బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officers Stopped Child Marraige | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Fri, Aug 26 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

Officers Stopped Child Marraige

మద్దూరు : ఓ బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకోగలిగారు. వివరాలిలా ఉన్నాయి. మద్దూరులోని 15ఏళ్ల బాలిక గతేడాది దామరగిద్ద కేజీవీబీలో ఏడోతరగతి చదువుతూ మధ్యలోనే మానేసింది. కాగా, ఈ బాలికకు పెద్దరాయిచూర్‌కు చెందిన వీరేష్‌తో వారం పది రోజుల్లో వివాహం చేయడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త సుజాత వెంటనే ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జ్యోతి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌1098 సభ్యుడు విజయ్‌కుమార్, ఎస్‌ఐ నరేందర్‌లకు సమచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయిని తహసీల్దార్‌ చందర్‌ ఎదుట హాజరుపర్చి అనంతరం జిల్లా కేంద్రంలోని బాలల సదన్‌కు పంపించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement