29న పల్స్‌పోలియో
29న పల్స్‌పోలియో
Published Thu, Jan 19 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
అయిదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలి
అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు
డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రయ్య
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : ఈ నెల 29న పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) డాక్టర్ కె.చంద్రయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలియో చుక్కల మందు వేస్తారన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై రూట్ సూపర్‌వైజర్లకు కాకినాడలోని తన కార్యాలయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. జీవనాధారం కోసం వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీలు, కోళ్లఫారాల్లో పని చేస్తున్నవారి చిన్నారులను గుర్తించి తప్పకుండా పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి రోజు ఎంపిక చేసిన పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేయాలని, రెండు, మూడు రోజుల్లో ప్రతి ఇంటినీ సందర్శించి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేయాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమంలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తీవ్ర జ్వరం, విరేచనాలు, అస్వస్థతతో బాధ పడుతున్న చిన్నారులకు చుక్కల మందు వేయరాదన్నారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయాలన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం నుంచి సంబంధిత పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు పల్స్‌పోలియా చుక్కల మందు సరఫరా, పోలియో కేంద్రాల్లో పాటించాల్సిన విధులు, బాధ్యతలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేష¯ŒS అధికారి డాక్టర్ అనిత, కాకినాడ, పెద్దాపురం డివిజన్ల సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement