Ended
-
మరోసారి కస్టడీనా.. బెయిలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ! కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు. కవితను కలసిన భర్త అనిల్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్‌రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
కొలిక్కిరాని తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ: నేడు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. దీంతో స్క్రీనింగ్ కమిటీలో సభ్యులతో ఛైర్మన్ మురళీధరన్ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నారు. తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మరోసారి జరగనుంది. అటు.. అభ్యర్థులు ఎంపిక సాగదీతతో ప్రచారంలో వెనుకబడి పోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రియాంక, రాహుల్ బస్సు యాత్రల తర్వాతనే లిస్ట్ విడుదల చేస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్రకు ముందే లిస్ట్ విడుదల చేస్తే పంచాయతీలు జరిగే అవకాశం ఉందని అధిష్టానం భయపడుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. 70 సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపికపై నేడు సమావేశమైంది. కానీ ఎటూ తేలకపోవడంతో మరోసారి సమావేశం కానుంది. ఎంపిక చేయాల్సిన దాదాపు 30 సీట్లలో ఒక్కో స్థానంలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడటంతో అభ్యర్థుల ఎంపిక కమిటీకి తలనొప్పిగా తయారైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తాం. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుంది. బిసిలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చింది. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను మేము పరిశీలించాం. అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నాం. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదే’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. ఆ 30 సీట్లలో తీవ్ర పోటీ ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
ముగిసిన కవిత సీబీఐ విచారణ.. దాదాపు 7 గంటలకు పైగా సాగిన విచారణ
-
ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
-
హుస్సేన్ సాగర్ తీరాన తొలిరోజు ముగిసిన కార్ రేసింగ్..
-
ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్
-
మునుగోడులో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
-
ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం
కౌటాల(సిర్పూర్)/కోటపల్లి(చెన్నూర్)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు. -
బ్యాంకులు, ఆటో దెబ్బ : 9 వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న దేశంలో లాక్ డౌన్ పొడిగింపు తప్పదన్న అంచనాల మధ్య కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఆరంభంలోనే బలహీనపడిన మార్కట్లు ఒక దశలో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ఠం లేదా 1.51 శాతం పడి 30,690 వద్ద, నిఫ్టీ 1.3 శాతం క్షీణించి 8995 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగ నష్టాలను మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఫార్మ, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ 10.3 శాతం, జీ 10 శాతం పతనంకాగా, ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.95 శాతం క్షీణించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.25 శాతం నష్టంతో టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇంకా ఎం అండ్ ఎం, టైటన్, విప్రో, హీరో మోటో, ఐసీఐసీఐ, బ్రిటానియా నష్టపోయాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, హిందాల్కో, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, డా. రెడ్డీస్, గ్రాసిం, సిప్లా లాభపడ్డాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ముగిసిన సాక్షి మెగా ఆటో ఎక్స్పో
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
స్వల్ప నష్టాలు: ఫార్మా వీక్, బ్యాంక్స్ అప్
సాక్షి, ముంబై: ఇటలీ, స్పెయిన్ రాజకీయ అనిశ్చితి, గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు దేశీయమార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో ట్రేడింగ్ ఆరంభంలోనే 200 పాయింట్లుపతనమైన మార్కెట్లు మిడ్‌సెషన్ కొనుగోళ్లతో రికవరీ సాధించాయి. చివరికి సెన్సెక్స్ 43 పాయింట్ల స్వల్ప నష్టంతో 34,906 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు తక్కువగా 10,614 వద్ద ముగిసింది. ఫార్మా బలహీనంగానూ, బ్యాంక్స్ సానుకూలంగానూ ముగిశాయి. హెచ్‌పీసీఎల్ 3శాతం నష్టపోగా , హిందాల్కో, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, మారుతీ, సన్ ఫార్మా, దివీస్,అరబిందో, ఐషర్, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్ నష్టాల్లో ముగిశాయి. జీఎస్కే ఫార్మా, ఆర్‌కాం, ఎక్సైడ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, యస్‌బ్యాంక్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, జీ, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
ప్రాణల మీదకు తెచ్చిన ఛాలెంజ్
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పది రోజుల క్రితం గాజులరామారం చిత్తారమ్మ జాతరలో ఉదయ్‌తేజ్ అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు డీసీపీ సాయిశేఖర్ ఆదేశాల మేరకు సవాల్‌గా తీసుకున్నారు. పోలీసులు 11 బృందాలతో గాలింపు చేపట్టి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. దీంతో భయపడ్డ కిడ్నాపర్లు ఉదయ్‌తేజ్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పొలంలో తెల్లవారు జామున వదిలి వెళ్లారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీశారు. జీడిమెట్ల పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు సిద్దిపేటకు చేరుకున్నారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు తరలించనున్నారు. -
ముగిసిన రోజా పాదయాత్ర
-
ఆత్మకూర్‌లో ముగిసిన విలు విద్యా పోటీలు
-
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
అర్ధాంతరంగా ముగిసిన ఇంపాక్ట్ ఎసెస్మెంట్ సభ
-
ముగిసిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు
దేవరకొండ దేవరకొండలో ఈ నెల 27న ప్రారంభమైన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి యూసూఫ్, షరీఫ్, శ్యామ్సన్లు గెలుపొందగా, రెండవ బహుమతి ఇలియాస్, ముజీబ్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షటిల్ ఇండోర్ స్టేడియానికి స్థలాన్ని కేటాయించేందుకు కషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కష్ణకిషోర్, తాళ్ళ సురేష్, చంద్రయ్య, భాస్కర్, బాబా, కష్ణమూర్తి, నర్సింహ్మ, ఐజాక్, రమేష్, వరికుప్పల సురేష్, శేఖర్, గిరి ఉన్నారు. -
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. జులై 2న ప్రారంభమై 48 రోజుల పాటు సాగిన ఈ యాత్ర.. నేటి పూజా కార్యక్రమంతో ముగిసిందని ఆలయ అధికారులు వెల్లడించారు. కశ్మీర్లో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాథ్ యాత్రికుల సంఖ్య కొంత తగ్గింది. 2,21,000 మంది యాత్రికులు మాత్రమే ఈ సారి అమర్నాథ్ దేవాలయాన్ని సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్నేళ్లలో యాత్రికుల సంఖ్య ఇదే తక్కువ అని తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్నాథ్ దేవాలయం సముద్రమట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు పరమశివుని దర్శనానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ సారి కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో భక్తుల సంఖ్య కాస్త తగ్గినా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు. -
అంత్యం ఆహ్లాదం
పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు ముగిసిన గోదావరి అంత్యపుష్కరాలు నిర్విఘ్నంగా ముగిసిన పర్వం వలంటీర్ల సేవలు భేష్ 12 రోజుల్లో 9.66 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు సాక్షి, రాజమహేంద్రవరం : పుష్కర పర్వం ముగిసింది. అంత్య పుష్కరాల 12వ రోజు పుష్కరఘాట్‌లో వేద మంత్రాల నడుమ సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన గోదావరి హారతిని వీక్షించి భక్త కోటి పరవశించింది. బాణాసంచా వెలుగులతో గోదావరి తీరం వీనుల విందుగా మారింది. గత పన్నెండు రోజులుగా భక్తజనం పుణ్య గోదావరిలో పుష్కర స్నానం ఆచరించి తరించింది. పసిపాప నుంచి వృద్ధుల వరకు గోదావరి మాత స్పర్శకు పులకించారు. గోదావరి తీరం వెంబడి గత పన్నెండు రోజులుగా సందడి నెలకొంది. తీరం వెంబడి ఉన్న దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. 12 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 9,66,892 మంది పుష్కర స్నానాలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండప్రదానాలు పెట్టారు. మరో పదకొండేళ్లకు పుష్కరాలు రానుండడంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా ఘాట్లకు భక్తులు పొటెత్తారు. రాజమహేంద్రవరంతోపాటు కోనసీమలోని అంతర్వేది, అయినవిల్లి తదితర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల సేవలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు ప్రతి ఘాట్‌కు డిప్యూటీ కలెక్టర్‌ను ఇన్చార్జిగా నియమించి పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించారు. ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికు లు ఎప్పటికప్పుడు ఘాట్లను శుభ్రం చేశా రు. గోదావరికి వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ బి.రాజమకుమారి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. ఘాట్లను ప్రతి రోజు పరిశీలిస్తూ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. వైద్యఆరోగ్యశాఖ పుష్కర భక్తులకు వైద్య సేవలందించింది. రోడ్లు భవనాలశాఖ, అగ్నిమాకపశాఖ, మత్యశాఖ, దేవాదాయ, విద్యుత్ శాఖలు అంత్యపుష్కరాల నిర్వహణలో తమ వంతు ప్రాత పోషించాయి. వలంటీర్ల సేవలు భేష్... అంత్యపుష్కరాలకు వచ్చిన భక్తులు వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థులు 12 రోజుల పాటు విశేష సేవలందించారు. శ్రీకల్కి మానవసేవా సంస్థ, శ్రీసత్యసాయి సేవా సంస్థ, ఆంధ్రకేసరి యువజన సంఘం, ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్ కళాశాల, ఆర్ట్స్ కాలేజీ, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ ఎంఆర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు వేకువజాము నుంచే ఘాట్ల వద్దకు చేరుకుని భక్తులకు తాగునీరు ఇవ్వడం, వృద్ధులు, వికలాంగులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, భక్తుల వస్తులు భద్రంగా చూసుకోవడం వంటి సేవలందించారు. సాంసృ్కతిక కార్యక్రమాలు ఫుల్.. ప్రేక్షకులు నిల్ అంత్యపుష్కరాల 12 రోజులు పుష్కరఘాట్, సరస్వతీఘాట్, ఆనం కళాకేంద్రం, కోటిలింగాల ఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆయా కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించకపోవడంతో ప్రేక్షకులు పలుచగా హాజరయ్యారు. పుష్కరఘాట్ ఎదురు మండపం వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతిరోజు శ్రోతలే ప్రేక్షకులుగా నిలిచారు. -
ముగిసిన గ్రేటర్ ప్రచార పర్వం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన ప్రచారపర్వం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మంగళవారం జరగనున్న పోలింగ్‌లో హైదరాబాద్ మహానగర ఓటర్లు 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. నగర వ్యాప్తంగా 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఐదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. -
ప్రశాంతంగా ముగిసిన ఏఈ రాత పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఏఈ పోస్టుల రాత పరీక్ష ప్రశాంతంగా ముగింసింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లో ఉన్నటువంటి 206 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 39,092 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 37,489 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఘనంగా ముగిసిన దేవీ నిమజ్జనోత్సవం
-
ఇంద్రకీలాద్రిపై ముగిసిన నవరాత్రి వేడుకలు
-
ముగిసిన గోదావరి పుష్కర మహాసరంభం
-
కౌన్సెలింగ్ సమాప్తం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. విద్యార్థుల్లో ఆదరణ కరువు కావడంతో ఈ ఏడాది కళాశాలల్లో లక్ష సీట్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ప్రైవేటు కళాశాల్లో అత్యధిక సీట్లు ఖాళీగా ఉండటం ఆ యాజమాన్యాలను డైలమాలో పడేసింది.రాష్ట్రంలో రానురాను ఇంజినీరింగ్ విద్యపై మక్కు వ తగ్గుతోంది. రెండేళ్లుగా ఈ పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్ కళాశాలలు పుట్టుకు రావడం ఓ వైపు, సీట్ల సంఖ్య ఏడాదికాఏడా ది పెరగడం మరో వైపు వెరసి ఇంజినీరింగ్ విద్యకు విద్యార్థులు కరువయ్యేలా చేసింది. పస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా 571 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 2,88,486 సీట్లు ఉన్నా యి. వీటిలో ప్రభుత్వ కోటా సీట్లు 2,11,889గా ఉన్నా యి. ఈ సీట్లను అన్నా వర్సిటీ నేతృత్వంలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏడాది దరఖాస్తుల సమయంలోనే ఇంజినీరింగ్‌కు ఆదరణ తగ్గిందన్న విష యం స్పష్టం అయింది. జనరల్ కోటా సీట్లకు లక్షా 70 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నా, కనీసం లక్షా నలైభై వేల వరకు సీట్లు భర్తీ అవుతాయన్న ఆశాభావం నెలకొంది. అయితే, విద్యార్థులు ముఖం చాటేయడంతో ఇంజినీరింగ్ ఖాళీల సంఖ్య గత ఏడాది కంటే అధికమయ్యాయి. సమాప్తం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు గత నెల ఏడో తేదీన అన్నావర్సిటీ శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 28 రోజుల పాటు జరిగిన కౌన్సెలింగ్ సోమవారంతో సమాప్తం అయింది. చివరి రోజు ఉద యం వరకు లక్షా ఏడు వేల మంది విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీట్లను ఎంపిక చేసుకుని అడ్మిషన్లు పొందారు. చివరి రోజు సాయంత్రం వరకు అదనంగా మరో రెండు వేల సీట్ల వరకు భర్తీ అయ్యాయి. దీంతో మిగిలిన సీట్లన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వక తప్పడం లేదు. లక్ష సీట్లు ఖాళీగా మిగిలాయి. గత ఏడాది 70 వేల వరకు సీట్లు ఖాళీగా మిగలగా, ఈ ఏడాది అదనంగా మరో 30 వేల సీట్లు ఆ జాబితాలోకి చేరాయి. సీట్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, మున్ముందు ఎక్కడ రాష్ట్రానికి ఏఐసీటీఈ కోటాను తగ్గిస్తుందోనన్న బెంగ ఓ వైపు నెలకొంటే, మరో వైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి. విద్యార్థులు కరువు గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే విధంగా సబర్బన్ ప్రాంతాల్లో విద్యా సంస్థలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఇందులో కొన్ని ఇటీవలే పుట్టుకొచ్చినవి. ఈ కళాశాలల్లో ప్రస్తుతం ఇంజినీరింగ్‌లోని అనేక కోర్సులకు విద్యార్థులు కరువయ్యారు. దీంతో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అన్నావర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. అలాగే, కొన్ని ప్రధాన ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అయితే, కొత్తగా పుట్టుకొచ్చిన కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు విద్యార్థులు లేకపోవడం గమనార్హం. సీట్ల సంఖ్యపై కౌన్సెలింగ్ అధికారి రైమండ్ ఉత్తిర రాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది లక్ష సీట్లు ఖాళీ గా ఉన్నాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇతర కోర్సుల మీద దృష్టి పెడుతున్నట్టుందని పేర్కొన్నారు. జనరల్ కౌన్సెలింగ్ సమాప్తం అయిందని, మంగళవారం అనుబంధ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. ఎస్సీ, అరుంధతీయ కోటాలో ఖాళీగా ఉన్న సీట్లు ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. అలాగే, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం ఆ విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటే, బుధవారం కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తామని తెలిపారు. -
నామినేషన్ పత్రం ముట్టింది
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ సమరంలో గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడు రోజుల్లో 52 జెడ్పీటీసీ స్థానాలు 149, 636 ఎంపీటీసీ స్థానాలకు 1,329 నామినేషన్లు వచ్చాయి. ఇక చివరి రోజు జెడ్పీటీసీలకు 440, ఎంపీటీసీ స్థానాలకు 3,359 వచ్చాయి. మొత్తం జెడ్పీటీసీలకు 589, ఎంపీటీసీలకు 4,688 పోటీ పడుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ వేయడంతో ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల పరిశీలన జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సంబంధించిన నామినేషన్ల పత్రాలను శుక్రవారం పరిశీలించనున్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి జనార్దన్ నివాస్, సహాయ రిటర్నింగ్ అధికారులు జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ ఉమామహేశ్వర్‌రావుతోపాటు మరో ఐదుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు పరిశీలించనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను మండల పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులతోపాటు ఇద్దరు సహాయ రిటర్నింగ్ అధికారులు పత్రాలు పరిశీలిస్తారు. ఈ నెల 23న తిరస్కరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ, ఈనెల 24న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సాయంత్రం 3 గంటల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. కాగా, మరో పదహారు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం కొత్త పాలక వర్గం ఏర్పడుతుంది. వ్యూహ రచనలో పార్టీలు జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఇక పార్టీలు వ్యూహ రచనలో పడ్డాయి. పార్టీల టిక్కెట్ దొరకని అభ్యర్థులు రెబెల్‌గానైనా పోటీలో ఉంటామని ప్రకటిస్తున్నారు. ఇదీ కొందరు అభ్యర్థులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. వీరిని ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. పార్టీల్లోని ముఖ్యనాయకులతో చెప్పిస్తున్నారు. వారికి తాయిలాలు ఇస్తామని బరిలో ఉండే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. దీంతో ఎంత మేరకు సఫలం అవుతారో వేచిచూడాలి. కొందరు నాయకులు జిల్లా పరిషత్ స్థానాల్లో సగం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నాయకులు జెడ్పీటీసీ స్థానాలను 30 వరకు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు వెళ్లి వివరించేందుకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అదే తరుణంలో జిల్లా పరిషత్ పోరులో సగం సీట్లు మహిళలకు కేటాయించడంతో తల్లులు, భార్యలను బరిలోకి దింపారు. దాఖలైన నామినేషన్లను బట్టి చూస్తే ఒక జిల్లా పరిషత్ స్థానానికి త్రిముఖ పోరు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ముగిసిన ఓటరు నమోదు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమైన ఓటరు నమోదు డిసెంబర్ 23తో ముగిసింది. ఈ ప్రక్రియ సుమారు 36 రోజులుపాటు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 2,16,276 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు 2,12,296 మంది యువత నుంచి దరఖాస్తులు అందాయి. సోమవారం తుదిరోజు కావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు చేసే ప్రక్రియ కూడా కొనసాగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లో పొందుపర్చే ప్రక్రియ ప్రారంభించారు. కాగా, జిల్లా అధికారులు ఇప్పటివరకు 41,654 దరఖాస్తులు కంప్యూటర్లో డాటా ఎంట్రీ చేశారు. ఇంకా 1,32,073 దరఖాస్తులను డాటా ఎంట్రీ చేయాల్సి ఉంది. -
వైభవంగా ముగిసిన కాకతీయ ఉత్సవాలు
కాకతీయుల స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేద్దామని కేంద్ర సామాజిక, సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అన్నారు. కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. గొలుసు కట్టు చెరువులతో సుభిక్షమైన పాలన కొనసాగించిన ఘన చరిత్ర కాకతీయులదన్నారు. వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రతి ఏటా కాకతీ య ఉత్సవాలు నిర్వహించేలా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడు తూ వివక్షతకు, అణిచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాటి కాలం నుంచి రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య... నేటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరు ల చరిత్ర ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గత ఏడాది *64కోట్లు విడుదల చేయగా అందులో 44 కోట్లే ఖర్చయ్యాయని, ఈసారీ *100 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకున్న ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని.. అందుకు కాకతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ పరిపాలనకు ప్రతిరూపంగా కాకతీయలు నిలిచారని, వరంగల్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఉత్సవాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, ఇకనుంచి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. సోని యగాందీ, మన్మోహన్సింగ్ కృషితో 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడబోతోందని పేర్కొ న్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో నూతన అధ్యాయం మొదలైందని, ఇప్పటినుంచి ప్రతీ ఏడాది కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు సందేశాన్ని అందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలోనే బెస్ట్ హెరిటేజ్ సిటీగా వరంగల్‌కు గుర్తింపు వచ్చిందని వివరించారు. కాకతీయుల చరిత్రతో కూడిన వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిం చడానికి *వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలరించిన ప్రదర్శనలు ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పద్మశ్రీ మాధవి ముగ్దల్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు రచయితల వ్యాసాలతో కూడిన 400ల పేజీల ‘కాకతీయ ఉత్సవాలు’ సంచికను, సీనియర్ జర్నలిస్టు గటి క విజయ్‌కుమార్ రూపొందించిన ‘మణి మా ణిక్యాలు’ సీడీని ఆవిష్కరించారు. కోటలో కిక్కిరిసిన జనం .. చారిత్రక ఖిలావరంగల్ మధ్యకోటలో మూడు రోజులుగా కొనసాగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగా యి. ఆదివారం ముగింపు వేడుకలను ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ అంజనేయులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిం చిందని చెప్పారు. కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వరంగల్ తహసీల్దార్ రవి, మిల్స్కాలని సీఐ జి.కృష్ణ, ఆర్ఐ నాగేంద్ర ప్రసాద్, ఏఈ దయాకర్, గైడ్స్ రవియాదవ్ తదితరులు హాజరయ్యారు. ముడో రోజు వేడుకలను తిలకించడానికి నగరంతోపాటు జిల్లా నలుమూల నుంచి ప్రజ లు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జియావుద్దీన్, తాడూరి రేణుక, పేరిణి సునీత ప్రకాశ్, కస్తూర్భా విద్యార్థినులు, కుప్పా పద్మజ, రుద్రవేను, కృష్ణ డాన్స్ కాలేజీ విద్యార్థినులు, కృష్ణదేవ్, ముగ్దు బృందాల ప్రదర్శనలు, సదాశివ్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి.