pulse
-
వింత ఘటన: గుండె లేకుండా జీవించిన తొలి మానవుడు!
సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..క్రెయిగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ బిల్లీకోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, లూయిస్ రక్తాన్ని పల్స్ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు. అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్‌లైన్ చూపిస్తుందని డాక్టర్ కోన్ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు. ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్‌ని డయాలసిస్ మెషిన్, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్ నిలిచాడు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
స్మార్ట్ వాచ్... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటి? అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అదెలా జరిగిందంటే... యూకేకు చెందిన 54 ఏళ్ల డేవిడ్‌కు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సారా, యాపిల్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే.. పల్స్రేట్ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి. కానీ డేవిడ్‌కు 30 మాత్రమే నమోదవుతుండటంతో వాచ్ సరిగ్గా పనిచేయట్లేదేమోనని డేవిడ్ అనుకున్నాడు. కానీ అతని భార్య పదేపదే వెంటపడటంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేయిస్తే... అతను కార్డియాక్ అరెస్టుతో మృతి చెందే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బ్లాక్ వల్ల గుండెలోని ‘జంక్షన్ బాక్స్’ పనిచేయడం ఆగిపోతోందన్నారు. అలా 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్లపాటు అతని గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతని గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, అతను ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీతో గుండెలోని బ్లాక్స్‌ను తొలగించారు. అలాగే భవిష్యత్తులో అతని హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా చేసేందుకు వీలుగా గుండెలో ఒక ‘పేస్‌మేకర్’ పరికరాన్ని సైతం అమర్చారు. దీంతో ఇప్పుడు అతని గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు... నేను బతికి ఉండేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క చార్జింగ్ సమయంలో తప్ప వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్ చెబుతున్నాడు. -
చనిపోయిందనుకుని టెంట్ వేసి కూర్చొబెట్టారు...ఆ తర్వాత
తగరపువలస (భీమిలి): జీవీఎంసీ రెండో వార్డుకు చెందిన లక్కోజు అన్నపూర్ణ అనే 74 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం వృద్ధాప్యం కారణంగా ఇంటి వరండాలో పడిపోయి చనిపోయింది. దీంతో ఇంటి ముందు టెంట్ వేసి వారి సాంప్రదాయం ప్రకారం కూర్చొబెట్టారు. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. పగలంతా ఎండ తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం 3.30 సమయంలో ఆమె భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు స్నానం చేయిస్తుండగా శరీరంలో కదలికలు కనిపించాయి. వెంటనే పల్స్మీటర్తో తనిఖీ చేయగా సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె స్పందించింది. 70 నుంచి 90 వరకు పల్స్ రేట్ చూపించడంతో అప్పటి వరకు విషాదం అలుముకున్న ఆ ఇంట సంభ్రమాశ్చర్యాలు చోటుచేసుకున్నాయి. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అనంతరం స్పూన్‌తో టీ తాగించగా గుటకలు వేసింది. ఆమె స్పందిస్తున్నందుకు సంతోషంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహన సిబ్బందికి ఫోన్ చేశారు. వారు సాయంత్రం 5 గంటలకు వచ్చి తనిఖీలు చేయగా చనిపోయినట్టు నిర్ధారించారు. అంతలోనే మళ్లీ వారింట విషాదం అలముకుంది. అనంతరం ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. (చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?) -
జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్
ప్రేమ: ‘ఏరా, కాఫీ మానేశావట!!!’ ‘ఎప్పుడైతే కావ్యకు టీ తప్ప కాఫీ నచ్చదు అనే విషయం తెలిసిందో ఇక అప్పటి నుంచి కాఫీ ముఖం ఈ జన్మలో చూడొద్దని డిసైడైపోయాను’ అభిమానం: ‘మీరు ఏమైనా అనుకోండి. మీ హీరో సినిమా ఏమాత్రం బాగలేదు. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి?’ ‘సినిమా ఎందుకు చూడాలి? అనే మాట వాడి చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. అంతపెద్ద మాట అంటావా! ఇక ముందు మీ హీరో సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్నాము’ కుటుంబం: ‘నాన్న పలకరించినా ముఖం తిప్పేస్తున్నావట! ఇది మంచి పద్ధతి కాదు. పెద్దవాళ్లు మన బాగు కోసం ఒక మాట అంటే తప్పేమిటి?!’ సామాజికం: ‘మిత్రులారా... ఫలానా షూస్ ఎవరూ వాడవద్దు. వాటిని జంతుచర్మంతో తయారుచేస్తారట’ ∙∙ ‘జెన్ జడ్’ జనరేషన్లో కీలకపాత్ర వహిస్తుంది ‘క్యాన్సిల్ కల్చర్’ దీనికి సోషల్‌మీడియా ప్రధాన వేదిక అయింది. ‘క్యాన్సిల్’ అంటే ఉన్న సాధారణ అర్ధాలలో రెండు.. రద్దు చేయడం, తుడిచివేయడం. ఇక పాప్–కల్చర్ డిక్షనరీ ప్రకారం తమ మనోభావాలను దెబ్బతీశారనే కారణంతో సెలబ్రిటీలు లేదా కంపెనీలను ఏదో ఒక రూపంలో బాయ్‌కాట్ చేయడం. ఈ క్యాన్సిల్ కల్చర్ మూలాలు 2014 ‘లవ్ అండ్ హిప్–పాప్: న్యూయార్క్’ రియాల్టీ షోలో ఉన్నాయి అంటారు. ఆ షోలో ఒక నటుడికి తన గర్ల్‌ఫ్రెండ్‌కు అంతకుముందే కూతురు ఉందనే విషయం తెలిసి ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ అంటాడు. మొదట్లో ‘యూ ఆర్ క్యాన్సిల్డ్’ను సోషల్ మీడియాలో సరదాగా అనుకరించేవారు. అయితే ఈ సరదా కాస్త ఆ తరువాత సీరియస్ రూపంలోకి మారింది. మనలాంటి దేశాల్లోకి కూడా వచ్చేసి చాలామంది యూత్‌ను పట్టేసింది. ట్విట్టర్లో ‘బాయ్‌కాట్’ హ్యాష్‌టాగ్‌లు పెరిగాయి. ఫేస్బుక్లో ఒక కుర్రాడు ఇలా పోస్ట్ పెట్టాడు. ‘జాను లవ్స్ ఆరెంజ్. షీ ఈజ్ క్యాన్సిల్డ్’ యూత్‌లోని ఈ ‘క్యాన్సిల్ కల్చర్’ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనడం కంటే...‘ఇది సరికాదు’ అనే వారే ఎక్కువ. అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ‘సౌత్ పార్క్’ ఈ ధోరణిని వెక్కిరించింది. స్టాండప్ కామెడి షో ‘స్పీక్స్ అండ్ స్టోన్స్’ కూడా అదే మార్గాన్ని అనుసరించింది. ‘కాలేజి క్యాంపస్‌లో ప్రత్యర్థి పక్షం భావాలను వ్యతిరేకించడం... అనే భావన క్యాన్సిల్ కల్చర్‌కు విత్తనంలాంటిది. అది కాస్త సోషల్ మీడియాకు విస్తరించింది’ అంటాడు ‘కోడింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్’ పుస్తకం రాసిన జోనాధన్. బాయ్కాట్లు, బహిష్కరణలు మన సామాజిక చరిత్రలో కొత్తేమీ కాదు. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘విదేశీ వస్తు బహిష్కరణ’ ఎంత కీలక పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. అలాంటి ఉద్యమాలకు అర్థం, పరమార్థం, అనంతమైన బలం ఉన్నాయి. అలా కాకుండా చిన్న చిన్న విషయాలు, అల్పమైన విషయాలపై ‘క్యాన్సిల్ కల్చర్’ను ఫాలోకావడం తగదని చెబుతున్నారు విజ్ఞులు. అయితే జెన్ జడ్లో ‘క్యాన్సిల్ కల్చర్’ని తలకెత్తుకుంటున్నవారితో పాటు ‘క్యాన్సిల్ ది క్యాన్సిల్ కల్చర్’ అని నినదిస్తున్నవారు కూడా ఉన్నారు. -
ఫోన్లోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా మహమ్మరి మన దేశాన్ని వణీకిస్తుంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే మరణాల రేటు అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడమే. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉచితంగా మన దగ్గర ఉన్న ఫోన్లోని ఒక యాప్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’. ఎలా పనిచేస్తుంది? మన దేశంలోని కోల్‌కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్‌కేర్’ అనే స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ 'కేర్‌ప్లిక్స్ వైటల్స్'ను అభివృద్ధి చేసింది. ఇక్కడ చేయాల్సిందల్లా ఈ యాప్ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఉన్న ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి దాని మీద వేలు పెట్టిన తర్వాత స్కాన్ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్ స్థాయి(SpO2), పల్స్, శ్వాసక్రియ రేట్లను చూపిస్తుంది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ తెలిపారు. ట్రయిల్స్ లో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టెస్ట్ నిర్వహించడానికి మంచి ఇంటర్నెట్, హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఉండాలి అప్పుడే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం సింగిల్ యూజర్ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు కేర్‌నౌ వెబ్సైట్లో ఉన్నాయి. చదవండి: ఐసీఎంఆర్ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి -
టైమొచ్చింది ఫ్రెండ్స్... తిరిగి ఇచ్చేద్దాం!
‘ఊరు మనకెంతో చేసింది.. తిరిగిచ్చేద్దాం లేదంటే లావైపోతాం’ అనే శ్రీమంతుడు సినిమా డైలాగ్ రియల్ లైఫ్‌లో కూడా ఎంతోమందిని కదిలించింది. అచ్చం ఇటువంటి డైలాగునే కాస్త మార్చి చెబుతున్నారు బెంగుళూరుకు చెందిన ఇద్దరమ్మాయిలు. ‘‘సమాజం మనకు చేసిన దాంట్లో కొంతైనా తిరిగిచ్చేద్దాం! అందుకు ఇదే సరైన సమయం’’ అంటూ తమవంతు సాయంగా నిరుపేదలకు రెండువందల పల్స్ ఆక్సిమీటర్లు ఉచితంగా పంపిణీచేస్తున్నారు బెంగళూరుకు చెందిన స్నేహా రాఘవన్, శ్లోకా అశోక్‌లు. ఈ ఇద్దరు కలిసి విరాళాల రూపంలో నిధులు సేకరించి ఎన్జీవో సంస్థ ద్వారా ఆక్సీమీటర్లు అందిస్తున్నారు. బెంగళూరులోని సరజ్పూర్కు చెందిన స్నేహా రాఘవన్, శ్లోకా అశోక్‌లు ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’లో పదో తరగతి చదువుతున్నారు.‘‘ప్రస్తుతం మనదేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చి విరుచుకుపడుతోంది. దీంతో పిల్లల నుంచి పెద్దవారి వరకు అంతా ఏదోరకంగా తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇది చూసిన స్నేహా, శ్లోకలు ...‘తాము కూడా ఏదోక సాయం చేయాలని అనుకున్నారు’ ఎలా సాయం చేయాలి? అనుకుంటున్న సమయంలో సామాజిక కార్యకర్త అనుపమ పరేఖ్ వారిని కలవడంతో తమ మనసులోని మాటను ఆమెకు చెప్పారు. ‘‘ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చినవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్‌చేసుకోవాలి. అందువల్ల ప్రతిఒక్కరి దగ్గర పల్స్ ఆక్సిమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నవారు వీటిని కొనలేరు కాబట్టి, అటువంటివారికి ఆక్సిమీటర్లు అందిస్తే బావుంటుంది’’ అని అనుపమ చెప్పడంతో.. నిరుపేదలకు ఆక్సీమీటర్లు ఇవ్వాలని స్నేహ శ్లోకాలు నిర్ణయించుకున్నారు. వెంటనే ఆక్సీమీటర్ల ప్రాజెక్టుకు నిధులు సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ‘గివ్ ఇండియా’ పేరుతో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి దానిలో ‘‘నిరుపేదలకు ఆక్సీమీటర్లు ఇచ్చేందుకు నగదు సాయం కావాలి’’అని కోరారు. అంతేగాకుండా ఇదే విషయాన్ని పోస్టర్లపై ప్రింట్ చేసి జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అతికించారు. వీరు ప్రచారం మొదలు పెట్టిన కొద్ది సమయంలోనే మంచి స్పందన లభించి, ఒక్కరోజులోనే రెండు లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయి. దీంతో నగదుతో పల్స్ ఆక్సీమీటర్లు కొనుగోలు చేసి ఎన్జీవో ‘సంపర్క్’ ద్వారా ఉత్తర బెంగళూరులోని గ్రామాల్లోని పేద కుటుంబాలకు, మురికివాడల్లో నివసించే నిరుపేదలకు పంచుతున్నారు. ‘‘ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్ అనే మహమ్మారితో తీవ్రంగా పోరాడుతోంది. ఈ సమయంలో సమాజానికి తమ వంతు సాయం చేయాలనుకున్నాం. ఒకపక్క మా బోర్డు పరీక్షలు రద్దవడంతో మాకు కాస్త సమయం దొరికింది. ఇప్పటిదాక సమాజం నుంచి ఎంతో లబ్ధి పొందాం. దాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే ఇప్పుడే ఏదైనా చేయాలనుకున్నాం. మా ఆలోచనకు అనుపమ పరేఖ్ తోడవడంతో ఈ ఆక్సీమీటర్ల ప్రాజెక్టులో పాల్గొనగలిగాము. ప్రస్తుతం ఉత్తర బెంగళూరులోని మురికివాడలు, గ్రామాల్లోని నిరుపేదలకు ఆక్సిమీటర్లు పంపిణీ చేస్తున్నాము. మా స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ సామాజిక కార్యక్రమాలు మాకు ప్రేరణ ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాము. మాలాగే మరింతమంది విద్యార్థులు సమాజం కోసం తమవంతు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మన తోటి భారతీయులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తే, ఈ విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు’’ అని స్నేహ, శ్లోకలు చెప్పారు. -
వాస్తవ ఘటనలతో...
దిలీప్‌కుమార్ మల్లా, రోషిని పటేల్ సింగాని జంటగా నటిస్తున్న చిత్రం ‘పల్స్’. అమి ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుగుతోంది. రమణ తూముల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమ ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని ఓ జంట ఎలా చెప్పిందన్నది ఆకట్టుకుంటుంది. వైజాగ్‌లో తొలి షెడ్యూల్చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’’ అన్నారు. భవానీశంకర్, డా. శివరాం, ఆనంద్ చెలికాని, చంద్రశేఖర్ పాత్రుడు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నిజాని అంజన్, కెమెరా: చందు. -
2 నుంచి పల్స్ పోలియో
ఏలూరు (మెట్రో): జిల్లాలో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు వచ్చేనెల 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజులపాటు పల్స్ పోలియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్యాధికారి (డీఎంహెచ్ఓ) కె.కోటేశ్వరి తెలిపారు. పల్స్ పోలియా కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు నాలుగు లక్షల మంది వరకూ ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 2వ తేదీన జిల్లాలో 3,233 కేంద్రాలను ఏర్పాటు చేసి 13,215 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. డీఆర్ఓ హైమావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మోహనకృష్ణ, డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యం జిల్లాలో అందరికీ ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పథకం అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ కె.కోటేశ్వరి తెలి పారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఏడాదికి రూ.1,200 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంటుందన్నారు. కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు వచ్చేనెల 3వ తేదీ నుంచి ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారిని పథకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పథకాల అమలుపై ఆరా జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పథకాలపై ఎంపీహెచ్ఈఓ, సీఓలతో డీఎంహెచ్ఓ కోటేశ్వరి సమీక్షించారు. ఐవో మోహనకృష్ణ, ఆర్బీఎస్కే డాక్టర్ కె.సురేష్‌బాబు, డెప్యూటీ డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రజాసాధికార సర్వేకు చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్ కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న లక్షా 30 వేల మంది ప్రజాసాధికార సర్వేకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేట విజయవాడ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జేసీ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ అంశాలపై జిల్లాలో చేపట్టిన ప్రగతి, చేపట్టిన చర్యలను జేసీ వివరించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అనిల్ చంద్ర మాట్లాడుతూ రెవెన్యూ శాఖను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటి తహసీల్దార్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకూ ప్రతిఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. కైజాలా మొబైల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. పెండింగ్ లేకుండా మీసేవ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ల ప్యానల్‌ను తయారు చేసి వెంటనే పంపాలని సూచించారు. జిల్లాకు మంజూరైన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ప్రారంభిచాలని ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సర్వే శాఖ ఏడీ నూతనకుమార్, కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
29న పల్స్‌పోలియో
అయిదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలి అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రయ్య కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : ఈ నెల 29న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలియో చుక్కల మందు వేస్తారన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై రూట్ సూపర్వైజర్లకు కాకినాడలోని తన కార్యాలయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. జీవనాధారం కోసం వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీలు, కోళ్లఫారాల్లో పని చేస్తున్నవారి చిన్నారులను గుర్తించి తప్పకుండా పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి రోజు ఎంపిక చేసిన పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయాలని, రెండు, మూడు రోజుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తీవ్ర జ్వరం, విరేచనాలు, అస్వస్థతతో బాధ పడుతున్న చిన్నారులకు చుక్కల మందు వేయరాదన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయాలన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి సంబంధిత పీహెచ్సీ, సీహెచ్‌సీలకు పల్స్‌పోలియా చుక్కల మందు సరఫరా, పోలియో కేంద్రాల్లో పాటించాల్సిన విధులు, బాధ్యతలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేష¯ŒS అధికారి డాక్టర్ అనిత, కాకినాడ, పెద్దాపురం డివిజన్ల సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వే ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి కావాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వే ప్రక్రియ ఈకేవైసీతో సహా ఈ నెలాఖరుకు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గురువారం విజయవాడ సెంట్రల్ కంట్రోల్ అండ్ కమాండ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అరుణ్‌కుమార్ సర్వే ప్రగతిని వివరించారు. జిల్లా ప్రొజెక్టెడ్ జనాభా 52 లక్షలకు గాను 43 లక్షల జనాభా సర్వే పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 16 లక్షల 93 కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, ఏజన్సీ మండలాలతో పాటు మైదానప్రాంతాల్లో డోర్లాక్డ్, తాత్కాలిక వలస వెళ్లిన దాదాపు లక్షా 94 కుటుంబాల సర్వే ఇంకా మిగిలి ఉందన్నారు. మైదాన ప్రాంత సర్వేను ఈ నెలాఖరుకు, ఏజన్సీ మండలాల్లో సర్వేను డిసెంబర్ ఐదో తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ మండలాల్లో జనావాసాలు దూరందూరంగా ఉండటం వల్ల సర్వే ఆలస్యమవుతోందని, దీనిని అధిగమించేందుకు సర్వే బ్లాకులను మరింత విభజించి ఎక్కువ సంఖ్యలో ఎన్యూమరేటర్లను, ట్యాబ్‌లను రంగంలోకి దించుతామన్నారు. పట్టణ ప్రాంత ప్రజాసాధికార సర్వేలో 76 శాతం పురోగతితో జిల్లా అగ్రస్థానంలో ఉందని, 69 శాతంతో వెనుకబడిన పిఠాపురం మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో సర్వే ముమ్మరంగా సాగుతోందన్నారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీపీవో టీవీఎస్ గంగాధరకుమార్, డిఆర్డిఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఎన్ఐసి సీనియర్ సైంటిస్ సయ్యద్ ఉస్మాన్, సెక్షన్ అధికారి రామ్మోహనరావు, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్ష
కాకినాడ సిటీ : రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేట జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాసాధికార సర్వే పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే చేసిన గృహాలకు డిజిటల్ ఇంటి నంబర్లు జారీ చేసేందుకు వాటి ముందు ఉన్న వీధుల జీపీఆర్ఎస్ వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. అసంపూర్తి, అసంబద్ధ డేటాను సరిచేసేందుకు ప్రత్యేక అప్ రూపొందించామని, దీనితో సత్వరం సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పాల్గొంటూ జిల్లాలో 68 శాతం సర్వే పూర్తి చేశామన్నారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, ఎన్ఐసీ సైంటిస్ట్ ఉస్మాన్, హెచ్ సూపరింటెండెంట్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పట్టుకుంటారా..?
నత్తనడకన ప్రజా సాధికార సర్వే కొరవడిన పర్యవేక్షణ ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమగ్ర వివరాలను ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు అక్కడికక్కడే ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆయా వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నత్తనడకన సాగుతున్న ఈ సర్వే ఎప్పుడు ముగుస్తుందోనని వివిధ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు. – కాకినాడ సిటీ జిల్లావ్యాప్తంగా 64 మండలాలు ఉండగా, ఏజెన్సీలోని 11 మండలాల్లో సాంకేతికంగా నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా మండలాల్లో మాన్యువల్‌గా చేపట్టాలని నిర్ణయించి, మిగిలిన మండలాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. జూలై 8న ప్రారంభమైన ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. తొలుత తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో గణాంకాల సేకరణ నెమ్మదిగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతంతమాత్రమే.. పట్టణ, నగర ప్రాంతాల్లో సర్వే అంతంతమాత్రంగా సాగుతోంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను రెండు దశల్లో జూలై, ఆగస్టు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, మరో నెల గడువు పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్లలోని 51 గ్రామీణ మండలాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లోని 4,804 బ్లాకుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50 లక్షల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 33,98,595 మంది వివరాలను సేకరించారు. దీంట్లో 51 గ్రామీణ మండలాల్లో 26,12,700 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 7,107 మంది వివరాలు సేకరించారు. కదలని ప్రక్రియ అర్బన్ ప్రాంతాల్లో సర్వే ముందుకు కదలని పరిస్థితి. మొత్తం 7,03,148 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో 17,135 మంది వివరాలు సేకరించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 2,07,579, కాకినాడలో 2,03,956 మంది వివరాలు సేకరించారు. అలాగే అమలాపురం మున్సిపాలిటీలో 38,659, రామచంద్రపురంలో 23,484, మండపేటలో 45,541, తునిలో 33,787, పెద్దాపురంలో 23,807, సామర్లకోటలో 36,172, పిఠాపురం మున్సిపాలిటీలో 31,375, ఏలేశ్వరం నగర పంచాయతీలో 19,715, ముమ్మిడివరంలో 21,920 మంది వివరాలు సేకరించారు. వేగవంతానికి చర్యలు జిల్లాలో ప్రజా సాధికార సర్వే వేగవంతానికి చర్యలు చేపట్టాం. మరో పది రోజుల గడువు ఉంది. గడువులోపు సర్వే పూర్తయ్యేలా పర్యవేక్షించడమే కాకుండా, పట్టణ, మండల, డివిజన్ అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ -
జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తి : జేసీ
రంగంపేట : జిల్లాలో 40 శాతం సాధికార సర్వే పూర్తయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో జిల్లాలోని అన్ని మండల అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,800 మంది సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు గాను, ఇప్పటి వరకూ 6 లక్షల 13 వేల కుటుంబాల సర్వే పూర్తి చేశారని తెలిపారు. నెల రోజుల్లోగా ఈ సర్వే పూర్తి చేస్తామన్నారు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఎంపీడీఓ కె.కిషోర్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూర్య ప్రభ తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ సర్వేకు నిరుద్యోగులు..కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
మహారాణిపేట : జిల్లాలో మందకొడిగా సాగుతున్న ప్రజాసాధికారిత సర్వే (పల్స్ సర్వే)ను మరింత వేగవంతం చేసేందుకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ చర్యలు చేపట్టారు. జిల్లాలో 1051 బందాలు సర్వే చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో 150 బందాలు పని చేయడం లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఆయన దష్టిసారించారు. జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నిరుద్యోగులైన యువతీ, యువకులను ఎంపిక చేసి వారిచే సర్వే చేపట్టేందుకు రంగంసిద్ధం చేశారు. ఇప్పటికే 124 మందిని ఎంపిక చేసి సర్వే ప్రక్రియలో వారికి శిక్షణ ఇచ్చారు. మరో 200 మందిని ఎంపిక చేసి వారికి కూడా శిక్షణ ఇచ్చి రెండు , మూడు రోజుల్లో పల్స్ సర్వేకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పల్స్ సర్వే ప్రక్రియలో పూర్తి స్థాయిలో అధికారులు తో పాటు శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొనేలా చేయాలని కలెక్టరేట్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సర్వేలో పాల్గొనే నిరుద్యోగులకు రోజుకు రూ.200 ఇవ్వనున్నారు. -
పైసలుంటేనే.. 'పల్స్' పట్టేది
- ప్రభుత్వ ఉద్యోగులకు అందని నగదు రహిత వైద్య సేవలు - ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని చేతులెత్తేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు - పట్టించుకోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు - ప్యాకేజీ సొమ్ము 40% పెంచాలని పట్టు.. ఏడాదిగా తేలని వివాదం.. - నెట్వర్క్ ఆసుపత్రులకు సుమారు రూ.100 కోట్లు బకాయి పడ్డ ప్రభుత్వం - ఉచిత ఓపీ సేవలకూ గ్రహణం.. నిమ్స్‌లోనూ అదే తీరు - డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నా.. రీయింబర్స్మెంట్ రాక తిప్పలు - ఇప్పటిదాకా డబ్బులు కట్టి చికిత్స చేయించుకున్న వారు లక్ష మందికి పైనే.. - సర్కారుపై పోరుకు ఉద్యోగ సంఘాల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండె ఆపరేషన్ కోసం నిమ్స్‌కు వెళ్లారు. అయితే నగదు రహిత ఆరోగ్య కార్డులపై చికిత్స చేయలేమని ఆసుపత్రి వర్గాలు చేతులెత్తేశాయి. ఆలస్యం కావడంతో ఆ ఉద్యోగి చనిపోయారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ టీచర్‌కు కిడ్నీల వ్యాధి వచ్చింది. డయాలసిస్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకోసం నిమ్స్‌కు వస్తే.. నగదు రహిత ఆరోగ్య కార్డు కింద డయాలసిస్చేయలేమని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ...నగదు రహిత వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆరోగ్య కార్డులు ఉద్యోగులను ఏ మేరకు ఆదుకుంటున్నాయో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు! నగదు రహిత చికిత్సలు అందక వేలాది మంది ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. సొంతంగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నా.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు నగదు రహిత చికిత్సకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభించినా.. ఆయా ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక కార్పొరేట్ ఆసుపత్రులైతే నగదు రహిత వైద్యాన్ని ఏమాత్రం అమలు చేయడం లేదు. ప్యాకేజీ కింద ఇచ్చే సొమ్మును 40 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏడాదిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. బోధనాసుపత్రులు మినహా రాష్ట్రంలో ఏ ఆసుపత్రులూ నగదు రహిత ఆరోగ్య కార్డులను పట్టించుకోవడం లేదు. దీంతో నగదు రహిత వైద్యం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. సొంత డబ్బులతోనే.. రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పెన్షన్‌దారులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 22 లక్షల మందికిపైగా ఉన్నారు. వారందరి కోసం ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న దాదాపు 200 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. నగదు రహిత కార్డులు ఇచ్చిన మొదటి రెండు మూడు నెలల వరకు ఆసుపత్రులు బాగానే సహకరించాయి. కానీ ప్రభుత్వం ఆయా ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలను నిలిపివేశాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు దాదాపు 100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులైతే ప్యాకేజీ సొమ్ము పెంచకుండా నగదు రహిత వైద్యం అందించలేమని స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య కార్డుల కింద ఇప్పటివరకు 10 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వైద్య సేవలు పొందారు. పది నెలలుగా ఆరోగ్య కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలను నిలిపివేయడంతో.. లక్ష మందికిపైగా ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకున్నారు. ఉచిత ఓపీ సేవలూ అందడం లేదు ఓపీ సేవలను ఉచితంగా అందించాలని ఉద్యోగులు చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు నెలల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్‌లో, మరో ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సేవలను ప్రారంభించారు. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉద్యోగుల కోసమే ప్రత్యేక ఓపీ సేవలు అందించాలి. కానీ ఏ ఒక్క ఆసుపత్రిలోనూ ఈ సేవలు అందడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. స్వయంగా మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన నిమ్స్‌లోనే సేవలకు దిక్కులేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బేఖాతరు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రీమియం చెల్లిస్తామన్నా అదే గోస కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలకు తాము ప్రీమియం చె ల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆరోగ్య కార్డులను సక్రమంగా అమలు చేయడం లేదని అఖిల భారత ఉపాధ్యాయుల సంఘం (ఏఐటీఓ) ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నిమ్స్ ఆసుపత్రి కూడా ఉద్యోగులకు సహకరించడంలేదని విమర్శించారు. ఉచిత ఓపీ సేవలకు ఆదేశాలు రాలేదంటూ నిమ్స్ వర్గాలు ఉద్యోగులను వెనక్కు పంపిస్తున్నాయన్నారు.