
ఆత్మహత్య చేసుకున్న సినీ కెమెరామెన్
బంజారాహిల్స్: భార్య వేధింపులు తట్టుకోలేక సినీ కెమెరామెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్‌లో నివసించే తెలుగు సినీ కెమెరామెన్ మహ్మద్ నవాజ్..శ్వేత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా తనను భార్య వేధిస్తున్నదని, తాను ఇంతటితో జీవితాన్ని ముగించదలచుకున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తల్లి సబేరాబేగంకు ఫోన్ చేసి చెప్పాడు.
తనను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా కొంతమందితో కలిసి కొట్టిస్తున్నదని, ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తల్లికి చెప్పాడు. తాను చనిపోతున్నానని, నువ్వు, చెల్లి జాగ్రత్త అని చెప్పడమే కాకుండా ఇదే తన చివరి కాల్ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను తేరుకునే లోపే తన కొడుకు మరణ వార్త వినాల్సి వచి్చందని తల్లి సబేరాబేగం కన్నీరుమున్నీరయ్యారు.
నవాజ్‌కు చెందిన ఆస్తితో పాటు శ్వేత పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిందని, ఈ నేపథ్యంలోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా నవాజ్, ఆయన భార్య శ్వేత కొంతకాలం క్రితం జీడిమెట్లలో నివసించారు. ఇటీవలే కృష్ణానగర్‌కు వచ్చారు. నవాజ్ మీద గతంలోనే శ్వేత బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇటీవల జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కూడా భర్తపై ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment