
'ఉచిత పథకాల కన్నా మాతృభాషే ముఖ్యం'
హోసూరు: తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణ ఉధ్యమ నాయకుడు, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కెతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. హోసూరు, ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కలుసుకొని తనకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. అనంతరం హోసూరు పట్టణంలోని రైతు బజార్, పూల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
ప్రచారం సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ద్రవిడ పార్టీల ఉచిత పథకాల కంటే మన మాతృ భాష పరిరక్షణే మనకు ముఖ్యమన్నారు. గతంలో ఎన్నో వాగ్దానాలతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు మొండి చెయ్యి చూపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.