హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన ప్రచారపర్వం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
మంగళవారం జరగనున్న పోలింగ్లో హైదరాబాద్ మహానగర ఓటర్లు 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నగర వ్యాప్తంగా 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.