వాస్తవ ఘటనలతో... | pulse movie second schedule starts | Sakshi
Sakshi News home page

వాస్తవ ఘటనలతో...

Published Sat, Feb 22 2020 2:36 AM | Last Updated on Sat, Feb 22 2020 2:36 AM

pulse movie second schedule starts - Sakshi

దిలీప్‌కుమార్‌ మల్లా, రోషిని పటేల్‌ సింగాని జంటగా నటిస్తున్న చిత్రం ‘పల్స్‌’. అమి ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. రమణ తూముల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమ ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని ఓ జంట ఎలా చెప్పిందన్నది ఆకట్టుకుంటుంది. వైజాగ్‌లో తొలి షెడ్యూల్‌చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’’ అన్నారు. భవానీశంకర్, డా. శివరాం, ఆనంద్‌ చెలికాని, చంద్రశేఖర్‌ పాత్రుడు ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నిజాని అంజన్, కెమెరా: చందు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement