
బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది.
"என்னை விடுங்க.." உயிரை வெறுத்து கதறிய சிறுமி.. குண்டுக்கட்டாக தூக்கி சென்ற இளைஞர் - ஷாக்கிங் வீடியோ#childmarriage #hosur #thanthitv pic.twitter.com/lheSh1UjZ8
— Thanthi TV (@ThanthiTV) March 6, 2025
అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment