ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్డీఏ తన ప్రణాళికను జూలై నుంచి అమలుచేయనుంది. ఇండియా అలయన్స్ కూడా తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్టార్ క్యాంపెయినర్‌గా కల్పనా సోరెన్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమెకు జేఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన అనంతరం కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో జేఎంఎం ర్యాలీల్లో కల్పన చురుగ్గా పాల్గొన్నారు. గాండే ఉప ఎన్నికలో కల్పనా సోరెన్ బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హేమంత్ సోరెన్ అరెస్టు దరిమిలా కల్పన తన భర్తను తప్పుడు ఆరోపణలతో జైలులో పెట్టారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
త్వరలోనే హేమంత్ సోరెన్ నిర్దోషిగా విడుదలవుతారని, ఇండియా అలయన్స్ నుంచి ముఖ్యమంత్రి అవుతారని కల్పన చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలు నుండి బయటకు రానిపక్షంలో పార్టీ కల్పనా సోరెన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment