stopped
-
నెట్ ఆగితే నష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలు, ఎన్నికలు, మత ఘర్షణలు, చివరకు పరీక్షల సమయంలో సమాచారం, సందేశాల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాంతాల వారీగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలను స్తంభింప జేయడం ఇటీవలి కాలంలో సాధారణ విషయమై పోయింది. రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతోంది. 2024లో 88,788 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో 60.48 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం పడినట్లు అంచనా. 28 దేశాల ఆర్థిక రంగంపై రూ.68,319 కోట్ల మేర ప్రభావం చూపించగా..మన దేశంలో రూ.279 కోట్ల మేర 6.77 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించినట్లుగా లెక్కలు వేశారు.ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మయన్మార్ రెండు, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’, టిక్‌టాక్, సిగ్నల్ అత్యధిక గంటల పాటు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిపివేత డిజిటల్ ఎకానమీ, టూరిజం, స్టార్టప్ రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే విద్య, టెలీమెడిసిన్‌తో పాటు అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది.పలు సంస్థల సూచికలు పరిగణనలోకి.. ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల ద్వారా జరిగే నష్టాన్ని ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), యూరోస్టాట్, యూఎస్ సెన్సస్ తదితర సంస్థల సూచికలను ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం, సోషల్ మీడియా స్తంభన, ఇంటర్నెట్ స్పీడ్‌ను 2జీ స్థాయికి తగ్గించడం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత, సామాజిక మాధ్యమాలను స్తంభింప చేసేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ఒక రకంగా ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌గా భావించవచ్చు.⇒ గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ⇒ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై రైతుల దాడి నేపథ్యంలో.. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నవంబర్ 12న దుద్యాల ప్రాంతంలో కొద్ది గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.⇒ గత ఏడాది నవంబర్‌లో మత ఘర్షణలతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో, రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేశారు. డిసెంబర్లో రైతుల నిరసనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో, జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.తరచూ స్తంభిస్తున్న ‘ఎక్స్’, ‘టిక్ టాక్’ ప్రాంతాల వారీగానే కాకుండా దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రత, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనుకున్న ఖాతాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్‌లో గత ఏడాది 28 వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయగా ఇందులో ఫేస్బుక్, ‘ఎక్స్’కు సంబంధించినవే సుమారు 10 వేల వరకు ఉన్నాయి.సామాజిక మాధ్యమ ఖాతాల తొలగింపులో.. అభ్యంతరకర సమాచారం ఉన్న యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌కు సంబంధించిన ఖాతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలగింపునకు గురైన వాటిలో ఎక్కువగా ఖలిస్తానీ అనుకూల సమాచారంతో కూడిన ఖాతాలతోపాటు విద్వేష ప్రసంగాలు, జాతీయ భద్రత, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉన్న ఖాతాలు ఉన్నాయి. -
నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో రోగులకు వివరిస్తూ బోర్డులను కూడా తమ ఆసుపత్రుల ముందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ సిబ్బంది కూడా రోగులకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. దీంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి: తెన్హా నెట్వర్క్ పరిధిలోని 368 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ (ఉద్యోగులు), జేహెచ్ఎస్ (జర్నలిస్టులు) పథకాల కింద ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల విలువైన చికిత్సలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 1,030 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.730 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు. ఈ లెక్కన ఈ సంవత్సరానికి సంబంధించి రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్లు తెన్హా చెబుతోంది.ఇంకా రూ.1,100 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని సంఘం నేతలు తెలిపారు. బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 10 నుంచి సేవలు నిలిపివేస్తామని తెన్హా ప్రకటించటంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్ ఆ సంఘం నాయకులతో గురువారం చర్చలు జరిపారు. రూ.100 కోట్లను టోకెన్ కింద వెంటనే విడుదల చేస్తామని, వచ్చే నెలలో మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. దీంతో తెన్హా వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగా ఇచ్చిందేంటి? బకాయిల్లో కేవలం రూ.100 కోట్లువిడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తెన్హా తప్పు పట్టింది. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.100 కోట్ల విలువైన చికిత్సలు అందిస్తుంటే.. సంవత్సరం నుంచి రావాల్సిన రూ.1,200 కోట్లకుగాను రూ.100 కోట్లు ఇస్తామనటం సరికాదని పేర్కొంది. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో శివశంకర్‌కు శుక్రవారం లేఖ రాస్తూ.. తమ బకాయిల పరిష్కారానికి కచ్చితమైన మార్గం చూపేంత వరకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
వైఎస్ జగన్ కాన్వాయ్ అడ్డగింత (ఫోటోలు)
-
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం(డిసెంబర్21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వర్రావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. -
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
సచిన్ టెండుల్కర్ పదో తరగతితో ఆపితే.. అర్జున్ ఎంత వరకు చదివాడో తెలుసా? (ఫొటోలు)
-
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
డ్రోన్ల కలకలం.. ఆగిన మెట్రో రైళ్లు
న్యూఢిల్లీ: డ్రోన్ల కలకలం కారణంగా ఢిల్లీ మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై అధికారులు డ్రోన్‌ను గుర్తించారు. ఈ నేపధ్యంలో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్లో బుధవారం ఉత్తమ్ నగర్ ఈస్ట్- ఉత్తమ్ నగర్ వెస్ట్ మెట్రో స్టేషన్ల మధ్య ట్రాక్‌పై డ్రోన్ పడి ఉండటాన్ని చూశామని, ఫలితంగా 30 నిమిషాల పాటు మెట్రో సేవలు దెబ్బతిన్నాయని ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై నుంచి ఆ డ్రోన్‌ను తొలగించేంత వరకూ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అధికారులు పరిస్థితిని చక్కదిద్దాక మెట్రో సేవల పునరుద్ధరణ జరిగింది.ఇదేవిధంగా బుధవారం రాత్రి 8 గంటలకు జనక్‌పురి మెట్రో లైన్‌కు ఎగువన అనుమానాస్పద డ్రోన్ కనిపించడంతో ఆ మార్గంలో మెట్రోను నిలిపివేశారు. దీంతో కాసేపు మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనల గురించి ఢిల్లీ మెట్రో అధికారులు మాట్లాడుతూ డ్రోన్లు కనిపించిన బ్లూ లైన్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత బ్లూ లైన్లో మెట్రో సేవలను పునరుద్ధరించామన్నారు. ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన కారు.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో..
సాక్షి, విశాఖపట్నం: షీలానగర్‌లో మారుతి సర్కిల్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు దాటుతూ నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్‌పై సడన్‌గా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులోని ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. పట్టాలపై కారు నిలిపోవడాన్ని గూడ్స్ రైలు లోకో పైలట్ గమనించి వెంటనే వేగాన్ని తగ్గించాడు. అయినప్పటికీ రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో కారులో కొంతభాగం నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన కుటుంబంగా సమాచారం. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు.. -
HYD: సాంకేతిక లోపంతో మరోసారి నిలిచిపోయిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్–మియాపూర్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో సుమారు 30 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో ఆయా స్టేషన్లలో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు, రైళ్లలో జర్నీ చేస్తున్న వారు నరక యాతన అనుభవించారు. సిగ్నలింగ్ సమస్యల కారణంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్ తదితర స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రయాణికులు ఆందోళన చెందడంతో రంగంలోకి దిగిన అధికారులు..సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లను నిలిపివేసినట్లు రైళ్లలో అనౌన్స్మెంట్ చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం రైలు సర్వీసులను పునరుద్ధరించారు. కాగా నగరంలో మెట్రో రైళ్లను కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం(సీబీటీసీ)సాంకేతికత ఆధారంగా నడుపుతున్నారు. ఈ విధానం మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో తరచూ రైళ్లు పట్టాలపైనే నిలిచిపోతున్నాయి. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమౌతున్నారని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్యం పెరిగిన ప్రతీసారీ సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తి రైళ్లు నిలిచిపోతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
దుల్కర్ సల్మాన్ డైరెక్టర్‌తో రజనీ కాంత్ సినిమా?.. ఇదిగో క్లారిటీ!
Desingh Periyasamy Gave Clarity On Working With Rajini Kanth: 'కనులు కనులను దోచాయంటే' (తమిళంలో కన్ను కన్ను కొళ్లైయడిత్తాల్) చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు దేసింగ్ పెరియసామి. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రం 2020లో విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో ఈ దర్శకుడు పేరు మారుమ్రోగింది. పలువురు సినీ ప్రముఖులు ప్రసంశించారు. అందులో నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. కాగా రజనీకాంత్‌తో దేసింగ్ పెరియస్వామి చిత్రం ఉంటుందని ప్రచారం జరిగింది. ఈయన చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చేసిందని అందులో నటించడానికి ఆయన పచ్చ జెండా ఊపినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా 'అన్నాత్తే' చిత్రం తరువాత దేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తారని టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే అనూహ్యంగా దర్శకుడు నెల్సన్ తెరపైకి వచ్చారు. విజయ్ హీరోగా బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు దేసింగ్ పెరియస్వామి ఒక భేటీలో పేర్కొంటూ.. తన రెండో చిత్రం రజనీకాంత్ హీరోగా తెరకెక్కాల్సి ఉందని, కానీ కొన్ని కారణాలతో అది జరగలేదన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా రజనీకాంత్‌ను డైరెక్ట్ చేస్తాననే నమ్మకం ఉందన్నారు. కొత్త చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. చదవండి: సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ? -
Afghanistan: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
కాబూల్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘన్లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్యకు అక్కడి యువతులు దూరమయ్యారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లో రష్యాకు షాకులు.. పుతిన్ ఏం చేస్తారోనన్న టెన్షన్..? -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్‌పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్ నిద్ర.. ఆగిన రైలు
నంద్యాల రూరల్: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ వద్ద కాపలా ఉన్న గేట్‌మ్యాన్ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్ వేయలేదని గమనించిన లోకోపైలెట్ రైలును ఆపి హారన్ మోగించారు. స్థానికులు రూమ్‌లో ఉన్న గేట్‌మ్యాన్‌ను నిద్రలేపారు. గేట్ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్‌మ్యాన్‌ను విచారించారు. అతడు మద్యం తాగాడని తెలుసుకుని విధుల నుంచి తొలగించారు. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ -
‘కట్ట’లతోనే మమ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మాదిరే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పం చేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు ఎక్కడివక్క డే ఆగిపోయాయి. పనులు మొదలుపెట్టి నాలుగేళ్లయినా.. డబ్బులొచ్చే కట్టపనులు మాత్రమే చేసిన కాంట్రాక్టర్లు మిగతా సుందరీకరణ పనులు చేయకుండా చేతులెత్తేశారు. పనుల పూర్తిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేక..నిధుల విడుదల్లేక ఆహ్లాదం పంచాల్సిన ట్యాంక్‌లు కళావిహీనంగా మారాయి. సగం మాత్రమే పూర్తి... చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మినీ ట్యాంక్‌బండ్‌లను రూ.571.53 కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో ఇప్పటివరకు రూ.290 కోట్ల మేర పనులే పూర్తయ్యాయి. 50చోట్ల మాత్రమే పూర్తిస్థాయి ట్యాంక్బండ్ల నిర్మాణం పూర్తవగా చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. మట్టిపనితో కూడిన కట్ట నిర్మాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పనులు మాత్రమే చేశారు. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగించి, బిల్లులు తీసుకొని మమ అనిపించారు. ఇవి మినహా బతుకమ్మ ఘాట్లు, వాకింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ ట్రాక్‌ల పనులు చేయనేలేదు. చాలాచోట్ల కట్టలపై రోడ్డు నిర్మాణాలు జరుగక ట్యాంక్‌బండ్ దగ్గరకు సైతం వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పట్టణాల నుంచి మురుగు ట్యాంక్బండ్ల్లోకే వచ్చి చేరుతూ కంపుకొడుతున్నాయి. నిర్మాణ నిబంధనలు ఇవి.. మినీ ట్యాంక్ బండ్ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్లతో నిర్మించి రోడ్డు వేయాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. నిధుల్లేక నీరసం... ట్యాంక్బండ్ల పనులు నత్తనడకకు నిధుల లేమి సైతం సమస్యగా మారింది. మిషన్ కాకతీయ సమయంలోనే ఈ పనులూ చేపట్టారు. చెరువుల పను లు చేసిన కాంట్రాక్టర్లే చాలా చోట్ల మినీ ట్యాంక్‌బండ్ పనులు చేపట్టారు. చెరువులు, మినీ ట్యాంక్‌బండ్‌లకు కలిపి మొత్తంగా రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి రూ.100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఓ వైపు చెరువుల బిల్లు లు రాక, మినీ ట్యాంక్‌బండ్ బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేశారు. మహబూబాబాద్‌లోని నిజాం చెరువుకు రూ.5.50 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా నేటికి 30 శాతమే పూర్తయ్యాయి. కట్ట పనులు, పంట కాల్వ, మత్తడి పనులు పూర్తి కాగా.. పార్క్, వాకింగ్ ట్రాక్, బ్రిడి ఇతర పనులు చేయాలి. కాంట్రాక్టర్‌కు రూ.2 కోట్లు చెల్లించారు. గడువులు దాటుతున్నా పనులు సాగడం లేదు. చెరువు నుంచి గోపాలపురం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేసి ఏడాదిన్నరయినా పనులు పూర్తి కాలేదు. మరమ్మతులు లేక తెగిపోయిన నిజాం చెరువుకట్ట భైంసాలోని సుద్ధవాగు(గడ్డెన్నవాగు) ప్రాజెక్టులోనే ఓ వైపు మినీ ట్యాంక్‌బండ్ పేరిట పనులను చేపట్టారు. 2017, మార్చి 9న శంకుస్థాపన చేశారు. రూ.3.64 కోట్లతో పనులు చేపట్టగా, రూ.2.42 కోట్ల పనులు పూర్తయినట్లు చూపారు. ప్రాజెక్టు పక్కనే లోతైన గుంతలతో ఉన్న ప్రాంతాన్ని మొరంతో నింపారు. నీళ్లున్నవైపు బతుకమ్మ ఘాట్ నిర్మించారు. చుట్టూ రెయిలింగ్ వేసి, పార్క్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. అసలు ఆ ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మధ్యలో సీసీ పేవ్మెంట్ వేసి వదిలేశారు. భైంసా పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ -
సాంకేతిక సమస్యలతో ఆగిన ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ నూతన నమోదు, సవరణల ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా గత కొద్దిరోజులుగా నిలిచిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాల్లో (ఏఈసీ) జరిగే ఈ ప్రక్రియకు ఐదురోజులుగా అంతరాయం ఏర్పడింది. దీంతో కొత్త కార్డుల కోసం నమోదు, వేలిముద్రలు–ఐరిస్ అప్డేషన్, ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాల కోసం ఏఈసీలకు వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 కేంద్రాలు ఈ సేవలందిస్తున్నాయి. రోజుకు సగటున లక్ష మంది వివిధ రకాల సేవల కోసం ఈ కేంద్రాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం వీటిల్లో సేవలు నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రాల చుట్టూ చక్కర్లు.. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కార్యక్రమంలో భాగంగా ఆసరా íపింఛన్లు ఇస్తోంది. ఇటీవల ఈ పథకం వయోపరి మితి నిబంధన సడలించి 57 సంవత్సరాలు దాటిన వారికి ఫించన్లు్ల ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్ల మంజూరుకు ఆధార్ కార్డు వివరాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖా స్తులకు ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఇప్పటివరకు ఆధార్ లేనివారు కొత్తగా నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే ఉంటే వ్యక్తిగత వివరాల అప్డేషన్, పేర్లు, చిరునామాలు తదితరాల్లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏఈసీలకు వస్తున్నారు. అయితే ఐదురోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వయోవృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ఆధార్ జత చేసి దరఖాస్తు చేసుకోకుంటే పింఛ న్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రోజూ ఆ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసరాతో పాటు పలు పథకాలు, అనేక వ్యవహారాలు/ లావాదేవీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అ య్యింది. దీంతో ఇప్పటివరకు తీసుకోనివారు ఈ కేం ద్రాల్లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఐదేళ్లకోసారి చేసుకోవాల్సిన బయోమెట్రిక్ అప్డేషన్కోసం కూడా చాలామంది ఈ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యల ను అధిగమించేందుకు యూఐడీఏఐ సంబంధిత ఇంజనీర్లను రం గంలోకి దింపింది. సర్వీసుల పురనరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. అయితే ఎన్నిరోజుల్లో సర్వీసులు పునరుద్ధరిస్తామనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఐదు రోజులుగా తిరుగుతున్నా.. ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం సవరణ కోసం ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నా. నగరంలోని కేంద్రాలతో సహా 20 సెంటర్లు తిరిగా. ఎక్కడా సర్వర్ పనిచేయట్లేదు. ఈ మార్పు చేసుకుంటేనే నేను ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగలను. – కె.నర్సింహారెడ్డి, హన్మాస్‌పల్లి, రంగారెడ్డి జిల్లా -
ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్: నేపాల్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబాకు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్ మందును భూటాన్ నిలిపివేయగా.. తాజాగా నేపాల్ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్ విఫలం చెందిందని గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ కిట్‌లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‌ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్‌కు ప్రత్యామ్నాయ మందులకు నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది. కరోనిల్ కిట్‌ను పతాంజలి సంస్థ రూపొందించింది. ఈ మందును 2020 జూన్ 23వ తేదీన విడుదల చేశారు. ఈ మందు కరోనా కట్టడిలో విఫలం చెందిందని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆ మందుకు డిమాండ్ లేకుండాపోయింది. అయితే పతాంజలి సంస్థ మాత్రం తమ కరోనిల్ కిట్‌ను లక్షల్లో విక్రయించినట్లు తెలిపింది. చదవండి: పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ చదవండి: రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే -
కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు
డోర్నకల్/వరంగల్: ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు కోసం ఖబ్రస్థాన్ను ఆక్రమించారని ఆరోపిస్తూ డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు ముస్లింలు మానుకోట జిల్లా కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని అడ్డగించారు. వివరాలిలా ఉన్నాయి. అమ్మపాలెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కలెక్టర్ బుధవారం పరిశీలించేందుకు వచ్చారు. పరిశీలన అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఎస్కె మునీర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలెక్టర్ వాహనాన్ని అడ్డగించారు. 21 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 571లోని 1.20 ఎకరాల బంచరాయి భూమిని ఖబ్రస్థాన్ కోసం కేటాయించారని మునీర్ తదితరులు తెలిపారు. ఆ స్థలంలో 20 మంది ముస్లింల సమాదులు ఉండగా.. ఇటీవల నర్సరీ ఏర్పాటు కోసం వాటిని తొలగించి ఆక్రమించారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ఖబ్రస్థాన్ స్థలాన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. -
హైదరాబాద్‌లో నిలిచిపోయిన మెట్రో ట్రైన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రోరైలు సేవలు మరోసారి నిలిచిపోయాయి. అమీర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్ బస్‌స్టేషన్ వెళ్తుండగా, మార్గమధ్యంలో 15 నిమిషాలపాటు మెట్రోరైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వరకు వచ్చిన ట్రైన్లో ప్యాసింజర్లను దింపేశారు. ఆగిపోయిన ట్రైన్‌ను తీసుకువచ్చేందుకు అధికారులు మరో ట్రైన్‌ను పంపారు. అయితే గతంలోనూ మెట్రో రైళ్లలో పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తరచూ ఇలా మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కొద్ది క్షణాల్లో పెళ్లి.. 100కు కాల్ చేసిన వధువు
సాక్షి, మహబూబాబాద్(మరిపెడ రూరల్): పీటల మీద ఓ పెళ్లి ఆగిపోవడం కలకలం రేగింది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేస్తున్నారని వధువు కల్యాణ మండపం నుంచే 100 నంబరుకు ఫోన్ చేసింది. ఈ సం ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని కృష్ణమూర్తి, రంగమ్మ దంపతుల కుమారుడు యామిని రాజేశ్‌కు, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతికి పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించారు. చదవండి: (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) ఈ మేరకు గురువారం ఉదయం 11:55కి ముహూర్తం ఖరారు చేశారు. ముందుగా కల్యాణ మండపంలో పెళ్లి పీట లపై వధువు కూర్చుంది. పురోహితులు గౌరీ పూజ చేస్తున్న క్రమం లో.. వధువు లేచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పింది. అక్కడి నుంచే 100 నంబర్‌కు ఫోన్ చేసిం ది. పెళ్లి ఆగి పోవడంతో మండపంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వధువును స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా.. తాను కాంపెల్లికి చెందిన యువకున్ని ప్రేమించానని.. అతడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు ముందే చెప్పినా వినకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారని వాపోయింది. కాగా, అదే కల్యా ణ మండపంలో తన బంధువులకు చెందిన మరో యువతితో వరుడు రాజేశ్ వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (తండ్రి కొట్టాడని అలిగెళ్లి.. పాతికేళ్లకు మళ్లీ!) -
డిసెంబర్ నుంచి పాత విధానమే..!
ఆదిలాబాద్‌అర్బన్: కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు అందించిన ఉచిత రేషన్ బియ్యం సరఫరా గడువు ముగిసింది. డిసెంబర్ 1 నుంచి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించనున్నారు. బుధవారంలోగా డీడీలు కట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో డీలర్లందరు డీడీలు అందజేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో సామాన్య, మద్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. దీంతో కార్డుదారులు యూనిట్‌కు పదికిలోల చొప్పున ఎనిమిది నెలల పాటు ఉచితంగా తీసుకున్నారు. ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత డీలర్లకే అప్పగించడంతో కార్డుదారులు నేరుగా షాపుకు వెళ్లి బియ్యం తీసుకున్నారు. జిల్లాలోని 355 రేషన్ దుకాణాల ద్వారా 1,88,549 మంది కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. ఒకరికి 12 కిలోల చొప్పున నాలుగు నెలలు 10కిలోల చొప్పున మరో నాలుగు నెలలు అందించారు. దీంతో ప్రతినెల జిల్లాకు 8,032 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమైంది. తెల్లరేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు అనే తేడా లేకుండా అన్నిరకాల కార్డుదారులకు ఎనిమిది నెలలు ఉచితంగా అందజేయడంతో 1,88,549 కార్డుల పరిధిలో 6 లక్షలకుపైగా లబ్ధిపొందారు. అయితే ఉచిత బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా ఈ పాస్ విధానంతో కాకుండా నేరుగా అందించారు. ఇక నుంచి పాత విధానమే తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం ఇక నుంచి పాత పద్ధతి ద్వారానే పంపిణీ చేయనున్నారు. కరోనాకు ముందు ఎలా పంపిణీ జరిగిందో ఇక నుంచి అలాగే కొనసాగనుంది. రేషన్ షాపులో ఈ పాస్ విధానం ద్వారా వేలిముద్ర వేసి కిలో బియ్యానికి రూపాయి చెల్లించి యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున పంపిణీ జరుగనుంది. అయితే జిల్లాలో ఇంకా కొన్ని రేషన్ షాపుల్లో ఈపాస్ విధానం అమలు కాకపోవడంతో రిజిస్టర్లో పేర్లు చూసుకొని లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుని బియ్యం పంపిణీ చేస్తున్నారు. సెకండ్ వేవ్ ముప్పుందా? దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. సెకండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని మరో మూడు లేదా నాలుగు నెలల పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేసేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐదు నెలల వరకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని జూలై1న ప్రకటించారు. దీంతో ఈ సారి కూడా డిసెంబర్ 1 వరకు వేచిచూడాల్సిన అవసరముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా పీఎం ప్రకటిస్తే ఉచిత బియ్యం లేదంటే రూపాయి కిలో బియ్యం అందనున్నాయి. -
ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్ట్‌లకు విరామం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. గురువారం నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలు చేయకూడదని ప్రైవేటు ల్యాబ్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్రంలో 18 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చాయి. దీంతో గతనెల మూడో వారం నుంచి ప్రైవేటు ల్యాబ్‌లు ఈ పరీక్షల్ని ముమ్మరంగా చేపట్టాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే అధిక మొత్తంలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించింది. ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తేలింది. అవగాహన, నైపుణ్యం లేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందువల్లే తప్పుడు ఫలితాలు వస్తున్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయా ల్యాబ్‌ల యాజమాన్యాలకు నోటీసులు జారీచేస్తూ, లోపాలు దిద్దుకోవాలని ఆదేశించింది. లోపాలు సరిదిద్దుకునేందుకే.. ప్రభుత్వ నోటీసులకు వివరణ ఎలా ఇవ్వాలనే దానిపై ప్రైవేట్ ల్యాబ్‌లు తర్జనభర్జన పడుతున్నాయి. లోపాలు దిద్దుకుని ఈ నెల 5 వరకు నివేదిక ఇవ్వాలని భావిస్తున్నాయి. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పాటు కొత్తగా పరీక్షలు చేయరాదని నిర్ణయించాయి. అయితే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే శాంపిల్స్‌ను మాత్రం పరిశీలిస్తున్నట్లు ల్యాబ్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే, ఇప్పటివరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేసిన పరీక్షల ఫలితాలను ఐసీఎంఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓ ప్రైవేటు ల్యాబ్ ఏకంగా 12వేల పరీక్షలు నిర్వహించినా.. ఫలితాలను అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయొద్దని తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టంచేసింది. -
నల్లగొండ సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కార్లు, ద్విచక్రవాహనాల పై వేల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో గురువారం నల్లగొండ జిల్లాలో ఏపీతో సరిహద్దులు ఉన్న రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌వాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి వేల సం ఖ్యలో ప్రజలు రావడంతో దామచర్ల మండలం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీ పోలీసులు వారిని కొద్దిసేపు అడ్డుకుని అనంతరం షరతులతో రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతించారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్య రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామునుంచే ద్విచక్రవాహనాలు, కార్లల్లో ఏపీకి వెళ్లేందుకు జనం వచ్చారు. చెక్‌పోస్టు వద్ద నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) చూసిన అనంతరం తెలంగాణ పోలీసులు వారు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణానది ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వీరిని కొద్దిసేపు అడ్డుకున్నారు. సమస్య తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలతో కలసి వాడపల్లి చెక్ పోస్టును సందర్శించారు. పరిస్థితి తీవ్రతను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రజలు వచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని, ఇకపై సరిహద్దును మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకపై ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. క్వారంటైన్‌కు వెళతామంటేనే అనుమతి ఏపీకి సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్‌పై వంతెన దాటగానే గుంటూరు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టళ్లు, మెస్సులు మూతపడడంతో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వారు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకుని బుధవారం రాత్రే ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు చొప్పున బయలుదేరి తెల్లారే సరికల్లా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. మరికొంతమంది అద్దెకార్లు, టాటా సుమోల్లో ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకున్నారు. అయితే నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వారి వాహనాలను మొదట నిలిపివేశారు. దీనిపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో గుంటూరు జిల్లా ఎస్పీ విజయారావు సరిహద్దుకు చేరుకుని 14 రోజులపాటు క్వారంటైన్‌కు వెళతామంటే రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే, ఈ షరతు నచ్చని చాలామంది తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మరికొంత మంది దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లొచ్చని వాడపల్లికి వచ్చారు. -
రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు...! గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్ అయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి. -
షారుఖ్ బర్త్‌డే పార్టీని అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తన 53వ జన్మదిన వేడుకలను జరుపుకున్న షారుఖ్.. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. తనకు సన్నిహితులైన కొందరు మిత్రులను ఆ పార్టీకి పిలిచారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద శబ్దాలతో కూడిన సంగీతం ఆగక పోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నగరంలోని రెస్టారెంట్లు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత పనిచేయరాదనే నిబంధనలున్నాయంటూ కార్యక్రమాన్ని ఆపుచేయించారు. -
రంజాన్‌లో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేత
న్యూఢిల్లీ/శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసంలో జమ్మూకశ్మీర్‌లో మిలటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని భద్రతాబలగాలను కేంద్రం ఆదేశించింది. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ భద్రతాబలగాలపై దాడి జరిగితే తిప్పికొట్టేందుకు, ప్రజల్ని రక్షించే పూర్తి స్వేచ్ఛ బలగాలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్థంలేని హింసతో ఇస్లాంకు చెడ్డపేరు తీసుకొస్తున్న ఉగ్రమూకలను ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రంజాన్‌ను ముస్లింలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
జయ వార్డులో సీసీ కెమెరాలు ఆపేశాం
టీ.నగర్ (చెన్నై): దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికిత్స పొందిన సమయంలో.. ఒక ఐసీయూ యూని ట్ మొత్తాన్ని ఆమెకే కేటాయించామని, ముందు జాగ్రత్తగా ఆమె వార్డులోని సీసీ కెమెరాలను ఆపేశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడించారు. సంబంధం లేని వ్యక్తులు చూడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొలొరెక్టల్ సర్జరీ, యూఎస్ఏ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24, 25న నిర్వహించనున్న సదస్సు గురించి మీడియాతో మాట్లాడుతూ.. జయకు అందించిన చికిత్స వివరాల్ని వెల్లడించారు. ‘24 గదుల ఐసీయూ యూనిట్ మొత్తాన్ని జయకే కేటాయించినా.. ఒక గదిని మాత్రమే ఉపయోగించాం. చికిత్స పొందిన 75 రోజులు అన్ని సీసీటీవీల్ని ఆపుచేశాం. మిగతా రోగుల్ని వేరే ఐసీయూలోకి మార్చాం’ అని చెప్పారు. కొద్దికాలం సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించలేదని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న వైద్యుడి సమ్మతి మేరకే అనుమతించేవారిమని తెలిపారు. జయలలితకు ఆస్పత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్స అందించామని, విదేశీ వైద్యులు కూడా సాయపడ్డారని, ఆమె పూర్తిగా కోలుకున్నారని భావించిన తరుణంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామన్నారు. -
ఆగని చిరుత దాడులు
రామాయంపేట(మెదక్): చిరుతల దాడుల పరంపర కొనసాగుతుంది. గత పదిహేను రోజులుగా ప్రతిరోజూ మండలంలోని ఏదో చోట చిరుత దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఆయా గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి చిరుతలు మండలంలోని అక్కన్నపేటలో రెండు, లక్ష్మాపూర్ పరిధిలో ఒక దూడను హతమార్చాయి. అక్కన్నపేటకు చెందిన వెల్ముల లక్ష్మి తన పశువులను అటవీప్రాంతానికి సమీపంలో పంటచేలవద్ద కట్టివేయగా, అర్థరాత్రి చిరుత దాడిచేసి రెండు దూడలను హతమార్చింది. ఉదయం లక్ష్మి తన పంటచేలవద్దకు వెళ్లి చూడగా, ఒక దూడ చనిపోయి ఉండగ, మరో దూడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపటి తరువాత మృతిచెందింది. మరో సంఘటనలో లక్ష్మాపూర్ గ్రామశివారులో చింత పోచయ్యకు చెందిన దూడను చిరుత ఎత్తుకెళ్లి హతమార్చింది. దీనితో రైతులు రాత్రి వేళలో పంట చేలవద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుతలను బంధించి తమను రక్షించాలని వారు అటవీశాఖ అ«ధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ శాఖ అధికారులు సంఘటనా స్థలిని సందర్శించారు. -
జ్యోతిష్యంతో ‘పెళ్లి’కి ఎసరు!
సిద్దిపేటటౌన్ : తప్పుడు జ్యోతిష్యం చెప్పడంతో ఓ పెళ్లి ఆగిపోయింది. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందంటూ జ్యోతిష్యుడు చెప్పడంతో అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి సంబంధం వదులుకున్నారు. ఆ మాటే అబ్బాయి తరఫు వాళ్లు అమ్మాయి వాళ్లకు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆ జ్యోతిష్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. మూఢ నమ్మకంతో పెళ్లి ఆగిన ఘటన సోమవారం సిద్దిపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీనివాస నగర్లో రాజు పంతులు అనే వ్యక్తి జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నాడు. అదే కాలనీలోని ఓ కుటుంబం తమ కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటున్నామని తాము చూసిన అమ్మాయి జాతకం చూడమని ఆ జ్యోతిష్యునికి చూపించారు. దాన్ని చూసిన పంతులు ఇద్దరికి జాతకాలు కలవడం లేదని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఇంట్లో ఒకరికి ప్రాణ హాని ఉందని ఖంగు తినే విషయం చెప్పాడు. ఆ పంతులు చెప్పిన మాట నమ్మిన వారు అమ్మాయి వాళ్లకు అదే విషయాన్ని చెప్పి పెళ్లి ఆలోచన మానుకోవాలని చెప్పారు. అంతకుముందే కట్నకానుకల విషయం మాట్లాడుకొని ఈ నెల 22న నిశ్చితార్థం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే జాతకాల వ్యవహారం అమ్మాయి తరఫువాళ్లను ఆందోళనలో పడేసింది. అమ్మాయి వాళ్లు ఆదివారం వచ్చి జ్యోతిష్యున్ని సంపద్రించడంతో మీ అమ్మాయికి జన్మలో పెళ్లి కాదని చెప్పాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జాతకంలో దోషం ఉందని పేరు మార్చుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుందని చెప్పినట్టు తెలిపారు. నాలుగు నెలల నుంచి కలిసి మెలిసి తిరిగిన అమ్మాయి, అబ్బాయి రాజు పంతులు చెప్పిన మాటలతో పెళ్లి చేసుకోలేకపోతున్నారని, దీనంతటికి పంతులే కారణమని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన మీదకు దాడికి వచ్చారని రాజు పంతులు పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కోరడంతో పోలీసులు అతడిని, అబ్బాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి తరఫు వాళ్లు మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకున్నారు. పెళ్లి కారణంగా అమ్మాయివాళ్లకైన డబ్బులు ఇవ్వడానికి అబ్బాయి వాళ్లు అంగీకారం తెలపడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు.. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టైంల శనివారం రాత్రి అబ్బాయి వాళ్లు ఫోన్ చేసి మా అమ్మాయిని చేసుకుంటే వారి కుటుంబంలోని ఒకరికి ప్రాణ హాని ఉందని చెప్పిండ్రు. పెళ్లి క్యాన్సల్ చేస్తున్నట్టు చెప్పిండ్రు. ఏం చేయాల్నో మాకు ఏం అర్థం కావడం లేదు. మమ్మల్ని ఆగం చేసిండ్రు. గుట్టుగా బతికే మమ్మల్ని రోడ్డు మీదకు గుంజిండ్రు.. –అమ్మాయి తల్లి పెళ్లి యోగం లేదన్నాడు ముందుగా మేం చూపించిన పంతులు జాతకం బాగానే ఉందన్నాడు. రాజు పంతులు మా అమ్మాయికి జన్మలో పెళ్లి కాదన్నాడు. పెళ్లి యోగం లేదన్నాడు. ఒక వేళ పెళ్లి అయితే నా తల నరుక్కుంటా అని చెప్పి.. ఇంకా ఎవరినైనా పండితులను అడిగి తెలుసుకొని నాకు ఫోన్ చేయమని తన నంబర్ నాకిచ్చాడు. రాజు పంతులు వల్లనే మా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. – అమ్మాయి తండ్రి పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమన్నా.. నా దగ్గరకు ముందుగా ఒక తప్పుడు డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూసి చెప్పాను. మళ్లీ ఇంకో డేట్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారం చూస్తే జాతకంలో కొంచెం దోషం ఉందని, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను. అదే జాతకం తీసుకొని వేరే పంతులు దగ్గరకు వెళ్లినా నేను చెప్పిందే చెప్తాడు. నేను తప్పుడు జాతకం చెప్పలేదు. –రాజు పంతులు, జ్యోతిష్యుడు -
ఈయూకు చేపల ఎగుమతి తాత్కాలికంగా నిలిపివేత
బ్రెసిలియా: యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చేపల ఎగుమతిపై బ్రెజిల్ తాత్కాలికంగా నిలిపివేసింది. కొన్ని బ్రెజిల్ సంస్థలు ఆహార భద్రత నిబంధనలు పాటించడంలో అక్రమాలను కనుగొన్న నేపథ్యంలో ఈ నిలిపివేతను ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈయూ నిర్వహించిన ఆడిట్ నేపథ్యంలో జనవరి 3నుంచి విరామం కార్యాచరణను అమలులో పెట్టనున్నట్లు బ్రెజిల్ వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ కార్యాచరణలో భాగంగా యూరప్‌కు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే బ్రెజిల్ ఓడలను తనిఖీ చేపట్టారు. పది కంపెనీలకు గాను 6 కంపెనీల్లో తనిఖీ అధికారులు సమస్యలను కనుగొన్నారు. -
చెన్నంపల్లి కోటలో నిలిచిన తవ్వకాలు
సాక్షి, కర్నూలు: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలు నిలిచిపోయాయి. అక్కడ గుప్త నిధులున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. వారం రోజులుగా తవ్వకాలు జరుగుతుండగా శుక్రవారం బండ రావడంతో తవ్వకాలకు బ్రేకులు పడ్డాయి. బండను పేల్చివేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం స్థానిక అధికారులు ఎదురుచూస్తున్నారు. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు. -
సాగునీరు లేకుండా చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న రైతులు వెయ్యి ఎకరాల్లో వరినాట్లు వేయని వైనం తరలివెళ్లిన పోలీసులు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు లేక వరినాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానం కారణం పైప్‌లైన్ పనులేనని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు ఆవలి పక్కనే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే నీరు పైప్‌లైన్ పనులకు ఇవతల వైపున ఉన్న 1,000 ఎకరాలకు అందాలి. పైప్‌లైన్ పనుల వల్ల నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఇంత వరకూ వరినాట్లు వేయలేకపోయారు.అదీ వారి ఆగ్రహానికి కారణం. దీంతో తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు, కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ. వెంకటేశ్వరావు, 20 మంది పోలీస్ సిబ్బంది తరలివెళ్లారు. అధికారులు ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆగస్టు 2కు వాయిదా వేసిందని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తే వాటి ఆధారాలు చూపాలని ప్రభుత్వ అడ్వకేట్‌ను కోరారని, అంతవరకూ పనులు చేయడానికి వీల్లేదని రైతులు కలగర బాలకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, ప్రసాద్, చల్లమళ్ళ విజయ్‌కుమార్ చౌదరి తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన అధికారులు ఇందులో పనులు ఆపమని చెప్పలేలే అని వివరించారు. రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పనులు చేయమని ఆర్డర్ చూపాలని మెగా ఇంజనీరింగ్ ఆధికారులను నిలదీశారు. దానికి అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకునే అధికారం మీకు లేదని, కోర్టు అర్డరులో పనులు ఆపమని లేనందున పనులు యథావిదిగా చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంతేగాకుండా అధికారులు పోలీసుల రక్షణలో పనులు కొనసాగించారు. వరినాట్లు వేయడానికి తొర్రిగెడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు వెళ్లడానికి పైప్‌లైన్ వద్ద కాలువను కలుపుతామని చెప్పి తక్షణమే పనులు చేపట్టారు. దీనితో రైతులు మద్యాహ్న 1.30 గంటలకు అక్కడ నుండి తరలి వెళ్లారు. ఎత్తిపోతల పథకం పనులు యధావిదిగా కొనసాగించారు. -
అక్రమ రవాణాకు చెక్
నూతన జీఎస్టీ విధానంతో జరిగిన మేలు పప్పులు, నూనెలపై ఏకీకృత పన్ను విధింపు ఇంత వరకూ ఐదు శాతం పన్ను ఎగవేతకు వ్యాపారుల ఆపసోపాలు యానాం నుంచి నిలిచిన అక్రమ సరుకు దిగుమతులు చెక్‌పోస్టు ఎత్తివేత అమలాపురం టౌన్ : దేశ వ్యాప్త జీఎస్టీ విధానంతో రాష్ట్రాల మధ్య పన్నుల వత్యాసాలు చెరిగిపోయాయి. ఒక రాష్ట్రంలో పన్నులు లేని కొన్ని వస్తువులను ఇతర రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకునే అక్రమ రవాణాలు ఆగిపోయాయి. దీంతో మన జిల్లాలో అంతర్భాగమై ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని ఫ్రెంచి యానాం నుంచి నిత్యం జరిగే వివిధ ఆహార దినుసులు, అపరాల తదితర వస్తువుల అక్రమ రవాణాకు సైతం అడ్డుకట్ట పడింది. పుదిచ్ఛేరి రాష్ట్రానికి పన్నుల పరంగా కొన్ని వెసులబాట్లు ఉండేవి. దాంతో అక్కడి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు భారీ ఎత్తున సరుకు అక్రమంగా రవాణా అయ్యి జిల్లాలో పన్నుల ఎగవేత జరిగేది. ఇప్పుడు జీఎస్టీతో ముఖ్యంగా పప్పు ధాన్యాలు, వంట నూనెలు, చక్కెర తదితర ఆహార వస్తువులపై సమాంతర పన్నులు విధించటంతో ఒక విధంగా అక్రమ రవాణా నిలిచిపోయింది 5 శాతం పన్ను ఎగవేత కోసం.. ఫ్రెంచి యానాంలో అన్ని రకాల పప్పు ధాన్యాలు, వంట నూనెలు తదితర ఆహార వస్తువులపై 0 శాతం పన్ను అమలయ్యేది. అదే మన రాష్ట్రంలో వాటిపై 5 శాతం పన్ను ఉండేది. ఈ పన్ను ఎగవేతకు కొందరు వ్యాపారులు అక్కడి నుంచి పప్పులు, నూనెలను జిల్లాలోకి అక్రమంగా రవాణా చేసి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలకు తరలించేవారు. దీని వల్ల జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు రోజుకు రూ.పది లక్షల చొప్పున, నెలకు రూ.మూడు కోట్ల నష్టం వాటిల్లేది. ఒడిషా నుంచి వంట నూనె పీపాల లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి పప్పుల లారీల సరుకు ఫ్రెంచి యానానికి దిగుమతి అవుతున్నట్లు బిల్లులు ఉండేవి. అవి మన జిల్లాలోని బడా హోల్‌సేల్ వ్యాపారాలకు చేరేవి. ఇదంతా ఓ రాకెట్లా సాగేది. అమలాపురానికి రెండు రోజులకోసారి ఫ్రెంచి యానాం బిల్లుతో వచ్చిన పప్పులు, వంట నూనెల లారీలు అక్రమ రవాణాతో వచ్చి రహస్యంగా దిగుమతి అయ్యేవి. చెక్ పోస్టు ఎత్తివేత : పన్నుల వ్యత్యాసం, సరిహద్దు సమస్యతో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఫ్రెంచి యానాం నుంచి అక్రమ రవాణాలను అరికట్టేందుకు కొన్నేళ్ల కిందట యానాం సమీపంలోనే ఓ చెక్‌పోస్టు పెట్టింది. యానాం నుంచి 0 శాతం పన్నుల సరుకులను జిల్లాలోకి ప్రవేశించకుండా ఈ దీనిని ఏర్పాటు చేసినప్పటికీ జీఎస్టీ అమలు తరువాత ఎత్తివేశారు. అయితే జీఎస్టీ నుంచి మద్యం, డీజిల్, పెట్రోలులకు మినాహాయింపు ఉండటంతో యానంలో వాటికి ఉన్న తక్కువ ధరల వెసులబాటు అలానే కొనసాగుతోంది. -
ఎయిర్‌పోర్టు పనులను అడ్డుకున్న రైతులు
తమకు న్యాయం చేయాలని డిమాండ్ వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి సారథ్యం తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మధురపూడి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. తమ భూములకు పరిహారం, సాగునీరు, ఉపాధి, రోడ్లు అందించాలని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధులు కేటాయించాలని కోరుతూ రైతులు ఈ చర్యకు ఉపక్రమించారు. వైఎస్సార్సీపీ సీజీసీ జభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వారికి సారథ్యం వహించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టు అధికారులు, కాంట్రాక్టర్లతో రైతులు ఒక దశలో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా మధురపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరుకొండ తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించకుండా ఎయిర్‌పోర్టు విస్తరణ, రక్షణ గోడ పనులు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. రైతులు పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని తహసీల్దార్ హుస్సేన్‌కు అందించారు. దీంతో తహసీల్దార్ హుస్సేన్ రైతులను కోరుకొండలోని తన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లను సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కోరుకొండ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గరగ మధు, రైతు విభాగం కన్వీనర్ తోరాట శ్రీను, మధురపూడి రైతు నాయకులు గణేశుల పోసియ్య, ఆకుల రామకృష్ణ, నందెపు ప్రసాద్, పిల్లా పోలీసు, గణేశుల మాణిక్యాలు పాల్గొన్నారు. ఐక్యంగా ఉద్యమిద్దాం ఎయిర్ పోర్టు పనులను అడ్డుకున్న రైతులను ఉద్దేశించి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల సమస్యల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో కాలయాపన చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. -
నిలిచిన ఇసుక అక్రమ తవ్వకాలు
కొవ్వూరు : కొవ్వూరు పరిధిలోని చిడిపి, బల్లిపాడు, గూటాల ర్యాంపులతోపాటు పోలవరంలోని రెండు ఇసుక ర్యాంపులను శనివారం మూసివేశారు. ‘ఈ ర్యాంపుల మాటేమిటో!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ ర్యాంపుల్లో పనిచేస్తున్న యంత్రాలు, లారీలు ఒడ్డుకు చేరాయి. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు ర్యాంపుల్ని మూసివేసినట్టు సమాచారం. ఆచంట మండలం కోడేరు ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో నరసాపురం సబ్ కలెక్టర్ దాడిచేసి 28 లారీలు, 6 పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అధికార పార్టీ నేతల అండదండలతో పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లో యంత్రాలను వినియోగిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, నేతల్లో గుబులు రేగింది. మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ తంతుకు ‘సాక్షి’ కథనంతో బ్రేక్ పడింది. ర్యాంపులు మూసివేసిన వ్యవహారంపై పోలీస్, రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఆ రెండు శాఖల అధికారులతో మాట్లాడగా.. ర్యాంపుల మూసివేత వ్యవహారం తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు. -
బాల్య వివాహాన్ని నిలిపి వేయించిన అధికారులు
భీమ్‌గల్ (బాల్కొండ): మండలంలోని బడాభీమ్‌గల్ గ్రామంలో ఈ నెల 22న నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు నిలిపి వేయించారు. గ్రామానికి చెందిన గంగారాం, లలిత దంపతులకు చెందిన బాలికకు ఈ నెల 22న వివాహం జరిపిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి వీఆర్వో, అంగన్వాడీ టీచర్లను వెంట బెట్టుకుని శుక్రవారం వారి ఇంటికి చేరుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పెళ్లిని నిలిపి వేయించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకున్న బాలికకు మానసికంగా, శారీరకంగా ఎదుగుదల ఉండదని, భవిష్యత్తులో ఎదురయ్యే శారీరక, కు టుంబ సమస్యల గురించి వారికి వివరించారు. చట్ట ప్రకారం కూడా బాల్య వివాహం శిక్షార్హమని హెచ్చరించారు. మైనారిటీ తీరే వరకు పెళ్లి చేయబోమని బాలిక తల్లిదండ్రులతో బాండ్ పేపర్ రాయించుకున్నారు. వరుడి కుటుంబ సభ్యుల కు కూడా ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. పెళ్లి రద్దు చేసి, బాలికను చదివించేందుకు ఎట్టకేలకు కుటుం బ సభ్యులు అంగీకరించారు. -
పోలీస్ నెట్వర్క్ షట్‌డౌన్
ఏలూరు అర్బన్: హ్యాకింగ్ అనే పదం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల పోలీసు నెట్‌వర్క్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీస్స్టేషన్లు, కార్యాలయాల్లో కంప్యూటర్లు రాన్సమ్వేర్ వైరస్ బారిన పడి మూగబోయాయి. పోలీసు ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించడం తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను తక్షణం షట్‌డౌన్ చేయాలని రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు అందేంతవరకూ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని ఆర్డర్ వేశారు. దీంతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లను ఆపరేటర్లు షట్‌డౌన్ చేశారు. ఏలూరు సీఐ ఉడతా బంగార్రాజు మాట్లాడుతూ హ్యాకర్స్ దాడికి పాల్పడటంతో రాష్ట్రంలో దాదాపు సగం పోలీస్స్టేషన్లలో నెట్వర్క్ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో నెట్‌వర్క్‌లు పూర్తిగా స్తంభించాయన్నారు. కంప్యూటర్ రంగ నిపుణులు మాత్రం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లు మాత్రమే హ్యాక్ అయ్యాయని, ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్న కంప్యూటర్లకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారన్నారు. ఈ సమస్య కేవలం రాష్ట్రానికే పరిమితం కాదని ప్రపంచంలోని పలు దేశాల్లో పోలీస్ నెట్‌వర్క్‌లు సైబర్ దాడుల బారిన పడ్డాయని చెప్పారు. -
పెటాకులైన ‘ఫేస్బుక్’ ప్రేమ పెళ్లి
పెద్దవడుగూరు (తాడిపత్రి): ఫేస్బుక్లో ఏడాదిపాటు చాటింగ్ చేసుకున్న ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నాక పది రోజులు కూడా కలిసి ఉండలేకపోయింది. అమ్మాయిని వదిలి అబ్బాయి ఉడాయించాడు. న్యాయం కోసం అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి ఆందోళనకు దిగింది. పెద్దవడుగూరు మండలం ఆవులాంపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆవులాంపల్లికి చెందిన సుదర్శన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతడికి బీఈడీ పూర్తిచేసిన గార్లదిన్నెకు చెందిన అరుణశ్రీ ఫేస్బుక్లో పరిచయమైంది. ఏడాదిపాటు చాటింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇద్దరూ ప్రేమలో పడటంతో ఇరు కుటుంబాల పెద్దలకూ తెలపకుండా మార్చి పదో తేదీన కర్నూలు జిల్లా బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమ కుమారుడు కనిపించడం లేదంటూ సుదర్శన్ తల్లిదండ్రులు పెద్దవడుగూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచచేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రేమజంటను వెతికి స్టేషన్‌కు పట్టుకొచ్చారు. అప్పటికే వీరికి పెళ్లయ్యి నాలుగు రోజులు గడిచింది. వీరి పెళ్లిని అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట అమ్మాయి పుట్టింటికి వెళ్లింది. అక్కడ కూడా పెద్దలు తిరస్కరించారు. దీంతో వారు అక్కడి నుంచి వచ్చేశారు. పామిడిలో ఫంక్షన్ ఉందని, అక్కడకు వెళ్లేందుకు కొత్త బట్టలు తెచ్చుకుందామని చెప్పి సోమవారం ఉదయం అరుణశ్రీని సుదర్శన్ పామిడిలోని షాప్ వద్దకు తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానని నమ్మబలికి ఆమెను అక్కడే ఉంచి బయటికెళ్లిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన అరుణశ్రీ ఆవులాంపల్లికి వెళ్లి ఆరా తీయగా.. ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని సుదర్శన్ కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్తను మీరే ఎక్కడో దాచారని ఆందోళనకు దిగింది. దీంతో వారు ఇంటికి తాళం వేసి పక్కకు వెళ్లిపోయారు. చేసేదిలేక అరుణశ్రీ కూడా కాసేపటి తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించింది. -
నవ్‌జీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
హైదరాబాద్: సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. బుధవారం ఉదయం విజయవాడ- ఖమ్మం మార్గంలో చింతకాని మండలం వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించిన డ్రైవర్ రైలును నిలిపివేశారు. సంఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుని, మరమ్మతులు ప్రారంభించారు. -
ఎగిరినట్టే ఎగిరి ఆగిపోయిన విమానాలు
-
నిలిచిన ఎండుకొబ్బరి తయారీ
కొబ్బరి ధర పెరుగుదల రైతులకు సంతోషాన్ని ఇస్తుంటే.. కొబ్బరి కార్మికులకు, తయారీ కొబ్బరి వ్యాపారులను మాత్రం కష్టాల్లోకి నెట్టుతోంది. పచ్చికొబ్బరి కాయ ధర పెరగడంతో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి).. కొబ్బరినూనె తయారీ దాదాపు నిలిచిపోయింది. దీంతో ఇటు వ్యాపారులకు... అటు కార్మికులకు చేతిలో పనిలేకుండా పోతోంది. – అమలాపురం/అంబాజీపేట ప్రస్తుతం మార్కెట్లో పచ్చికాయ, ముక్కుడు కాయ వెయ్యి కాయల ధర రూ.7,500 వేల వరకూ ఉంది. పది, పదిహేను రోజుల క్రితం రూ.పది వేలు ఈ ధర పలికింది. కాయ ధర ఎక్కువగా ఉండడంతో రైతులు, కొబ్బరి వ్యాపారులు నేరుగా కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత ధరకు కొనుగోలు చేసి.. తయారీ కొబ్బరి (కొత్తకొబ్బరి, ఎండుకొబ్బరి)ని స్థానికంగా తయారుచేసే అవకాశం లేదు. తయారీ కొబ్బరి కన్నా పచ్చికొబ్బరి ధర ఎక్కువగా ఉంది. తయారీ కొబ్బరి క్వింటాల్ ధర రూ.8 వేలు ఉండగా, పచ్చికొబ్బరి ధర రూ.7,500లే ఉంది. ఎండు కొబ్బరి చేస్తే నష్టమే.. వెయ్యి కొబ్బరికాయల నుంచి 90 కేజీల ఎండు కొబ్బరి తయారవుతుంది. క్వింటాల్ ఎండుకొబ్బరి తయారు చేయాలంటే 1,110 కాయలు అవసరం. మార్కెట్ ధరను బట్టి చేస్తే అయ్యే ఖర్చు రూ.8,325. వలుపు, తయారీ కార్మికులకు, రవాణా ఖర్చులు కలుపుకుంటే క్వింటాల్ ఎండు కొబ్బరి ఉత్పత్తికి అయ్చే ఖర్చు రూ.వెయ్యికిపైనే. అంటే క్వింటాల్ ఎండుకొబ్బరి తయారీ పెట్టుబడి రూ.9,500ల వరకూ అవుతున్నట్టు లెక్క. మార్కెట్ ధర మాత్రం రూ.8,200లే. దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలను వేలంలో పొందినవారే ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. సీజ¯ŒSలో అంబాజీపేట మార్కెట్ నుంచి ఇప్పుడు 10 టన్నులు కూడా ఎగుమతి కావడం లేదు. ఉపాధి కోల్పోయిన కార్మికులు పచ్చికొబ్బరి ఎగుమతి కన్నా ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె ఎగుమతులపైనే అంబాజీపేట మార్కెట్లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 3 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు. నిండా ముంచేస్తున్న వ్యాపారులు తక్కువ ధర ఉన్నప్పుడు భారీగా నిల్వ చేసిన వ్యాపారులు ఇప్పుడు ఎగుమతి చేసే పనిలో పడ్డారు. నిల్వలు పూర్తయ్యేవరకూ ధర తగ్గించేశారని రైతుల ఆరోపణ. నిల్వలు పూర్తయ్యాకా తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, తరువాత ధరలు పెంచి లాభపడాలనే వ్యాపారుల వ్యూహానికి బలవుతున్నామని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు మాత్రం ధర పెరిగిన తరువాత అమ్మకాలు చేయాలని కొబ్బరికాయలను నిల్వ చేస్తున్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
సీబీసీఐడీ మెజిస్ట్రేట్ శివశంకర్ కాకినాడ లీగల్ : సామాజిక రుగ్మతగా మారిపోయిన బాలకార్మిక వ్యవస్థను, యాచక వృత్తిని రూపుమాపాల్సిన అవసరం ఎంతయినా ఉందని కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, సీబీసీఐడీ జడ్జి కె.శివశంకర్ అన్నారు. స్థానిక గాంధీ భవ¯ŒSలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా కేరింతలు కొడుతూ పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన బాలల జీవితాలు యాచక వృత్తిలోనూ, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలలను సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పించకపోతే భవిష్యత్‌లో వారు సంఘ విద్రోహశక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఒక ఉద్యమంగా తీసుకుని సమష్టిగా ఆ వ్యవస్థలను సమూలంగా నిర్మూలించాల్సి ఉందన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.శివరామప్రసాద్ మాట్లాడుతూ నేటిబాలలే రేపటి పౌరులని, బాలలను తీర్చిదిద్దితే దేశానికి, సమాజానికి మేలు జరుగుతుందన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఇ¯ŒSచార్జి పీడీ పంతం సావిత్రి మాట్లాడుతూ బాలల వసతి గృహనిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
హైటెక్కే ముద్దు...ఎన్నాళ్లీ హద్దు
నగదు రహితమే ముద్దంటూ అవగాహన ర్యాలీలు ఓ వైపు జిల్లాలో జరుగుతుంటే ఇంకో వైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన జనం మాత్రం ఎన్నాళ్లీ హద్దులు..కష్ట, నష్టాలంటూ పెదవి విరుస్తున్నారు. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించారని వాపోయారు. ఈ క్యూలు పక్క నుంచే పోలీసుల రక్షణతో అవగాహన ర్యాలీలు జరుగుతుండడంతో అక్కడక్కడా జనం నిలదీసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ వద్ద విద్యార్థులు, ఇతరులు మానవహారం చేసి అవసరాల కోసం హైటెక్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునివ్వగా బ్యాంకుల్లో నగదు పెట్టకుండా ఏమీటీ ప్రవచనాలంటూ బాధితులు విమర్శించారు. రాజానగరంలో కూడా ర్యాలీని నగదు బాధితులు అడ్డుకున్నారు. 20 రోజులుగా అన్ని పనులు ఆగిపోయాయని రైతులు, వ్యాపారులు, గృహిణులు ధ్వజమెత్తారు. రాజానగరం : నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్యపరుస్తూ రాజానగరంలో పోలీసులు, బ్యాంకు అధికారులు కలిసి ఇంజినీరింగ్ విద్యార్థినుల సాయంతో బుధవారం రాజానగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జనం తిరగబడ్డారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ శంకర్‌నాయక్‌ల ఆధ్వర్యంలో గ్రామంలోని షిరిడీ సాయిబాబా సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతులు, వ్యాపారులు అక్కడకు చేరుకుని ర్యాలీలో ఉన్న బ్యాంకు అధికారులు తమకు సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ఒకవైపు, రబీ సాగు మరోవైపు జరుగుతున్న నేప«థ్యంలో పొలాల్లో పనులు చేస్తున్న కూలీలకు సొమ్ములు ఇవ్వలేకపోతున్నామని వైఎస్సార్సీపీకి చెందిన దూలం పెద్ద, ప్రగడ చక్రితోపాటు మరికొందరు రైతులు తమ ఆవేదనను తెలిపారు. తమ ఖాతాలో ఉన్న సొమ్ములు ఇమ్మంటే రూ.రెండు వేలు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకువెళ్లి ఎంతమందికి కూలీ ఇవ్వాలన్నారు. ఇలాగైతే ఎలా వ్యవసాయం చేసేందంటూ నిలదీశారు. వ్యాపారులు కూడా చిల్లర సమస్యతో సతమతమవుతున్నామని, బ్యాంకులో రూ.రెండు వేల నోట్లు తప్ప చిల్లర నోట్లు ఇవ్వడం లేదన్నారు. మా ఖాతాలో ఉన్న కరెన్సీనుంచి మేము అడిగినంత ఇవ్వాలని, మేనేజర్ సమాధానం చెప్పాలని పట్టుపడ్డారు. ఈ సమయంలో డీఎస్పీ, సీఐలు అడ్డుకుంటూ బ్యాంకుకు వెళ్లి మాట్లాడండి.. ఇక్కడ కాదు అని సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. బ్యాంకుకు వెళ్తుంటే తమను పురుగుల్లా చూస్తున్నారని, ఇక్కడే సమాధానం చెప్పాలన్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాధవ కలుగజేసుకుని తాము పై అధికారులు చెప్పిన విధంగా చేస్తున్నామని, మీ ఇబ్బందులను వారి దృష్టిలో పెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో వివాదం సద్దుమణిగి, ర్యాలీ ముందుకు సాగింది. -
నోట్లు రద్దుతో నిలిచిన భూముల రిజిష్ట్రేషన్లు
-
ప్రైవేటుకు నోఛాన్స్
పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లకుండా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాలని భావిస్తున్న విద్యార్థులకు ఇక భంగపాటే. పాఠశాలలో చదవకుండా పరీక్షలు సమీపించే ముందు కాండొనేషన్ ఫీజు చెల్లించి ప్రైవేటుగా హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో ఆ అవకాశం చేజారింది. * రెగ్యులర్‌గా పాఠశాలకు వెళ్తేనే టెన్త్ పరీక్షకు అర్హులు * మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ * ప్రైవేటు విద్యార్థులకు ఇక దూర విద్యే దిక్కు గుంటూరు ఎడ్యుకేషన్: నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం అమలు కారణంగా టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో రెగ్యులర్‌గా హాజరవుతున్న విద్యార్థులే అర్హులుగా పేర్కొంటూ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాధారణంగా ప్రతి యేటా ప్రైవేటు విద్యార్థుల మాదిరిగా హాజరు మినహాయింపు కోరుతూ పరీక్ష ఫీజుతో పాటు కాండొనేషన్ ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేస్తుంటారు. ఈ విధంగా దరఖాస్తు చేసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థులుగా పరిగణించి పరీక్షలకు అనుమతిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన సీసీఈ ప్రభావంతో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులు మినహా ప్రైవేటుగా విద్యార్థులెవ్వరూ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. సీసీఈ విధానంతో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ, మరో 20 మార్కులను విద్యార్థుల ఓవరాల్ ప్రతిభ ఆధారంగా లెక్కిస్తారు. దీంఓ పాఠశాలకు వెళ్లని విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయింది. తగ్గిన గుర్తింపులేని స్కూళ్ల సంఖ్య.. జిల్లాలో గత మూడేళ్ల క్రితం వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు 10 వేల వరకూ ఉంటుండగా, గుర్తింపు లేని స్కూళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో 2015–16 విద్యాసంవత్సరంలో వీరి సంఖ్య 3,450కి పరిమితమైంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఉత్తర్వులతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మినహా ప్రైవేటు అనే మాట లేకుండా చేసినట్లయింది. దీంతో పరీక్షలకు ప్రైవేటుగా హాజరు కావాలని భావిస్తున్న విద్యార్థులు దూర విద్యను ఆశ్రయించాల్సి వస్తుంది. అటువంటి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే దూర విద్య టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సి ఉంది. చైల్డ్ ఇన్ఫో డేటా ఆధారం.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డు ఆధారంగా వారికి సంబం«ధించి అన్ని వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదుచేసిన విద్యాశాఖ, దాని ఆధారంగానే విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అనుమతించనుంది. ఆధార్ కార్డు వివరాలు నమోదు అయిన విద్యార్థులనే పదో తరగతి పరీక్షలకు అర్హులుగా గుర్తించనున్నారు. -
బదిలీకి పొలిటికల్ బ్రేక్
కోడుమూరు : కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి మధ్య విబేధాలకు అధికారులు నలిగిపోతున్నారు. కోడుమూరు సర్కిల్‌కు సీఐగా రావాలంటేనే భయపడే పరిస్థితులు అధికారుల్లో నెలకొంది. బదిలీల సందర్భంగా ముగ్గురు సీఐలు కోడుమూరు సర్కిల్‌ను ఎంపిక చేసుకుని చివరి సమయంలో విరమించుకున్నట్లు సమాచారం. చివరకు వారు ఊహించిందే నిజమైంది. ఇటీవల కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమితులైన శ్రీనివాసులు ఇంత వరకు బాధ్యతలు చేపట్టలేదు. ఆయనకు పొలిటికల్ బ్రేక్ పడినట్లుస సమాచారం. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డేగల ప్రభాకర్ కర్నూలు టు–టౌన్‌కు ఈ నెల 6వ తేదీన బదిలీ అయ్యారు. స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. అయితే సీఐ శ్రీనివాసులును ఎమ్మెల్యే మణిగాంధీ సిఫారస్ చేశారన్న కారణంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి సీఐ నియామకాన్ని ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు ద్వారా నిలుపుదల చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జి సీఐగా డేగల ప్రభాకర్ కొనసాగుతున్నారు. -
పారిశుద్ధ్య పనులకు మంగళం
నాలుగు నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం రూ.2.22 కోట్ల బకాయి జిల్లాలో 2.520 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు రాయవరం : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ భావించింది. విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షాభియాన్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులను మంజూరు చేస్తుంది. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించారు. గ్రామ సంఘాలు నియమించిన వ్యక్తులు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. వీరికి ఇస్తున్న అరకొర గౌరవ వేతన నాలుగు నెలలుగా నిలిచి పోయింది. అసలు ఈ నిధులు విడుదల అవుతాయా? లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 3,301 ప్రాథమిక పాఠశాలలు, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు, 659 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణకు డ్వాక్రా మíß ళలను నియమించారు. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4 వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వీరి గౌరవ వేతనం నుంచి ప్రాథమిక పాఠశాలకు ఫినాయిల్, హార్పిక్, బ్లీచింగ్, చీపుర్లు కింద రూ.200 తగ్గిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.300, ఉన్నత పాఠశాలకు రూ.500 చొప్పున తగ్గించి ఆ సొమ్ముతో పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. 2014 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ.. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను ఎస్ఎస్ఏ 2014 నవంబరు నుంచి చేపడుతుంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్ఎస్ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. మార్చి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలలకు రావాల్సిన గౌరవ వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 22 లక్షల 52 వేలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటున్నారు.. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేస్తున్నాను. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. – గుబ్బల వీరయ్యమ్మ, వెదురుపాక, రాయవరం మండలం నిధులు మంజూరు కావాల్సి ఉంది.. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్న వారికి గౌరవ వేతనం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఫిబ్రవరి వరకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. – మల్లిబాబు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, కాకినాడ -
ఉగ్రవేటను నిలిపివేసిన నేవీ
ఉగ్ర అనుమానితుల కోసం నేవీ చేపట్టిన వెతుకులాటను శుక్రవారం సాయంత్రం నిలిపివేసింది. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా నవీ ముంబైలోని ఓ నేవల్ బేస్‌కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు గురువారంచెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న 91 ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఎన్ఎస్ జీ కమాండోలను కూడా రంగంలోకి దించిన నేవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ ను నిలిపివేశారు. వెతుకులాటను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంపై నేవీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
రైల్వే డివిజన్‌కు గట్టి దెబ్బ
* ట్రాక్ పునరుద్ధరణకు రెండు రోజులు * సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూం నగరంపాలెం: గుంటూరు రైల్వే డివిజను పరిధిలో అతి పెద్ద నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో వరదనీటికి రైల్వే ట్రాకు కనీసం పది నుంచి పదిహేను చోట్ల దెబ్బతింది. సత్తెనపల్లి– రెడ్డిగూడెం మధ్యలో ఎక్కువ చోట్ల, రెడ్డిగూడెం– బెల్లంకొండ, బెల్లంకొండ– పిడుగురాళ్ల మధ్యలో అక్కడక్కడ రైల్వే ట్రాకు మీద నుంచి వర్షంనీరు ప్రవహించింది. వర్షం ప్రారంభం నుంచే రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించటంతో ట్రాకు దెబ్బతిన్న సమాచారం తక్షణమే తెలుసుకొని ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు. గురువారం సాయంత్రం వరకు ట్రాక్ సమీపంలో నీటి ప్రవాహం తగ్గకపోవటంతో నష్టంపై కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. నిలిచిపోయిన పల్నాడు, పలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల వద్దకు వెళ్లటానికి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవటంతో మధ్యాహ్నానికి అధికారులు అక్కడకు చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణకు కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు.. డివిజనులో రద్దు, దారిమళ్లిన రైళ్లు, ఇతర సమాచారం కోసం గుంటూరు రైల్వేస్టేషన్లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. వివరాల కోసం 9701379072, 0863–2222014, రైళ్లరాకపోకలకు సంబంధించి సెంట్రల్ కంట్రోల్ రూం 9701379073, 9701371072 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
జిల్లాలో రైళ్ల రాకపోకలు బంద్
–వర్షం కారణంగా 34 రైళ్ల రద్దు –పిడుగురాళ్ల–సత్తెనపల్లి మధ్య కొట్టుకుపోయిన ట్రాక్ –ఇక్కట్లలో ప్రయాణికులు నల్లగొండ క్రైం : వర్షం కారణంగా జిల్లాలో రైళ్ల రాకపోకలు గురువారం పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు రైళ్ల రాకపోకలు కొనసాగలేదు. గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల – సత్తెనపల్లి మధ్య భారీ వర్షానికి రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. అదేమార్గంలో మరొకొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌ల కింద కంకర కొట్టుకుపోవడంతో పట్టాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని 70 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ పటిష్టంగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన కారణంగా జిల్లా మీదుగా వెళ్లే 34 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గురు, శుక్రవారాల్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట్ మీదుగా దారి మళ్లించారు. రైళ్ల రాకపోకల పునరుద్ధరణ అంశం అర్ధరాత్రి తర్వాతనే తేలుతుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్వే అధికారులు, ఇంజనీర్లు పిడుగురాళ్లకు చేరుకున్నారు. గుంటూరు వరకు రైలు ట్రాక్‌లను పూర్తిస్థాయిలో డెమో రైలు ద్వారా పరిశీలించిన తర్వాతనే రాకపోకలను పునరిద్ధరిస్తారని అంటున్నారు. రద్దయిన రైళ్లివి... తిరుపతి – ఆదిలాబాద్, సికింద్రాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్, ఖాజీపేట – రేపల్లే, రేపల్లే – ఖాజీపేట, గుంటూరు – సికింద్రబాద్, వికారాబాద్ – గుంటూరు రైళ్లను రద్దు చేశారు. దారి మళ్లించినవి.. భువనేశ్వర్ – సికింద్రాబాద్ రైలును వయా ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్ – భువనేశ్వర్ రైలును వయా ఖాజీపేట మీదుగా, హైదరాబాద్ – చెన్నైను గుంతకల్ మీదుగా, తిరుపతి – సికింద్రాబాద్‌ను గుంతకల్ మీదుగా, పూణే – బోంబాయిను ఖాజీపేట మీదుగా, నాగర్సోల్ – నర్సాపూర్, లోకమాన్యతిలక్ టెర్మినల్ – కాకినాడ, సికింద్రాబాద్ – హౌరా ట్రైన్లను ఖాజీపేట మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రద్దు చేసిన ట్రైన్ల వివరాలను స్టేషన్లలోని నోటీస్ బోర్డుల్లో ఉంచారు. -
ఒక్కరి కోసం!
3 నెలలుగా 59 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేత ఓ ఎస్జీటీ అక్రమ పదోన్నతే కారణమన్న ట్రెజరీ అధికారులు విచారణకు ఇంటలిజెన్స్ బృందం రంగ ప్రవేశం నెల్లూరు, సిటీ : కేవలం ఒక్క ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది ఉపాధ్యాయులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళణ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 15 మున్సిపల్ పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలో డీఎస్సీ–2014 ద్వారా 59 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యారు. వీరు విధుల్లో చేరి మూడు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లింపులు మాత్రం జరగలేదు. నగరపాలక వైవీఎం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ(ఫిజికల్ సైన్స్) ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది జీతాలు నిలిచిపోవడం గమనార్హం. అసలు ఏమి జరిగిందంటే నగరపాలక సంస్థ పరిధిలోని వైవీఎం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని 2015లో అక్రమ పదోన్నతిపై స్కూల్‌అసిస్టెంట్‌గా అప్పటి కమిషనర్ నియమించారు. క్యాడర్ స్టెంత్ పరిశీలించకుండా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నియమించారు. ప్రతి విషయంలో మీనమేషాలు లెక్కించే అధికారులు ఈ అక్రమ పదోన్నతిలో మాత్రం హుటాహుటిన ముందూ వెనకా చూడకుండా పదోన్నతి కల్పించారు. అయితే ఇటీవల డీఎస్సీ–2014 ద్వారా చంద్రకళ అనే మహిళా ఉపాధ్యాయురాలు ఫిజికల్ సైన్స్ పోస్ట్‌కు నియామకమైంది. కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఫిజికల్ సైన్స్ పోస్ట్‌లు 27 ఉన్నాయి. అయితే ఓ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి కారణంగా 28 మందికి జీతాలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్ అధికారులు 28 మంది ఫిజికల్సైన్స్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ట్రైజరీ డిపార్ట్మెంట్ను కోరారు. అయితే నిబంధనల ప్రకారం 27 పోస్ట్‌లు ఉంటే 28 ఏ విధంగా జీతాలు చెల్లించాలని కార్పొరేషన్ అధికారులు పంపిన ఫైల్‌ను వెనక్కు పంపారు. దీంతో గత మూడు నెలల నుంచి 59 మంది జీతాలు నిలిచిపోయాయి. అక్రమ పదోన్నతి వెనుక ఓ ఎమ్మెల్సీ అక్రమ పదోన్నతి పొందిన ఆ ఉపాధ్యాయుని వెనుక ఓ ఎమ్మెల్సీ ఉన్నట్లు సమాచారం. ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో అక్రమ పదోన్నతికి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు చేసిన ఘోరమైన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎస్టీ(గణితం) బ్యాక్ లాగ్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆ ఉపాధ్యాయుడిని గణితం ఉపాధ్యాయుడిగా నియమించేందుకు ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడి కోసం ఆ పోస్ట్‌ను ఖాళీగా ఉంచారు. అయితే అధికారులు గణిత ఉపాధ్యాయుడి పోస్ట్‌లో నియమించి, అక్రమ పదోన్నతిని సక్రమం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఓ బలమైన ఉపాధ్యాయ సంఘం మాత్రం ఆ ఉపాధ్యాయుడికి బాసటగా నిలుస్తున్నట్లు సమాచారం. విచారణ చేపట్టిన ఇంటిలిజెన్స్ బృందం అక్రమ పోస్టింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఇంటిలిజెన్స్ బృందం కూడా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కార్పొరేషన్ అధికారులను, పలువురు ఉపాధ్యాయులను ఇంటిలిజెన్స్ బృందం ప్రశ్నించారు. అక్రమ పదోన్నతి రద్దు చేయాలి అక్రమ పదోన్నతిని రద్దు చేసి, 59 ఉపాధ్యాయులకు వెంటనే వేతనం చెల్లించాలి. కార్పొరేషన్ అధికారులు అక్రమాలను ప్రోత్సహించకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. త్వరగా అక్రమ పదోన్నతిని రద్దు చేయకపోతే ఆందోళణ చేసేందుకు వెనుకాడబోం. –ఎన్.మోహన్‌దాస, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ -
శాంసంగ్‌కు అక్కడ కూడా ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్ : బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు సంస్థను, మరోవైపు యూజర్లను వణికిస్తున్న శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్7కు పాకిస్తాన్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక దేశాల విమాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్ వాడకాన్ని నిషేధించగా.. తాజాగా పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలు(పీఐఏ) కూడా గెలాక్సీ నోట్7పై నిషేధాజ్ఞలు విధించాయి. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో విమానాల్లో ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విమానాల్లో వినియోగదారులు గెలాక్సీ నోట్7 స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్యాసెంజర్లు అసలు ఈ ఫోన్‌ను తీసుకురావద్దని, చెక్-ఇన్ లగేజీల్లో కూడా కనిపించవద్దని పీఐఏ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికుల సురక్షిణార్థమే ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్టు పీఐఏ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ( ఎఫ్ఎఎ)లు ఈ ఫోన్‌పై ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆదివారం పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థల అధికారులు కూడా ఈ ఫోన్ పై ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. తాజా నిషేధాజ్ఞలతో శాంసంగ్ కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమైనదిగా యూఎస్ రెగ్యులేటరీ పేర్కొంటూ, వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలనే ఆదేశాల జారీ అనంతరం కంపెనీ షేర్లు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ ఫోన్ బ్యాటరీలు పేలుళ్ల సంఘటనలతో సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలించింది. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సప్లైను మించి డిమాండ్‌లో దూసుకుపోయిన ఈ ఫోన్లు, తాజా ఘటనలతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కంపెనీ ఇప్పటికే 2.5 మిలియన్ ఫోన్లను రీకాల్ చేసినట్టు ప్రకటించింది. చార్జ్ చేస్తున్నప్పుడు లేదా కాల్ ఆన్షర్ చేస్తున్నప్పుడు ఈ ఘటనలు సంభవిస్తున్నాయని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 19లోపు గెలాక్సీ నోట్7లన్నింటినీ రిప్లేస్ చేస్తామని శాంసంగ్ ప్రకటించింది. -
ఆల్మట్టికి నిలిచిన వరద
జూరాల : కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు శనివారం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని కూడా నిలిపివేశారు. దీంతో ఆల్మట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు లేవు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.58 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో కేవలం 1598 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం మినహా, విద్యుదుత్పత్తి, స్పిల్‌వేల ద్వారా దిగువకు ఔట్‌ఫ్లో పూర్తిగా నిలిపివేశారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.05 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా ఎత్తిపోతల లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా 750 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ద్వారా 5180 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా ఔట్‌ఫ్లోను పూర్తిగా నిలిపివేశారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మద్దూరు : ఓ బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకోగలిగారు. వివరాలిలా ఉన్నాయి. మద్దూరులోని 15ఏళ్ల బాలిక గతేడాది దామరగిద్ద కేజీవీబీలో ఏడోతరగతి చదువుతూ మధ్యలోనే మానేసింది. కాగా, ఈ బాలికకు పెద్దరాయిచూర్‌కు చెందిన వీరేష్‌తో వారం పది రోజుల్లో వివాహం చేయడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త సుజాత వెంటనే ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, చైల్డ్ హెల్ప్‌లైన్1098 సభ్యుడు విజయ్‌కుమార్, ఎస్ఐ నరేందర్‌లకు సమచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని తహసీల్దార్ చందర్ ఎదుట హాజరుపర్చి అనంతరం జిల్లా కేంద్రంలోని బాలల సదన్‌కు పంపించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న సీడీపీఓ
సంగం: సంగం మండలం జంగాలదరువులో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో సోమవారం సీడీపీఓ విజయలక్ష్మి గ్రామానికి వెళ్లి బాల్య వివాహం జరగనివ్వకుండా పెద్దలను ఒప్పించారు. జంగాలదరువుకు చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలికకు ఈనెల 25వ తేదీ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. సమాచారం సీడీపీఓ విజయలక్ష్మికి తెలియడంతో ఆమె గ్రామానికి వెళ్లి మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. మైనర్ బాలికకు వివాహం చేస్తే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారికి తెలిపారు. మైనర్ వివాహం చేస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు తాము వివాహం చేయమంటూ తెలిపారు. ఈమె వెంట అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి, సంగం పోలీసులు ఉన్నారు. -
హోల్డింగ్‌పాయింట్‌లో ఆగేవారేరి..?
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు వెళే ్లభక్తులను ఉద్ధేశించి ట్రాఫిక్‌ను నియంంత్రించేందుకు హోల్డింగ్ పాయంట్లను ఏర్పాటు చేశారు. కానీ బోగారం శివారులోని మంజువనాథహోమ్స్కు చెందిన 10ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్లో గత మూడు రోజులుగా ఒక్క వాహనం కూడా ఆగలేదు. పుష్కరఘాట్లవద్ద ట్రాపిక్ సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఎక్కడికక్కడ వాహనాలను ఆపడం హోల్డింగ్పాయింట్ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. స్థానికసీఐ ఎ.శ్రీ«ధర్‌రెడ్డి పర్యవేక్షణలో పోలీసుశాఖ వారు హోల్డింగ్ పాయింట్లో వాహనాలను నిలిపేందుకు బారీకేడ్లను నిర్మించారు. టూవీలర్స్, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు నిలిపేందుకు వేర్వేరుగా పార్కింగ్పాయింట్లను సిద్దంచేసి సూచికబోర్డులను పెట్టారు. ఎస్బీహెచ్వారి సహకారంతో స్టాపర్లను ఏర్పాటుచేశారు. సర్కిల్పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది షిప్ట్లవారిగా అక్కడ విధులను నిర్వహిస్తున్నారు. గ్రామీణ నీటిసరఫరావారు మంచినీటి వసతి ఏర్పాటుతోపాటు, మరుగుదొడ్లను నిర్మించారు. విద్యుత్‌శాఖవారు ఫోకస్‌లైట్లను అమర్చారు. ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో వైద్యసిబ్బంది నియమించడంతోపాటు, ప్రథమచికిత్సకు అవసరమైన మందులను సిద్దంగా ఉంచారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భక్తులకు అవసరమైన సేవలను అందించడానికి కార్యోన్ముకులై ఉన్నారు. ఒక్కవాహనం నిలిపితే ఒట్టు... పుష్కరాలు ప్రారంభమై మూడురోజులు పూర్తయినప్పటికీ బోగారం హోల్డింగ్ పాయింట్వద్ద ఒక్కవాహనం కూడా ఆగలేదు. ఈనెల 12న వరలక్ష్మి వ్రతం, 13, 14, 15 తేదిలలో వరుస సెలవులు వచ్చినందున రద్దీబాగా ఉంటుందని అధికారులు బావించారు. కానీ ఇంతవరకు హోల్డింగ్‌పాయింట్‌లో ఎవరూ ఆగలేదు. -
74 గ్రామాలకు సత్యసాయి నీటిసరఫరా బంద్
పురుషోత్తపట్నం (సీతానగరం): మండలంలోని పురుషోత్తపట్నంలోని శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా పథకం మొరాయించింది. దీంతో ఏజెన్సీ వాసులతో సహా ఐదు మండలాల్లోని 47 గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన గోదావరి జలాల సరఫరా నాలుగు రోజులుగా నిలిచిపోయింది. ఈ పథకం వద్ద ఉన్న మూడు మోటార్లు కాలిపోవడమే ఇందుకు కారణం. ఈ తాగునీటి పథకం వద్ద నుంచి శుద్ధి చే సిన గోదావరి జలాలను తాగునీరుగా అందించేందుకు ఈ మోటార్లు అవసరం. ఆరు నెలల క్రితం ఒక మోటారు వైరింగ్ కాలిపోయింది. దీనికి ఇంత వరకు వైండింగ్ చేయలేదు. వారం రోజుల క్రితం రెండో మోటార్, ఈనెల 12వ తేదీ రాత్రి మూడో మోటార్ వైరింగ్ కాలిపోయాయి. దీంతో ఇక్కడి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండలాల్లోని 74 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక మోటార్‌కు ఆదివారం వైండింగ్ చే యించామని తెలిపారు. దాని సహాయంతో సోమవారం తాగునీటిని అందిస్తామన్నారు. మిగిలిన రెండు మోటార్ల వైండింVŠ నాలుగు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. -
పెదకొండూరు ఘాట్ పనుల అడ్డగింత
కూలి కోసం కూలీల ఆందోళన దుగ్గిరాల : పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలీల కథనం మేరకు.. పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణంలో ఇటీవల వరకు పని చేసిన కూలీలకు వేతనాలు చెల్లించలేదు. సుమారు 50 మంది కూలీలకుగాను రూ.60 వేల వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో వేతనాలు చెల్లించాలని ఘాట్ కాంట్రాక్టర్‌ను కోరారు. వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ అలసత్వం ప్రదర్శించడంతో కూలీలు వారం రోజుల క్రితం పనులకు గైర్హాజరయ్యారు. దీంతో కాంట్రాక్టర్ కొత్త కూలీలతో పనులు తిరిగి చేపట్టారు. విషయం తెలుసుకున్న కూలీలు వచ్చి పనులను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఘాట్‌లో పనిచేస్తున్న కూలీలకు సమస్యను వివరించి పనులు జరగకుండా నిలుపుదల చేశారు. దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి అక్కడకు చేరుకుని సమస్యపై వివరాలు సేకరించారు. కాంట్రాక్టర్‌ను ఫోన్లో విచారణ చేశారు. ఈ నెల 12వ తేదీ బకాయిలు చెల్లిస్తామనే హామీ లభించడంతో తిరిగి పనులు ప్రారంభించారు. -
నిలిచిన అంతరరాష్ట్ర వంతెన పనులు
పెదబయలు : ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పెదబయలు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డపై ఒడిశా ప్రభుత్వం రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోయాయి. మన్యంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మత్స్యగెడ్డలో నీరు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో 20 రోజుల నుంచి పనులు ఆపేశారు. వంతెన కోసం 9 ఫిల్లర్ల వేస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో పనులు ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నా వర్షాలు, నీటి ఉధతి వల్ల బ్రేక్ పడింది. వర్షాలు తగ్గితే గాని పనులు ప్రారంభించే అవకాశాలు లేవు. వారధి ఎప్పుడు పూర్తవుతుందా అని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశగా చూస్తున్నారు. -
చేతులెత్తేశారు!
నగరంలో రోడ్డు నిర్మాణ పనుల నిలిపివేత ఆర్అండ్బీ, కాంట్రాక్టర్ అలసత్వమే కారణం అదే పుష్కర యాత్రికులకు శాపం.. ఎటుచూసినా గుంతలు.. రాళ్లు రప్పలు.. పగిలిపోయిన రోడ్లు.. కుంగిపోయిన డ్రైన్లు.. ఇదీ ప్రస్తుతం నగరంలో పరిస్థితి. పుష్కర పనులు మొదలెట్టి మధ్యలోనే చేతులెత్తేయడంతో ఏర్పడిన దుస్థితి. పుష్కరాలతో నగర స్వరూపం మారిపోతుందని ఆశించిన ప్రజలకు నిరాసే మిగిలింది. శాఖల మధ్య సమన్వయలోపం, కాంట్రాక్టర్ల అలసత్వం.. వెరసి పుష్కర భక్తులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. సాక్షి, గుంటూరు: అధికారుల మధ్య సమన్వయ లోపం పుష్కర యాత్రికులకు శాపంగా మారనుంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, రోడ్ల విస్తరణ చేపట్టి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. నగరంలో రూ.20 కోట్లతో రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులు చేపట్టేందుకు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు ఖరారు చేసి పనులు కూడా మొదలెట్టారు. పుష్కరాలు దగ్గరపడటంతో హఠాత్తుగా పనులు నిలిపేశారు. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ నిర్మాణాలు పూర్తిచేసి తమకు అప్పగించాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేశారని ఆరోపిస్తూ రోడ్డు నిర్మాణాలు నిలిపేశారు. పుష్కర యాత్రికులు అధికంగా వచ్చే అమరావతి రోడ్డు, పొన్నూరు రోడ్డు, నల్లచెరువు రోడ్డులను కొంత మేరకు మొదలెట్టి వదిలేశారు. మిగతా పనులు పుష్కరాలు ముగిశాక చేపడతామని చెబుతుండటం గమనార్హం. రోడ్డు నిర్మాణానికి నెల రోజులకు పైగా పడుతుందని తమకు ఆలోపే క్షేత్ర స్థాయిలోని రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగించి తమకు అందించాలని ఆర్ అండ్ బీ అధికారులు నగరపాలక సంస్థ అధికారులను కోరారు. అలా అయితే ఎందుకు ప్రారంభించాలి? నెల రోజులకు పైగా సమయం పడుతుందన్నప్పుడు పది రోజుల కిందట అమరావతిరోడ్డు పనులు ఎందుకు మొదలెట్టారు. సదరు కాంట్రాక్టరు సుమారు 15కు పైగా పనులు తీసుకున్నారని, ఇప్పుడు మెటీరియల్, లేబర్ అందక పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టరుతో ఆర్అంyŠ బీ అధికారులు లాలూచీ పడి పనులు మధ్యలోనే నిలిపివేశారు. నగరపాలక సంస్థ గోరంట్ల శివారు ప్రాంతంలో పుష్కరనగర్‌ను నిర్మిస్తోంది. ఇక్కడ నుంచే భక్తులకు బస్సు సౌకర్యంతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. లాడ్జిసెంటర్ నుంచి పుష్కరనగర్‌కు వెళ్లే మార్గంలో గుంతల్లో వర్షం కురిసి నీరు నిల్వ ఉంటే గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రమాదాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా రోడ్డుకు సమానంగా మట్టిని తొలితే ప్రమాదాల బారిన పడే అవకాశం తప్పుతోంది. నాణ్యతా లోపాలు.. గోదావరి పుష్కరాల సందర్భంగా వివిధ నిర్మాణ పనుల్లో జరిగిన నాణ్యత లోపాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నిధులు విడుదల చేయాల్సిన ప్రభుత్వం పుష్కరాలకు రెండు నెలల గడువు ఉందనగా హడావుడి చేసింది. దీంతో అన్ని శాఖల అధికారులు ఒకే సారి పనులు మొదలుపెట్టడం, త్వరిత గతిన పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు హడావుడి చేయడంతో నగరంలో నిర్మించిన డ్రైన్లు, రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు లోపించాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అవినీతికి తెరతీశారు. సమయం తక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు సైతం పనుల్లో నాణ్యత కంటే త్వరగా పూర్తి చేయించేందుకే అధిక ప్రాధాన్యమివడం వీరికి వరంగా మారింది. ప్రధానంగా నల్లచెరవు, పొన్నూరు రోడ్డుల్లో నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేవు. అందుకే ఆపేశాం.. ఆర్అండ్ బీ తరఫున జిల్లాలో 78 పనులు, 460 కిలో మీటర్ల రోడ్లు, డ్రైన్లు, ఇతర పనులను రూ.170 కోట్లతో చేపట్టాం. గుంటూరు నగరంలో తప్ప మిగిలిన అన్ని పనులు పూర్తిచేశాం. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు గడువులోపు వారి పనులు పూర్తిచేయలేదు. మూడు, నాలుగు రోజుల కిందటే మాకు అప్పగించారు. దీంతో ఉన్నతాధికారుల అనుమతితో పనులు నిలిపివేశాం. రాఘవేంద్రరావు, ఆర్అండ్ బీ ఎస్ఈ కొన్ని ప్రాంతాల్లోనే పనుల జాప్యం.. నగరంలో ఐదు ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ అధికారులు పనులు చేపట్టారు. సమయం తక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నగరపాలక సంస్థ పనుల్లో జాప్యం జరిగింది. అమరావతి రోడ్డుకు సంబంధించి పదిరోజుల కిందటే ఆర్ అండ్ బి అధికారులు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. ఎస్.నాగలక్ష్మి, కమిషనర్ -
క్రిభ్కో భూముల సర్వే అడ్డగింత
సర్వేపల్లి(వెంకటాచలం): వెంకటాచలం మండలం సర్వేపల్లి పరిధిలో క్రి భ్‌కోకు కేటాయించిన భూములలో జరుగుతున్న సర్వేను ముత్యాలగుంట గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 2508లో సుమారు 260ఎకరాల భూములను క్రిభ్కో ఎరువుల ఫ్యాక్టరీకి కేటాయించారు. ఈ భూములు కోల్పోయిన లబ్ధిదారులలో కొందరికీ ఇప్పటికీ పరిహారం రాక అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. బినామీ పేర్లుతో లక్షలాది రూపాయల పేదల పరిహారాన్ని అధికారులు, అధికారపార్టీ నాయకులు దోచుకున్నారని గత ఏడాది పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఆందోళనలు చేశారు. అయితే సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని ముత్యాలగుంట గ్రామం ఆనుకుని క్రి¿Œ కో కంపెనికీ చెందిన వారు శనివారం ఉదయం సర్వేపనులు చేపట్టారు. ముళ్లచెట్లను జేసీబీతో తొలగించారు. దీంతో ముత్యాలగుంట గ్రామస్తులు తమ నివాసాల పక్కనే క్రిభ్కో కంపెనీ గోడను కట్టనీయబోమని సర్వేను అడ్డుకున్నారు. క్రిభ్కో కంపెనీ నిర్వాహకులు రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, ఇన్చార్జి తహసీల్దార్ చెన్నయ్య, ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులు, క్రిభ్కో కంపెనీ నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామంలోని నివాసాలకు దగ్గర ఫ్యాక్టరీ గోడ కట్టేందుకు సర్వేఎలా చేస్తారని గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. రికార్డులను పరిశీలించిన తరువాతే పనులు చేయాలని ఆర్డీవో క్రిభ్కో కంపెనీ సిబ్బందికి తెలియజేయడంతో పనులు నిలిపివేశారు. -
మధ్యాహ్న భోజనానికి మంగళం
సత్యదేవ డిగ్రీ కళాశాలలో దూరప్రాంత విద్యార్థుల అవస్థలు గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించిన అన్నవరం దేవస్థానం అన్నదానం నిధులను దీనికి వెచ్చించరాదన్న ఉన్నతాధికారులు ఎలాగైనా కొనసాగించాలని కోరుతున్న విద్యార్థులు అన్నవరం : దూరప్రాంత విద్యార్థుల కోసం సత్యదేవ డిగ్రీ కళాశాలలో గత ఏడాది ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని అన్నవరం దేవస్థానం నిలిపివేసింది. దీంతో దూరప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తరగతులకు ఆలస్యమవుతోందని వాపోతున్నారు. 400 మంది విద్యార్థులకు ప్రయోజనం అన్నవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో 630 మంది చదువుతున్నారు. వీరిలో 400 మంది శంఖవరం, రౌతులపూడి, తొండంగి, తుని మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. వారి తల్లితండ్రులు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలుగా ఉంటూ తమ పిల్లలను కళాశాలలో చదివిస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి.. ఉదయాన్నే తమ పిల్లలకు భోజనం తయారు చేసి ఇవ్వడం ఇబ్బందికరమే. ఇంట్లో వంట పూర్తయిన తరువాత క్యారియర్ సర్దుకుని, సుమారు పది పదిహేను కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ విద్యార్థులు రావాల్సిన పరిస్థితి. దీంతో వారు కళాశాలకు ఆలస్యంగా వస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ 400 మంది విద్యార్థులకు అన్నదానం పథకం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ ఏడో తేదీన అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్‌తో కలిసి ఈఓ కె.నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గత మార్చి వరకూ దీనిని అమలు చేశారు. అన్నదాన పథకం ని««దlులను విద్యార్థుల భోజనానికి వెచ్చించడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అనుమతి నిరాకరించారు. ఫలితంగా ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తే మేలు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 400 మంది విద్యార్థులకు భోజనం అంటే రోజుకు కనీసం రూ.10 వేల ఖర్చవుతుంది. ఏడాదికి ఎనిమిది నెలలు కళాశాల పని చేస్తుందనుకుంటే మధ్యాహ్న భోజనానికి సుమారు రూ.25 లక్షలు అవసరం. దేవస్థానం 50 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ఈ పథకాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. సాంకేతిక కారణాలతోనే.. డిగ్రీ కళాశాలలో మ«ధ్యాహ్న భోజనం పథకాన్ని సాంకేతిక కారణాలతో నిలిపివేయాల్సి వచ్చింది. అన్నదాన పథకం నిధులతో ఈ పథకాన్ని నిర్వహించాలని అనుకున్నా సాధ్యపడలేదు. అన్నదాన పథకంలో బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెట్టడంతో రోజూ ఎంతమంది భోజనం చేస్తున్నారో స్పష్టంగా లెక్క తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం.– కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
సత్యసాయి తాగునీరు బంద్
మక్తల్ : రైతులకు సాగునీరు అందించేందుకు పంచదేవ్పాడు గ్రామం కృష్ణానదికి భీమా కాల్వ పనులు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. పనుల నిర్వహణలో సత్యసాయి పైపులైన్ పగిలిపోవడంతో దాదాపు 15రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్ పనులు సకాలంలో చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేవని, ఆయన నిర్లక్ష్యంతోనే సత్యసాయి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భీమా కాల్వ పనులు చేస్తున్న సమయంలో పైపులు పగిలిపోవడంతో మరో చోట పైపులు ఏర్పాటు చేశారు. కాల్వ పనులు చేస్తున్న సమయంలో నది నుంచి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో మరోచోట వేసిన రోడ్డు తెగిపోయింది. కాల్వ పనులు పరిశీలించడానికి వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి సందర్శించి సత్యసాయి పైపులైన్ విషయం తెలిపినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాగునీటి సరఫరా బంద్ చేయడంతో నియోజకవర్గంలోని 65గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది. ఈ పథకం ఎల్అండ్టీ కంపెనీ ఆదీనంలో 1999నుంచి కొనసాగుతుంది. మక్తల్ మండలం పారేవుల హెడ్‌వర్క్ నుంచి మండలంలోని 25గ్రామాలకు, మాగనూరు మండలంలో 14 గ్రామాలకు, ఊట్కూర్ మండలంలో 7గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. పైప్‌లైన్ పగలడంతో సత్యసాయి తాగునీటిపై ఆధారపడిన గ్రామాలు నీరులేక అల్లాడిపోతున్నాయి. పైపులైన్ నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్వ పనులు చేయడంతో పారేవుల, ముస్లాయిపల్లి, అనుగొండ, గడ్డంపల్లి, అంకేన్‌పల్లి, దాదాన్పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు సైతం దారిలేక బంద్ చేశారు. ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు పంచలింగాల, చిన్నగోప్లాపూర్ గ్రామాల మీదుగా వెళ్తున్నారు. కనీసం అనుగొండ, పారేవుల, గడ్డంపల్లి పుష్కరఘాట్లకు రోడ్డు లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సాగర్‌లో ఆగిన పుష్కర పనులు
నాగార్జునసాగర్ : సాగర్‌లో జరుగుతున్న పుష్కర పనులు నిలిచిపోయాయి. సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో రెండు రోజులుగా మెట్లు నిర్మించే పనులను నిలిపివేశారు. కాంక్రీట్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈనెల 28 వరకే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ విధించిన గడువు నేటితో ముగియనుంది. ఎలాంటి ఎటయిల్స్ వేయాలి, ఎక్కడ వరకు వేయాలనే విషయమై డ్యాం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కాంట్రాక్టర్ టెయిల్స్ కంపెనీవారితో మాట్లాడుకొని గడువులోపు వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. సంబంధిత సీఈ మాత్రం ఇంతవరకు కాంట్రాక్టర్‌కు టెయిల్స్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేయలేదని అంటున్నారు. అలాగే పార్కుల్లోనూ పనులు నిలిచిపోయాయి. ఆగిన రోడ్డు పనులు పుష్కర భక్తులకు పూర్తి భద్రత చేకూర్చేందుకు గాను డ్యాం అధికారులు వన్‌వే కోసం పాత రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. అయితే అటవీ అధికారులు అనుమతి లేదంటూ రెండు రోజలు క్రితం రోడ్డు పనులను నిలిపివేశారు. ఈ విషయమై డ్యాం అధికారులను సంప్రదించగా అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించగా అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని తెలిపారు. -
వైవీయూకు తాగునీరు బంద్
వల్లూరు: యోగి వేమన యూనివర్సిటీతోపాటు వల్లూరు మండలంలోని పలు గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేసే నీటి పథకానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో గత 3 రోజులుగా తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగి వేమన యూనివర్సిటీతోపాటు వల్లూరు , పెండ్లిమర్రి మండలాల్లోని 65 గ్రామాలకు తాగు నీటిని అందించడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రూ.5 కోట్లతో పథకాన్ని మంజూరు చేశారు. ఇందులో భాగంగా వల్లూరు మండలంలోని చెరువుకిందిపల్లె సమీపంలో పెన్నా నదిలో బావులను ఏర్పాటు చేశారు. 40 హెచ్‌పీ విద్యుత్ పంపు సెట్టును అమర్చి పెద్దలేబాక వద్ద నిర్మించిన ఓహెచ్‌బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ) కు అనుసంధానం చేశారు. అక్కడి నుంచి గత మూడేళ్లుగా యూనివర్సిటీకి నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతానికి వల్లూరు మండలంలోని కొప్పోలు, లేబాక , దిగువపల్లె, కుమారునిపల్లె తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. భారంగా విద్యుత్ బిల్లులు తమకువచ్చే ఆర్థిక నిధుల వాటా నుండి విద్యుత్ బిల్లులను చెల్లించడం జిల్లా పరిషత్‌కు పెద్ద భారంగా ఉండేది కాదు. కానీ గ్రామ పంచాయతీలకు వచ్చే కొద్ది పాటి ని«ధుల నుంచి ఇంతటి భారీ విద్యుత్ బిల్లులను చెల్లించడం పెను భారంగా మారింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు తమకు మంజూరైన ఆర్థిక సంఘం నిధులలో కేవలం 20 శాతం నిధులను మాత్రమే విద్యుత్ బిల్లులకు చెల్లించడానికి అవకాశం ఉంది. ఈ 20 శాతం నిధులలోనే గ్రామ పంచాయతీలు తమ పంచాయతీ పరిధిలో ఉన్న సింగిల్ విలేజ్ వాటర్ స్కీముల విద్యుత్ బిల్లులతోపాటు ఈ నీటి పథకం విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి రావడం అవరోధంగా మారుతోంది. –విద్యుత్ సరఫరా నిలిపివేత గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వైవీయూ నీటి పథకానికి సంబంధించి రూ.19 లక్షలు విద్యుత్ బకాయిలు పేరుకు పోయాయి. వీటిని యూనివర్సిటీ వారు, నీటిని వాడుకుంటున్న గ్రామ పంచాయతీల వారు కలిసి చెల్లించాల్సి ఉంది. బిల్లుల బకాయిలను చెల్లించక పోవడంతో గత ఆరు నెలల క్రితం విద్యుత్ శాఖ వారు ఈ పథకానికి సరఫరాను నిలిపి వేశారు. తరువాత పలువురు ప్రజా ప్రతినిధులు జోక్యంతో సరఫరాను తాత్కాలికంగా పునరుద్ధరించారు. అయినా బకాయిలు చెల్లించక పోవడంతో తిరిగి ఫిబ్రవరి నెల 26 వ తేదీన సరఫరాను నిలిపి వేశారు. దాదాపు రెండు నెలలతరువాత పునరుద్ధరించారు. తాజాగా ఈ నెల 25 వ తేదీన విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. మా వాటా విద్యుత్ బిల్లుల చెల్లించాం: మాకు ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రజల నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ నిధుల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లించడానికి చెక్కులు అందచేశాం. మా గ్రామ పంచాయతీ నీటి సరఫరా స్కీము విద్యుత్ బిల్లులు చెల్లించినా విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబదులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి. కే. శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్ , కొప్పోలు , వల్లూరు మండలం. బకాయిలు చెల్లించగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తాం: ఈ స్కీముకు సంబంధించి దాదాపు రూ.19 లక్షలకు పైగా విద్యుత్ బకాయిలు పేరుకు పోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేశాం. బకాయిలు చెల్లిస్తే వెంటనే పునరుద్ధరిస్తాం. మురళీధర్ రెడ్డి, ఏడీఈ , విద్యుత్ శాఖ, కడప. ఫోటోలు 27కేఎల్పీ302,302ఏ– పెద్దలేబాక వద్ద వున్న ఓహెచ్‌బీర్ ట్యాంక్ 27కేఎల్పీ302బీ–కే.శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్, కొప్పోలు. 27కేఎల్పీ302డీ– లేబాక సమీపంలో వ్యవసాయ మోటారు వద్ద నుండి ∙తాగు నీటిని తీసుకుని వెళుతున్న ప్రజలు -
గోవుల తరలింపును అడ్డగింత
త్రిపురారం : గోవులను తరలించే ఓ లారీని ఆదివారం మండలంలోని ఆర్ఎస్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కోదాడ సంత నుంచి ఓ లారీలో గోవులను మహబూబ్‌నగర్ కబేళాలకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ నాయకులు తుంగపాడు సమీపంలో అడ్డగించారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని గోవులను తరలిస్తున్న లారీ డ్రైవర్‌ను విచారించారు. అడ్డుకున్న వారిలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఉప్పుల అశోక్‌రెడ్డి, కుంచం రామాంజనేయులు, నామోజు సత్యనారాయణచారి ఉన్నారు. -
ఆరోగ్యశ్రీ ఆగింది..!
► ప్రైవేటు ఆస్పత్రుల్లో నేటి నుంచి సేవలు బంద్ ► ఆస్పత్రులకు రూ. 250 కోట్లు బకాయి పడిన ప్రభుత్వం ► తొమ్మిది మాసాలుగా చెల్లించకపోవడం వల్లే ఈ నిర్ణయం ► ఆరోగ్యశ్రీతో పాటు ఈహెచ్ఎస్ సర్వీసులూ నిలిపివేత ► తెలంగాణ ప్రైవేటు, నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు, నర్సింగ్ హోమ్‌లలో సాధారణ ఆరోగ్యశ్రీ సర్వీసులతోపాటు ఎంప్లాయూస్ హెల్త్ స్కీం సర్వీసులనూ నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన ఆరోగ్యశ్రీ బిల్లులను మే 1లోగా చెల్లించాలని లేదంటే ఆ మరుసటి రోజు నుంచే సేవ లను నిలిపివేయనున్నట్లు ఇటీవల ఆ సంఘం ప్రతినిధులు డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్రెడ్డిలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 190 ఆస్పత్రులు ఉండగా వీటిలో 60 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. మిగిలిన 130 ఆస్పత్రుల్లో కార్పొరేట్, ప్రెవేటు నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 80 వేల శస్త్రచికిత్సలు చేయగా ఇందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించక పోవడంతో నర్సింగ్‌హోమ్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. బకాయిలు చెల్లించాల్సిందిగా కోరుతూ ఇప్పటికే పలుమార్లు వైద్య ఆరోగ్య మంత్రితోపాటు ట్రస్ట్ సీఈవోకు విన్నవించామని, వారి నుంచి స్పందన లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని డాక్టర్ సురేశ్‌గౌడ్, టి.నర్సింగ్రెడ్డిలు పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఇందుకు సహకరిస్తున్నాయని తెలిపారు. అయితే దీనిపై తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతరాయం కలిగించొద్దు: ఆరోగ్య శ్రీ బకాయిలను సోమవారం నుంచి చెల్లిస్తామని, వాటి సేవలకు అంతరాయం కలిగించొద్దని నెట్వర్క్ ఆస్పత్రులను తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ ఎం.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో కోరారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
డిండి: మైనర్ బాలికకు పెద్దలు తలపెట్టిన వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం రామంతాపూర్ గ్రామానికి చెందిన వేముల తిరుపతయ్య కుమార్తె(14) వివాహం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం గట్టుప్పల గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడితో నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం రామంతాపూర్‌లో పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో సక్కుబాయి, ఎస్సై శేఖర్ అక్కడికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు.రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరకుండా బాలికకు వివాహం చేయటం నేరమని వారికి వివరించారు. -
గన్ ఆకారం హీల్స్ వేసుకున్నందుకు...
వాషింగ్టన్ః తుపాకీ హీల్స్ ధరించి, బుల్లెట్ బ్రాస్లెట్లను బ్యాగ్ లో తీసుకెడుతున్న అమ్మాయికి అమెరికా ఎయిర్ పోర్టు అధికారులు అభ్యంతరాలు తెలిపారు. చూసేందుకు అచ్చం బులెట్లలా ఉన్నరెండు బ్రాస్టెట్లను బ్యాగ్ లో పెట్టుకొని, నిజం తుపాకీల్లా ఉన్నహై హీల్స్ ధరించడమే ఆమె ప్రయాణానికి అడ్డంకిగా మారింది. ప్రమాదకర వస్తువులతో ప్రయాణమైనట్లు అనుమానించిన ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడే నిలిపేశారు. అభ్యంతర కర వస్తువులతో ఆమె ట్రావెల్ చేయడంతో ఎంతో సమయం వృధా అయ్యిందని బాల్టిమోర్ వాషిగ్టన్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు లిసా ఫార్బెస్టన్ తెలిపారు. ఏజెంట్లు ఆమెవద్ద ప్రమాదకర వస్తువులున్నాయని గుర్గించారని, అందుకే ప్రత్యేక తనిఖీలు చేపట్టాల్సివచ్చిందని ఆమె అన్నారు. షూస్, బ్రాస్లెట్లు ధరించడం అభ్యంతరం కాదని, అయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రి వంటివి తీసుకొని ప్రయాణించేందుకు టీఎస్ఏ అనుమతి ఉండదని ఆమె ఓ ట్వీట్లో తెలిపారు. అయితే ఆమె ఆ వస్తువులు చెక్ పాయింట్ దగ్గర చెక్డ్ బ్యాగ్ లో పెట్టుకున్నారని అనంతరం నియమాలకు విరుద్ధంగా బోర్డింగ్ సమయంలో వాటిని తీసి ధరించారని ఫార్బెస్టన్ తెలిపారు. కాగా ఆమెపై ఎటువంటి కేసులు పెట్టలేదని బాల్టిమోర్ సీబీఎస్ నివేదించింది. ప్రస్తుతం టీఎస్ఏ ఏజెంట్లకు తన బూట్లను అప్పగించి వెళ్ళిన యజమాని అడ్రస్ కోసం షూ తయారీదారుడు ఎదురు చూస్తున్నాడు. తన బూట్లను ఎయిర్ పోర్టులో వదిలి వెళ్ళిన మహిళకోసం శోధిస్తున్నట్లు ప్లెజర్ యుఎస్ఏ షూ కంపెనీ యజమానులు తమ కంపెనీ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. దయచేసి తమను సంప్రదించాలని, తమ కారణంగా విమానం తప్పిపోయిన మహిళకు మరో బాండ్ గర్ల్ బూట్ల జతను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. -
చీకట్లో ఉత్తర్వులు!
♦ జీవోలు బహిర్గతం కాకుండా వెబ్సైట్ నిలుపుదల ♦ వివాదాస్పద జీవోలపై సీఎం అసంతృప్తే కారణం! సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ల వెబ్‌సైట్‌ను మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సాధారణ, విధాన నిర్ణయాలన్నింటినీ ఏ రోజుకారోజు ప్రజలకు వెల్లడించే (goir.telangana.govt.in) వెబ్‌సైట్‌ను ఎలాంటి ప్రకటన లేకుండా నిలిపివేయడంపై మేధావులు, సమాచార హక్కు కార్యకర్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే ప్రజలకు వెల్లడికాకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జారీ చేసిన కొన్ని జీవోలు వివాదాలకు దారితీయడంతోనే జీవోల వెబ్‌సైట్‌ను నిలుపుదల చేసి, ఉంటారని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్న విషయం.. ఆ వ్యయం నిమిత్తం నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో వల్లే బహిర్గతమైంది. దీనిని ఎండగడుతూ జాతీయ మీడియా అప్పట్లో ప్రత్యేక కథనాలు వెల్లడించింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోల ద్వారా జీహెచ్ఎంసీ చట్టానికి పలుమార్లు సవరణలు జరపడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దాంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. ఇలా జీవోల వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు బహిర్గతం కావడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జీవోల వెబ్‌సైట్‌ను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏయే నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాలి, మరే నిర్ణయాలను వెల్లడించవద్దన్న అంశాలపై అధ్యయనం జరిపి నూతన విధానాన్ని సిఫారసు చేసేందుకు ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఇదే సమావేశంలో సీఎం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి కొత్త మార్గదర్శకాలను సిఫారసు చేయనుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మేరకు మార్పు చేర్పులతో జీవోల వెబ్‌సైట్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కేవలం కొన్ని రకాల విధాన పరమైన నిర్ణయాలు, భారీ మొత్తంలో నిధులకు సంబంధించి మాత్రమే ఇకపై జీవోలు జారీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ప్రభుత్వ అవసరాలు, స్వల్ప వ్యయాలకు ఇకపై జీవోలు జారీ కావని తెలుస్తోంది. దీనితోపాటు ప్రజలకు బహిర్గతమైతే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే నిర్ణయాలపై ఏ తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై ఈ కమిటీ ప్రత్యమ్నాయాలను సిఫారసు చేయనుందని సమాచారం. -
అరగంటపాటు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్
దామరచర్ల(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళోతన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్లలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. బొత్తల పాలెం వద్ద పట్టాలపై ఉన్న రెండు గేదెలను రైలు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్ రైలును నిలిపేశాడు. చనిపోయిన గేదెల శరీరభాగాలు రైలు చక్రాల్లో ఇరుక్కుపోవడంతో రైలును అనివార్యంగా నలిపేశారు, వీటిని తొలగించిన అనంతరం తిరిగి రైలు గుంటూరుకు బయలుదేరింది. -
ఎమ్మెల్యేని అడ్డుకున్న పోలీసులు
విశాఖపట్టణం: విశాఖ జిల్లా చింతపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుకొండ బాక్సైట్ సదస్సుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని లోతుగడ్డ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సదస్సుకు అనుమతి లేదంటూ ఈశ్వరితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో బ్రిడ్జిపైనే ఎమ్మెల్యే బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
ఘట్కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్‌లో పోలోకార్ల డెలివరీ నిలిపివేత
ఫ్రాంక్ ఫర్ట్ : జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగన్ భారత్‌లో హాచ్ బ్యాక్ పోలో కార్ల డెలివరీలను నిలిపివేయాలని తమ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన సంస్థ, భారత్ లో తమ విక్రయాలను కొంత కాలం ఆపడానికి స్పష్టమైన కారణాలను మాత్రం పేర్కొనలేదు. అయితే మరో నోటీస్ ఇచ్చే వరకు పోలోలోని అన్ని వేరియంట్లలో ఎలాంటి డేలవరీలు చేయకూడదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్లకు లేఖ పంపింది. ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు ఫోక్స్ వాగన్ సంస్థ అంగీకరించిన విషయం తెలిసిందే. తొలుత కేవలం అమెరికాలోని 5లక్షల కార్లలో మాత్రమే లోపాలున్నట్లు తెలిపిన సంస్థ యాజమాన్యం ఆ తర్వాత భారీ మోసాన్ని అంగీకరించింది. అయితే ఈ కార్లకు సంస్థ ఇదివరకు చెప్పిన ఇంజిన్ అమర్చాలంటే భారత కరెన్సీలో అక్షరాలా 48.10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!
ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే... కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు. అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది. నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు. నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ గ్రీన్ చెక్ బాక్స్ లో యాడ్ అయ్యి ఉండటం గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట. అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు. అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు. ''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు. దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది'' అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్. ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్ ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి. ప్రస్తుతానికి గూగుల్ ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది. -
కడపలో ఆగిపోయిన విమాన సర్వీసులు
-
తెలంగాణ తొలిపరీక్షలో స్వల్ప అంతరాయం
-
సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేత
గుంటూరు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు నీటి విడుదలను ఆదివారం నిలుపుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 4.3 టీఎంసీలు విడుదల చేయాలని కృష్టా నదీ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున పది రోజల పాటు మొత్తం 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు గత నెల 28 నుంచి సాగర్ జలాశయానికి నీటి విడుదల కొనసాగింది. కుడికాలువ ఆయకట్టు పరిధిలోని గ్రామాలకు సాగునీటి అవసరాల నిమిత్తం బుగ్గవాగు రిజర్వాయర్‌కు 2.15 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1.4 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం బుగ్గవాగు రిజర్వాయర్‌లో 0.3 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంకా 1.4 టీఎంసీలు రావాల్సి ఉండగా బోర్డు అధికారులు నీటిని కుడికాలువకు నిలుపుదల చేశారు. మరో ఎనిమిది రోజుల పాటు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే బుగ్గవాగు రిజర్వాయర్‌కు 1.4టీఎంసీలు నీరు చేరుతుంది. -
'ధనంజయ ట్రావెల్స్' బస్సులు అడ్డుకున్న ప్రయాణికులు
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ధనంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ప్రయాణికులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. ఒక్కో టిక్కెట్టును నలుగురికి అమ్ముకోవడమే కాకుండా వోల్వో బస్సుకు టికెట్ బుక్ చేసుకుంటే సూపర్ లగ్జరీ బస్సులో టికెట్ కేటాయించారు. కనీసం సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఏర్పాటు చేయకుండా జాప్యం ప్రదర్శిస్తూ సరైన సమాధానం చెప్పడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. -
కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి 5వ దశ 11వ యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకవడాన్ని గుర్తించిన అధికారులు ట్రిప్ చేశారు. దీంతో రాష్ట్ర గ్రిడ్‌కు విద్యుదుత్పత్తి చేయడంలో తీవ్ర అంతరాయం వాటిల్లింది. కాగా, సీఈ సిద్దయ్య నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ యూనిట్‌ను పునరుద్ధరించనున్నారు. -
రైళ్లకు పై-లీన్ బ్రేక్
ఆమదాలవలస, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను తాకిడితో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు దెబ్బతినడంతో శనివారం రావాల్సిన రైళ్లన్నీ రద్దయ్యాయి. పలాస-విశాఖపట్నం పాసింజర్ సర్వీసు (78531/78532), (58525/58526), (67293/67294)లను రద్దు చేశారు. భువనేశ్వర్-హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఈస్ట్‌కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా, భువనేశ్వర్-ముంబాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పూరీ-అహ్మదాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (18411/18412)ను, భువనేశ్వర్-తిరుపతి వెళ్లే (12879)వీక్లీ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (67293) రద్దు చేసినట్లు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ రైల్వే అధికారులు తెలిపారు.పై-లీన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖాధికారులు శుక్రవారం నుంచే రైళ్ల సర్వీసులను క్రమబద్ధీకరించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ (17015/16) విశాఖఎక్స్ప్రెస్ను విజయనగరం నుంచి నడుపుతున్నట్లు ప్రకటించి రద్దు చేశారు. పాట్నా-ఎర్నాకుళం (16310) వీక్లీ ట్రైన్ 3 గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ ైరె ళ్లను శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. ప్రయాణికుల ఇక్కట్లు ైరె ళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్లాట్‌ఫారంపై అంధకారం అలముకుంది. రైల్వే బుకింగ్ వద్ద కూడా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంవైపు దృష్టి సారించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికుల సందడి లేక ప్లాట్ఫారం బోసిపోయింది. పట్టాలపై చెట్లు పలాస :పై-లీన్ తుఫాను ప్రభావంతో రైలు పట్టాలపై చెట్లు విరిగిపడడంతో రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 9 గంటలకు పలాస స్టేషన్లో నిలిపేశారు. ఒడిశా తీరంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అటు వైపు వెళ్లే రైళ్లు నిలిపివేసినట్లు పలాస రైల్వే స్టేషన్ మాష్టారు ఎం.శ్యామలరావు తెలిపారు. ఉదయం భువనేశ్వర్- బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు పలాస నుంచి బయలుదేరిందన్నారు. హౌరా-చెన్నై మెయిల్ 11.40 గంటలకు, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు 01.40 గంటలకు పలాస నుంచి బయలుదేరినట్లు ఆయన తెలిపారు. -
నిలిచిపోయిన రవాణా వ్యవస్ధ
-
డిపోల్లోనే నిలిచిపోయిన అర్టీసీ బస్సులు