డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు | Drone Seen on Blue Line | Sakshi
Sakshi News home page

డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు

Published Thu, Oct 3 2024 6:59 AM | Last Updated on Thu, Oct 3 2024 12:06 PM

Drone Seen on Blue Line

న్యూఢిల్లీ: డ్రోన్ల కలకలం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై అధికారులు డ్రోన్‌ను గుర్తించారు. ఈ నేపధ్యంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్‌లో బుధవారం ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌పై డ్రోన్ పడి ఉండటాన్ని చూశామని, ఫలితంగా 30 నిమిషాల పాటు మెట్రో సేవలు దెబ్బతిన్నాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై నుంచి ఆ డ్రోన్‌ను తొలగించేంత వరకూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దాక మెట్రో సేవల పునరుద్ధరణ జరిగింది.

ఇదేవిధంగా బుధవారం రాత్రి 8 గంటలకు జనక్‌పురి మెట్రో లైన్‌కు ఎగువన అనుమానాస్పద డ్రోన్ కనిపించడంతో  ఆ మార్గంలో మెట్రోను నిలిపివేశారు. దీంతో కాసేపు మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనల గురించి ఢిల్లీ మెట్రో అధికారులు మాట్లాడుతూ డ్రోన్లు కనిపించిన బ్లూ లైన్‌లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బ్లూ లైన్‌లో మెట్రో సేవలను పునరుద్ధరించామన్నారు. 

ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement