compaign
-
గ్రామాలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని బీజేపీ ఓ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ‘గ్రామాలకు వెల్లండి’(గావో చలో అభియాన్)అని శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఈ ప్రచారం జరగనుంది. ప్రతి బీజేపీ కార్యకర్త గ్రామాలకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, పేద ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోవాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. బూత్ స్థాయిలో మరింత ఎక్కువగా కార్యకర్తలు ప్రచారం చేయాలని అన్నారు. సుమారు 7 లక్షల గ్రామాల్లో బూత్‌స్థాయిలో బీజేపీ కార్యకర్తలు.. కేంద్ర ప్రభుత్వ విధానాల వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని అన్నారు. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయటం కోసం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 51 శాతం ఓట్లను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్థానాల్లో భారీ మేజార్టీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: కులమతాల చిచ్చు పెడుతున్నారు -
TS Election 2023: ఉద్యోగులూ.. జాగ్రత్త! ప్రచారానికి పోతే సస్పెన్షన్ వేటే!
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయొద్దని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం పోస్టులపైనా ఓ కన్నేశారు. సభలు.. సమావేశాలు వద్దు.. ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకుని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు ఎన్నికల అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. నిరంతర నిఘా ఉంటున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలకు హాజరుకాకపోవడమే ఉత్తమం. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే అంగన్వాడీలపై వేటు వేశారు. అప్పట్లో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని కోరుతున్నారు. సెల్ఫోన్లతో కష్టాలు.. స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది. ఉద్యోగులు ఎటువైపు? ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలముంటే, మరికొన్ని ప్రతికూలమంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో వారి తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్ విధానంపై ఉద్యోగులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ► ‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించాడని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరుపగా నిజమేనని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.’ ► ‘2018 ఎన్నికల్లోనే చొప్పదండి మండలంలోని ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆయనను సస్పెండ్ చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారు.’ -
చాయ్ వాలాగా మారిన సీఎం మమతా.. ఇదంతా అందుకోసమే!
కోల్‌కతా: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతుంటారు. ఇందుకోసం లీడర్లు చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. రానున్న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క ఉన్న ఓ హోటల్లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న వారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం మమతా ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్ నుండి జూలై 8 పంచాయతీ ఎన్నికల కోసం.. పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. కాషాయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్ఎప్ భయపెడుతోందని, ఈ క్రమంలో వారి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. వారి బెదిరిపులకు భయపడకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొనాలని ఆమె ప్రజలను పిలుపునిచ్చారు. మూడంచెల గ్రామీణ ఎన్నికలలో తృణమూల్ బీజేపీని ఓడిస్తుందని మమతా నొక్కి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి, దేశంలో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. జూలై 8న ఒకే దశలో ఎన్నికలు జరుగనుండగా, జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri's Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET — ANI (@ANI) June 26, 2023 చదవండి: 'సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం' ప్రముఖ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. -
‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం శ్రీకారం చుట్టారు. జబల్పూర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో గత 220 నెలల్లో 225 కుంభకోణాలు జరిగాయని.. అది బీజేపి ఘనతని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ప్రతి నెలా ఒక కొత్త కుంభకోణం చోటుచేసుకుంటోందని దుయ్యబట్టారు. వ్యాపమ్, రేషన్ సరుకుల పంపిణీ, మైనింగ్, ఈ–టెండర్ వంటి వ్యవహారాలను ఆమె ప్రస్తావించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని, 100 యూనిట్ల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామని, వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని చెప్పారు. చదవండి: Jharkhand: రూ.10 అడిగితే ప్రాణం తీశాడు -
బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక పదవుల భర్తీపై బీజేపీ కసరత్తు ఓ కొలిక్కి వచి్చనట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు ఈ విషయమై చర్చలు జరిపారు. అత్యంత కీలకమైన పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలను సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కట్టబెట్టాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని ఢిల్లీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఈటలకున్న గుర్తింపు, రాజకీయ అనుభవం, కుల సమీకరణల ఆధారంగా..ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తేనే అధికార బీఆర్ఎస్ను ఎదుర్కోగల మని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతు న్నారు. ఈటలకు కీలక బాధ్యతలు ఇస్తే బీఆర్ఎస్ నుంచి మరింత మంది అసంతృప్త నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయ ని అంచనా వేస్తున్నట్టు సమాచారం. నిజానికి తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఈటల కోరుతున్నప్పటికీ, వివిధ సమీకరణలు, పార్టీలో కొంతమంది నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే ఈటలకు పెద్దలు సమాచారమిచ్చారని, దీనికి ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటలను శుక్రవారం ఢిల్లీకి పిలిపించారని ప్రచారం జరిగినా, ఆయన గౌహతి వెళ్లినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడి మార్పుపై ఎడతెగని చర్చలు.. అత్యంత కీలకమైన పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పుపైనా బీజేపీ పెద్దలు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. బండి సంజయ్‌నే కొనసాగించాలని పారీ్టలోని ఓ వర్గం కోరుతుంటే.. ఎన్నికలను, అధికార బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కోవాలంటే మార్చడమే ఉత్తమమని మరికొంతమంది నేతలు చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ సంజయ్‌ను పక్కన పెడితే ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపైనా బీజేపీ జాతీయ నాయకత్వం సమాలోచన చేస్తోంది. ఈ క్రమంలో మొన్నటివరకు ఈటల పేరును పరిశీలించినా, చివరకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ముందుకు వచ్చినట్లు సమాచారం. వివాదాలకు దూరంగా ఉండటం, అందరినీ కలుపుకొనే తత్వం, పార్టీ అప్పగించే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడం, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఇన్చార్జిల నుంచి అభిప్రాయ సేకరణ జరిపినట్లు చెబుతున్నారు. అన్నీ ఓకే అయితే అధ్యక్షుడి మార్పుపై సైతం రెండు, మూడ్రోజుల్లోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సముచిత గౌరవం కలి్పంచవచ్చని తెలుస్తోంది. చదవండి: ‘బీ’టెక్ బేరం షురూ! -
సాక్షి కార్టూన్ 08-02-2022
చాలా సభలు కవర్ చేయాలట! -
ఎన్నికల చిత్రాలు.. ఓటు కోసం పడరాని పాట్లు.. మహిళ కాళ్లుకు..
భువనేశ్వర్/జాజ్‌పూర్: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు తారసపడుతుంటాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన మహిళా అభ్యర్థులు వినయ విధేయతలు మరింత ఎక్కువగా ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జాజ్‌పూర్ జిల్లా, జాజ్‌పూర్ సమితి, ఎరబంగా పంచాయతీలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సమితి సర్పంచ్ అభ్యర్థి రేఖా మల్లిక్, సమితి సభ్యురాలిగా పోటీ చేస్తున్న సస్మతి శెట్టి పంచాయతీ బహుముఖాభివృద్ధికి హామీ ఇస్తూ తమకు ఓటు వేసి, గెలిపించాలని ఇలా పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఓటుకో పాదాభివందనం లెక్కన పంచాయతీ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఇలా తలమునకలయ్యారు. -
కోవిడ్-19: ఎన్నికల రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలను పొడిగించిన ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 నేపథ్యంలో ప్రచారం, సభలపై విధించిన నిషేధాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) జనవరి 31 దాకా పొడిగించింది. అయితే తొలి రెండు దశల్లో ఎన్నికలు జరిగే 114 నియోజకవర్గాల్లో (ఫిబ్రవరి 10న తొలిదశలో 55, 20న మలిదశలో 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి) గరిష్టంగా 500 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించవచ్చని తెలిపింది. అలాగే ఈ నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారంపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఇంటింటికీ ఇకపై 10 మంది వెళ్లి ప్రచారం నిర్వహించుకోవచ్చు. ముందుగానే ఖరారు చేసిన బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ వీడియో వ్యాన్ల ద్వారా ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపింది. -
వ్యాక్సిన్‌పై అపోహలోద్దు..
సాక్షి,భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని జలవాయు విహార్ కమ్యూనిటీ హాల్లో వందశాతం పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన అసోసియేషన్ సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ వేయించుకోవడంతో కరోనా కట్టడి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నోడల్ ఆఫీసర్ శ్రీరాములు, టాక్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, పోతుల రాజేందర్, అశోక్ కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. జనతానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. మూసాపేట: మూసాపేట డివిజన్ జనతానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మంగళవారం మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై అపోహలను వీడి బాధ్యతగా టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గోపాల్, తుకారాం, విష్ణు, ఇనుగంటి రాజు, రమేష్ పాల్గొన్నారు. రామకృష్ణ వీధిలో.. ఆల్విన్‌కాలనీ: వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ వీధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వడం సంతోషకరమైన విషయమని కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఏఎంసీ నరేందర్‌రెడ్డి, టీఐ సత్యరాజుతో కలిసి సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు చైతన్యంతో ముందుకొచ్చి టీకా వేయించుకోవాలన్నారు. రామకృష్ణ వీధిలో వంద శాతం పూర్తికి సహకరించిన పురేందర్ రెడ్డి, కాలనీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, వెంకటేశ్వరరావు, ఆనంద్‌రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ -
ఆ హీరోలతో మాట్లాడబోతున్న: అనన్య పాండే
మనలో చాలా మంది సోషల్ మీడియాని వాడుతుంటాం గానీ నెగిటివ్‌గా చూస్తున్నాం, అందులోనూ పాజిటివ్ ఉందంటోంది బాలీవుడ్ మద్దు గుమ్మ అనన్య పాండే. ఈ అమ్మడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో కొందరు మానవత్వంతో పలువురికి సహాయం చేయడం సోషల్ మీడియాలో చూశాను. ఎటువంటి పరిచయం లేని వాళ్లకు నిస్వార్థంగా సహాయం చేయడం, సమాచారం పంచుకోవడం లాంటివే గాక ఎంతోమంది ప్రాణాలను కూడా మనం దీని కారణంగానే కాపాడుకోగలిగామని తెలుపుతూ ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేసింది. ఇటీవల పలువురు సోషల్ మీడియాని ద్వారా స్వచ్చందంగా చేసిన పనులు చూసి నాకు దానిపై మరింత నమ్మకాన్ని పెరిగేలా చేశాయి. ఈ కారణంగానే ప్రస్తుతం ‘సోషల్ మీడియా ఫర్ సోషల్ గుడ్’ అనే ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా నేను కొంతమంది సోషల్ మీడియా హీరోలతో మాట్లాడబోతున్నాను’’ అంటూ తెలిపింది. కాగా.. అనన్య వస్త్రధారణ విషయంలో గతంలో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం గమనార్హం. దానిపై స్పందించిన ఆమె తాను ఏ దుస్తులు ధరించినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చింది. తెలుగులోనూ సందడి చేసేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయం కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) చదవండి: వెరైటీ లుక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్ -
పిచ్చి పీక్స్.. వీధి కుక్కలకి ప్రచార పోస్టర్లు..
లక్నో: రాజకీయ నాయకులు గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారని తెలుసు. కానీ, ఇప్పుడు ప్రచారానికి దేన్నైనా వాడేస్తారని నిరూపించారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజకీయనేతలు. వారు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మూగజీవాలను కూడా వాడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు వింత పోకడలకి పోయారు. అక్కడి వీధి కుక్కలకి తమ ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని ఆ పోస్టర్లపై కోరారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు వారిపై ఫైర్ అయ్యారు. జంతు కార్యకర్త అయిన రీనా మిశ్రా మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో ఇలాంటి స్టిక్కర్లు మనుషుల ముఖం మీద అంటించుకోమంటే ఎవరైనా అలా చేస్తారా?.. నోరు లేని జీవాలను ఈ విధంగా వాడుకోవడం సరికాదని’ మండిపడ్డారు. తక్షణమే పోలీసులు స్పందించి పోస్టర్లు అంటించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలను అభ్యర్థులు తోసిపుచ్చుతున్నారు. ప్రచారంలో జంతువులను ఉపయోగించరాదనే ఎటువంటి నియమం లేదు. అయినా మేము జంతువులకు ఏ విధంగానూ హాని చేయటం లేదు. వాటికి ఆహారం పెట్టి, పోస్టర్లను అంటిస్తున్నాం. ఇందులో తప్పేముందని, తమ పనిని వారు సమర్థించుకుంటున్నారు. ( చదవండి: మద్యాన్ని జుర్రుకున్న కోతులు! ) -
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇక ఈ నెల 17న ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ బరిలో 93 మంది అభ్యర్థులు కాగా ఓటర్లు 5,31,268 మంది ఉన్నారు. ఇక మూడు జిల్లాలకు కలిపి మొత్తం పోలింగ్ కేంద్రాలు 799 ఏర్పాటు చేశారు. ఇక నల్లగొండ-వరంగల్-ఖమ్మం బరిలో 71 మంది అభ్యర్థులు కాగా, ఓటర్ల సంఖ్య 5,05,565 గా ఉంది. 731 పోలీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఏ బాక్సులో...ఏముందో
గ్రేటర్ వార్ ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్ మొదలైంది. ఓటింగ్ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో... అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జిల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు. ఎప్పటిలాగా కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపుమీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్చార్జిలు ఉన్నారు. ఓటర్ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. అభివృద్ధి మీద కాకుండా... మతం, దేశం పేరిట భావోద్వేగాలతో పార్టీలు ప్రచారం ముగించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరికి దెబ్బపడుతుందనేది... ఈనెల 4న బాక్సులు తెరిచి ఓట్లు లెక్కిస్తే తేలనుంది. అప్పటిదాకా వేచిచూడాల్సిందే. –సాక్షి, హైదరాబాద్ సమయమే లేదు... ప్రచారానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే చిక్కింది. పెద్దగా సమయం లభించలేదు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకొని పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగేసరికి ప్రచారం గడువు ముగిసింది. ప్రతీ ఓటర్ను కలిసి ఓటు అడిగే సమయం దొరకలేదని అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యతను అప్పగించింది. గ్రేటర్ ప్రచారబాధ్యత తీసుకున్న కేటీఆర్ అన్నీ తానై రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సంఘాలతో, వాణిజ్యవర్గాలతో భేటీ అయ్యారు. చివర్లో... నవంబర్ 28న జరిగిన సీఎం సభ టీఆర్ఎస్లో జోష్ నింపిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా ముఖ్యులకు డివిజన్ల బాధ్యతలు అప్పగించినా... ఎక్కువగా స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంపైనే ఆధారపడింది. అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారానికి ఊపు తెచ్చారు. అయితే పార్టీని చివర్లో ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లలేకపోయారనే భావన నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారం నిర్వహించినా... ఎంఐఎం ప్రధానంగా ఎమ్మెల్యేలపై భారం మోపింది. పాతబస్తీలో పట్టు నిలుపుకునేందుకు శ్రమించింది. వరదల కారణంగా బస్తీల్లో కొంత వ్యతిరేకత వచ్చినా... అది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించదనే భావనలో మజ్లిస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇళ్లు సర్దుకొని రంగంలోకి దిగేసరికి ప్రచారం ముగింపుకొచ్చింది. పెద్ద నాయకులు విస్తృతంగా తిరగకపోవడం, పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్‌కు ప్రతికూలమని చెప్పొచ్చు. ఎంతచేసినా... ఓటింగ్ పెరగలేదు ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్చార్జీల్లో గుబులు మొదలైంది. గ్రేటర్ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్ ఓటింగ్‌లో లేకపోవడం... వీరికి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా... ఓటింగ్ శాతాన్ని పెంచలేకపోయామని మధనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే... తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోటీ ముఖ్యంగా టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో టీఆర్ఎస్ మేయర్ రేసులో ముందుంటుందని భావిస్తున్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా
సాక్షి, హైదరాబాద్: చలికాలంలోనూ మహానగరం రాజకీయ నాయకుల మాటల దాడులు, ప్రతిదాడులతో వేడెక్కుతోంది. గతానికి భిన్నంగా నగర ఓటర్లలో చీలిక తెచ్చే యత్నాలతో ప్రధాన పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి అధికార టీఆర్ఎస్పై తనదైన శైలిలో దాడి చేస్తున్న బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్‌తో పెద్ద దుమారానికి తెర లేపింది, రాజకీయ అలజడిని సృష్టించింది. దీన్ని అధికార పార్టీ అస్త్రంగా మలుచుకుని రివర్స్ అటాక్‌కు దిగింది. కాంగ్రెస్ సైతం తానేం తక్కువ కాదని దూకుడు పెంచింది. మరోవైపు ఎంఐఎం సవాల్‌తో గొంతెత్తింది. కౌంటర్లు.. అటాక్‌లతో.. భాగ్యనగరం రంగస్థలమైంది. మాటల రణక్షేత్రంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంత స్పీడ్‌తో దూసుకుపోతున్న టీఆర్ఎస్ బీజేపీపైనే ప్రధాన విమర్శలు ఎక్కుపెడుతోంది. గడచిన ఆరేళ్లలో కర్ఫ్యూ లేని నగరంగా.. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి నగరంగా హైదరాబాద్ ముందుకు వెళుతోందని, మరో ఐదేళ్లు అధికారం ఇస్తే నగర ప్రగతికి హద్దులువండవని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి పగ్గాలు అప్పగిస్తే అభివృద్ధి స్థానంలో అరాచకం, విధ్వంసం వస్తాయని.. నగర ప్రజలు అభివృద్ధి వైపా? అరాచకం వైపా? తేల్చే సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చు పెడతారా?: టీఆర్ఎస్ ⇔ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాల్నా? రోజూ తెల్లారి లేస్తే పంచాయితీ పెట్టుకునే హైదరాబాద్ కావాల్నా? అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా? ⇔ గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీ నుంచి దిగుతున్నారు. టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీ పెద్దలకు భయమేస్తోంది. ముషీరాబాద్‌లో బీజేపీ, ఎంఐఎంలను కలిపి కొట్టాలి. ⇔ హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? కొన్ని సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం టీఆర్ఎస్.. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? కొన్ని సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం ఉంటే పేదరికంపై, మత విద్వేషాలపై, నిరుద్యోగ సమస్యపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి. కమలం పార్టీ.. బీజేపీని గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. పాతబస్తీలోని పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, బచ్చాగాళ్లు, బఫూన్ గాళ్లు ఓట్లు వేస్తున్నారు. వారిని రిమికొడతాం. హిందూస్థాన్ భాగ్యనగరం కావాలా? పాకిస్థాన్ భాగ్యనగర్ కావాలా? దేశభక్తి పార్టీ బీజేపీ కావాలా? దేశద్రోహి పార్టీలైన టీఆర్ఎస్, ఎంఐఎం కావాలా? కాంగ్రెస్.. టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో చిత్తు కాగితంలాంటిది. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. 100 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు వస్తే.. బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని టీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్లా మేశారు. టీఆర్ఎస్, బీజేపీలది తెరచాటు దోస్తానా. ఎంఐఎం.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ కాదు.. కమలనాథులు దమ్ముంటే భారత్సరిహద్దులో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి. టీఆర్ఎస్తో దోస్తీ లేదు ఇక ఫైటే. కేటీఆర్ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాకు కుర్చీలో కూర్చోబెట్టడం తెలుసు.. పడేయడమూ తెలుసు. -
ఎన్నికల ప్రచారాన్ని పరుగెత్తించేది వీరే!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. వివిధ పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు దుమ్ము లేపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను వివిధ పార్టీలు సమర్పించాయి. కేసీఆర్, కేటీఆర్‌ల నేతృత్వంలో గులాబీ దళం... అధికార టీఆర్ఎస్ నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహ్మద్ మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీకి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి జాబితా సమర్పించారు. కాంగ్రెస్ నుంచి ఎవరంటే... కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రేవంత్‌రెడ్డి (ఎంపీ), పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, జెట్టి కుసుమకుమార్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజన్‌కుమార్ యాదవ్ ప్రచారం చేస్తారు. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించి ఎస్ఈసీకి ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ లేఖ సమర్పించారు. కమలదళం విషయానికొస్తే.. బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం. రఘునందన్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు బీజేపీ జాబితా సమర్పించింది. -
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఎంఐఎంతో మరోసారి జట్టుకట్టిన గులాబీ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ప్రచార పర్వంలో దూసుకుపోయేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. రేపు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లో, ఎల్లుండి మహేశ్వరం, ఎల్బీనగర్లో ప్రచారం చేయనున్నారు. (చదవండి: గ్రేటర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!) అదే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్స్‌గా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మొహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌లు) -
20 రోజులు..13 జిల్లాల్లో..68 సభలు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఆయన 13 జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో పర్యటించి వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. గత నెల 17వ తేదీన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి, ఇడుపులపాయ వద్ద సంచలన రీతిలో ఒకేసారి 175 మంది అసెంబ్లీ, 25 మంది లోక్‌సభ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ రోజు నుంచే ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టారు. 20 రోజులపాటు ఆయన 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ప్రచారగడువు చివరి రోజైన ఈ నెల 9వ తేదీన ఆయన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ముగించారు. ఆయన మంగళవారం వరకూ మొత్తం 68 సభల్లో ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాల్లో కర్నూలు - 6, వైఎస్సార్ కడప- 5, చిత్తూరు - 5, నెల్లూరు - 3, ప్రకాశం- 5, గుంటూరు- 8, కృష్ణా- 6, పశ్చిమగోదావరి- 6, తూర్పుగోదావరి- 7, విశాఖపట్టణం- 6, విజయనగరం- 3, శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. -
లోకేశ్ కోపం కట్టలు తెంచుకోవడంతో..
తాడేపల్లి రూరల్: టీడీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ తనను ప్రశ్నించిన ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లి సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన లోకేశ్‌కు పోలకంపాడు, ఉండవల్లి దళితవాడ కరకట్ట వద్దకు వెళ్లే సరికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు అధికారం చేపడితే రాజధాని పేరుతో మా ఇళ్లు తొలగిస్తారని చెబుతున్నారు, నిజమా కాదా అంటూ’ మహిళలు నిలదీశారు. స్పందించిన లోకేశ్ మేం అక్కడ పట్టాలిచ్చాం, ఇక్కడ పట్టాలిచ్చాం అని చెబుతుండగా.. మీరున్న ఊళ్లో ఎందుకివ్వలేదంటూ మహిళలు ప్రశ్నించారు. అంతలో నాగేశ్వరరావు అనే చిరు వ్యాపారి ‘మీరు గెలిస్తే ఇళ్లు తీయరని గ్యారెంటీ ఏంటని’ అడిగారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో తాను ఎమ్మెల్యే అయితే ఒక్క ఇటుక కూడా కదిలియ్యనని లోకేశ్ అనడంతో, ఐదేళ్ల తర్వాత తీస్తారా అని అక్కడున్న వారు ప్రశ్నించారు. ఇది తట్టుకోలేని లోకేశ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ‘నేను చెప్పింది మీరు వినండి.. మీరు చెప్పేది నేను వినేదేంటి.. అర్థం చేసుకోరా అంటూ’ ఊగిపోయారు. దాంతో అక్కడున్న ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం గమనించిన టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న నాగేశ్వరరావుతో పాటు, మరికొంత మందిని పక్కకు నెట్టివేశారు. -
ఉదయగిరిని వరదలతో ముంచెత్తుతా: చంద్రబాబు
సాక్షి, నెల్లూరు: ‘కరువు కోరల్లో ఉన్న ఉదయగిరి ప్రాంతానికి నీరు తెప్పించి వరదలతో ముంచెత్తుతా’ అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేయడంపై ఈ ప్రాంత ప్రజలు అవాక్కవుతున్నారు. ఒక వైపు గుక్కెడు నీరు దొరక్క నానా కష్టాలు పడుతున్న మెట్ట వాసులకు ఐదేళ్ల పాటు నీరివ్వలేని చంద్రబాబు రెండో సారి సీఎంను చేస్తే నీరు వరదలా పారిస్తానంటూ కథలు చెప్పడంపై సభకు వచ్చిన వారు విస్తుపోయారు. జిల్లాలో బుధవారం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఆకట్టుకోలేక పోయింది. క్యాడర్లో ఉత్సాహం నింపలేకపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన పర్యటన రెండు గంటల ఆలస్యంగా జరగడంతో సభకు హాజరైన ప్రజలు చంద్రబాబు ప్రసంగానికి ముందుగానే సభాస్థలి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఆత్మకూరులో చంద్రబాబు ప్రసంగం చప్పగా సాగింది. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావు, అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య సభావేదికపై నిద్రపోవడం కనిపించింది. ఓటర్లను ఆకట్టుకునేలా అధినేత ప్రసంగం సాగకపోవడంతో టీడీపీ నేతలు నిరుత్సాహంగా కనిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు జనసమీకరణ కోసం ఆ పార్టీ అభ్యర్థులు భారీగానే ఖర్చు చేశారు. ఒక్కో మహిళకు రూ.500 వంతున నగదు ఇచ్చి సమావేశానికి తరలించారు. పురుషులకు నగదుతో పాటు మద్యం బాటిల్ కూడా సమకూర్చి సభకు తరలించారు. పాత హామీలే కొత్తగా.. గతంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు ఐదేళ్లలో అమలు చేయలేకపోయారు. దుత్తలూరులో బుధవారం జరిగిన సభలో అవే హామీలను తిరిగి వినిపించారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను మూడేళ్లలో పూర్తిచేస్తానని చంద్రబాబు 2016 జూన్ 3వ తేదీన కనిగిరి మండలంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. మరో ఐదేళ్లల్లో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేస్తానని చెప్పడం గమనార్హం. గత ఎన్నికల ప్రచారంలో ఉదయగిరిని పర్యాటక పరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన సంగతి మరిచి మరో అవకాశమిస్తే పర్యాటక పరంగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పడం విశేషం. స్పందన కరువు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత మహిళలు సభావేదిక నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఉపన్యాసం ముగింపు సమయానికి దాదాపు సగం మంది మహిళలు బయటకు వెళ్లిపోయారు. ఎక్కువ మంది ఉపాధి కూలీలు, డ్వాక్రా సంఘాల మహిళలకు కొంత నగదు ఇచ్చి సమావేశానికి తరలించారు. ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ మీ స్పందన తెలపాలని చంద్రబాబు పదే పదే సభికులను కోరినప్పటికీ పెద్దగా వారి నుంచి స్పందన రాలేదు. దీంతో చంద్రబాబు కొంత అసహనానికి గురయ్యారు. మొత్తమ్మీద సీఎం సభ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అటు పార్టీ నేతల్లోను, ఇటు కేడర్‌లోనూ కొంత నిరాశ, నిస్పృహలు కనిపించాయి. -
సిగరెట్ కాల్చడం మానేయండి: కమల్
చెన్నై, పెరంబూరు: మాది బీ టీమా? అని మండిపడ్డారు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్. అసలు సంగతేమిటంటే ఈయన పార్టీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు, రాష్ట్రంలో జరగనున్న 18 శాసనసభ ఉప ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పనిలో పనిగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను ఏకి పారేస్తున్నారు. దీంతో ఆ డ్రావిడ పార్టీలు కమలహాసన్ పార్టీపైనా ఎదురు దాడికి సిద్ధం అయ్యారు. కమలహాసన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కమలహాసన్ మండిపడ్డారు. ఈయన మీడియాకిచ్చిన భేటీలో తన పార్టీని బీ టీమ్ అంటున్న ఇదే కూటములు ఢిల్లీలో ఏ ప్రధాని త్రాసు బరువు తగ్గుతుందో అ పక్కకు గుర్రాన్ని అమ్మబోతారు చూడండి అని అన్నారు. ప్రధానమంత్రి పదవికి ఇతరుల అవసరం ఏర్పడితే వీళ్లు గుర్రం బేరానికి పాల్పడతారని అన్నారు. స్థానిక అన్నాశాలలోని బ్రిడ్జి సమీపంలో గుర్రాన్ని పట్టుకుని ఒక శిల ఉంటుంది. అదే డీఎంకే అని అన్నారు. చేరకూడని వంచకుల కూటమిలో తన కమ్యునిస్ట్ సోదరులు చేరారని అన్నారు. రాజకీయాలు ఇలా ఉండకూడదన్న భావంతోనే తాను వచ్చానని అన్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ మంచి చేస్తే దాన్ని తుడిచేయడానికి మరో పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మంచి పథకాలను అమలు పరచనీయని సంస్కృతి మారాలన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలు మారతాయన్న నమ్మకమే పోయిందని అన్నారు. ఇక ఆ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. తాము ఇంకో వందేళ్లు ఉంటామని వారు చెప్పుకోవచ్చునని, వారు మరో నూరేళ్లు ఉండరాదన్నదే తమ ప్రయత్నం అని కమలహాసన్ అన్నారు. వైదొలుగుతున్న నిర్వాహకులు ఇదిలాఉండగా మక్కళ్ నీది మయ్యం పార్టీ నుంచి నిర్వాహకుల తొలగింపులు, వైదొలగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కమలహాసన్ ఒక పక్క ఓట్లను రాబట్టుకునే కార్యక్రమలను చేస్తుంటే అసంతృప్తులు దూరం కావడం పార్టీని ఇబ్బంది పెట్టే చర్యే అవుతుంది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ముఖ్య నిర్వాహకులిద్దరు తాజాగా మక్కళ్ నీది మయ్యం పార్టీని వీడారు. ఆ మధ్య తిరునెల్వేలి జిల్లా పార్టీ నిర్వాహకుడు సెంథిల్‌కుమార్, జిల్లా పశ్చిమ నిర్వాహకుడు కరుణాకరరాజా కమల్ పార్టీ నుంచి వైదొలిగారు. వారు మంగళవారం పార్టీని వీడుతున్నట్లు లేఖ రాసిన కొద్ది సేపటికే వారిని తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. దీనంతటికీ కారణం నెల్లై పార్లమెంట్ స్థానానికి మక్కళ్ నీది మయ్యం తరఫున వెన్నిమలై అనే అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆయన చెన్నైలో వ్యాపారస్తుడు. నెల్లైలో ఈయనకు ఎవరితోనూ సంబంధాలు లేవట. అదే విధంగా అక్కడి నిర్వాహకులతో సంప్రదించకుండా వారిని కలుపుకుపోకుండా, చెన్నై నుంచి కొందరిని వెంటేసుకుని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ అసంతృప్తే సెంథిల్‌కుమార్, కరుణాకరరాజులు వైదొలగడానికి ప్రధాన కారణం. పొగ తాగడం మానేయండి రాష్ట్ర పొగ నియంత్రణ కమిటీ అధికారులు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఆ కమిటీ అధికారి సిరిల్ అలెగ్జెండర్ పేర్కొంటూ తమ కమిటీ సభ్యులు పొగ నియంత్రణలో తీవ్రంగా పని చేస్తున్నారన్నారు. ఇటీవల పాండిచ్చేరిలో కమల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను నిర్వహించారన్నారు. ఆ సమయంలో వేదిక వెనుక భాగాన ఒక స్త్రీ సిగరెట్ కాల్చడం తమ అధికారుల కంట పడిందన్నారు. అంతేగాకుండా మీ పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు పలువురు పొగ తాగుతున్న దృశ్యాల వీడియో తమకు అందిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతం పొగ తాగే జోన్ కాదని, అది జనసంచారం ఉండే ప్రాతం అని వివరించారు. మీరు సినిమాల్లో పొగ తాగే సన్నివేశాలను ఎలా నిషేధించేవారో, అదే విధంగా ప్రస్తుత ప్రచారాల్లోనూ మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు పొగ తాగడాన్ని కట్టడి చేయాలని కోరారు. ఇక ఇంతకుముందు పొగ తాగిన వారిపై ఎలాంటి చర్చలు తీసుకున్నారో వివరణను తమ కమిటీకి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
డాన్స్‌తో ఎన్నికల ప్రచారం
తిరువళ్లూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు పూందమల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పూందమల్లి నియోజకవర్గంలోని వదట్టూరు కోయంబాక్కం ఎగువకొండయూర్ ఆరియలూరుతో పాటు పది గ్రామాల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా పూందమల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి పూందమల్లి పట్టణంలోనూ, ఏఎంఎంకే అభ్యర్థి ఏలుమలై ఎల్లాపురం యూనియన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ గుమ్మిడిపూండిలోనూ, కాంగ్రెస్ అభ్యర్థి జయకుమార్ తిరువేళాంగాడు యూనియన్లోనూ, ఏఎంఎంకే అభ్యర్థి పొన్‌రాజా పొన్నేరిలోనూ ప్రచారం నిర్వహించారు. ఇదిలాఉండగా గ్రామీణ ఓటర్లును ఆకట్టుకోవడానికి ఎంజీఆర్‌తో పాటు ఇతర వేషధారణలో కళాకారులతో నృత్యాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
బాలయ్య... నరుకుతా.. చంపుతా.. బాంబులేస్తా
ఆయనకు తిక్కుంది. దానికి లెక్కలేదు. ఎప్పుడు ఎవరిపైన చేయి చేసుకుంటారో.. ఎక్కడ ఎవరిని తిడతారో ఆయనకే తెలియదు. ఎంతో ప్రేమతో దండ తీసుకొచ్చిన అభిమానులు కూడా.. ఆయన మెడలో వేసేందుకు ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి. ప్రేమతో పలకరిద్దామన్నా.. పళ్లు ఊడగొడతాడేమోననే భయం. సమస్యను చెప్పుకుందామన్నా.. బూతులు తిడతాడనే ఆందోళన. విగ్గుపైన చూపే శ్రద్ధ.. నియోజకవర్గ ప్రజలపై లేకుండా పోతోంది. మొన్న అభిమాని.. నిన్న ఛానల్ రిపోర్టర్.. తాజాగా పార్టీ కార్యకర్త.. రేపు ఎవరో..? బాలయ్య చేస్తున్న గోల హిందూపురం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. హిందూపురం: ఎన్టీఆర్‌ను గెలిపించిన హిందూపురం.. టీడీపీకి కంచుకోట.. ఇదంతా నిన్నటి మాట. బాలయ్య బాధితుల సంఖ్య పెరిగిపోతుండటం, అభివృద్ధికి ఆమడ దూరం. సమస్యలు చెప్పుకునేందుకు కూడా భయపడే జనం ఇదీ నేటి పరిస్థితి. ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చే బాలయ్య ఎన్నికల వేళ హిందూపురంలో తిష్టవేశాడు. ప్రచారం హోరెత్తించాలనుకున్నాడు. కానీ జన స్పందన లేక ఉసూరుమంటున్నాడు. ఇంత ఎండలో నేనే వచ్చినా...సినిమా డైలాగ్ చెప్పినా జనం రాకపోవడమేమిటంటూ లోలోన రగిపోతున్నాడు..అందుకే ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే చాచి కొట్టేస్తున్నాడు. అంతా సినిమా టైపు రాజకీయం బాలకృష్ణ సినిమా తరహాలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఫుల్‌టైం సినిమాలకే పరిమితం మవుతూ..చుట్టపుచూపుగా హిందూపురం వచ్చి వెళ్తున్నారు. ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. అందుకే హిందూపురం నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. సినిమా హీరోగా తనవృత్తికి న్యాయం చేసినట్లు ప్రజాసేవకుడిగా రాణించలేక పోయాడని పురం ప్రజలు విమర్శిస్తున్నారు. బాలయ్యకు విగ్ కష్టాలు బాలకృష్ణ మరో రెండేళ్లలో షష్టిపూర్తి చేసుకోనున్నారు. కానీ సినిమా హీరో...ఆ ఇమేజ్ మ్యానేజ్ చేసేందుకు నిత్యం విగ్గులోనే కనిపిస్తారు. తనదగ్గరికి ఎవరైనా వచ్చినా..పూలమాల వేసేందుకు గుంపులుగా జనం వచ్చినా విగ్గు జారిపోతుందని భయపడుతుంటారు. అందుకే అనుమతిలేనిదే ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరైనా దగ్గరగా వచ్చినా తాకకూడదు..కాదు కూడదని తాకితే తనదైన శైలిలో వారికి బహుమానం ఇస్తారు. ఎవరైనా సరే సినిమాలో హీరోలా అలా దూరం చేసి నమస్కారం పెట్టి పోవాలి. అదీ బాలయ్య స్టైల్. కానీ జనం ఇవేవీ తెలియక మా ఎమ్మెల్యే నంటూ దగ్గరకు వెళ్లి ఆయన హస్తముద్ర వేయించుకుంటుంటారు. ఐదేళ్లలో 20 సార్లులోపే హిందూపురం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ...ఈ ఐదేళ్ల కాలంలో 20సార్లులోపే నియోజకవర్గంలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా రెండు లేదా మూడు రోజుల రూట్‌మ్యాప్‌తో మూడు మండలాల్లో వివిధ పనుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలు, రోడ్డుషోలతో సరిపెట్టెశారు. ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఓ ఇంటిలో గృహప్రవేశం చేసి తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించారు. ఆయన భార్య వసుంధర కూడా గత ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించి మాయమయ్యారు. మళ్లీ ఇపుడు ప్రచారం కోసం హిందూపురం వచ్చారు. ఈ మధ్యలో బాలయ్య పీఏలే పాలన సాగించారు. టీడీపీ సీనియర్లను పక్కనపెట్టి అందిన కాడికి దోచుకున్నారు. దీంతో కొందరు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేశారు. దీంతో వ్యవహార శైలి మార్చుకోవాల్సిన బాలకృష్ణ...పీఏను మార్చేసి తన సినిమా లోకంలోకి వెళ్లిపోయారు. ఇలా ముగ్గురు పీఏలను మార్చినా...వారంతా తమ స్వార్థమే చూసుకున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయింది. ప్రజలకు తమ ఎమ్మెల్యేను కలిసే భాగ్యమే లేకపోయింది. అప్పుడెప్పుడో 2016లో ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిన సమస్యల అర్జీలు స్వీకరించారు. ఏటా ఇలాగే నిర్వహిస్తామని ప్రకటించి అంతటితో సరిపెట్టారు. అర్జీలకు అతీగతీ లేకుండా పోయింది. దీంతో జనమే కాదు...టీడీపీ నేతలే బాలయ్యపై గుర్రుగా ఉన్నారు. అంతర్మథనంలో బాలకృష్ణ భారీ సినిమా డైలాగ్‌లు చెబుతున్నా...జనం నుంచి స్పందన లేదు. రోజుకో ముఖ్య నేత పార్టీ వీడుతున్నారు. దీంతో బాలకృçష్ణకు ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సత్తా చాటేందుకు బాలయ్య నామినేషన్ సందర్భంగాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. పెనుగొండ, మడకశిర ప్రాంతాల నుంచి డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చి పరువు కాపాడుకోడానికి నానా తంటాలు పడ్డారు. అయితే అదే రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ నామినేషన్‌కు అంతకు రెట్టింపులో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో కంగుతిన్నారు. ఇక ఓటమి తప్పదనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ చివరి ప్రయత్నంగా గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడం, పట్టణ రహదారుల్లో హడావుడిగా మరమ్మత్తులు, రంగులు వేయించడం, గ్రామాల్లో బోర్లు వేయించడం వంటివి చేస్తూ ఓటర్లను ప్రలోభాపెట్టేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. పెరిగిన వలసలు బాలకృష్ణ వ్యవహారశైలితో టీడీపీ బలంగా ఉన్న మండలాలైన లేపాక్షి, చిలమత్తూరుల్లో కూడా వలసలు పెరిగాయి. కీలమైన నేతలంతా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. దీంతో నేరుగా రంగంలో దిగిన బాలకృష్ణ నేతలను బతిమాలి పార్టీలో నిలిచేటట్లు ప్రయత్నిస్తున్నారు. అయినా చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచి ఇప్పటికే బలమైన బీసీ, మైనార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో ఈ రెండు మండలాల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ వైపు దూసుకుపోతోంది. బాలకృష్ణ ఐదేళ్లు బాగా పనిచేసి ఉంటే ఇంత కష్టపడాల్సిన పని ఉండేదికాదని ప్రజలే చర్చించుకుంటున్నారు. -
సారొస్తున్నారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ పరిధుల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించను న్నారు. సారు.. కారు.. పదహారు నినాదం తో లోక్‌సభ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతోన్న గులాబీ పార్టీ ఆ మేరకు వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే క్రమం లో రాష్ట్రంలో పదహారు లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు గులాబీ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంట్ స్థానాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలోని వనపర్తి జిల్లాకేంద్రానికి సమీపంలో నాగవరంలో.. మహబూబ్‌నగర్ లోక్‌సభకు సంబంధించి భూత్పూర్లో జరగనున్న సభలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి లక్ష మంది చొప్పున జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో జనాన్ని భారీగా సమీకరించారు. సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 4గంటల ప్రాంతంలో వనపర్తి సభకు చేరుకుంటారు. అక్కడ ఖిల్లాఘనపురం, పెద్దమందడి, పెబ్బేరు మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు రెండొందల మంది కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం కేసీఆర్ గంట సేపు ప్రసంగిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా 6గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. ఇక్కడ గంటసేపు ప్రసంగించి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. సీఎం సభ జరిగే రెండు చోట్లా జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించింది. సీఎం ప్రసంగంపై ఆసక్తి.. ఈ నెల 29న మహబూబ్‌నగర్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించుకున్నారని... తర్వాత సీఎంను చేశారన్నారు. అయినా.. కేసీఆర్ మాత్రం ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. అలాగే ఇటీవల టీఆర్ఎస్ను వీడి కమలం గూటికి చేరిన మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి.. బీజేపీ బహిరంగసభలో కేసీఆర్‌ను విమర్శించారు. ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సైతం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. దీంతో ఆదివారం బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. మోదీ, జితేందర్‌రెడ్డి, అరుణపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారో అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో తాత్సార్యం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. సంక్షేమమే ఎజెండా... ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ఏజెండాగా బరిలో దిగిన గులాబీ పార్టీ వీటినే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. ప్రస్తుతం రెండు పార్లమెంట్ పరిధుల్లో 14అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం.. పార్లమెంట్‌కు ఒకరి చొప్పున వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవులు అప్పగించడం రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల విజయానికి కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు రెండు స్థానాల్లోనూ త్రిముఖ పోటీ నెలకొనడం.. మహబూబ్‌నగర్‌లో బీజేపీ, టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వనుండడంతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ అదే వేదికపై స్థానిక నేతలు, ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
‘వారిద్దరికీ ఆనందం, ఆశ్చర్యం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజా కూటమి, అధికార టీఆర్ఎస్ పార్టీలు చెప్పే వాటిల్లో పసలేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి వస్తున్న ఆదరణ, స్పందన చూసి ప్రధాని మోదీ, అమిత్ షా ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. 50కి పైగా సభలు, పార్టీ అగ్రనాయకుల ప్రచారంతో బీజేపీకి గెలుపు మీద భరోసా వచ్చిందని లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉండడం చూసి కేసీఆర్, రాహుల్, చంద్రబాబులు బెంబేలెత్తుతున్నారని అన్నారు. దేశంలోని మిగతా చోట్ల ఎదురైన చేదు అనుభవాలే కాంగ్రెస్‌కు ఇక్కడా ఎదురౌతాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు పెట్టుబడికి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజల పార్టీలు కావాలో.. లేక కుటుంబ పార్టీలు కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. మజ్లిస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని లక్ష్మణ్ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, అధికార దుర్వినియోగం కాకుండా యువమోర్చా కార్యకర్తలు నిఘా వేయాలని సూచించారు. -
మిగిలింది మూడు రోజులే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు తిరిగామా.. లేదా.. అన్ని వర్గాలు, అన్ని సంఘాలను కలిశామా.. లేదా.. అన్న దానిపై అనుచరులతో చర్చిస్తున్నారు. కేవలం మూడ్రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు అన్ని రకాలుగా శ్రమిస్తు న్నారు. ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డి ప్రతీ ఇంటికి వెళ్లి ఓటు అడిగే ప్రయత్నం విస్తృతం చేశారు. అభ్యర్థి కుటుంబంతో పాటు బంధువర్గం, అనుచరులు ఇలా అందరూ గడపగడపకూ వెళ్లి ఓటు, బ్యాలెట్ పేపర్, సీరియల్ నంబర్ చెప్పి మరీ ప్రచారాన్ని చివరి దశకు చేర్చారు. అయితే ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు మరోసారి అన్ని వర్గాలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఊపందుకున్న ప్రలోభాలు ఓటుకు రూ.500 ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడంతా ఓటుకు రూ.2 వేలు అంతకుమించి ప్రలోభాలు సాగుతున్నాయి. భారీ స్థాయిలో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండటంతో కొన్ని పార్టీల అభ్యర్థులు ‘పంపిణీ’లో డీలా పడ్డారు. ప్రచారం ముగిసే 5వ తేదీ నుంచి ఓటు వేసే 7వ తేదీ ఉదయం వరకు దాదాపు 40 గంటల పాటు ప్రలోభ పర్వం ఊపందుకోనుంది. కొన్ని హాట్సీట్లలో అభ్యర్థుల ఖర్చు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు చేరబోతోందని ఎన్నికల కమిషన్ అంచనా వేస్తోంది. రెండు ప్రధాన పార్టీల్లో ఉన్న కీలక నేతలు, మాజీ మంత్రుల స్థానాల నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రలోభాలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓటు బాగా కాస్ట్లీగా మారిపోయిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ‘సంఘాల’ ఓట్లకు ఎర.. గ్రామాల్లో కీలకంగా మారిన మహిళా సంఘాలకు అభ్యర్థులు ఏకంగా లక్షల రూపాయలు పంచుతున్నట్టు పోలీస్ శాఖ గుర్తించింది. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మహిళా సంఘాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కో సంఘానికి రూ.1 లక్ష చొప్పున ఇవ్వడంతో పాటు ప్రతీ మూడు గ్రూపులకు ఒక బూత్ కమిటీ మెంబర్‌ను ఇన్చార్జిగా పెట్టారు. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ సంబంధిత గ్రూపునకు ఎక్కువగా డబ్బులిస్తే, అప్పటికప్పుడు మళ్లీ డబుల్ చేసి ఇచ్చేలాగా కమిటీ మెంబర్ వద్ద రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా పెట్టారు. అదే విధంగా యువజన సంఘాలు, కుల సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో పాటు 5, 6వ తేదీల్లో భారీ స్థాయిలో మద్యం సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రతీ గ్రామంలో పార్టీలకు కీలక అనుచరులుగా వారితో పాటు వారి వారి బంధువుల ఇళ్లలో మద్యం నిల్వ చేసినట్టు తెలిసింది. అయితే మరికొంత మంది అభ్యర్థులు పార్టీలకు సంబంధం లేకుండా ఉండే వారి ఇళ్లలో మద్యం నిల్వ చేసినట్టు ఆయా పరిధిలోని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దాడులకు రంగం సిద్ధం ప్రలోభాలు తారస్థాయికి చేరుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు, తదితరుల నివాసాల్లో దాడులు చేసేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఈ మేర ప్రత్యేక బృందాలను ఆదేశించినట్టు తెలుస్తోంది. కీలక నేతలుగా ఉన్న 20 నియోజకవర్గాల్లో అబ్జర్వర్లు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఒక్కో అబ్జర్వర్ ఒక్కో నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌తో దాడులు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.