వ్యాక్సిన్‌పై అపోహలోద్దు.. | Covid 19 Vaccine Awareness Program In Hyderabad | Sakshi
Sakshi News home page

Covid-19: వ్యాక్సిన్‌పై అపోహలోద్దు..

Published Wed, Sep 1 2021 10:22 PM | Last Updated on Wed, Sep 1 2021 10:35 PM

Covid 19 Vaccine Awareness Program In Hyderabad - Sakshi

ధృవపత్రాలు అందజేస్తున్న నార్నె శ్రీనివాసరావు

సాక్షి,భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్‌):కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని జలవాయు విహార్‌ కమ్యూనిటీ హాల్లో వందశాతం పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన అసోసియేషన్‌ సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ వేయించుకోవడంతో కరోనా కట్టడి చేయవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ నోడల్‌ ఆఫీసర్‌ శ్రీరాములు, టాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ రెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మహదేవ్, పోతుల రాజేందర్, అశోక్‌ కుమార్, ప్రసాద్‌ పాల్గొన్నారు.  

జనతానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. 
మూసాపేట: మూసాపేట డివిజన్‌ జనతానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మంగళవారం మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై అపోహలను వీడి బాధ్యతగా టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గోపాల్, తుకారాం, విష్ణు, ఇనుగంటి రాజు, రమేష్‌ పాల్గొన్నారు.  

రామకృష్ణ వీధిలో..
ఆల్విన్‌కాలనీ: వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని రామకృష్ణ వీధిలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తవ్వడం సంతోషకరమైన విషయమని కార్పొరేటర్‌ మాధవరం రోజాదేవి రంగారావు పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఏఎంసీ నరేందర్‌రెడ్డి, టీఐ సత్యరాజుతో కలిసి సభ్యులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు చైతన్యంతో ముందుకొచ్చి టీకా వేయించుకోవాలన్నారు. రామకృష్ణ వీధిలో వంద శాతం పూర్తికి సహకరించిన పురేందర్‌ రెడ్డి, కాలనీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, వెంకటేశ్వరరావు, ఆనంద్‌రావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్‌ వైరల్‌.. పోలీసులు సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement