Hosur
-
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్‌లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని
హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్‌కాట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. గుట్కా, కారు సీజ్ హోసూరు: కర్ణాటక నుంచి కరూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్కాట్ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. సిఫ్‌కాట్ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్ (28) అనే డ్రైవర్‌ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు. చదవండి హైదరాబాద్: మీర్‌పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి.. -
జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని హైవే దిగ్బంధం
హోసూర్(తమిళనాడు): కృష్టగిరి జిల్లా హోసూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వకపోవడంతో చెన్నై-బెంగళూరు హైవేను వందలాది మం గ్రామస్తులు దిగ్బంధించారు. దాంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మూడు పోలీసు వాహనాలు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు. -
భార్య కళ్ల ముందే దారుణం.. నవ వరుడు..
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో భార్య కళ్ల ముందే భర్త మృతి చెందిన ఘటన బేరికె పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... హోసూరు సమీపంలోని వెంకటేశపురం గ్రామానికి చెందిన కార్మికుడు అంజినప్ప (25)కు గతనెల 5న సూళగిరి సమీపంలోని త్యాగరసనపల్లి గ్రామానికి చెందిన వెన్నెల (20)తో వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో భార్యను తీసుకొని త్యాగరసనపల్లి గ్రామానికి వెళ్తుండగా బేరికె సూళగిరి రోడ్డులోని ఏ.శెట్టిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అంజినప్ప ఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన వెన్నెలను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..) -
హోసూరులో అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్
న్యూఢిల్లీ: దేశంలో యాపి ల్ ఐఫోన్ల తయారీకి సంబంధించి అతిపెద్ద ప్లాంట్ కర్ణాటకలోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా 60వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ వివరాలను కేంద్ర టెలికం, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఐఫోన్ల తయారీపై రాంచీ, హజారీబాగ్‌కు చెందిన ఆరువేల మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. -
క్రికెట్ మైదానం ప్రారంభించిన ధోని (ఫొటోలు)
-
క్రికెట్ మైదానం ప్రారంభించిన ధోని
హోసూరు: హోసూరు సమీపంలోని శానసంద్రం వద్ద గల ఎం.ఎస్.గ్లోబల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ మైదానాన్ని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ శిక్షణా అకాడమితో విద్యార్థులకు క్రికెట్‌పై శిక్షణ అందజేసేందుకు అధికారికంగా ధోని సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ మైదానాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమి అధికారి విశ్వనాథన్, పాఠశాల నిర్వా హకులు చంద్రశేఖర్, భువనేశ్వరి, వినిత్ చంద్రశేఖర్, దీపిత, విష్ణుగౌరవ్, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నోట్లో గుండుసూది వేసుకుని పొరపాటున మింగేసిన విద్యార్థి
సాక్షి, బెంగళూరు: ఓ విద్యార్థి నోటిలో గుండుసూది వేసుకుని పొరపాటును మింగేశాడు. హోసూరు సమీపంలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన ఆనందన్, ధనలక్ష్మి దంపతుల కొడుకు యల్లేష్ (12). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తరగతి గదిలో గుండుసూదిని నోట్లో ఉంచుకొని అకస్మాత్తుగా మింగేశాడు. భయపడిన యల్లేష్ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు వెంటనే హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ చేయగా గుండుసూది కడుపులో ఉన్నట్లు తేలింది. వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. చదవండి: Maharashtra: రాయ్‌గఢ్‌లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా -
పెళ్లి చేయమంటే ఆగమన్నారు.. అందుకే ఇలా
సాక్షి, బెంగళూరు( హోసూరు): పెళ్లి చేయాలని కోరినా తల్లిదండ్రులు పట్టించుకోలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. రాయకోట సమీపంలోని పిల్లారి అగ్రహారం గ్రామానికి చెందిన అమావాసికి అజిత్ కుమార్, అరుళ్ కుమార్ (18) ఇద్దరు కుమారులు ఉన్నారు. అజిత్‌కుమార్ హోసూరులోని ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అరుళ్‌కుమార్ తనకు పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. అన్న పెళ్లి తరువాతే నీ పెళ్లి అని చెప్పడంతో మనోవేదనకు గురైన అరుళ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కొడుకు మందుల కోసం 300 కి.మీ.సైకిల్ తొక్కిన తండ్రి -
రోడ్డు మీద బంగారు నాణేల కలకలం
సాక్షి, బెంగళూరు : రోడ్డు మీద కుప్పులు కుప్పలుగా బంగారు నాణేలు అంటూ ప్రచారం. నిమిషాల్లో ఈ విషయం చుట్టుపక్కల పాకిపోయింది. ఇంకేముంది... బంగారు నాణేలను సొంతం చేసుకునేందుకు జనాలు భారీ ఎత్తున గుమ్మిగూడటంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుసరిహద్దులోని హోసూరు తాలూకా బాగలూరు– సజ్జాపురం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్ సమీపంలోని ఓ పొదలో బంగారు నాణేలు దొరుకుతున్నాయని శుక్రవారం సాయంత్రం ప్రచారం జరిగింది. దీంతో చిన్నాపెద్ద తేడా లేకుండా సుమారు 200 మందికిపైగా చేరుకొని నాణేల కోసం వెతకలాట ప్రారంభించారు. నాణేలు దొరికిన కొంత మంది అక్కడి నుండి వెళ్లిపోగా మిగిలిన వారు గాలింపులు కొనసాగిస్తూ వచ్చారు. దీనితో బాగలూరు– సర్జాపురం రోడ్డులో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. విషయం తెలుసుకొన్న బాగలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను క్రమబద్దీకరించారు. నాణేలపై హోసూరు తహసీల్దార్ సెందిల్‌కుమార్ మాట్లాడుతూ... ప్రజలకు దొరికిన కొద్ది నాణ్యాలను స్వాధీనపరుచుకొని పరిశీలించగా ఇత్తడి నాణేలుగా తెలిసింది. ఇత్తడి నాణేలను చూసి జనాలు బంగారు నాణేలు అనుకున్నారన్నారు. ఈ ఘటన హోసూరు ప్రాతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. -
మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి
చెన్నై: బేకరీలో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ మరుగుతున్న పాల పాత్రలో పడి మృతి చెందాడు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. హోసూర్‌లోని చినఎలసగిరికి చెందిన మురుగేష్ (30) బేకరీ నిర్వహిస్తుంటాడు. అతని కుమారుడు భవుస్యాకు మూడేళ్లు. ఆగస్టు 30వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో బేకరీలో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడు అనుకోకుండా పక్కనే ఉన్న మరుగుతున్న పాల పాత్రలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన భవుస్యాని చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి భవుస్యా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
హోసూరులో విషాదం
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి పత్తికొండ రూరల్: ఈత కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటి కుంట మింగేసింది. ఈ విషాద ఘటన పత్తికొండ మండలం హోసూరులో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తూర్పుగేరి రంగస్వామి కుమారుడు కార్తీక్ (10), పెద్దహుల్తి భాస్కర్ కుమారుడు మధు (9)తో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఈత సరదా కోసం గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆటలాడుకుంటూ కుంటలోని లోతును గమనించలేక కార్తీక్, మధు మొదట నీళ్లలోకి దిగారు. ఇటీవలే కురిసిన వర్షం నీళ్లతో ఉన్న కుంటలో పూడిక ఎక్కువగా ఉండటంతో నీళ్లలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక మునిగిపోయారు. బయట గట్టుపై ఉన్న మరో ఇద్దరు ప్రమాద విషయాన్ని గమనించి గ్రామానికి వెళ్లి కొందరికి చెప్పారు. గ్రామస్తులు వచ్చేలోగా చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పత్తికొండ ఎస్ఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు : వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి, నరసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మౌనిక, మంజుల కాగా కార్తీక్ చివరి సంతానం. అదే కాలనీకి చెందిన భాస్కర్, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు పవన్, మధు, రఘు సంతానం కాగా మధు రెండో సంతానం. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను నీటి కుంట బలిగొనడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. చిన్నారుల మృతితో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ద్విచక్రవాహనంలో డబ్బు అపహరణ
ఆంధ్రకు చెందిన వ్యక్తి అరెస్టు హొసూరు: ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్లో ఉంచిన నగదును అపరహరించి వెళ్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాహనదారుడు పట్టుకొని కావేరి పట్టణం పోలీసులకు అప్పగించాడు. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని దేవరముక్కుళంకు చెందిన అరుళ్మణి(41) కావేరిపట్టణంలో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం వ్యాపారం కోసం తన ద్విచక్ర వాహనంలో కావేరి పట్టణానికి వచ్చి ద్విచక్రవాహనాన్ని పక్కన నిలిపి తన జేబులో ఉన్న రూ. 4,500ను ట్యాంకు కవర్లో ఉంచి, వ్యాపారంలో నిమగ్నమయ్యాడు. ఈ సమయంలో అక్కడికొచ్చిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఉన్న డబ్బును తీసుకొని పరారైయ్యాడు. విషయం గమనించిన అరుళ్మణి, స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని పట్టుకొని కావేరి పట్టణం పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా ఆంధ్రరాష్ట్రం అనంతపురం జిల్లా నల్లచెరువు గ్రామానికి చెందిన గణేష్(40) అని తెలిసింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
'ఉచిత పథకాల కన్నా మాతృభాషే ముఖ్యం'
హోసూరు: తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణ ఉధ్యమ నాయకుడు, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కెతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. హోసూరు, ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కలుసుకొని తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. అనంతరం హోసూరు పట్టణంలోని రైతు బజార్, పూల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ద్రవిడ పార్టీల ఉచిత పథకాల కంటే మన మాతృ భాష పరిరక్షణే మనకు ముఖ్యమన్నారు. గతంలో ఎన్నో వాగ్దానాలతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు మొండి చెయ్యి చూపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
'అమ్మ'పై పోటీకి తెలుగు నాయకుడి సై
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో సీఎం జయలలిత పోటీచేస్తున్న ఆర్కే నగర్ నుంచి ఆమెపై పోటీచేసేందుకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సోమవారం స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గతంలో తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్ధతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. నిర్బంధ తమిళవిద్య ప్రవేశపెట్టడం వల్ల తెలుగువాళ్లు నష్టపోతారని అందుకే ఆ అంశంపై పునరాలోచించాలని ఎన్నిసార్లు వినతిపత్రం కోరినా ఆమె పట్టించుకోలేదని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు తీరుస్తానని జయ హామీ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని తెలిపారు. కేవలం ఆర్కే నగర్ లో లక్షా ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని చెప్పారు. ద్రావిడ పార్టీలు తెలుగు వారి బాగోగుల కంటే వారిని అణగదొక్కే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. మంగళవారం హోసూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు. -
పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ
-
పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ, 10మంది మృతి!
బెంగళూరు : కర్ణాటక హోసూరు వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో వందమందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా బెంగళూరు-తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఉదయం 7.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. D-8 బోగీ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు 10 అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, రైల్వే సిబ్బంది... బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మోడీ వస్తే అరాచకమే : చిరంజీవి
హొసూరు: కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని మతతత్వ పార్టీ బీజేపీకి ఓట్లు వేయవద్దని కేంద్రమంత్రి చిరంజీవి ఓటర్లను కోరారు. తమిళనాడులోని కృష్ణగిరి లోకసభ నియోజకవర్గ పరిదిలోని హొసూరు, వేపనహళ్ళి శాసనసభ నియోజకవర్గాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హొసూరు గాంధీ విగ్రహం వద్ద అభిమానుద్దేశించి మాట్లాడారు. బీజేపిని గెలిపిస్తే దేశంలో అరాచకమే అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. విభిన్న భాషలు, సంస్కృతులు, విభిన్న మతాలున్న ప్రాంతం హొసూరు మినీ ఇండియాగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకు పదవులే తప్ప ప్రజాప్రయోజనాలు తెలియదన్నారు. తమిళనాడు ప్రభుత్వం అందజేసే ఉచిత బియ్యం పథకం నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి అత్తిపల్లి మీదుగా ఆయన హొసూరుకు వచ్చారు. బాగలూరు, బేరికె, సూళగిరి, అత్తిముగంలలో పర్యటించారు. చిరంజీవి తప్పుడు సమాచారం హొసూరు రోడ్డు షోలో అభిమానులను చూసి చిరంజీవి రెచ్చిపోయారు. తన ప్రసంగంలో తప్పుడు వివరాలను ప్రజలకు చెప్పారు. రోడ్ల గురించి తెలిసీ తెలియని మాటలు మాట్లాడారు. 65 ఏళ్ళలో డీఎంకే, అన్నాడీఎంకే ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. హొగేనకల్ తాగునీటి ప్రాజెక్ట్, కష్ణా తాగునీటి ప్రాజెక్ట్ (తెలుగుగంగ) డీఎంకే, అన్నాడీఎంకేలు రాష్ట్రానికి తీసుకొచ్చాయి. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని తాగు, సాగునీరు ప్రాజెక్ట్‌గా చిరంజీవి పేర్కొనడంతో ప్రజలు నవ్వుకున్నారు. -
టైటాన్.. ‘కారీగర్’ కేంద్రాలు
దేశంలోనే తొలిసారిగా ఇన్‌హౌస్ ఆభరణాల తయారీ మెరుగైన సౌకర్యాలతో స్వర్ణకారులకు రెట్టింపు ఆదాయం త్వరలోనే ఆభరణాల తయారీపై శిక్షణా కేంద్రం హోసూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి దేశీయ బంగారు ఆభరణాల తయారీ రంగంలో టాటా గ్రూపునకు చెందిన టైటాన్ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలోనే తొలిసారిగా స్వర్ణకారుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాలుగు ఆభరణాల తయారీ కేంద్రాలను (కారీగర్ సెంటర్స్) ఏర్పాటు చేసింది. సుమారు రూ.22 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సంస్థ డెరైక్టర్ డాక్టర్ సి.జి.కె.నాయర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆభరణాల వినియోగంలో ఇండియా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో చాలా వెనుకబడి ఉందని, ఈ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాలు తయారై ఎగుమతులు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ఆదాయాన్ని పెంచే ఇటువంటి కేంద్రాలు ఇతర జ్యుయెలరీ సంస్థలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టైటాన్ మేనేజింగ్ డెరైక్టర్ భట్ మాట్లాడుతూ గత పదేళ్లలో తనిష్క్ వినియోగదారుల్లో సంతోషాన్ని చూశాం కానీ, దానికి కారణమైన స్వర్ణకారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. స్వర్ణకారుల ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్న తమ పదేళ్ల కల ఇప్పటికి నిజమయ్యిందన్నారు. సుమారు పదేళ్ల క్రితం కారీగర్ పార్క్‌తో ప్రారంభించి ఇప్పుడు కారీగర్ కేంద్రాల స్థాయికి వచ్చామన్నారు. త్వరలోనే కోల్‌కతాలో మరో రెండు కారీగర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మరింత నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని భట్ తెలియజేశారు. రెట్టింపైన ఆదాయాలు: తమ కారీగర్ సెంటర్స్‌తో స్వర్ణకారులు ఎక్కువ ఆభరణాలను తయారు చేయడం ద్వారా అధికాదాయాన్ని పొందుతున్నట్లు టైటాన్ సీఈవో(జ్యుయెలరీ విభాగం) సి.కె.వెంకటరామన్ తెలిపారు. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెల రోజుల్లో 500- 600 గ్రాముల ఆభరణాలను తయారు చేస్తాడని, కానీ ఈ అధునాతన సౌకర్యాల వల్ల నెలకు 1,500 గ్రాముల వరకు తయారు చేయగలుగుతున్నారని తెలిపారు. త్వరలోనే దీన్ని 3 కిలోలకు (3వేల గ్రాములు) తీసుకెళ్ళాలన్నది టైటాన్ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ నాలుగు కారీగర్ సెంటర్స్‌లో 300 మంది స్వర్ణకారులు పనిచేస్తున్నారు. -
నడిరోడ్డుపై కారు దగ్ధం
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చెన్నై త్యాగరాజనగర్‌కు చెందిన ధనంజయన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం హోసూర్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి కారులో బయలు దేరారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై వస్తున్న సమయంలో కారు నుంచి చిన్నగా మంటలు వచ్చాయి. దీనిని గమనించిన ధనంజయన్ కారును ఆపి వెంటనే కిందకు దిగాడు. మంటలు పెద్దవి కావడంతో కారులోని భార్య, ఇద్దరు పిల్లలను కిందకు దింపి కారులోని విలువైన సామాగ్రిని కిందకు వేసి పరుగులు తీశారు. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికి కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ మేరకు సత్‌వాచ్చారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడి రోడ్డుపై కారు దగ్ధం కావడంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.