రైల్వే మెయిన్‌లైన్‌ను పూర్తిచేయాలి
Published Wed, Sep 28 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
కాకినాడ సిటీ: కాకినాడ–పిఠాపురం రైల్వే మెయిన్‌లైన్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఎంపీ తోట నరసింహం కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభుని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ కార్యాలయ అధికారులు తెలిపారు. తొలిదశలోనే స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడలో మరింత అభివృద్ధి సాధించేందుకు కాకినాడ– పిఠాపురం మెయిన్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్రం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎల్‌టీటీ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో ప్రయోగాత్మక హాల్ట్ ఇచ్చారని, అయితే ఇటీవల ఎల్‌టీటీ నుంచి విశాఖకు వచ్చే ట్రైన్ నంబర్ 18520కు సామర్లకోటలో హాల్ట్ తొలగించారన్నారు. సామర్లకోట కేంద్రంగా నిత్యం అనేకమంది ముం» యికి ప్రయాణిస్తున్నారని వెంటనే హాల్ట్‌ను పునరుద్ధరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.
Advertisement