maddur
-
విధి వైపరిత్యం అంటే ఇదేనేమో.. కూతురు పెళ్లై 24 గంటలు గడవకముందే!
సాక్షి, సిద్దిపేట జిల్లా: ఆ ఇంట పెళ్లిసందడి ముగియకముందే చావుబాజా మోగింది. పెద్దకూతురు పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే తల్లి గుండెపోటుతో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బంజార గ్రామానికి చెందిన జగిలి స్వరూప(35)కు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు శుక్రవారం వివాహం జరిగింది. ఇంటిల్లిపాది పెళ్లిసందడిలో ఆనందంగా ఉన్నారు. శనివారం ఉదయం కూతుర్ని అత్తగారింటికి పంపేందుకు ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే తల్లి సర్వూప ఒక్కసారిగా గుండెపోటుతో తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. పెద్దకూతురికి కన్యాదానం చేసి, చిన్నకూతురుతో తలకొరివి పెట్టించుకుందంటూ కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. -
కేటీఆర్.. కొడంగల్ దత్తత ఊసేదీ?
మద్దూరు: గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్‌ను దత్తత తీసుకొని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్ మాటలు ఏమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మూడున్నరేళ్లలో కేటీఆర్ ఒక్కసారైనా నియోజకవర్గానికి వచ్చారా? అని నిలదీశారు. ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురు లోకామాసంద్ ప్రభు ఉత్స వాల సందర్భంగా బావాజీ, కాళికాదేవిని రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం మోమి నాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతు లకు విద్యుత్ కోసం సబ్స్టేషన్లు, ఎన్నో ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించానని రేవంత్ గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేసి ప్రజల రుణం తీర్చు కుంటానని రేవంత్ చెప్పారు. కార్యకర్తలు ఏడాది కష్టపడితే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉపాధి కల్పిస్తానని హామీనిచ్చారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మద్దూరు : ఓ బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకోగలిగారు. వివరాలిలా ఉన్నాయి. మద్దూరులోని 15ఏళ్ల బాలిక గతేడాది దామరగిద్ద కేజీవీబీలో ఏడోతరగతి చదువుతూ మధ్యలోనే మానేసింది. కాగా, ఈ బాలికకు పెద్దరాయిచూర్‌కు చెందిన వీరేష్‌తో వారం పది రోజుల్లో వివాహం చేయడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త సుజాత వెంటనే ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, చైల్డ్ హెల్ప్‌లైన్1098 సభ్యుడు విజయ్‌కుమార్, ఎస్ఐ నరేందర్‌లకు సమచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిని తహసీల్దార్ చందర్ ఎదుట హాజరుపర్చి అనంతరం జిల్లా కేంద్రంలోని బాలల సదన్‌కు పంపించారు. -
తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా
మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో అపశృతి మద్దూరు : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ అయిలయ్య జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో సరిగ్గా గమనించలేదు. దీంతో జెండా తలకిందులుగా ఎగిరింది. ఈ మేరకు అక్కడ ఉన్న ఉద్యోగులు స్పందించి జెండాను కిందకు దించి సరిచేశాక మళ్లీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద మాధవి, జెడ్పీటీసీ నాచగోని పద్మ, పీఏసీఎస్ చైర్మన్ కామిడి రమేష్‌రెడ్డి, కొమురవెళ్లి ఆలయపాలక మండలి చైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీ కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి, ఎస్సై తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రెండోపెళ్లి చేసుకుందాం అన్నాడని..
ప్రేమపేరుతో యువకుడి మోసం రెండోపెళ్లి చేసుకుంటానని గొడవ మనస్తాపంతో ఓ అభాగ్యురాలి బలవన్మరణం మృతదేహంతో విద్యార్థుల రాస్తారోకో మద్దూరు: ప్రేమించిన వాడు కాదన్నాడు.. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. మళ్లీ నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అవమానభారం భరించలేక ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ విషాదకర సంఘటన బుధవారం రాత్రి మండలంలోని గోకుల్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భారతి(20) మద్దూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే ఊరికి చెందిన శివరాజ్(25) గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు విధానంపై ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శివరాజ్ భారతిని కాదని తన కులానికి చెందిన అమ్మాయిని ఆరునెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భారతికి ఫోన్‌చేసి ‘నిన్ను రెండో పెళ్లిచేసుకుంటా..’ అంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం ఇంటికివచ్చి భారతితో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. మతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. విద్యార్థుల రాస్తారోకో.. భారతి మృతికి కారణమైన శివరాజ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గురువారం ఏబీవీపీ, వీరశైవలింగాయత్ సంఘం ఆధ్వర్యంలో మతదేహంతో మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు పెదిరిపాడ్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. చదువుకుంటున్న విద్యార్థికి మాయమాటలు చెప్పి మోసం చేసి మరోపెళ్లి చేసుకున్న తరువాత కూడా వెధించడంతోనే ఆమె చనిపోయిందని ఆగ్రహించారు. నిందితుడిని అరెస్ట్‌చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. నిందితుడి శివరాజ్‌ను అరెస్ట్‌చేస్తామని హామీఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత్ నేతలు జగదీశ్వర్, శివరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జున్, శివకుమార్, శేఖర్, సిద్ధిలింగం, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. -
వేధింపులకు యువతి బలి
ప్రేమపేరుతో యువకుడి మోసం రెండోపెళ్లి చేసుకుంటానని గొడవ మనస్తాపంతో ఓ అభాగ్యురాలి బలవన్మరణం మతదేహంతో విద్యార్థుల రాస్తారోకో మద్దూరు: ప్రేమించిన వాడు కాదన్నాడు.. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. మళ్లీ నిన్ను రెండో పెళ్లి చేసుకుంటానని వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అవమానభారం భరించలేక ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ విషాదకర సంఘటన బుధవారం రాత్రి మండలంలోని గోకుల్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భారతి(20) మద్దూరులోని ఓ ప్రై వేట్ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే ఊరికి చెందిన శివరాజ్(25) గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు విధానంపై ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శివరాజ్ భారతిని కాదని తన కులానికి చెందిన అమ్మాయిని ఆరునెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భారతికి ఫోన్‌చేసి ‘నిన్ను రెండో పెళ్లిచేసుకుంటా..’అంటూ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం ఇంటికివచ్చి భారతితో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. మతురాలి తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. విద్యార్థుల రాస్తారోకో.. భారతి మతికి కారణమైన శివరాజ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని గురువారం ఏబీవీపీ, వీరశైవలింగాయత్ సంఘం ఆధ్వర్యంలో మతదేహంతో మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు పెదిరిపాడ్ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. చదువుకుంటున్న విద్యార్థికి మాయమాటలు చెప్పి మోసం చేసి మరోపెళ్లి చేసుకున్న తరువాత కూడా వెధించడంతోనే ఆమె చనిపోయిందని ఆగ్రహించారు. నిందితుడిని అరెస్ట్‌చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. నిందితుడి శివరాజ్‌ను అరెస్ట్‌చేస్తామని హామీఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో వీరశైవలింగాయత్ నేతలు జగదీశ్వర్, శివరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జున్, శివకుమార్, శేఖర్, సిద్ధిలింగం, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం
మహబూబ్‌నగర్:అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్దుడు శనివారం మధ్యాహ్నం అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పరిసర వాసులు గమనించి అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాలాల మండలానికి చెందిన యాచకుడు తిమ్మప్ప (60) శనివారం ఉదయం మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లికి వచ్చాడు. గ్రామపంచాయతీ సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని బలవంతంగా పక్కలో ఉన్న మరుగుదొడ్డి సందులోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోయాడు. ఇది గమనించిన పరిసర వాసులు అతన్ని పట్టుకొని దేహశుద్ది చేశారు. కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంతోష్‌రెడ్డి అక్కడకు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం నారాయణపేటకు తరలించారు.