narasimham
-
భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఇక లేరు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి అన్ని రంగాలను చుట్టుముట్టేస్తోంది. రాజకీయ, సినీ, ఆర్థిక ..ఇలా అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్, భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు ఎం. నరసింహం(94) కరోనాతో కన్నుమూశారు. దీంతో పలువురు ఆర్థిక రంగ నిపుణులు, పరిశ్రమ పెద్దలు నరసింహం మృతిపై సంతాపం ప్రకటించారు. కోవిడ్ సంబంధిత అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించినట్లు ఆర్బిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ కేడర్ నుండి నియమించబడిన తొలి, ఇప్పటివరకు ఉన్న ఏకైక ఆర్బీఐ గవర్నర్ నరసింహం. 1977 మే - నవంబర్ మధ్య ఏడు నెలల స్వల్ప కాలపరిమితిలో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచ బ్యాంకులో భారతదేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, తరువాత ఐఎంఎఫ్‌లో కూడా తన ప్రతిభను చాటారు. 1991 లో ఆర్థిక వ్యవస్థ కమిటీ, బ్యాంకింగ్ రంగ సంస్కరణల కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా నరసింహం పనిచేశారు. నరసింహం నేతృత్వంలోని రెండు కమిటీలు (నరంసింహం కమిటీలు 1991, 1997) ఆధునిక బ్యాంకింగ్ పరిశ్రమ, భారతదేశ బ్యాంకింగ్ రంగంపై విమర్శనాత్మక ప్రభావాన్ని చూపాయి. ఈ కమిటీల కొన్ని ముఖ్య సిఫారసులు బ్యాంకింగ్ రంగ స్వయంప్రతిపత్తికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్ పాత్రను సంస్కరించడం లాంటి కీలక సంస్కరణలకు నాంది పలికాయి. ఈ నేపథ్యంలోనే నరసింహంను భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా భావిస్తారు. చదవండి : Apple Event 2021: ఆపిల్ లవర్స్ ఎదురుచూపులు కోవిడ్ వారియర్స్‌కు భారీ ఊరట -
శారీ సుందరి
నరసింహం టూర్ నుంచి తిరిగొచ్చాడని తెలియగానే ఆ రాత్రి హుషారుగా బార్కి చేరుకుంది మిత్రబృందం. మందు సాక్షిగా తన టూర్ విశేషాలను మిత్రులతో పంచుకోవడం అతగాడి ఆనవాయితీ. నరసింహానికి ముప్పయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్గా ఉంటాడు. తన రూపంతో, మాట చాతుర్యంతో అమ్మాయిలను ఇట్టే పడేయగలనన్న గొప్ప ఆత్మవిశ్వాసం అతనిది. అయిదేళ్ళ క్రితం పెళ్ళయింది. రెండేళ్ళపాప కూడా ఉంది.ఒక ఆడిటింగ్ ఫర్మ్‌లో ఆడిటర్‌గా పనిచేస్తూన్న నరసింహం ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు టూర్ వెళుతూంటాడు. వెళ్ళిన చోటల్లా ఓ కొత్త అనుభవం కోసం వెంపర్లాడుతుంటాడు.‘చీర్స్’ చెప్పుకుని మందుకు శ్రీకారం చుట్టారు మిత్రులు. నరసింహం వంక చూస్తూ, ‘‘కమాన్, బ్రో! స్టార్ట్ ద స్టోరీ’’ అన్నాడు ఓ మిత్రుడు. ‘‘నీ మౌనం మా కుతూహలాన్ని రెచ్చగొడుతోంది.ఆరంభించు, భయ్యా!’’ అన్నాడు ఇంకొకడు.‘‘మొదటిసారిగా కోల్కత్తా వెళ్ళొచ్చావు. బెంగాలీ భామల విశేషాలతో మా వీనులకు విందు చెయ్యి మామా!’’ తొందర చేశాడు మరో మిత్రుడు. కథ ఆరంభించే ముందు ఒకసారి కన్నులు మూసుకున్నాడు నరసింహం. కోల్కత్తా అనుభవం మదిలో సుళ్ళుతిరిగింది.. తమ క్లయింట్ కంపెనీ యాన్యువల్ ఆడిటింగ్ పని మీద కోల్కత్తా వెళ్ళాడు నరసింహం. ఆ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ పార్క్ స్ట్రీట్‌లో ఉంది. నరసింహానికి గొరియహాట్లోని కంపెనీ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటైంది. ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనివేళలు. సాయంత్రం గెస్ట్‌హౌస్‌కి చేరుకోగానే టిప్ టాప్‌గా తయారై వాహ్యాళికి తిరిగేవాడు నరసింహం. గొరియహాట్ నుంచి ఢకూరియా బ్రిడ్జ్ వరకు వెళ్ళొచ్చేవాడు. ఆ వేళప్పుడు ఆ ఏరియా చాలా సందడిగా ఉంటుంది. మోడర్న్ దుస్తులలో సీతాకోకచిలుకల్లా తిరిగే భామలను ఆబగా చూసేవాడు అతను. వినూత్న బెంగాలీ అందాలనుకళ్ళతోనే జుర్రుకునేవాడు. ఒక సెలవురోజున సైట్ సీయింగ్ కోసం క్వీన్స్ వేలోని విక్టోరియా మెమోరియల్‌కి వెళ్ళాడు నరసింహం. 1921లో క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం నిర్మించిన పాలరాతి కట్టడం అది.మ్యూజియంగా రూపొందిన ఆ మెమోరియల్‌లో 25 గ్యాలరీలు ఉన్నాయి. వాటిలో రాయల్ గ్యాలరీ, జాతీయ నాయకుల గ్యాలరీ, తైలవర్ణచిత్రాల గ్యాలరీ, శిల్పకళాఖండాల గ్యాలరీ, ఆయుధాలు–కవచాల గ్యాలరీ, కోల్కత్తా గ్యాలరీ, సెంట్రల్ హాల్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి. దేశ, విదేశీ సందర్శకులతో మెమోరియల్ సందడిగా ఉంది. సెంట్రల్ హాల్లో ఓ బెంగాలీ యువతితో అతనికి పరిచయమైంది. ఫెయిర్ గా, స్లిమ్ గా, పొడవుగా ఉందామె. లైట్ ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడర్డ్ కుర్తీ, బ్లూ కలర్ లెగ్గింగ్స్‌లో మోడర్న్‌గా ఉంది.కబుర్లు చెప్పుకుంటూ గ్యాలరీలన్నీ తిరిగారు ఇద్దరూ. లంచ్ టైమ్‌లో గార్డెన్లో కూర్చుని తినుబండారాలను షేర్ చేసుకున్నారు. ఆమె కలుపుగోలుతనం అతనికి బాగా నచ్చింది. సందు దొరికినపుడల్లా అతను తన అందాన్ని పొగుడుతూండడం ఆమెకు నచ్చింది. సాయంత్రం మ్యూజియం నుంచి బయటపడ్డాక, ‘‘అయాం టైర్డ్. పక్కవీధిలో కాఫీ షాపు ఉంది. అక్కడ కాఫీ బాగుంటుంది. మీకు ఇబ్బంది కాకపోతే నాకు కంపెనీ ఇవ్వగలరా?’’ అడిగిందామె. రొట్టె విరిగి నేతిలోపడ్డట్టయింది అతనికి. ‘కాఫీ కఫే’ ఓపెన్–ఎయిర్ రెస్టారెంట్. జనం బాగానే ఉన్నారు. ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు నరసింహం, ఆ యువతీను. ఆమె పేరు జ్యోత్స్న అని తెలియగానే, ‘‘మీ పేరూ మీ అంత అందంగా ఉంది!’’ కాంప్లిమెంట్ ఇచ్చాడతను. నవ్వేసిందామె. ఆమె చనువుగా మెలగడంతో, సులభంగానే తన వలలో పడుతుందన్న ఆశ కలిగింది అతనిలో. కాఫీలు రాగానే, కప్పు అందుకోబోయాడు నరసింహం. ఆమె వారించి, తన హ్యాండ్ బ్యాగులోంచి చిన్నగుళికలు ఏవో తీసి అతని కాఫీలో కలిపింది. ‘‘నేనేదో మత్తుమందుకలుపుతున్నాననుకునిభయపడిపోకండి. హెర్బల్ గుళికలివి. కాఫీ, టీలలో వేసుకుంటే కఫీన్, నికోటిన్ల ప్రభావం మన ఆరోగ్యంపైన పడదు’’ అంది చిరునవ్వుతో. నరసింహం కప్పు నోటి దగ్గర పెట్టుకుంటూండగా వెనుక నుంచి ఎవరిదో చేయి తగిలి కప్పు కింద పడిపోయింది. కాఫీ అతని దుస్తులపైన ఒలికింది.ఒక యువతి అతని ఎదుటకు వచ్చి, ‘‘ఓహ్, అయాం సారీ! చూసుకోలేదు’’ అంటూ అతనికిక్షమాపణలు చెప్పుకుంది. ఇంచుమించు జ్యోత్స్న వయసే ఉంటుంది ఆమెకు. సాధారణమైన అందం. నీలాల కన్నులు ఆమె ప్రత్యేక ఆకర్షణ. లేత ఆకుపచ్చరంగు బెంగాలీ కాటన్ శారీ, అదే రంగుబ్లౌజులో నిండుగా ఉంది.ఆమెను చూడగానే కూల్ అయిపోయాడు నరసింహం. ‘‘ఇట్సాల్రైట్. డోంట్ వర్రీ,’’ అన్నాడు. కాఫీ ఒలికిన షర్టును వాష్ చేసుకు వస్తానంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు.జ్యోత్స్న తనవంక తీక్షణంగా చూస్తూంటే, పెదవులు విడీవిడనట్లుగా నవ్వుకుంది ఆ యువతి. షర్ట్ వాష్ చేసుకుంటూంటే, ‘‘అయాం రియల్లీ సారీ!’’ అన్న పలుకులు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు నరసింహం.ఆశారీ గాళ్!‘‘పరవాలేదులెండి. మీరు కావాలని చేయలేదుకదా!’’ అన్నాడు.‘లేదు, నేను కావాలనే చేశాను!’’ అని ఆమె అనడంతో తెల్లబోయి చూశాడు.‘‘ఇది మెన్స్ వాష్‌రూమ్. అలా పక్కకు వచ్చారంటేఎందుకలాచశానో చెబుతాను’’ అందామె తాపీగా.విస్తుపాటుతో ఆమెను అనుసరించాడతను. జ్యోత్స్నలాగే చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతోందామె. ఆమె చెబుతూన్నది నోరు వెళ్ళబెట్టి ఆలకించాడు‘‘జ్యోత్స్న ఓ చీట్. తన అందచందాలతో పురుషులను ట్రాప్ చేస్తుంది. కాఫీ షాపుకు తీసుకొచ్చి, వారి కాఫీలో డ్రగ్స్ కలుపుతుంది. వాటి ప్రభావంతో ఆమె చెప్పినట్టు చేస్తారంతా. కాఫీ తాగాక, తనఫ్రెండ్నికలవాలంటూ హోటల్ మన్మథకు తీసుకువెళుతుంది. అప్పటికి మత్తు పూర్తిగా తలకెక్కిన ఆ వ్యక్తిని నిలువుదోపిడీ చేసి అదృశ్యమైపోతుంది. తెలివి వచ్చాక ఆ మందు ప్రభావం వల్ల జరిగిందేమీఅతనికి గుర్తుండదు’’ నమ్మలేనట్టుగా చూశాడు నరసింహం. ‘‘ఆమధ్య ఓసారి నా కజిన్ బ్రదర్ ఆమె ట్రాప్‌లో పడి మోసపోయాడు. సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోయాము’’ అందామె. ‘‘ఇతరులు కూడా ఆమె ఉచ్చులో తగులుకోకూడదనే వీలైనపుడల్లా వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను నేను. నా మాటలు నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం!’’ ఆ షాక్ నుంచి అతను తేరుకునే లోపునే అక్కడి నుంచి నిష్క్రమించిందామె. నరసింహం తిరిగి రాగానే జ్యోత్స్న మళ్లీ కాఫీకి ఆర్డర్ చేసింది. అతను వద్దంటూంటే, ‘‘మిమ్మల్ని కాఫీకి ఇన్వైట్ చేశాను నేను. ఇప్పుడు మీరు తాగకుండా వెళ్ళిపోతే నాకు ఎలాగో ఉంటుంది’’ అంది.కాఫీ రాగానే మళ్ళీ గుళికలు తీసిఅందులో వేసిందామె. ఆమెను కబుర్లలో పెట్టి, కప్పు నోటి వద్ద పెట్టుకుని త్రాగుతున్నట్టు నటించాడు అతను. ఉన్నట్టుండి టేబుల్ కింద నుంచి ఆమె కాలిని త్రొక్కడంతో చటుక్కున వంగిందామె. అదేక్షణంలో టేబుల్ పక్కనున్న పూలకుండీలో కాఫీని ఒలకబోసేశాడు.‘‘నా కాలు తగిలినట్టుంది. సారీ!’’ అన్నాడు. మందహాసం చేసిందామె.కాసేపటి తరువాత బయటకు నడచారు ఇద్దరూ. ‘చేరువలోనే కొంచెంఅర్జెంట్ పని ఉంది’’ అన్నాడు. బలవంత పెట్టినా ప్రయోజనం లేకపోవడంతో, ‘‘ఓకే. రేపు సాయంత్రం మళ్ళీ ఇదే కాఫీ షాపులో కలుద్దాం. అప్పుడు మీరు తప్పక నా స్నేహితురాలిని కలవాలి!’’అందామె. ‘‘ఓకే, ష్యూర్!’’ అంటూ, ఖాళీగా వెళుతున్న టాక్సీని ఆపి ఎక్కేశాడు అతను.మర్నాడే కాదు, మరో రెండురోజుల వరకు ఆ కెఫే ఛాయలకే వెళ్లలేదు నరసింహం. అతని మనసు మాత్రం తనకు హెల్ప్ చేసిన ‘శారీ సుందరి’ చుట్టూనే తిరుగుతోంది. ఆమె పేరు అడగలేదు. ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. ఆమెను మళ్లీ చూడాలన్న కోరిక బలమయింది అతనిలో. ఆ కాఫీ షాపుకువస్తుంటానని చెప్పిందామె. మూడోరోజున అక్కడికి వెళ్ళాడు నరసింహం. ఆ శారీ సుందరి కోసం చూస్తూంటే కెఫే బయటే ఎదురైందామె. బ్రౌన్ కలర్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంది.అతన్నివెంటనే గుర్తుపట్టలేదామె. మూడురోజుల కిందటి సంఘటనను గుర్తుచేసి, ‘థాంక్స్’ చెప్పడానికి వచ్చానన్నాడు. తన మాట చాతుర్యంతో కాసేపటికే ఆమెను దోస్త్‌ని చేసేసుకున్నాడు. తన పేరు దేవయాని అనీ, స్వగ్రామం మిడ్నాపూర్ అనీ, ఉద్యోగరీత్యా తాను కోల్‌కతా వచ్చిందనీ, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోందనీ, చౌరంఘీలేన్లో ఓ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటోందనీ చెప్పిందామె. వస్త్రధారణలో పొందిక, మనిషిలో సిగ్గరితనమూ అతన్ని ఆకట్టుకున్నాయి. చీరలో సెక్సీగా అనిపించింది. మచ్చిక చేసుకుని, కోల్‌కతా వదిలే లోపున ఆమెను పక్కలోకి లాగాలని నిశ్చయించుకున్నాడు. ఆమెకు అతని పైన సదాభిప్రాయం కలగడంతో, రోజూ సాయంత్రపు వేళ కలుసుకునేవారు ఇద్దరూ. ట్రామ్ లో తిరిగేవారు. ఐస్‌క్రీమ్ పార్లర్స్ కి వెళ్ళేవారు. ఈడెన్ గార్డెన్స్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు.రాత్రి ఎనిమిది గంటలకల్లా ఆమెను హాస్టల్ సమీపంలో దిగబెట్టేవాడు అతను.ఇక రెండు రోజుల్లో కోల్‌కతా వదిలి వెళతాడనగా, తమ స్నేహానికి గుర్తుగా చిన్న పార్టీ ఏర్పాటు చేశానంటూ, ఆ సాయంత్రం దేవయానిని తాను ఉండే గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్ళాడు నరసింహం. కాక్ టెయిలూ, డిన్నరూ పూర్తయ్యేసరికి రాత్రి పదయిపోయింది. దేవయాని వాచ్ చూసుకుని కంగారుపడుతూ, ‘‘ఓ మై గాడ్! ఎనిమిది దాటితే హాస్టల్ డోర్ లాక్ చేసేస్తారు. ముందుగా లేట్ పర్మిషన్ తీసుకున్నవారినే లోపలికి ఎలవ్ చేస్తారు’’ అంది.‘‘డోంట్ వర్రీ. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. తెల్లవారాక వెళ్ళొచ్చును. రాత్రి ఎవరో ఫ్రెండ్‌ది బర్త్ డే పార్టీ బాగా లేటయిందనీ, అందుకే రాలేకపోయావనీ చెబుదువుగాని’’ అన్నాడతను. రాత్రి పదకొండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. తరువాత పడుకునేందుకు లేచారు. హఠాత్తుగా ఆమెను కౌగిలించుకుని, పెదవుల మీద గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు నరసింహం. ఆమె తెల్లబోయి, ప్రతిఘటించబోయింది. కానీ కౌగిలింతలోని పులకింత, ముద్దులోని మాధుర్యం మత్తుకు గురిచేయడంతో అది వ్యర్థప్రయత్నమే అయింది. మర్నాటి ఉదయం నరసింహానికి మెలకువ వచ్చేసరికి తొమ్మిది దాటిపోయింది. గదిలో దేవయాని కనిపించలేదు. వాష్ రూమ్‌కి వెళ్ళిందనుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి వాష్‌రూమ్‌కి వెళ్ళి చూశాడు. ఖాళీగా ఉందది. విస్తుపోతూ సూట్ అంతా వెదికినా ఆమె జాడ లేదు. మార్నింగ్ వాక్‌కి వెళ్ళిందేమోననుకుంటే, టీపాయ్ మీద ఉంచిన ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించలేదు. ఎవరి కంటా పడకూడదని తెల్లవారకుండానే వెళ్ళిపోయివుంటుందనీ, తన నిద్ర పాడుచేయడం ఇష్టంలేక లేపలేదనీ అనుకున్నాడు. హఠాత్తుగా నరసింహం చూపులు కార్నర్ టేబుల్ పైన పడ్డాయి. దాని మీద ఉండవలసిన అతని ల్యాప్ టాప్ కనిపించలేదు! బెడ్ సైడ్ ర్యాక్ మీద పెట్టిన సెల్‌ఫోను, టైటాన్ వాచ్ కూడా కనిపించలేదు. ఏదో అనుమానం పొడసూపడంతో గబగబా టేబుల్ సొరుగు తెరచి చూశాడు. అందులో పెట్టిన మనీపర్స్, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులూ, ఐడీ కార్డూ మాయమయ్యాయి. పర్సులో పదివేలు ఉన్నాయి. గుండె ఝల్లుమంది.వెంటనే గెస్ట్ హౌస్ వాచ్‌మన్‌కి ఇంటర్కమ్లో ఫోన్ చేసి, దేవయాని గురించి వాకబు చేశాడు. తెల్లవారు జామునే ఆమె వెళ్ళిపోయిందనీ, చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉందనీ చెప్పాడతను. అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదు నరసింహానికి. మెదడు మొద్దుబారిపోవడంతో తల పట్టుకుని బెడ్ మీద కూలబడ్డాడు.అదిగో, అప్పుడే పడింది అతని చూపు – టీపాయ్ క్రింద రెపరెపలాడుతున్న కాగితం మీద. చటుక్కున దాన్ని తీసి చూసాడు. అది ‘శారీ సుందరి’ దేవయాని ఆంగ్లంలో రాసిపెట్టిన ఉత్తరం –‘హే, బ్లడీ ఫ్లర్ట్! ఈ పాటికి గేమ్ అర్థమయివుంటుందనుకుంటాను నీకు, నీ ల్యాప్ టాప్, ఫోన్, మనీ,డెబిట్–క్రెడిట్ కార్డ్స్, వాచ్ నాతో తీసుకుపోతున్నాను – రాత్రి నీతో పొందిన అనుభవానికి జ్ఞాపికలుగా!... బై ద బై, ఆ కాఫీ గాళ్ గురించి నేను చెప్పినవేవీ నిజాలు కావు. ఆమె నీ కాఫీలో వేసిన గుళికలు హెల్త్పిల్సే. డ్రగ్ కాదు. ఆమె అప్పుడప్పుడు స్నేహితులతో ఆ కెఫేకి వస్తుంటుంది. కాఫీలో తులసి గుళికలను కలుపుకుని తాగుతుంటారు వాళ్ళు. ఆ విషయం చాలాసార్లు గమనించాను నేను.నీ వాలకం కనిపెట్టి, ఆమె అలవాటును నాకు ఎడ్వాంటేజ్ గా మార్చుకోవాలనుకున్నాను. నీ కాఫీని ఒలకబోసి డ్రామా ఆడాను. ఆమె గురించి చెడుగా చెప్పాను. నేను ఊహించినట్టే, నన్ను నమ్మి, నావెంట పడ్డావునువ్వు. నా గురించి నీకు చెప్పిన వివరాలు కూడా నిజం కాదు. నా రెసిడెన్స్ కూడా! ఆడవాళ్లను చూసి చొంగకార్చుకుంటూ వారిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకునే నీలాంటి విమనైజర్స్ని బకరాలను చేసి బుద్ధిచెప్పడం నా హాబీ!...నా కోసం వెదకడానికి ప్రయత్నించకు, నీ పరువే పోతుంది. బై, ఫర్ ఎవర్!’కంపెనీ వాళ్ళకు ఏదో చెప్పి, వారి సాయంతో తిరిగివచ్చాడతను. నరసింహం చెప్పడం ముగించగానే మిత్రుల మధ్య భయంకర నిశ్శబ్దం అలముకుంది. ‘‘దెబ్బతో తాగిందంతా దిగిపోయింది, భయ్యా!’’ అన్నాడు ఓ మిత్రుడు, నిశ్శబ్దాన్ని చీల్చుతూ.‘‘కోల్‌కతా వెళ్ళొచ్చి కత్తిలాంటి కథ చెబుతావనుకుంటే సుత్తిదెబ్బలు తినొచ్చావేంట్రా, మామా!’’ అన్నాడు మరో మిత్రుడు.‘‘పద, బ్రో! కోల్‌కతా వెళదాం. ఆ మాయలాడిని వెదికి పట్టుకుని తగిన బుద్ధి చెబుదాం’’ కోపంతో ఊగిపోయాడు ఇంకొకడు.తల అడ్డుగా తిప్పాడు నరసింహం. ‘‘లేదురా. ఆమె చేసింది కరెక్టేననిపిస్తోంది నాకు. విస్తట్లో పంచభక్ష్య పరమాన్నాలూ పెట్టుకుని ఎంగిలి కూటికి ఎగబడటం తప్పే! ఆ అనుభవం నాకళ్ళు తెరిపించింది. ఇక మీదట పరాయి స్త్రీ జోలికి పోకూడదని తీర్మానించుకున్నాను’’ అంటూన్న మిత్రుడి వంక నోళ్ళు వెళ్ళబెట్టి చూశారంతా. - తిరుమలశ్రీ -
రాజ్యమూ, రాజధానీ లేని.. నరసింహావతారం నాది
- నా చివరి కోరిక ఒక్కటే.. రెండు రాష్ట్రాలూ సాయం చేసుకోవాలి - సీఎంలిద్దరూ ఇరు రాష్ట్రాలూ పర్యటిస్తుండాలి - హైటెక్ అభివృద్ధి ఒక్కటే చాలదు.. ప్రజావసరాలనూ తీర్చాలి - త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలు విభజన సమస్యలను అధిగమించి అభివృద్ధి దిశగా పోటీ పడుతున్నాయని ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొల్పే దిశగా నా పాత్ర ముగిసింది. ఇప్పుడు ప్రగతి కాముక పాత్ర పోషిస్తా’’అని పేర్కొన్నారు. పదేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన నర సింహన్ పదవీకాలం మే 2న ముగియడం, మరికొంతకాలం ఆయననే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో గురువారం ‘సాక్షి’కి గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... నాది నరసింహావతారం రాజధాని లేని రాష్ట్రాల్లో గవర్నర్‌గా పని చేయ టం నాకో కొత్త అనుభవం. ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు అక్కడ గవర్నర్‌గా ఉన్నాను. ప్రత్యేక ఉద్యమం సమయంలో ఏపీకి వచ్చి కొత్త రాష్ట్రంలో కొనసాగుతున్నా. నాది పురాణాల్లో నరసింహావతారంలా ఉంది. మిగ తా అవతారాలకు రాజ్యం, రాజధాని ఉంటా యి. నరసింహావతారానికి మాత్రం అవేవీ ఉండవు. నా అనుభవమూ అదే తీరుగా ఉంది. విద్య, వైద్యాల్లో చాలా చేయాలి ఇద్దరు సీఎంలూ అభివృద్ధిపై దృష్టి సారిస్తు న్నారు. నా దృష్టిలో అభివృద్ధి రెండు రకాలు. ఒకటి హైటెక్. రెండోది ప్రజా కోణం. ప్రజావ సరాల కేంద్రంగా పాలన ఉండాలని నేను కోరుకుంటాను. నీరు, కరెంటు, విద్య, వైద్యం, భద్రత ప్రజలకు అవసరాలు. అన్నీ ఉన్నాక కంప్యూటర్ ఇస్తే ఉపయోగం. రెండు రాష్ట్రాలు నీరు, కరెంటు, ఆహార భద్రత, గృహ నిర్మా ణంపై దృష్టి సారిస్తున్నాయి. విద్య, ఆరోగ్యా లపై చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. బడ్జెట్లో రైతుకు అనామక నిధి విపత్తుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రెండు రాష్ట్రాలు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఆ విషయాన్ని ముందుగానే ప్రకటిస్తే కరువు, విపత్తులంటూ రోజుకో ఆందోళన వస్తుంది. కాబట్టి ముందుగా ప్రకటించకుండా ఆ పద్దును అనామకంగా నిర్వహించాలి. రైతులు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక పద్దు పేరుతో వారిని ఆదుకునేలా వెసులుబాటు కల్పించాలి. అప్పుడు ప్రతిసారీ కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే సమస్యను పరిష్కరించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం కొనుగోళ్ల విధానం పక్కాగా అమలవుతుంది. అక్కడ ఏ రైతు తన పంటను ఎవరికి అమ్మిందీ రాజ్‌భవన్‌లో కూర్చొని కూడా తెలుసుకునే వీలుంది. పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించేందుకు ప్రత్యేక విధానా న్ని అనుసరించాలి. ఒకోసారి కరువు, వర్షాల తో నష్టాలొస్తాయి. ఎక్కువ దిగుబడి వచ్చిన ప్పుడు మద్దతు ధర సమస్య. అందుకే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. ధర ఉన్నప్పుడు అమ్ము కునే వీలుంటుంది. తెలంగాణలో మిర్చి రైతుల ఆందోళన కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో సద్దుమణుగుతుందని అనుకుంటున్నాను. పీస్ మేకర్.. పేస్ మేకర్ నేనిప్పటిదాకా పీస్ మేకర్ (శాంతిస్థాపక) పాత్ర పోషించాను. ఆ పాత్ర ముగిసిందను కుంటున్నా. ఇప్పుడిక పేస్ మేకర్ (ప్రగతి కాముక) పాత్ర పోషిస్తా. అంటే అభివృద్ధి దిశగా కార్యాచరణ వేగవంతం చేస్తా. నా వంతుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటా. పర్యవేక్షణతో పాటు ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామినవుతా. దటీజ్ మై లాస్ట్ డ్రీమ్ ఉద్యమం పరిస్థితులకు, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ఒక ఇంట్లో అన్నాదమ్ములు విడిపోతే తలెత్తే సమస్యలే రెండు రాష్ట్రాల్లోనూ ఉత్పన్నమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ సీఎం కేసీ ఆర్ తిరుపతి వెళ్లారు. ఉగాది ఉత్సవాల్లో ఇద్దరూ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ సర్దుకుంటాయి. తెలంగాణకు ఏపీ సాయం చేయాలి, ఏపీకి తెలంగాణ సాయం చేయాలి. ఇద్దరు సీఎంలు తరచూ రెండు రాష్ట్రాల్లో పర్య టించాలి. దటీజ్ మై లాస్ట్ డ్రీమ్, అండ్ విజన్. చర్చలు... ఓపికకు పరీక్ష రెండు రాష్ట్రాల మధ్య విభజన సంబంధిత పంపకాలు, అపరిష్కృత అంశాలపై మంత్రుల కమిటీల చర్చలు కొనసాగుతున్నాయి. చర్చ లంటేనే ఓపికకు పరీక్ష. చర్చలకు వీలైనంత ఓపిక అవసరం. అంత సహనం నాకుంది. త్వరలో ఇద్దరు సీఎంల తో భేటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ముగ్గురం చర్చిస్తాం. గతంలో నాగార్జునసాగర్ నీటి విషయంలో గొడవ జరిగింది. రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరు సీఎంలతో రెండు గంటలు చర్చలు జరిపాను. అక్కడిక క్కడే పరిష్కారం దొరికింది. చేదు అనుభవాలూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తపరిచాయి. వాటన్నింటినీ ఎప్పటి కప్పుడే మర్చిపోయా. ఇవన్నీ కుటుంబంలో చిన్న గొడవల్లాంటివి. ఇద్దరు కొడుకుల్లో ఎవరి పట్లా తండ్రికి భేద భావముండదు. వారిపై తండ్రికి ఆప్యాయత, ఆయనంటే పిల్లలకు గౌరవ భావం ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోనూ నాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అడ్డం కులను ఏ రోజుకారోజు అధిగమించాం. కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా.. నా చరమాంకం చెన్నైలోనే చాలా ఏళ్లు పోలీసు ఆఫీసర్‌గా పని చేసిన తర్వాత గవర్నర్‌గా పని చేయడం నాకో కొత్త అనుభవం. నేను అప్పటిదాకా ప్రైవేట్‌గా ఉన్న వ్యక్తిని. ఒక్కసారిగా పబ్లిక్ వ్యక్తిని అయ్యాను. నాది ప్రజా జీవితం గా మారిపోయింది. ఈ మార్పుకు అలవాటు పడటానికి 2 వారాలు పట్టిందంతే. గవర్నర్‌గా ఉన్నా నా వ్యక్తిగత జీవితంలో మార్పేమీ లేదు. రాజ్‌భవన్‌లో ఉన్నా, ఎక్కడున్నా నా దినచర్యలో మార్పేమీ లేదు. అందులో మార్పు వస్తేనే సమస్య. రానంతకాలం వృత్తిలోనూ ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ ఉదయం నాలుగింటికే లేస్తా. మీడియాలో నాపై వ్యతిరేకంగా వార్తలొస్తే బాధేమీ ఉండదు. గవర్నర్ గుడికి వెళితే తప్పా? అది వ్యక్తిగతం. విశ్వాసాలకు సంబంధించిన అంశం. నేను ఉదయాన్నే పూజ చేస్తా. ఆఫీసుకు వచ్చాక వృత్తి నిర్వహణ ముఖ్యం. నా కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా. తర్వాత హైదరాబాద్‌లో ఉండను. హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ పీస్ఫుల్ సిటీ. కానీ నేను చెన్నై వెళ్తా. జీవిత చరమాంకంలో హోమ్ టౌన్లో ఉండటమే కరెక్ట్. -
రైల్వే మెయిన్‌లైన్‌ను పూర్తిచేయాలి
కాకినాడ సిటీ: కాకినాడ–పిఠాపురం రైల్వే మెయిన్‌లైన్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని ఎంపీ తోట నరసింహం కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభుని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ కార్యాలయ అధికారులు తెలిపారు. తొలిదశలోనే స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడలో మరింత అభివృద్ధి సాధించేందుకు కాకినాడ– పిఠాపురం మెయిన్‌లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్రం దీనిపై దృష్టి సారించి త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎల్టీటీ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే లోక్మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో ప్రయోగాత్మక హాల్ట్ ఇచ్చారని, అయితే ఇటీవల ఎల్టీటీ నుంచి విశాఖకు వచ్చే ట్రైన్ నంబర్ 18520కు సామర్లకోటలో హాల్ట్ తొలగించారన్నారు. సామర్లకోట కేంద్రంగా నిత్యం అనేకమంది ముం» యికి ప్రయాణిస్తున్నారని వెంటనే హాల్ట్‌ను పునరుద్ధరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. -
ఏం మంత్రులో..ఏంటో!
ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామంటూ ప్రతిన చేసిన మన ప్రజాప్రతినిధులు.. ఆ ప్రజలనే మరచిపోయిన కాలం దాపురించింది. అధికారానికి దూరంగా ఉన్న నేతలు ప్రజల తరఫున నిలబడి పోరాడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికార అందలాలను అధిరోహించి.. అమాత్యులై కూడా పాలనను గాలికొదిలి.. ప్రజలను పట్టించుకోవడం లేదంటే ఏమనుకోవాలి?! జిల్లా సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక అయిన డీఆర్సీ గురించి కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ.. వారితో కుమ్మక్కు రాజకీయాలు నెరపుతున్న తెలుగుదేశీయులకు కానీ ఏమీ పట్టడంలేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పు గోదావరి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మన జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అధికార పార్టీ వారి సంఖ్యే అధికం. కాకినాడ, అరకు ఎంపీలు ఎంఎం పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్‌లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఇక్కడి ప్రజల గురించి కానీ, ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ.. ఇందులో కీలక భూమిక పోషించే జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం గురించి కానీ వీరిలో పట్టించుకున్నవారే లేరు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండే డీఆర్సీ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన మూడు నెలలకోసారి జరపాలి. అలా జరిగితే ఆ సమయంలో వచ్చే ప్రధాన సమస్యలపై చర్చించి, పరిష్కరించే వీలుంటుంది. గత మార్చి తొమ్మిదో తేదీన అప్పటి హోం, జిల్లా ఇన్చార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. తరువాత తొమ్మిది నెలలుగా దీని ఊసే లేదు. చిత్రమేమిటంటే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన తరువాత ఇంతవరకూ ఇన్చార్జి మంత్రి నియామకమే జరగలేదు. ఇటువంటి సర్కార్ తమ సమస్యలను ఏం పరిష్కరిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీఆర్సీ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, జాతీయ ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, నీటిపారుదల తదితర పలు శాఖల పని తీరును సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ సమావేశం జరగకపోవడంతో ఆయా శాఖల పనితీరును పట్టించుకుంటున్నవారే లేరు. మాట్లాడని మంత్రులు తన అధ్యక్షతన జరిగే విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి వచ్చి వెళ్లడమే తప్ప కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు డీఆర్సీ గురించి పట్టించుకోవడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయని ఆయన.. ఉద్యమం చల్లబడ్డ తరువాత జిల్లాకు వచ్చారు. రాష్ట్ర మంత్రి తోట నరసింహం కూడా డీఆర్సీ ఊసెత్తిన దాఖలాలే లేవు. తరచూ వివిధ కార్యక్రమాల పేరుతో హడావుడే తప్ప జిల్లా అభివృద్ధి గురించి కానీ, అసలు జిల్లాలో ఏం జరుగుతోందన్న అంశాన్ని కానీ ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఆర్సీపై మంత్రులిద్దరూ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా డీఆర్సీలో జాప్యం జరిగిందని నేతలు సమర్థించుకునే యత్నం చేస్తున్నారని, అయితే ఈ ఉద్యమం వచ్చి మూడు నెలలే అయిందని, దానికి ముందు ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలున్నా.. స్పందనే లేదు పై-లీన్ తుపాను, ఆ తరువాత వచ్చిపడ్డ భారీ వర్షాలతో జిల్లాలో రైతులు, మత్స్యకార, చేనేత కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఇటువంటి సమయంలోనైనా బాధితులకు చేయూతనిచ్చే దిశగా డీఆర్సీ ఏర్పాటు చేసి ఉండాల్సిందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, జిల్లాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాన్ని ఆశించి డెల్టా ఆధునికీకరణ, డ్రెయిన్లలో ముంపు సమస్య పరిష్కారంవంటి వాటి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.1600 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులపై డీఆర్సీలో చర్చించే అవకాశం ఉన్నా స్పందించేవారే లేరు.