కాకతీయుల స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేద్దామని కేంద్ర సామాజిక, సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అన్నారు. కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. గొలుసు కట్టు చెరువులతో సుభిక్షమైన పాలన కొనసాగించిన ఘన చరిత్ర కాకతీయులదన్నారు. వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రతి ఏటా కాకతీ య ఉత్సవాలు నిర్వహించేలా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడు తూ వివక్షతకు, అణిచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాటి కాలం నుంచి రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య... నేటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరు ల చరిత్ర ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర కోసం గత ఏడాది *64కోట్లు విడుదల చేయగా అందులో 44 కోట్లే ఖర్చయ్యాయని, ఈసారీ *100 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకున్న ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని.. అందుకు కాకతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ పరిపాలనకు ప్రతిరూపంగా కాకతీయలు నిలిచారని, వరంగల్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఉత్సవాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, ఇకనుంచి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు.
సోని యగాందీ, మన్మోహన్‌సింగ్ కృషితో 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడబోతోందని పేర్కొ న్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో నూతన అధ్యాయం మొదలైందని, ఇప్పటినుంచి ప్రతీ ఏడాది కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు సందేశాన్ని అందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలోనే బెస్ట్ హెరిటేజ్ సిటీగా వరంగల్‌కు గుర్తింపు వచ్చిందని వివరించారు. కాకతీయుల చరిత్రతో కూడిన వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిం చడానికి *వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలరించిన ప్రదర్శనలు
ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పద్మశ్రీ మాధవి ముగ్దల్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు రచయితల వ్యాసాలతో కూడిన 400ల పేజీల ‘కాకతీయ ఉత్సవాలు’ సంచికను, సీనియర్ జర్నలిస్టు గటి క విజయ్‌కుమార్ రూపొందించిన ‘మణి మా ణిక్యాలు’ సీడీని ఆవిష్కరించారు.
కోటలో కిక్కిరిసిన జనం ..
చారిత్రక ఖిలావరంగల్ మధ్యకోటలో మూడు రోజులుగా కొనసాగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగా యి. ఆదివారం ముగింపు వేడుకలను ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈఓ అంజనేయులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిం చిందని చెప్పారు.
కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వరంగల్ తహసీల్దార్ రవి, మిల్స్‌కాలని సీఐ జి.కృష్ణ, ఆర్‌ఐ నాగేంద్ర ప్రసాద్, ఏఈ దయాకర్, గైడ్స్ రవియాదవ్ తదితరులు హాజరయ్యారు. ముడో రోజు వేడుకలను తిలకించడానికి నగరంతోపాటు జిల్లా నలుమూల నుంచి ప్రజ లు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జియావుద్దీన్, తాడూరి రేణుక, పేరిణి సునీత ప్రకాశ్, కస్తూర్భా విద్యార్థినులు, కుప్పా పద్మజ, రుద్రవేను, కృష్ణ డాన్స్ కాలేజీ విద్యార్థినులు, కృష్ణదేవ్, ముగ్దు బృందాల ప్రదర్శనలు, సదాశివ్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి.
వైభవంగా ముగిసిన కాకతీయ ఉత్సవాలు
Published Mon, Dec 23 2013 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement