బాధ్యతాయుతంగా పనిచేసి ప్రగతి సాధనకు కృషి చేయాలి
Published Fri, Aug 11 2017 11:25 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ: డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనిచేసే ఏరియా కో ఆర్డినేటర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ఆయా మండలాల్లో ప్రగతి సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యక్రమలపై అధికారులతో సమీక్షించారు. ఈ సంవత్సరం 52,920 సంఘాలకు రూ.1223,22 కోట్ల రుణ సహాయం లక్ష్యం కాగా 6495 గ్రూపులకు రూ.223 కోట్ల రుణాలు అందించారన్నారు. ఈనెలాఖరు నాటికి రుణాల కల్పన వేగవంతం చేసి రూ.300 కోట్లకు పెంచాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, మెప్మా పీడీ రత్నబాబు, ఏపీడీ శ్రీనివాసకుమార్, క్షేత్రసిబ్బంది పాల్గొన్నారు.
25వ తేదీల్లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి:
వివిధ కార్పొరేషన్లకు సంబంధించి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోపు 80 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ల ద్వారా పట్టణ, మండలాల్లో జరుగుతున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, ఎస్‌సీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ఈడీలు డేవిడ్‌రాజు, జ్యోతి, వీఎస్‌ఎస్ శాస్త్రీ, ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్...
కలెక్టరేట్ కోర్టు హాలు నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా శుక్రవారం రాత్రి మండలస్ధాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తట్టు, రుబెల్లా టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డిఎంహెచ్‌వో కె.చంద్రయ్య, డీఈవో అబ్రహం, ఐసీడీఎస పీడీ «శారదాదేవి పాల్గొన్నారు.
Advertisement