మద్దూరు: గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్‌ను దత్తత తీసుకొని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్ మాటలు ఏమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మూడున్నరేళ్లలో కేటీఆర్ ఒక్కసారైనా నియోజకవర్గానికి వచ్చారా? అని నిలదీశారు. ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురు లోకామాసంద్ ప్రభు ఉత్స వాల సందర్భంగా బావాజీ, కాళికాదేవిని రేవంత్ దర్శించుకున్నారు.
అనంతరం మోమి నాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతు లకు విద్యుత్ కోసం సబ్‌స్టేషన్లు, ఎన్నో ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించానని రేవంత్ గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేసి ప్రజల రుణం తీర్చు కుంటానని రేవంత్ చెప్పారు. కార్యకర్తలు ఏడాది కష్టపడితే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉపాధి కల్పిస్తానని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment