line
-
డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ: డ్రోన్ల కలకలం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై అధికారులు డ్రోన్‌ను గుర్తించారు. ఈ నేపధ్యంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్లో బుధవారం ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌పై డ్రోన్ పడి ఉండటాన్ని చూశామని, ఫలితంగా 30 నిమిషాల పాటు మెట్రో సేవలు దెబ్బతిన్నాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై నుంచి ఆ డ్రోన్‌ను తొలగించేంత వరకూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దాక మెట్రో సేవల పునరుద్ధరణ జరిగింది.ఇదేవిధంగా బుధవారం రాత్రి 8 గంటలకు జనక్‌పురి మెట్రో లైన్‌కు ఎగువన అనుమానాస్పద డ్రోన్ కనిపించడంతో ఆ మార్గంలో మెట్రోను నిలిపివేశారు. దీంతో కాసేపు మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనల గురించి ఢిల్లీ మెట్రో అధికారులు మాట్లాడుతూ డ్రోన్లు కనిపించిన బ్లూ లైన్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బ్లూ లైన్లో మెట్రో సేవలను పునరుద్ధరించామన్నారు. ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
దేవరకద్ర–కృష్ణా రైల్వే విద్యుదీకరణ పూర్తి.. ముఖ్య నగరాలకు తగ్గనున్న దూరం
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వేస్టేషన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్–మునీరాబాద్ రైల్వేలైన్‌లో భాగంగా ఇటీవల చేపట్టిన బ్రాడ్ గేజ్ లైన్ పనులు పూర్తి కావడంతో డెమో రైలును ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకుగాను దేవరకద్ర నుంచి మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణా రైల్వేస్టేషన్ వరకు 64 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలకు అత్యంత అందుబాటులో ఉండే మార్గంగా దేవరకద్ర–కృష్ణా రైల్వేలైన్ మారబోతోంది. దాదాపు అన్ని రూట్లకు వంద కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రూట్లో డెమో ప్యాసింజర్ రైలుతో పాటు గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు వంటి భారీ వస్తువులను రవాణా చేసే అవకాశం ఉంది. ఈ మార్గంలో త్వరితగతిన విద్యుద్దీకరణ పూర్తి చేసిన నిర్మాణ, ఎలక్ట్రిక్ విభాగాల అధికారులను దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ అభినందించారు. -
లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు?
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయితే దీనికిముందే భారత్, పాకిస్తాన్ విభజనకు సన్నాహాలు మొదలయ్యాయి. 1937, ఆగష్టు 3న లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పిస్తూ, భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని, అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని స్పష్టంగా తెలిపారు. లార్డ్ మౌంట్ బాటన్ అందించిన ప్రణాళికను జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అంగీకరించారు. అయితే విభజనను అమలు చేయడం అంత సులభం కాలేదు. విభజన అంత సులభం కాలేదు భారతదేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, దేశంలోని ఏ భాగాన్ని భారతదేశంలో ఉంచాలి? పాకిస్తాన్‌కు ఏ ప్రాంతం ఇవ్వాలో నిర్ణయించడం కష్టంగా మారింది. పలు తర్జనభర్జనల తర్వాత మత ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ హిందూ-ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉన్న అనేక ప్రాంతాల విషయంలో విభజన అంత సులభం కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విభజన బాధ్యతను సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సిరిల్ రాడ్‌క్లిఫ్ గతంలో భారతదేశాన్ని సందర్శించలేదు. అలాగే భారతదేశలోని విభిన్న జనాభా గురించి అతనికి తెలియదు. సిరిల్ రాడ్‌క్లిఫ్ ఎవరు? రాడ్‌క్లిఫ్ వృత్తిరీత్యా న్యాయవాది. బ్రిటన్‌లోని వేల్స్ నివాసి. అతని తండ్రి ఆర్మీ కెప్టెన్. రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌లోని హాలీ బెర్రీ కాలేజీలో చదువుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువును పూర్తి చేసిన తర్వాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. ప్రముఖ కేసులను చేపట్టడం వలన బ్రిటన్‌లో పాపులర్ అయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అతను సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యాడు. 1945లో తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. విభజన రేఖ ఎలా గీశారు? భారత స్వాతంత్ర్య చట్టం ఆమోదం పొందిన తరువాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య విభజనకు రేఖ గీసే బాధ్యత సిరిల్ రాడ్‌క్లిఫ్ చేతికి వచ్చింది. అతను రెండు సరిహద్దు కమిషన్లకు చైర్మన్‌గా నియమితుడయ్యాడు. అతనికి ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లు సహాయం అందించారు. 1947, జూలై 8 న సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశానికి చేరుకున్నాడు. 5 వారాల్లో విభజన రేఖను గీసే బాధ్యత అతనికి అప్పగించారు. జనాభా పరంగా బెంగాల్, పంజాబ్‌లను విభజించడం అంత సులభం కాలేదు. రెండు చోట్లా హిందూ-ముస్లిం జనాభా సమానంగా ఉండేది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ రాడ్‌క్లిఫ్ తన పనిని 12 ఆగస్టు 1947న పూర్తి చేశాడు. ఈ విభజన రేఖను అధికారికంగా 1947, ఆగస్టు 17న బహిరంగపరిచారు. దీనికి రాడ్‌క్లిఫ్ లైన్ అని పేరు పెట్టారు. లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్‌ను పాకిస్తాన్‌కు ఇస్తారా లేదా అనే దానిపై చర్చ జరిగింది. ఒక ఇంటర్వ్యూలో సిరిల్ రాడ్‌క్లిఫ్ మాట్లాడుతూ విభజనకు సన్నాహక సమయంలో తాను లాహోర్‌ను భారతదేశంలోనే చేర్చానని, అయితే పాకిస్తాన్లో పెద్ద నగరం లేదని గమనించి, లాహోర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ విధంగా లాహోర్ స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజుల వరకూ భారతదేశంలో భాగంగా ఉంది. తరువాత అధికారిక ప్రకటనతో అది పాకిస్తాన్లో చేరింది. సరిహద్దును పరిష్కరించిన తర్వాత వలసలు ప్రారంభమయ్యాయి. భారతదేశం నుండి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ నుండి భారతదేశానికి కోట్ల మంది ప్రజలు తరలివెళ్లారు. విభజన తర్వాత రాడ్‌క్లిఫ్ బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఎప్పుడూ భారతదేశానికి రాలేదు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ..
అంతరిక్షంలో నక్షత్రాలన్నీ సమూహాలు (గెలాక్సీలు)గా.. అక్కడో గుంపు, ఇక్కడో గుంపు అన్నట్టుగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలకు ఒకచోట మాత్రం ఏదో గీత గీసినట్టుగా నక్షత్రాల వరుస కనిపించింది. అదేదో పదులు, వందల్లో కాదు.. లక్షల నక్షత్రాలు అలా లైన్ కట్టాయి. అదేమిటా అని చూస్తే నోరెళ్లబెట్టేసంగతి బయటపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నక్షత్రాల లైన్ ఏమిటని చూసి.. సాధారణంగా ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ) మధ్యలో పెద్ద బ్లాక్‌హోల్ ఉంటుంది. దాని చుట్టూరానే నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కూడా గుంపుగా ఉంటాయి. కానీ ఇటీవల హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో.. నక్షత్రాలు ఒక గీతలా వరుసగా ఉండటం, అదీ ఓ చిన్న గెలాక్సీ దగ్గర మొదలై కోట్ల కిలోమీటర్ల పొడవునా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చిత్రాల్లో అదేదో ‘పొరపాటు (ఎర్రర్)’ కావొచ్చని తొలుత భావించారు. కానీ యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ వాన్ డొక్కుమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసి.. ఆ నక్షత్రాల వరుస ముందు ఓ ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. క్షుణ్నంగా పరిశీలించి అది కృష్ణబిలం అని తేల్చింది. గెలాక్సీ నుంచి తప్పించుకుని.. ఓ పెద్ద కృష్ణబిలం తన గెలాక్సీ నుంచి తప్పించుకుని, అమిత వేగంతో ప్రయాణిస్తూ.. దారిలో ఈ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు, మూడు గెలాక్సీలు ఢీకొన్న క్రమంలో.. ఒక గెలాక్సీ నుంచి విసిరేసినట్టుగా ఈ కృష్ణబిలం బయటికి వచ్చి ఉంటుందని అంచనా వేశారు. దాని పరిమాణం మన సూర్యుడి కంటే రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. అది గంటకు సుమారు 58 లక్షల కిలోమీటర్ల అమిత వేగంతో ప్రయాణిస్తోందని గుర్తించారు. నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? విశ్వం ఏర్పడే క్రమంలో గెలాక్సీలతోపాటు వాటి మధ్యలో అక్కడక్కడా విడిగా వాయువులు, ఇతర ఖగోళ పదార్థాలు ఉండిపోయాయని శాస్త్రవేత్త పీటర్ వాన్ చెప్పారు. ఈ కృష్ణబిలం ప్రయాణిస్తున్న క్రమంలో దాని ఆకర్షణ శక్తి వల్ల వాయువులు, ఖగోళ పదార్థాలు ఒక్కచోటికి చేరుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణబిలం వెనుక ఏర్పడే అతిశీతల పరిస్థితితో.. అవి సంకోచించి నక్షత్రాలు జన్మిస్తున్నాయని వివరించారు. విశ్వంలో ఇలాంటి దానిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. దీని గుట్టు తేల్చేందుకు త్వరలో ప్రఖ్యాత జేమ్స్‌వెబ్ టెలిస్కోప్‌తో పరిశీలించనున్నామని వెల్లడించారు. ఏమిటీ కృష్ణ బిలం? అతిపెద్ద నక్షత్రాలు వేలకోట్ల ఏళ్లపాటు మండిపోయి, ఇంధనం ఖాళీ అయ్యాక.. వాటిలోని పదార్థమంతా కుచించుకుపోయి ‘కృష్ణబిలం’గా మారుతాయి. వీటి గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండి.. సమీపంలోకి వచ్చే అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోవడంతో.. నేరుగా కనబడవు. అందుకే కృష్ణబిలం (బ్లాక్‌హోల్స్) అని పిలుస్తారు. -
బాలయ్య సినిమాలు చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోలు
-
1912తో విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం
– సీజీఆర్ఎఫ్ అధ్యక్షుడు డి.ధర్మారావు – రాజమహేంద్రవరంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కారవేదిక దానవాయిపేట(రాజమహేంద్రవరం) : విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే సంబంధిత అధికారులు వారి సమస్యలను పరిష్కరిస్తారని, ఈ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) అధ్యక్షుడు డి.ధర్మారావు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి డి.ధర్మారావు పాల్గొన్ని వినియోగదారుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ నుంచి ఐదు జిల్లాలో(శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ)లో వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించామన్నారు. 2016లో 336 ఫిర్యాదులు వస్తే 332 విద్యుత్ సమస్యలను పరిష్కారించామని, 2017లో 370 ఫిర్యాదులు 235 సమస్యలను పరిష్కారించామని తెలిపారు. కోన్ని ఫిర్యాదుల్లో సంస్థ అధికారుల నుంచి వినియోగదారులకు నష్టపరిహారం అందజేసినట్టు వెల్లడించారు. విద్యుత్ షాక్‌తో మృతి చెందిన, శాశ్వత అంగవైకల్యం పొందిన బాధితుడికి సంస్థ ద్వారా రూ.ఐదు లక్షలు నష్టపరిహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు కె.బాలాజీ, పి.వి.రమణరావు, బాలాజీ ప్రసాద్ పాండే, రాజమహేంద్రవరం టౌన్–1 ఏడిఈ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫెస్ట్ ఆఫ్ లైఫ్
-
భద్రాద్రి రైల్వేలైన్ సర్వే పూర్తి
ఏలూరు సిటీ : కొవ్వూరు–భద్రాచలం మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించి సర్వే పూర్తి చేశామని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. జిల్లాలో కొత్త రైలు మార్గాలు, వంతెనల నిర్మాణం తదితర అంశాలపై రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. భద్రాచలం రైల్వే లైన్‌కు సంబంధించి రైల్వే శాఖ నుంచి తగిన ప్రతిపాదనలు ఇస్తే యుద్ధప్రాతిపదికన భూములు సేకరించి అప్పగిస్తామన్నారు. జిల్లాలో రైల్వే లైన్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రానున్న రెండేళ్లలో మన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించనుందని, ఈ దృష్ట్యా రైల్వేలకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త రైలు మార్గాలను గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ రైల్వే అడిషనల్ మేనేజర్ కె.వేణుగోపాలరావును కోరారు. ఏలూరు నుంచి జీలుగుమిల్లి మీదుగా భద్రాచలం వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే మెట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. కైకలూరు నుంచి భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు రైల్వే రెండో ట్రాక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, డెల్టాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏలూరు నుంచి ద్వారకాతిరుమల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే భక్తులు ఉపయోగం కలుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏలూరు లేదా భీమడోలులో రైలు దిగి రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల వెళ్లాల్సి వస్తోందన్నారు. రైల్వే ఏడీఆర్ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ వట్లూరు వద్ద ఆర్ఓబీ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని, పాలకొల్లులో రైల్వే గేటు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల, రైల్వే డివిజినల్ ఇంజినీర్ వరుణ్‌బాబు, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఏవీ సత్యనారాయణ, పార్సిల్ సూపర్వైజర్ ఎస్కే మీర్‌హుస్సేన్ పాల్గొన్నారు. -
స్టార్టప్స్ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు
ముంబయి / న్యూఢిల్లీ / బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ సంస్థల ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నారు. ఇటీవల వందలమందిపై వేటు వేసిన దేశీయ అతిపెద్ద ఈ కామర్స్ స్నాప్‌డీల్ బాటనే ఇతర సంస్థలు అనుసరిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ-కామర్స్, ఫుడ్-టెక్, లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధపడుతున్నాయి. దాదాపు16వందలమందికి పైగా 'పింక్ స్లిప్'లను జారీ చేశాయి. ఈ వేసవిలో వారంతా మరో ఉద్యోగాన్ని చూసుకోవాలని అల్టిమేట్టం కూడా జారీ చేశాయి. ముఖంగా సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా, ఫ్యాషన్ పోర్టల్ యప్ మీ, టోలెక్సో వంటి స్టార్టప్ కంపెనీలు ఇటీవల వందలమందిని తొలగించేందుకు నిర్ణయించాయి. స్థిరమైన వృద్ధితో వేగంగా ఎదగలేక పోతున్న మధ్యతరహా సంస్థలు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పేరిట వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాయని ఈ దోరణి ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా అత్యధికులను ఈ సంవత్సరమే తీసివేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ వజీర్ అడ్వయిజర్స్ ఎండీ హర్మీందర్ సాహ్నీ వ్యాఖ్యానించారు. మరికొన్ని కంపెనీలు పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు. పేమెంట్ గేట్ వే సంస్థ పేయూ, తన 85 మంది ఉద్యోగుల కాల్ సెంటర్ విభాగాన్ని 25 మందికి కుదించింది. మాతృసంస్థ ఇండియా మార్ట్ లో విలీనమైన టొలెక్సో, 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టొలెక్సో సీఈఓ బ్రిజేష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తొలగింపుకు స్పందించిన ఆయన కారణాలను వెల్లడించేందకు నిరాకరించినప్పటికీ.. డీమానిటైజేషన్ కూడా ఒక కారణమన్నారు. ఫ్యాషన్ రీటైలర్ 'యప్ మీ' వేర్‌హౌసింగ్, క్వాలిటీకంట్రోల్ విభాగంనుంచి ఉద్యోగులను తొలగించింది. తాము పెట్టిన పెట్టుబడులు గత సంవత్సరంలోనే తిరిగి వస్తాయని ఆశించామని, కానీ నోట్ల రద్దు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయామని సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఇండియాలో అమ్మకాలు పడిపోయాయని, దీంతో విదేశాల్లో విస్తరణపై దృష్టిని సారించేందుకు ఇక్కడ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మరోవైపు క్రాఫ్ట్స్ విల్లా సంస్థ తన పూర్తి ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని మూసివేస్తూ, 100 మందికి పైగా ఉద్యోగులను, ఇతర ఉన్నతాధికారులను తొలగించింది. ఈ తొలగింపుపై వివరణ కోరేందుకు సంస్థ సీఈఓ మనోజ్ గుప్తాను సంప్రదించాలని చూడగా, ఆయన అందుబాటులో లేరు. కాగా, స్టార్టప్ సంస్థల్లో నిధుల లేమి, పెట్టుబడుల కొరత కూడా ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. 2015లో సుమారు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన స్టార్టప్ సంస్థలు, గత సంవత్సరం కేవలం రూ. 8,500 కోట్ల పెట్టుబడులకు పరిమితం అయ్యాయి. 2015తో పోలిస్తే, ఇది దాదాపు 28 శాతం తక్కవ. దీంతో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
సర్వే ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి కావాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వే ప్రక్రియ ఈకేవైసీతో సహా ఈ నెలాఖరుకు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గురువారం విజయవాడ సెంట్రల్ కంట్రోల్ అండ్ కమాండ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అరుణ్‌కుమార్ సర్వే ప్రగతిని వివరించారు. జిల్లా ప్రొజెక్టెడ్ జనాభా 52 లక్షలకు గాను 43 లక్షల జనాభా సర్వే పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 16 లక్షల 93 కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, ఏజన్సీ మండలాలతో పాటు మైదానప్రాంతాల్లో డోర్లాక్డ్, తాత్కాలిక వలస వెళ్లిన దాదాపు లక్షా 94 కుటుంబాల సర్వే ఇంకా మిగిలి ఉందన్నారు. మైదాన ప్రాంత సర్వేను ఈ నెలాఖరుకు, ఏజన్సీ మండలాల్లో సర్వేను డిసెంబర్ ఐదో తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ మండలాల్లో జనావాసాలు దూరందూరంగా ఉండటం వల్ల సర్వే ఆలస్యమవుతోందని, దీనిని అధిగమించేందుకు సర్వే బ్లాకులను మరింత విభజించి ఎక్కువ సంఖ్యలో ఎన్యూమరేటర్లను, ట్యాబ్‌లను రంగంలోకి దించుతామన్నారు. పట్టణ ప్రాంత ప్రజాసాధికార సర్వేలో 76 శాతం పురోగతితో జిల్లా అగ్రస్థానంలో ఉందని, 69 శాతంతో వెనుకబడిన పిఠాపురం మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో సర్వే ముమ్మరంగా సాగుతోందన్నారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీపీవో టీవీఎస్ గంగాధరకుమార్, డిఆర్డిఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఎన్ఐసి సీనియర్ సైంటిస్ సయ్యద్ ఉస్మాన్, సెక్షన్ అధికారి రామ్మోహనరావు, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమ రైల్వేలైన్ వంతెన టెండర్లు రద్దు
డిసెంబరులో కొత్తగా టెండర్లు అమలాపురం : కోనసీమ రైల్వేలైన్ బాలారిష్టాలు వీడడం లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదు నర్సాపురం వరకు సాగే ఈ రైల్వేలైన్ లో కీలకమైన గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ పిలిచిన టెండరు రద్దయింది. ఈ నిర్మాణానికి సింగిల్ టెండరు పడగా, దీనికి సాంకేతిక అనుమతి లభించపోవడంతో రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. దశాబ్ధకాలంలో పెండింగ్‌లో ఉన్న కోనసీమ రైల్వేలేన్ కు గత బడ్జెట్లో గ్రీ¯ŒSసిగ్నల్ లభించిన విషయం తెలిసిందే. ఈ లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ గత బడ్జెట్లో సుమారు రూ.270 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను కోటిపల్లి వద్ద గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి కేటాయించారు. సుమారు 3.5 కిమీల నిడివిగల వంతెన నిర్మాణానికి జూలై24న టెండర్లు పిలిచారు. అయితే ఒక్క టెండరు మాత్రమే పడగా, దానికి సైతం సాంకేతిక అనుమతి లభించలేదు. దీంతో టెండరు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని రైల్వేశాఖాధికారులు నిర్ణయించారు. డిసెంబరు నెలాఖరు నాటికి టెండర్లు ఖరారవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనే అవకాశముందని రైల్వే శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక కారణాలతో టెండరు రద్దు చేయడంపై రైల్వే ఉన్నతాధికారులతో అమలాపురం పార్లమెంట్ సభ్యుడు పండుల రవీంద్రబాబు మంగళవారం హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్త, రైల్వేఛీప్ ఇంజినీరు బ్రహ్మానందరెడ్డిలతో చర్చించి టెండరు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కోనసీమ రైల్వేలైన్ కు సంబంధించి కోటిపల్లి నుంచి అమలాపురం నిర్మాణం జరిగే భట్నవిల్లి వరకు భూసేకరణ గతంలోనే పూర్తయింది. తాజాగా పేరూ రు వరకు సర్వే ఆరంభించగా, దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సర్వేను బోడసకుర్రు, వైనతేయ గోదావరి వరకు చేపట్టాలని ఇటీవల నిర్ణయించారు. ఇందుకు రైల్వేశాఖ రూ.45 కోట్లు కేటాయించింది. రెవెన్యూ, రైల్వే శాఖలు సంయుక్తంగా చేపడుతున్న ఈ సర్వే డిసెంబరు నెలాఖరుకు పూర్తయ్యే అవకాశముంది. కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవడం, మరోవైపు భూసేకరణకు సర్వే శరవేగంగా జరగడంతో రైల్వేలైన్ నిర్మాణ కల సాకారమవుతోందని కోనసీమవాసులు గంపెడాశతో ఉన్నారు. అయితే వంతెన టెండర్లు రద్దయ్యాయని తెలిసి వారు నిరాశ చెందుతున్నారు. -
రైల్వే మెయిన్‌లైన్‌ను పూర్తిచేయాలి
కాకినాడ సిటీ: కాకినాడ–పిఠాపురం రైల్వే మెయిన్‌లైన్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఎంపీ తోట నరసింహం కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభుని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ కార్యాలయ అధికారులు తెలిపారు. తొలిదశలోనే స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడలో మరింత అభివృద్ధి సాధించేందుకు కాకినాడ– పిఠాపురం మెయిన్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్రం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎల్టీటీ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో ప్రయోగాత్మక హాల్ట్ ఇచ్చారని, అయితే ఇటీవల ఎల్టీటీ నుంచి విశాఖకు వచ్చే ట్రైన్ నంబర్ 18520కు సామర్లకోటలో హాల్ట్ తొలగించారన్నారు. సామర్లకోట కేంద్రంగా నిత్యం అనేకమంది ముం» యికి ప్రయాణిస్తున్నారని వెంటనే హాల్ట్‌ను పునరుద్ధరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. -
ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటి విడుదలకు 220కేవీ లైన్
–17 కిలో మీటర్ల లైన్‌కు ప్రత్యేక బృందాలు కర్నూలు(అగ్రికల్చర్): ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి భూములకు నీళ్లు ఇచ్చేందుకు 220 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చర్యలు చేపట్టారు. నన్నూరు, పూడిచెర్ల, కేతవరం, గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు వరకు 17 కిలో మీటర్ల మేర హైటెన్షన్ లైన్ వేయాల్సి ఉంది. పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో పోల్‌కు 49 చదరపు గజాల స్థలం అవసరమవుతుంది. రైతులను ఒప్పించి భుములను తీసుకునేందుకు కలెక్టర్ తహశీల్దారు, మండల వ్యవసాయాధికారితో బృందాలను ఏర్పాటు చేశారు. పోల్‌కు అవసరమైన 49 చదరపు గజాల స్థలానికి పరిహారం కూడా ఇస్తారు. విద్యుత్ లైన్ వేసిన తర్వాత ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. -
భారీ టెక్ ఐపీఓగా లైన్ యాప్
న్యూయార్క్ : టెక్ ఐపీఓలకు నిరుత్సాహకరమైన ఏడాదిగా ఉన్న 2016లో అతిపెద్ద టెక్ ఐపీఓకు తెరపడింది. జపాన్ లోని ప్రముఖ మెసేజింగ్ యాప్ లైన్, తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా 1.1 బిలియన్ డాలర్ల(రూ.6711కోట్లకు పైగా)ను సమీకరించింది. 3500లక్షల షేర్లను లైన్ ఈ పబ్లిక్ ఆఫర్ లో జారీచేసింది. ప్రణాళిక కంటే ఎక్కువగానే ఒక్కో షేరు 32.84 డాలర్ల ధరకు కొనుగోలు కావడంతో 2016లో అతిపెద్ద ఐపీఓగా లైన్ రికార్డులోకెక్కింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఐపీఓ అని ఐపీఓ రీసెర్చ్ సంస్థ రీనైజెన్స్ క్యాపిటల్ ప్రకటించింది. గత నెల 150 మిలియన్ డాలర్ల ట్విలియో ఐపీఓను లైన్ ఐపీఓ బీట్ చేసినట్టు రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఈ ఐపీఓతో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ లో ఎల్ ఎన్ గుర్తుతో, టోక్యో స్టాక్ ఎక్సేంజ్ లో 3938 గుర్తుతో కంపెనీ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. లైన్ మెసేజింగ్ యాప్, దక్షిణ కొరియా అతిపెద్ద ఇంటర్నెట్ ఇంజెన్ దిగ్గజం నావర్ కార్పొరేషన్ కు చెందిన టోక్యో ఆధారిత కంపెనీ. ఉచిత మొబైల్ మెసేజింగ్, వాయిస్, వీడియో కాల్ సర్వీసులను ఈ పాపులర్ మెసేజింగ్ యాప్ ఆఫర్ చేస్తోంది. జపాన్ లో ట్విట్టర్, ఫేస్ బుక్ ల కంటే ఈ మెసేజింగ్ యాప్ ఎక్కువగా పాపులర్ అయింది. 2180లక్షల యూజర్లు లైన్ కు ఉన్నారు. అడ్వర్ టైజింగ్, మెసేజ్ లకు వాడే స్టాంపుల అమ్మకం ద్వారా లైన్ ఆదాయాలను ఆర్జిస్తోంది. -
మీ జీవితంలో ఉప్పు ఉందా?
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా’’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సంతోష్. ఎవరా అని చూసింది రేఖ. తమ్ముడు సంతోష్. ఆనందం... ఆశ్చర్యం! ‘‘ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. రారా’’ అంటూ ఆహ్వానించింది. ‘‘ఈ అక్కను చూడ్డానికి కూడా టైమ్ దొరకడం లేదా నీకు’’ అంటూ చిరుకోపం ప్రదర్శించింది. ‘‘సారీ అక్కా. వద్దామని ఉన్నా కుదరట్లేదు. అయినా నువ్వు కూడా ఇలా తిడితే నేనేం చేయగలను?’’ ‘‘సర్లేరా. అయినా నేను కాక ఇంకా తిట్టేవాళ్లున్నారా నిన్ను?’’ ‘‘ఉందిగా... మీ మరదలు.’’ ‘‘అదేంట్రా... ఇద్దరూ బాగానే ఉంటారుగా?’’ ‘‘ఉంటారు కాదు... ఉండేవాళ్లం. ఇప్పుడు రోజూ చిరాకులు పరాకులు.’’ ‘‘రోజూనా?’’ ‘‘రోజూ అంటే రోజూ కాదు. తరచుగా.’’ ఇంతలో ఆఫీసు నుంచి ఆనంద్ వచ్చేశాడు. ‘‘హల్లో సంతోష్... ఎలా ఉన్నావ్’’ అంటూ కూర్చున్నాడు. ‘‘సరే.. బావా మరుదులు మాట్లాడు కుంటూ ఉండండి. నేను వంట చేస్తా’’ అంటూ లేచింది రేఖ. ‘‘వంట అయిపోయింది. రండి’’ పిలిచింది రేఖ. ‘‘వద్దు అక్కా... నేను వెళ్తాను’’ అన్నాడు సంతోష్. ‘‘నేను కీర్తికి ఫోన్ చేసి చెప్పాలే. నువ్ భోంచేసి వెళ్లు.’’ తప్పదన్నట్లుగా కూర్చున్నాడు. రేఖ భోజనం వడ్డించింది. ‘‘ఏంటోయ్ ఈ కూరలో ఉప్పేలేదు’’ అన్నాడు ఆనంద్. ‘‘ఔనా... మర్చిపోయుంటాను.’’ ‘‘ఔనౌను.. తమ్ముడు వచ్చాడన్న ఆనందంలో మర్చిపోయుంటావ్.’’ ‘‘అంత లేదులెండి.’’ అంటూ కూరలో కాస్త ఉప్పు కలిపి, మళ్లీ వడ్డించింది రేఖ. ‘‘అబ్బబ్బ... ఇప్పుడు ఉప్పు ఎక్కువైందోయ్’’.. అరిచాడు ఆనంద్. ‘‘అబ్బబ్బ... తక్కువైతే తక్కువైందంటారు. ఎక్కువైతే ఎక్కువైందని అరుస్తారు. ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా?’’ ‘‘రోజూ అవుతూనే ఉన్నాంలే.’’ ‘‘ఇదిగో ఇదిరా మీ బావగారి వరస. పేరు ఆనందే కానీ, దుర్వాసుడి టైపు.’’ ‘‘నేను దుర్వాసుడి టైపయితే నీ పని బానే ఉండేది’’ అన్నాడు ఆనంద్. ‘‘బావుందనేగా చెప్తున్నా’’ అంది కొంటెగా రేఖ. అక్కాబావల గొడవ ముచ్చటగా అనిపించింది సంతోష్‌కి. అదే విషయం చెప్పాడు అక్కతో భోజనాల తర్వాత. ‘‘కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో సంసారంలో చిన్న చిన్న గొడవలు లేకపోయినా అలాగే ఉంటుందిరా’’ అంది రేఖ. ‘‘చిన్న చిన్నవైతే పర్లేదక్కా. మావి పెద్ద పెద్ద గొడవలు. అంటే మా కూరలో ఉప్పు ఎక్కువైందన్నమాట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఫీలవకురా. ఆ ఉప్పు బ్యాలెన్స చేయడానికి ఓ చిట్కా చెప్పనా?’’ అంది. ‘‘నీ దగ్గరకు వచ్చిందే అందుక్కదా.’’ ‘‘సరే... ఈసారి మీ ఆవిడ అరిచేటప్పుడు కొంచె నీళ్లు తాగు.’’ ‘‘కోపం వచ్చినవాళ్లు కదా వాటర్ తాగాలి?’’ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘నేను చెప్పింది చెయ్యరా. కొంచెం వాటర్ తాగి, మీ ఆవిడ అరుపులు తగ్గేంత వరకూ నోట్లో అలాగే ఉంచుకో. అలా రెండు వారాలు చేసి చూడు.’’ ‘‘ఓకే. ఐ విల్ ట్రై’’ అనేసి సెలవు తీసుకున్నాడు సంతోష్. రెండు వారాల తర్వాత ఫోన్ చేశాడు సంతోష్. ‘‘నువ్వు చెప్పిన చిట్కా బాగా పని చేసిందక్కా. ఇప్పుడు తను అరవడం లేదు’’ అన్నాడు సంతోషంగా. ‘‘వెరీగుడ్... ఇక హ్యాపీగా ఉండు’’ అంది రేఖ తృప్తిగా. ‘‘అలాగే అక్కా. కానీ నాదో డౌట్. జస్ట్ గుక్కెడు నీళ్లు నా సమస్యని ఎలా పరిష్కరించాయంటావ్?’’ నవ్వింది రేఖ.‘‘నీ సమస్యను పరిష్కరించింది నీళ్లు కాదురా... నువ్వే.’’ ‘‘నేనా? అర్థం కాలేదు’’ అన్నాడు అయోమయంగా. ‘‘నోట్లో నీళ్లు ఉంటే నువ్వు మాట్లాడ లేవు కదా! అందుకే నీ భార్య అరిచే టప్పుడు నువ్వు ఎదురు మాట్లాడి ఉండవు. ఎప్పుడైనా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య మాటా మాటా సమానంగా పెరిగితేనే సమస్యలు. ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండోవాళ్లు మౌనంగా ఉంటే కొట్లాట అన్నదే రాదు.’’ ‘‘వామ్మో... ఎన్ని తెలివి తేటలక్కా నీకు’’ అన్నాడు అక్క తెలివికి మురిసిపోతూ. ‘‘ఏడ్చావ్‌లే. జాగ్రత్తగా ఉండు’’... నవ్వి ఫోన్ పెట్టేసింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
స్కైప్ కాల్స్‌కు ఎయిర్టెల్ చార్జీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మొబైల్ డేటా ప్యాకేజీలు ఉపయోగించుకుని స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా కాల్స్ చేసుకునే వారు ఇకపై మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత డేటా ప్యాకేజీలలో చేర్చకుండా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (వీఓఐపీ)కి విడిగా చార్జీలు వసూలు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించడం ఇందుకు కారణం. డిస్కౌంటు రేటుతో లభించే ఇంటర్నెట్ ప్యాక్‌లు కేవలం బ్రౌజింగ్కి మాత్రమే పనిచేస్తాయని, వీఓఐపీ వీటిలో భాగం కాబోదని ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో పేర్కొంది. వీఓఐపీ వినియోగించుకునే వారు 10 కేబీకి/4 పైసలు (3జీ సర్వీసులకు), 10 కేబీకి/10 పైసలు (2జీ సర్వీసులకు) ప్రామాణిక డేటా రేటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా వీఓఐపీ డేటాకు విడిగా చార్జీలు విధించడం దేశీయంగా ఇదే తొలిసారి. దీని కోసం త్వరలో ప్రత్యేక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నామని ఎయిర్టెల్ వివరించింది. వాట్స్‌యాప్, లైన్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత సర్వీసుల సంస్థలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలంటూ మొబైల్ ఆపరేటర్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. -
నిబంధనలు ఉల్లంఘించలేదు
సచిన్, రేఖల గైర్హాజరుపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులైన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ గైర్హాజరు అంశం శుక్రవారం సభలో ప్రస్తావనకు వచ్చింది. వారిరువురూ చాన్నాళ్లుగా సభకు హాజరు కానప్పటికీ అది సభా నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. ఇరువురు సభ్యులూ 60 రోజులకు మించి సభకు గైర్హాజరు కాలేదని, అందువల్ల వారు ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. సభకు సచిన్, రేఖల గైర్హాజరు అంశాన్ని సీపీఎం సభ్యుడు రాజీవ్ లేవనెత్తారు. ఇందుకు కురియన్ ప్రతిస్పందిస్తూ నిబంధనల ప్రకారం ఓ సభ్యుడు/సభ్యురాలు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పార్లమెంటుకు చెందిన ఏదేని సభ సమావేశాలకు 60 రోజులకు మించి హాజరు కానట్లయితే ఆ స్థానాన్ని ఖాళీ అయినట్టుగా సదరు సభ ప్రకటించవచ్చని తెలిపారు. అయితే టెండూల్కర్ ప్రస్తుతానికి 40 రోజులుగా, రేఖ అంతకంటే తక్కువ రోజులుగా మాత్రమే సభకు గైర్హాజరయ్యారని, వీరిద్దరి వ్యవహారంలోనూ ఎటువంటి సభా నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. సచిన్, రేఖలను 2012, ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. టెండూల్కర్ 3 రోజులు, రేఖ 7రోజులు సభకు హాజరయ్యారు. సచిన్ ఈ ఏడాది ఒక్కరోజు కూడా సభకు రాలేదు. సచిన్ చివరిసారిగా 2013, డిసెంబర్ 13న సభకు హాజరయ్యారు. మరోవైపు రేఖ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న సభకు వచ్చారు. కాగా, తన అన్నకు బైపాస్ సర్జరీ ఆపరేషన్ ఉన్నందున సభలకు హాజరుకాలేకపోయానని సచిన్ వివరణ ఇచ్చాడు. -
మచ్చపడనివ్వని మంచి మనిషి
వాళ్లంతా విధి వంచితులు. చేయని తప్పుకు బలైనవారు. ఛిద్రమైన కలలను, యాసిడ్ దాడిలో కాలి కరిగిపోయిన ముఖాలను చూసుకుని కలత చెందుతున్నవాళ్లు. ఓరోజు వాళ్లను వెతుక్కుంటూ ఓ వెలుగు వచ్చింది. చీకటైపోయాయి అనుకున్న వారి జీవితాలను ఒక్కసారిగా కాంతిమంతం చేసింది. ఆ వెలుగు పేరు... రియాశర్మ! అక్టోబర్ 2, 2013. కర్ణాటకలోని హవేరీ జిల్లా. రేఖ అనే ఓ మహిళ ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రి మార్మోగుతోంది. భర్త చేసిన యాసిడ్ దాడిలో ఆమె తనువంతా మాంసపు ముద్ద అయ్యింది. ముఖం, మెడ, చేతులు, తొడలు... అన్ని భాగాలూ కాలిపోయాయి. చికిత్స చేయడానికి కూడా వీలు లేనట్టుగా ఉందామె శరీరం. అంతలో పరుగు పరుగున వచ్చింది ఓ ఇరవయ్యేళ్ల అమ్మాయి. రేఖ పరిస్థితి గురించి వాకబు చేసింది. ప్రథమ చికిత్స చేశాం కానీ పూర్తి చికిత్స చేయడానికి తగిన సదుపాయాలు తమ దగ్గర లేవని వైద్యులు చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యింది. కొందరు అధికారులతో మాట్లాడి ప్రభుత్వ సహాయాన్ని ఏర్పాటు చేసింది. తనకు తెలిసినవారికి ఫోన్ చేసి విరాళాలు కోరింది. వారి సాయంతో రేఖను మంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. రేఖ ప్రాణాలు కాపాడింది. రేఖ మాత్రమే కాదు... మరెందరో యాసిడ్ దాడి బాధితుల పాలిట ఆమె అదృష్ట దేవత. పేరు... రియాశర్మ. ఆమె సాయంతో ఎందరో బాధితుల శరీరంతో పాటు మనసుకు అయిన గాయాలు కూడా మానాయి. వారి జీవితాలు కొత్త బాట పట్టాయి. అనుకోకుండా వచ్చి అందరికీ బంధువై... కొంతమంది అందంగా ఉంటారు. వారి రూపం వల్ల కాదు. వారు కనిపించే విధానం వల్ల కూడా కాదు. వారి వ్యక్తిత్వం వల్ల. ఓ మహానుభావుడు చెప్పిన మాటలివి. వీటికి అర్థం రియాశర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పుట్టి పెరిగిన భారతదేశాన్ని వదిలి, పై చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లింది రియా. లీడ్‌స కాలేజ్ ఆఫ్ ఆర్ట అండ్ డిజైన్‌లో చేరింది. మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు అనుకోకుండా ‘సేవ్ ఫేస్’ అనే డాక్యుమెంటరీని చూసింది. పాకిస్థాన్‌లో జరిగిన యాసిడ్ దాడుల్లో గాయపడిన అమ్మాయిల గురించి తీసిన డాక్యుమెంటరీ అది. ఎందుకో చాలా రోజులపాటు దాన్ని మర్చిపోలేకపోయింది రియా. ఎప్పుడూ దాని గురించే ఆలోచించేది. అలాంటివాళ్ల కోసం ఎవరైనా ఏదైనా చేస్తే బాగుండేది అనుకునేది. కానీ అది తానే చేస్తానని ఎప్పుడూ అనుకోలేదామె. ఫైనలియర్ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది రియాకి. దానిని భారతదేశంలోనే చేయాలని అనుకుంది. కాలేజీ నుంచి అనుమతి పొంది తిరిగొచ్చింది. ఓ రోజు బెంగళూరులో సంచరిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు తారసపడ్డారు రియాకి. వాళ్లని చూడగానే ఆమె మనసు చలించింది. ఆ ఇద్దరి ముఖాలూ కాలిపోయాయి. చర్మం ముడతలు పడిపోయింది. ముక్కు, కళ్లు, నోరు... ఏ భాగమూ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఇద్దరి ముఖాల్లోనూ చిరునవ్వు తెలుస్తూనే ఉంది రియాకి. తాను చూసిన డాక్యుమెంటరీ గుర్తొచ్చిందామెకి. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి పలకరించింది. వాళ్ల కథలు విని కదిలిపోయింది. ప్రేమించలేదన్న కారణంతో మృగాళ్లు చేసిన ఘాతుకమే వారినలా మార్చిందని తెలుసుకుంది. అయినా కూడా వారు నిరుత్సాహపడకపోవడం, ఆ పని చేసిన వారిని నిందించకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. పైగా వారిలో ఒకమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తన పని తాను చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ రియాను వదలకుండా వెంటాడాయి. ఆలోచింపజేశాయి. ప్రతి మనిషీ అందంగా ఉండాలని కోరుకుంటాడు. ఆడపిల్లకయితే అందం ముఖ్యమంటారు. తను కూడా అలాగే అనుకునేది. కానీ ముఖం కాలిపోయి, వికృతంగా తయారైనా... అందరూ తమను చూసి ముఖం తిప్పుకుంటున్నా కూడా బాధపడకుండా, అవమానంగా భావించకుండా అందరి లోనూ ధైర్యంగా తిరుగుతున్నారు వాళ్లు. అంటే అందం శరీరంలో కాదు, వ్యక్తిత్వంలో ఉంది. పైగా జరిగిన దారుణం వారి తనువులను కాల్చేసినా మనోబలాన్ని మాత్రం సడలనివ్వ లేదు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేస్తున్నారు. కానీ అందరూ ఈ ఇద్దరిలానే ఉన్నారా? అలా ఉండటం అందరికీ సాధ్యపడుతుందా? ఈ ఆలోచన రియా గమనాన్ని పూర్తిగా మార్చేసింది. యాసిడ్ దాడి బాధితుల గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది. వారి గాథలు విని ఆమె కళ్లు చెమర్చాయి. వికృతంగా ఉన్న తమ రూపాల కారణంగా ఎలా అవమానాలు పడుతున్నామో వారు చెబితే ఆమె మనసు ఆర్ద్రమయ్యింది. వెంటనే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. వారి బాధను పంచుకోవడానికి ఓ వేదిక అవసరం అని భావించింది. తన ఫ్రెండ్స కొందరితో కలిసి ‘మేక్ లవ్... నాట్ స్కార్స’ అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. యాసిడ్ బాధితులు ఆడ, మగ ఎవరైనా కూడా తమ బాధను ఇందులో వెల్లడించేందుకు అవకాశం కల్పించింది. అయితే అది వారి గుండె బరువు మాత్రమే తీరుస్తుంది. వారికి మనోధైర్యాన్ని ఇవ్వదు. వారి భవిష్యత్తుకు కొత్త బాట పరవదు. అందుకే ఆ బాధ్యతను తాను తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులందరినీ కలుసుకుని వాళ్లకి ధైర్యం చెప్పింది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. ‘రూపం ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. అది ఉన్నప్పుడు మనిషికి అందంతో పని లేదు’ అని వివరించింది. వాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి మేకోవర్ ప్రాజెక్టును మొదలు పెట్టి... అందరికీ అందంగా మేకప్‌లు వేయించింది. ర్యాంప్‌షో నిర్వహించింది. ఆమె పరిచయమైన తరువాత అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం అని బాధితులంతా అంటున్నారు. కొందరు ఇప్పటికే తమ భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునే పనిలో పడ్డారు. అంటే... రియా వారిలో ఎంత మార్పు తెచ్చిందో ఊహించవచ్చు. అయితే తన పని అక్కడితో అయిపోలేదు అంటోంది రియా. త్వరలోనే తన వెబ్సైట్ పేరుతోనే ఎన్జీవోని స్థాపించబోతోంది. ఇప్పటికే కొందరు ఆమెతో చేతులు కలిపారు. వారంతా కలిసి ఎక్కడ ఎవరిపై యాసిడ్ దాడి జరిగినట్లు తెలిసినా వెంటనే అక్కడికి వెళ్లిపోతారు. ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వంతో మాట్లాడి సహాయం అందేలా చేస్తారు. తమ వంతుగా విరాళాలు సేకరించి బాధితులందరినీ ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఈ సేవలను విస్తరించాలని అనుకుంటోంది రియా. అందుకోసమే ఎన్జీవోను ఏర్పాటు చేయాలని అను కుంటోంది. ఆమె అనుకున్నదంటే సాధిస్తుంది. ఎందు కంటే... సాధించకుండా వదిలే తత్వం కాదామెది! - సమీర నేలపూడి ముఖం మీద చిన్న మచ్చ వస్తేనే కంగారు పడిపోతాం. అది మాసిపోయే వరకూ అవీ ఇవీ పూసేస్తుంటాం. కానీ ఎవరో ఏదో కోపంతో యాసిడ్ పోస్తే... ముఖం కాలిపోయి, తమను తామే అద్దంలో చూసుకోవడానికి బాధపడే పరిస్థితుల్లో ఉన్నవాళ్ల బాధ ఎలా ఉంటుంది! వాళ్లను చూసినప్పుడు నా మనసు కదిలిపోయింది. అందుకే అందం గురించి ఆలోచించకూడదని, అసలు జీవితంలో ఎప్పుడూ మేకప్ అన్నదే వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. - రియాశర్మ