ్లవాగు, వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు, నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, పెండ్లిపాకాల, ఉదయసముద్రం వంటి పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల కింద సైతం భూసేకరణను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. -
అర్జీ.. సర్కార్‌కు ఎలర్జీ!
సచివాలయంలో పేరుకున్న అర్జీల గుట్టలు వేళాపాళా పాటించని ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ.. కొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా సాకారమైన కొత్త రాష్ట్రం. కొత్త ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టి ఏడాది గడిచింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశగా సర్కార్ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా పలు అర్జీలను ఆయా శాఖలకు పెట్టుకున్నారు. కాని పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తులను చిన్నచూపు చూస్తోంది. ఫిర్యాదులను పక్కన పడేస్తోంది. దీంతో సచివాలయంలోని ఫిర్యాదుల విభాగంలో లెక్కకు మిక్కిలిగా అర్జీలు, ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 31,281 అర్జీలు పెండింగ్‌లో ఉంటే.. అందులో అత్యధికంగా, మూడో వంతుకు పైగా రెవెన్యూశాఖకు చెందినవే. ఈ ఒక్క విభాగంలోనే 12,941 ఫైళ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రతి రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి వంద నుంచి రెండు వందల అర్జీలు అందుతున్నాయి. పబ్లిక్ మానిటరింగ్ సెల్లో వీటిని ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత శాఖకు, ఆయా కార్యాలయాలకు పంపిస్తారు. క్షేత్రస్థాయి అధికారులు వీటిని పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. సీఎంవో ఆదేశించినా వాటికి అతీగతీలేదు. తమ అర్జీలకు మోక్షమెప్పుడు లభిస్తుందా.. అని బాధితులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో అవసరమైతే ఎక్కువ సమయం పని చేస్తామంటూ పీఆర్సీ అమలు, తెలంగాణ ఇంక్రిమెంట్ అందుకునే సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు. సచివాలయంలోనే ఉద్యోగులు వేళాపాళా పాటించటం లేదని, ఆలస్యంగా ఆఫీసులకు వస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గత నెలలో హెచ్‌వోడీ కార్యాలయాలన్నింటికీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్రం లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 2,986 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ మంగళవారం వరకు... అందిన అర్జీలు 33,814 పెండింగ్‌లో ఉన్నవి 31,281 పరిష్కారమైనవి 1,818 పురోగతిలో ఉన్నవి 566 తిరస్కరించినవి 149 జిల్లాల వారీగా అర్జీలు పరిష్కారమైనవి రంగారెడ్డి 2,986 0 హైదరాబాద్ 2,957 1111 కరీంనగర్ 1,807 6 వరంగల్ 1,373 1 మహబూబ్‌నగర్ 1,233 220 నల్లగొండ 1,091 301 ఖమ్మం 1,012 18 మెదక్ 904 58 ఆదిలాబాద్ 722 49 నిజామాబాద్ 699 66 -
పాతవి పోయె.. కొత్తవీ రాకపాయె..!
పింఛన్ల కోసం అర్హుల ఎదురు చూపులు.. జిల్లా వ్యాప్తంగా 50 వేల వినతుల పెండింగ్ అర్హులు 11,540 మందేనంటున్న అధికారులు జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం.. అర్హులకు మొండిచేయి.. అధికార పార్టీ వారికే మంజూరు.. చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది అర్హులు వివిధ రకాల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లు సైతం అందక అర్హులు అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల పింఛన్లను అధికారులు గతంలో తొలగించారు. వారి స్థానంలో జన్మభూమి కమిటీలు టీడీపీ నేతల అనుయాయులకు పింఛన్లు మంజూరు చేస్తున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వేల మందికి పైగా అర్హులు పింఛన్ల కోసం వినతులు సమర్పించారు. వారిలో 11,540 మంది మాత్రమే అర్హులంటూ జన్మభూమి కమిటీలు, జిల్లా అధికారులు తేల్చారు. వారికీ పింఛన్ ఇవ్వలేదు. ఆన్లైన్ చేస్తామంటూ మాటలతో కాలయాపన చేస్తున్నారు. మిగిలిన వారికి అర్హత లేదంటూ చిన్నచిన్న సాంకేతిక కారణాలతో దరఖాస్తులు మూలకునెట్టారు. రేషన్‌కార్డు,ఆధార్ కార్డుల్లో ఉన్న వయో పరిమితి తేడాలను అవకాశంగా తీసుకుని కొందరిని అనర్హులుగా తేల్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా పింఛన్ల మంజూరులో అర్హుల ఎంపికలో అధికార పార్టీ నేతలతో నింపిన జన్మభూమి కమిటీలే కీలక పాత్ర పోషింస్తుండడంతో టీడీపీ కార్యకర్తలకు మినహా అర్హులకు పింఛన్లు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లాలో 3,71,415 పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.39 కోట్లు వెచ్చిస్తున్నారు. వికలాంగులదీ అదే పరిస్థితి : జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో వికలాంగులకు 44,300 పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6,840 వాటిని తొలగించి వారి స్థానంలో జన్మభూమి కమిటీల ద్వారా అధికాార పార్టీ అనుచరులకు కట్టబెట్టారు. మరో 22 వేల మంది అర్హులున్నా వారికి నేటికీ పింఛన్లు మంజూరు చేయలేదు. పరిస్థితి ఇదీ... - కుప్పం నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు అర్హుల పింఛన్లు తొలగించారు. కొత్త వాటి కోసం వెయ్యి మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నా వారికి నేటికీ మంజూరు చేయలేదు. - పలమనేరులో4 వేల మంది దరఖాస్తులు చేసుకోగా, 3 వేల మందిని అనర్హులంటూ తొలగించారు. వెయ్యి మందే అర్హులని తేల్చారు. వారికీ పింఛన్లు మంజూరు కాకపోవడం గ మనార్హం. - పుంగనూరు నియోజకవర్గంలో 1400 మంది పింఛన్ల కోసం వినతిపత్రాలు సమర్పించి ఎదురుచూస్తున్నారు. - పూతలపట్టు నియోజకవర్గంలో 1500 మందికి పైగా అర్హులు పింఛన్ల కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. - సత్యవేడు నియోజకవర్గంలో 2735 మంది వినతి పత్రాలు ఇవ్వగా, 985 మందికి పింఛన్లు మంజూరు చేశారు. మిగిలిన వారికి రావాల్సి ఉంది. - శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 3,335 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఉన్న పింఛన్లలో 8 వేల ఫించన్లు తొలగించి కొత్త వారికి కట్టబెట్టారు. - నగిరిలో 3543 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 163 మందికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన 3,377 మందికి ఇంకా మంజూరుకాలేదు. - తంబళ్లపల్లి నియోజకవర్గంలో 3 వేల మంది దరాస్తు చేసుకోగా, వెయ్యి మందికి ఇచ్చారు. మిగిలిన 2 వేల మందికి ఇవ్వాల్సి ఉంది. - చంద్రగిరి నియోజకవర్గంలో 980 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. - మదనపల్లె నియోజకవర్గంలో 1225 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. -
ఔరా...ఔటర్!
ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు కోర్టు కేసుల సాకుతో పడకేసిన ప్రాజెక్టు జాప్యంపై పట్టించుకోని సర్కారు సిటీబ్యూరో: హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ సొబగులద్దిన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితి అయోమయంలో పడింది. ఈ పనులు ప్రారంభ మై తొమ్మిదేళ్లవుతున్నా ఇంకా కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు తుది గడువును ఏటా పొడిగిస్తుండడంతో ఔటర్ నిర్మాణాన్ని హెచ్ఎండీఏ పూర్తిగా గాలికి వదిలేసిందన్న అపకీర్తిని మూటగట్టుకొంది. గడువు ముగిసినా ఇంకా 22 కి.మీ. రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా మిగిలి ఉండటం హెచ్ఎండీఏ పనితీరుకు దర్పణం పడుతోంది. అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందన్నది అంతుబట్టని విషయంగా మారింది. అయితే... ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు మాత్రం 2016 ఫిబ్రవరి నాటికి పెండింగ్‌లో ఉన్న మెయిన్ క్యారేజీని అందుబాటులోకితెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2012 నవంబర్ నాటికి ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కి.మీ. నిర్మాణం పూర్తవ్వాలన్నది లక్ష్యం. 9 ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 2006లో పనులు ప్రారంభించగా... ఇప్పటివరకు 146 కి .మీ. మాత్రమే పూర్తయింది. దీనిలో 136 కి.మీ. వినియోగంలోకి వచ్చింది. -
పెండింగ్‌లో ఏపీ ప్రత్యేక హోదా