సర్వే ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి కావాలి
సర్వే ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి కావాలి
Published Thu, Nov 24 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి
కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వే ప్రక్రియ ఈకేవైసీతో సహా ఈ నెలాఖరుకు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గురువారం విజయవాడ సెంట్రల్ కంట్రోల్ అండ్ కమాండ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అరుణ్‌కుమార్ సర్వే ప్రగతిని వివరించారు. జిల్లా ప్రొజెక్టెడ్ జనాభా 52 లక్షలకు గాను 43 లక్షల జనాభా సర్వే పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 16 లక్షల 93 కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, ఏజన్సీ మండలాలతో పాటు మైదానప్రాంతాల్లో డోర్‌లాక్డ్, తాత్కాలిక వలస వెళ్లిన దాదాపు లక్షా 94 కుటుంబాల సర్వే ఇంకా మిగిలి ఉందన్నారు. మైదాన ప్రాంత సర్వేను ఈ నెలాఖరుకు, ఏజన్సీ మండలాల్లో సర్వేను డిసెంబర్ ఐదో తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ మండలాల్లో జనావాసాలు దూరందూరంగా ఉండటం వల్ల సర్వే ఆలస్యమవుతోందని, దీనిని అధిగమించేందుకు సర్వే బ్లాకులను మరింత విభజించి ఎక్కువ సంఖ్యలో ఎన్యూమరేటర్లను, ట్యాబ్‌లను రంగంలోకి దించుతామన్నారు. పట్టణ ప్రాంత ప్రజాసాధికార సర్వేలో 76 శాతం పురోగతితో జిల్లా అగ్రస్థానంలో ఉందని, 69 శాతంతో వెనుకబడిన పిఠాపురం మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో సర్వే ముమ్మరంగా సాగుతోందన్నారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీపీవో టీవీఎస్ గంగాధరకుమార్, డిఆర్‌డిఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఎన్‌ఐసి సీనియర్ సైంటిస్ సయ్యద్ ఉస్మాన్, సెక్షన్ అధికారి రామ్మోహనరావు, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement