main
-
దేశంలో పెరిగిన ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి. -
TS: చేతికే చెక్ పెట్టాలి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం తన సన్నద్ధతను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వేగవంతం చేసింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదురయ్యే పోటీపై లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల గణాంకాలు, వివిధ రూపాల్లో అందిన నివేదికల ఆధారంగా తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనన్న అంచనాకొచ్చింది. ఆ పార్టీ అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు, ఇస్తున్న హామీలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరుతెన్నుల వంటి అంశాలపై లోతుగా దృష్టి సారించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వరుస సభలు, సమావేశాలతో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల పేరిట పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల పనితీరుపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే.. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2014లో 21 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, మరో 50 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 19 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ మరో 68 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇక 2014లో ఐదు స్థానాల్లో, 2018లో కేవలం ఒకే చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పది నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలవగా, ఇందులో సగం వరకు హైదరాబాద్ నగరంలోనే ఉండటం గమనార్హం. ఈ గణాంకాలతో పాటు, ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వేలు, నిఘా సంస్థల నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఉంటుందో బీఆర్ఎస్ అధినేత విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొంత పుంజుకున్నట్లు కనిపించినా, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గినట్లు అధికార పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కొంత మెరుగయ్యే అవకాశమున్నా ప్రధాన ప్రత్యరి్థగా మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కాంగ్రెస్‌తోనే ప్రధానంగా పోటీ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. చేరికలతో బలోపేతం రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 2014 ఎన్నికల తర్వాత 25 మంది ఇతర పారీ్టల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. టీడీపీ నిరీ్వర్యమైనా, 2018 ఎన్నికల్లో మొత్తం మీద 87 స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు ప్రదర్శించింది. 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన హుజూర్నగర్, మునుగోడు స్థానాలను ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో వివిధ పారీ్టల నుంచి చేరిన 25 మంది ఎమ్మెల్యేలకు తిరిగి 2018లో బీఆర్ఎస్ టికెట్లు దక్కగా, తీగల కృష్ణారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్ ఓటమి పాలయ్యారు. అయితే వీరిపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తర్వాతి పరిణామాల్లో బీఆర్ఎస్ గూటికే చేరుకోవడం గమనార్హం. ఈ విధంగా కాంగ్రెస్ కుదేలైనట్లు కనిపిస్తున్నా పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఆ పారీ్టలో చేరితే ఆ పార్టీయే తమ ప్రధాన ప్రత్యరి్థగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు పార్టీ 2014 2018 కాంగ్రెస్ 07 12 టీడీపీ 12 02 వైఎస్సార్సీపీ 03 – బీఎస్పీ 02 – సీపీఐ 01 – ఇతరులు – 02 మొత్తం 25 16 -
బాధ్యతాయుతంగా పనిచేసి ప్రగతి సాధనకు కృషి చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: డీఆర్డీఏ ఆధ్వర్యంలో పనిచేసే ఏరియా కో ఆర్డినేటర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ఆయా మండలాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యక్రమలపై అధికారులతో సమీక్షించారు. ఈ సంవత్సరం 52,920 సంఘాలకు రూ.1223,22 కోట్ల రుణ సహాయం లక్ష్యం కాగా 6495 గ్రూపులకు రూ.223 కోట్ల రుణాలు అందించారన్నారు. ఈనెలాఖరు నాటికి రుణాల కల్పన వేగవంతం చేసి రూ.300 కోట్లకు పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, మెప్మా పీడీ రత్నబాబు, ఏపీడీ శ్రీనివాసకుమార్, క్షేత్రసిబ్బంది పాల్గొన్నారు. 25వ తేదీల్లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి: వివిధ కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోపు 80 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ల ద్వారా పట్టణ, మండలాల్లో జరుగుతున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, ఎస్సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు డేవిడ్‌రాజు, జ్యోతి, వీఎస్ఎస్ శాస్త్రీ, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్... కలెక్టరేట్ కోర్టు హాలు నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా శుక్రవారం రాత్రి మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తట్టు, రుబెల్లా టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డిఎంహెచ్వో కె.చంద్రయ్య, డీఈవో అబ్రహం, ఐసీడీఎస పీడీ «శారదాదేవి పాల్గొన్నారు. -
ఓట్ల వేటలో సర్కారు ఎరలు..!
-జీఓలు : 18, 54, 16, 17లపై ఉపాధ్యాయ సంఘాల నేతలు -ఎమ్మెల్సీ కోడ్ అమలు గురించి తెలిసే జారీ చేశారని వ్యాఖ్య భానుగుడి(కాకినాడ) : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒకేసారి మూడు రకాల జీవోలు వెలువడ్డాయి. కొన్నేళ్లుగా పోరాడుతున్న పండిట్, పీఈటీల అప్గ్రడేషన్ను అమలు చేస్తూ జీవో : 18, మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో :54, ఎంఈఓల వయోపరిమితి నిబంధనను తొలగిస్తూ జీవో :16, 17 విడుదల కావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం పెల్లుబికింది. అయితే ప్రస్తుతం పలు జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ జీవోల్లో ఏ ఒక్కటీ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల వేళ ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం వేస్తున్న ‘ఎర’ల్లో భాగమే ఈ జీవోలని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో అప్‌గ్రేడ్ కానున్న 471 ఉపాధ్యాయులు. జిల్లాలో తెలుగు పండిట్ 142, హిందీ 124, ఉర్దూ 12, సంస్కృతం 01, తమిళం 02, పీడీ(పీఈటీ) 190 మొత్తం 471 మందిలో పండిట్లు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లుగాను అప్‌గ్రేడ్ అవుతున్నారు. జీవో :54తో 43 మందికి గెజిటెడ్ హోదా. మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న 43 మందికి జీవో : 54తో గెజిటెడ్ హోదా రానుంది. కాకినాడలో 14, అమలాపురంలో 2, మండపేటలో 1, రామచంద్రపురంలో 3, సామర్లకోటలో 3, రాజమండ్రిలో 13, పెద్దాపురంలో 2, పిఠాపురంలో 3, తుని ఇద్దరు ఉపాధ్యాయులు గెజిటెడ్ హోదా పొందనున్నారు. ఎంఈవోలు కానున్న 58 మంది హెచ్ఎంలు జీవో :16, 17తో జిల్లాలో 58 మంది ప్రధానోపాధ్యాయులు సీనియార్టీ ఆధారంగా ఎంఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. మొన్నమొన్ననే వీరిని కౌన్సెలింగ్‌కు పిలిచినా 55 ఏళ్ల వయోపరిమితి వి««ధించడంతో కౌన్సెలింగ్ రద్దయింది. ప్రస్తుత జీవోల్లో వయోపరిమితిని పూర్తిగా తొలగించారు. వేచి చూడాల్సిందే.. అయితే కొన్ని జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కోడ్‌ను అమలు చేయడంతో ఈ జీవోల అమలుకు అడ్డంకి కానుంది. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడితేగాని రాష్ట్రవ్యాప్తంగా ఈ జీవోలు అమలులోకి రావు. ఇంకొన్నాళ్ళు వేచి చూస్తాం వ్యాయామోపాధ్యాయుల అప్గ్రడేషన్కు దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం. మరికొంతకాలం వేచి ఉంటాం. ఎన్నికల విషయం తెలిసే జీవోలు విడుదల చేశారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో అన్న దానికి ఇదొక నిదర్శనం. -ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓట్ల కోసమే ఊరింపు జీవోలు విడుదల చేసిన పెద్దలకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలియనిది కాదు. అయితే ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వాలు ఊరింపు చర్యలకు పాల్పడతాయనడానికి ఇదొక నిదర్శనం. -డీవీ రాఘవులు , యూటీఎఫ్ అధ్యక్షుడు -
రైల్వే మెయిన్‌లైన్‌ను పూర్తిచేయాలి
కాకినాడ సిటీ: కాకినాడ–పిఠాపురం రైల్వే మెయిన్‌లైన్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఎంపీ తోట నరసింహం కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభుని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ కార్యాలయ అధికారులు తెలిపారు. తొలిదశలోనే స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడలో మరింత అభివృద్ధి సాధించేందుకు కాకినాడ– పిఠాపురం మెయిన్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్రం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎల్టీటీ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో ప్రయోగాత్మక హాల్ట్ ఇచ్చారని, అయితే ఇటీవల ఎల్టీటీ నుంచి విశాఖకు వచ్చే ట్రైన్ నంబర్ 18520కు సామర్లకోటలో హాల్ట్ తొలగించారన్నారు. సామర్లకోట కేంద్రంగా నిత్యం అనేకమంది ముం» యికి ప్రయాణిస్తున్నారని వెంటనే హాల్ట్‌ను పునరుద్ధరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. -
రేపు జేఈఈ మెయిన్: ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్-2016 పరీక్షకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 59,731 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 42,971 మంది, వరంగల్‌లో 11,783 మంది, ఖమ్మంలో 4,977 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు జేఈఈ కో-ఆర్డినేటర్ మథ్యాస్‌రెడ్డి తెలిపారు. బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. సెంటర్ ముందే చూసుకోండి.. పేపర్-1 పరీక్షకు హాజరయ్యేవారిని ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 9:20 గంటలకు పరీక్ష బుక్లెట్లను పంపిణీ చేస్తారు. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. పేపర్-2 పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 1:50 గంటలకు పరీక్ష బుక్లెట్లను పంపిణీ చేస్తారు. 2 గంటలకు పరీక్ష మొదలవుతుంది. పరీక్షకు నిమిషం లేటయినా అనుమతించరు. అందుకే విద్యార్థులు ముందు రోజే పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి చూసుకోవాలని, ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. పెన్నులు, పెన్సిళ్లను అనుమతించరు. అవసరమైన పెన్నులు పరీక్ష గదిలోనే అందిస్తారు. పరీక్ష గదిలోకి షూస్‌ను అనుమతించరు. షూస్ వేసుకొస్తే బయటే విడిచి వెళ్లాలి. చెప్పుల విషయంలో ఆంక్షల్లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు, రిస్ట్‌వాచీలను అనుమతించరు. పరీక్ష గదిలోనే గోడ గడియారాలను అందుబాటులో ఉంచుతారు. ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లతో పరీక్ష హాల్లోకి వెళ్లడానికి వీల్లేదు. సికింద్రాబాద్‌లోని ఒక పరీక్ష కేంద్రం చిరునామా తప్పుగా పడింది. హస్మత్‌పేట మెయిన్ రోడ్డు మనోవికాస్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం పేరు మొదట ‘పల్లని’ మోడల్ స్కూల్‌గా తప్పుగా పడిందని, దాన్ని ‘పల్లవి’ మోడల్ స్కూల్‌గా చ దువుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. 9, 10 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేసింది. ఇది పేపర్-1లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. -
డిసెంబర్ 18 నుండి సివిల్స్ మెయిన్స్
ఢిల్లీ: సివిల్స్ మెయిన్ పరీక్షల నిర్వహణ తేదీలను యూపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. డిసెంబర్ 18 నుండి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 9,45,908 మంది అభ్యర్థులు సివిల్స్‌కు దరఖాస్తు చేసుకోగా, 15,008 మంది ప్రలిమినరీ దశను దాటి మెయిన్ ఎగ్జామ్‌కు అర్హత సాధించారు. సివిల్స్ పరీక్షల ద్వారా దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వాటిలో నియామకాలు చేపట్టనున్నారు. -
సాక్షి ది హెడ్ లైన్ షో 13th July 2013
-
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013