సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న దేశంలో లాక్ డౌన్ పొడిగింపు తప్పదన్న అంచనాల మధ్య కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఆరంభంలోనే బలహీనపడిన మార్కట్లు ఒక దశలో 600 పాయింట్లకు పైగా పతనమైనాయి. చివరికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్ఠం లేదా 1.51 శాతం పడి 30,690 వద్ద, నిఫ్టీ 1.3 శాతం క్షీణించి 8995 వద్ద ముగిసింది. ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగ నష్టాలను మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఫార్మ, మెటల్ రంగ షేర్లు లాభపడ్డాయి.
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ 10.3 శాతం, జీ 10 శాతం పతనంకాగా, ప్రైవేటు రంగ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.95 శాతం క్షీణించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.25 శాతం నష్టంతో టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇంకా ఎం అండ్ ఎం, టైటన్, విప్రో, హీరో మోటో, ఐసీఐసీఐ, బ్రిటానియా నష్టపోయాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, హిందాల్కో, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, డా. రెడ్డీస్, గ్రాసిం, సిప్లా లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment