పెండింగ్ ప్రజాసాధికార సర్వేకు చర్యలు
పెండింగ్ ప్రజాసాధికార సర్వేకు చర్యలు
Published Wed, Feb 8 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్
కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షా 30 వేల మంది ప్రజాసాధికార సర్వేకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేట విజయవాడ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ అంశాలపై జిల్లాలో చేపట్టిన ప్రగతి, చేపట్టిన చర్యలను జేసీ వివరించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ అనిల్ చంద్ర మాట్లాడుతూ రెవెన్యూ శాఖను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటి తహసీల్దార్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకూ ప్రతిఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. కైజాలా మొబైల్ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. పెండింగ్ లేకుండా మీసేవ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ల ప్యానల్‌ను తయారు చేసి వెంటనే పంపాలని సూచించారు. జిల్లాకు మంజూరైన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ప్రారంభిచాలని ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సర్వే శాఖ ఏడీ నూతనకుమార్, కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement