బాల్య వివాహాన్ని అడ్డుకున్న సీడీపీఓ
Published Mon, Aug 22 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
సంగం: సంగం మండలం జంగాలదరువులో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారంతో సోమవారం సీడీపీఓ విజయలక్ష్మి గ్రామానికి వెళ్లి బాల్య వివాహం జరగనివ్వకుండా పెద్దలను ఒప్పించారు. జంగాలదరువుకు చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలికకు ఈనెల 25వ తేదీ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. సమాచారం సీడీపీఓ విజయలక్ష్మికి తెలియడంతో ఆమె గ్రామానికి వెళ్లి మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. మైనర్ బాలికకు వివాహం చేస్తే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారికి తెలిపారు. మైనర్ వివాహం చేస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు తాము వివాహం చేయమంటూ తెలిపారు. ఈమె వెంట అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగమణి, సంగం పోలీసులు ఉన్నారు.
Advertisement