Balaram Naik
-
కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి : ఎంపీ బలరాంనాయక్
ఖమ్మం: కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. బుధవారం మణుగూరులోని డీవీ గ్రాండ్ హాల్లో పినపాక నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో అక్రమాలకు పాల్పడి రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పినపాక, భద్రాచలం నియోజవర్గాల్లో రూ.కోట్ల నిధులతో రహదారి సౌకర్యం కల్పించానని, మణుగూరుకు అదనపు రైలు సౌకర్యం తన హయాంలోనే వచ్చిందని వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు పులుసుబొంత, సీతమ్మసాగర్, వట్టి వాగు తదితర సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో మారుమూల గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు, రూ.20 కోట్లతో మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బలరాంనాయక్‌ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఈ నెల 6న తుక్కగూడలో జరిగే భారీ బహిరంగ సభకు తరxలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు పీరినాకి నవీన్, గొడిశాల రామనాధం, ఓరుగంటి భిక్షమయ్య, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, పాయం రామనర్సయ్య, శివ సైదులు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొర్సా ఆనంద్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, మణుగూరు వైస్ ఎంపీపీ కేవీరావు, భద్రాద్రి జిల్లా కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు భోగినేని వరలక్ష్మి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు బషీరుద్దీన్, సామాశ్రీనివాసరెడ్డి, గాండ్ల సురేశ్ పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ అన్నారు. జ్వరంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బట్టా విజయ్గాంధీని బుధవారం ఆయన పోలవరం గ్రామంలో పరామర్శించి మాట్లాడారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయన్నారు. అనంతరం బలరామ్ నాయక్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇవి చదవండి: ‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’ -
తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు..
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మొదలైన వెంటనే వరంగల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ ముఖ్యుల్లో భేదాభిప్రాయాలున్నా.. అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కడియం కావ్యను ఖరారు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించేందుకు చేపట్టిన కసరత్తు తుది దశకు చేరే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతుండడంతో బ్రేక్ పడుతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ కీలక స్థానం కావడంతో బలమైన వ్యక్తులను బరిలో దింపేందుకు ఆ రెండు పార్టీలు యోచిస్తున్నందుకే తాత్సారం జరుగుతోంది. బీజేపీ ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ హోలీ తర్వాతే అని అనడంతో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాలోతు కవిత, అజ్మీరా సీతారాంనాయక్, పోరిక బలరాంనాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించాయి. వరంగల్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు జిల్లాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. స్టేషన్‌ఘన్‌పూర్ మినహా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీజేపీ విషయానికొస్తే మొదట మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ తదితరుల పేర్లు వినిపించగా.. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కమలం గూటికి చేరడంతో సమీకరణలు, అంచనాలు తారుమారయ్యాయి. అదే విధంగా కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్ తర్వాత దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, సింగపురం ఇందిర పేర్లను మెజార్టీ నేతలు సూచించగా.. తాజాగా వరంగల్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అభ్యర్థి ప్రకటన విషయంలో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పునరాలోచనలో పడింది. ‘హస్తిన’లోనే తుది నిర్ణయం.. బీజేపీలో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు 64 మంది దరఖాస్తు చేసుకోగా.. అర డజన్ మందికి పైగా సీరియస్‌గా పోటీపై ఆసక్తి చూపుతున్నారు. దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, నమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, హరికోట్ల రవి తదితరులు ఇంకా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా కొందరు మంత్రులు.. ఎమ్మెల్యేలను కలిసిన పైన పేర్కొన్న ఆశావహులందరి ఆశలను సైతం కొట్టేయడం లేదు. దీంతో ఎవరికి వారుగా టికెట్ కోసం ఆశ పడుతుండగా.. పీఈసీ మాత్రం ముగ్గురు పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపించగా.. ఢిల్లీలో త్వరలోనే తుది నిర్ణయం జరుగుతుందంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్, మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బొజ్జపల్లి సుభాశ్లో ఒకరికి టికెట్ వస్తుందని భావించారు. అయితే.. ఈనెల 12న ఆ పార్టీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరారు. దీంతో ఆయనకే దాదాపు వరంగల్ టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కాకుండా.. ఇటీవల పార్టీలో చేరిన వారికే టికెట్ ఇచ్చే పరిస్థితులు ఆ రెండు పార్టీలకు అనివార్యంగా మారాయి. ఈనేపథ్యంలో ఆశావహులు, పార్టీ కేడర్ నుంచి నిరసనలు ఎదురుకాకుండా ఉండేందుకు వారిని బుజ్జగించిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించే ఉద్దేశంతో రెండు పార్టీలున్నాయి. ఇవి చదవండి: బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ నవ్వులపాలు!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఘోరంగా తడబడ్డారు. వరంగల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన భేటీలో గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో.. తప్పు తప్పుగా మాట్లాడారు. దీంతో సొంత నేతల మధ్య నవ్వులపాలయ్యారు. తొలుత.. కాంగ్రెస్ అధికారంలోకి ఏం ఏం చేస్తుందనేది చెబుతూ పోయారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తే రూ. 5 వేలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆపై నేతలు అప్రమత్తం చేయడంతో.. రూ.500కేనంటూ మాట్లాడారు. ఇక బీజేపీ ప్రభుత్వం రూ. 12, 000 గ్యాస్ సిలిండర్ ఇస్తోందని అనడం.. వెనక నుంచి సరిదిద్దే యత్నం చేశారు. ఒకవైపు కార్యకర్తల గోల మధ్య ప్రసంగం కొనసాగిస్తున్న ఆయన.. అలా తడబడినట్లు అర్థమవుతోంది. కానిస్టేబుల్ అయిన బలరాం నాయక్.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి ఎన్నికయ్యారాయన. మన్మోహన్సింగ్ కేబినెట్లో కేంద్రమంత్రి(సహాయ) గా పని చేశారు కూడా. ఇదీ చదవండి: వరద సాయం.. ఇట్లనేనా ఉండేది రిపోర్ట్? -
ఎమ్యెల్యే VS రిమ్స్ డైరెక్టర్
-
రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు
-
రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో వైద్య ఖాళీల భర్తీకి వైద్యులే అడ్డుపడుతున్నారంటూ రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులకు లేఖలు రాశాను. ఖాళీలు భర్తీ చేస్తే ఉన్న వైద్యులకు ఏ ఇబ్బందులు ఉండవు. అయినా వారు ఒప్పుకోవడం లేదు. నా సీటు నా పోస్టు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా వైద్యులకు వత్తాసు పలుకుతూ రిక్రూట్మెంట్ వద్దంటూ.. రాజకీయం చేస్తున్నారు. ఉన్న సౌకర్యాలతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాము. 90శాతం నుంచి 100శాతం వరకు పనిచేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ బలరామ్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి 10మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు పరారైన సంగతి తెలిసిందే. (10మంది కరోనా రోగులు పరారీ!) -
తెగని ఉత్కంఠ.. ప్రత్యర్థులెవరో!
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా బలరాంనాయక్ పేరు ఖరారు కావడంతో అందరి చూపు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులెవరనేదానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావటంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయనే భావనతో ఉన్న అధిష్టానం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో దాన్ని పునరావృతం చేయకూడదని భావించింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఎనిమిది మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థులను ప్రకటించింది. మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్‌ను మానుకోట కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఎంపీ ఎన్నికల బరిలో బలరాంనాయక్ పోటీచేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసింది. 44 మంది దరఖాస్తు లోక్‌సభలో గెలుపే లక్ష్యంగా, రాష్ట్రంలో శాసన సభ్యులు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో డీసీసీ, పీసీసీ స్థాయిల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిచింది. మానుకోట ఎంపీ స్థానానికి రాష్ట్రంలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు, విపక్ష పార్టీలు సైతం దృష్టిసారించాయి. రాష్ట్ర స్థాయిలో వడపోత పూర్తి చేసి మూడు రోజుల క్రితం ఏఐసీసీ స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలో ఒక్కో నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సీఈసీలో చర్చించి తొలి జాబితాను ఖరారు చేశారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులతో ఉన్న అనుబంధం ఉండటంతో బలరాంనాయక్ వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలిసింది. ముగ్గురిలో ఎవరికో.. కాంగ్రెస్ అభ్యర్థి తేలడంతో పాటు, రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై జిల్లాలో జోరుగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. కేసీఆర్ ఈ సారి ఇద్దరూ ముగ్గురు సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వలేమని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఎంపీ సీతారాంనాయక్‌కు టికెట్ రాకపోవచ్చనే ఊహగానాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్నాయి. మరో వైపు మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, ఢిల్లీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్‌లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు తేలనున్న బీజేపీ అభ్యర్థి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను పరిశీలిస్తోంది. మానుకోట స్థానం నుంచి జాటోతు హుస్సేన్‌నాయక్, యాప సీతయ్య, చందా లింగయ్య దొరల పేర్లను పరీశీలిస్తున్నారు. -
పార్లమెంటులో ఓరుగల్లు దిగ్గజాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లోక్‌సభ సభ్యులుగా దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఉన్నత పదవులు అధిష్టించి, వాటికి వన్నె తెచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గాలుండేవి. వరంగల్ లోక్‌సభ స్థానం 1952 సంవత్సరంలో ఏర్పాటైంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వారిధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దయింది. ఓరుగల్లుకు చెందిన పీవీ నర్సింహారావు భారత ప్రధానిగా సేవలందించి మన్ననలు పొందారు. గిరిజన ఎంపీగా ఎన్నికైన పోరిక బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మైనార్టీ వర్గానికి చెందిన కమాలోద్దీన్ అహ్మద్ మూడుసార్లు హన్మకొండ, ఒకసారి వరంగల్ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా సేవలందించారు. పీవీ.. మన ఠీవి.. హన్మకొండ నుంచి 1977, 1980లో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన పీవీ.నర్సింహారావు ఆ తర్వాత భారత దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురల నుంచి కూడా గెలుపొందారు. మూడు రాష్ట్రాలలో ఎంపీగా ఉన్న తెలుగు నేతగా రికార్డుకు ఎక్కారు. అయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చారు. 1980–1989 మధ్యకాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టారు. 1962లో తొలిసారిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా 1971 వరకు మంత్రిగా కొనసాగారు. 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ.నరసింహరావు బాధ్యతలు చేపట్టారు. 1973వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కడియం ఎంపీగా... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం వరంగల్ ఎంపీగా పని చేశారు. వరంగల్ ఎంపీ ఎస్సీకి రిజర్వ్ కావడంతో 2014లో కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికైన ఆరు నెలల తరువాత రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా కమాలోద్దిన్ అహ్మద్ వరంగల్‌కు చెందిన హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు, వరంగల్ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొంది కమాలోద్దిన్ అహ్మద్ చరిత్ర సృష్టించారు. 1980లో వరంగల్ ఎంపీగా, 1989, 1991, 1996 సంవత్సరాల్లో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా సైతం గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగుసార్లు గెలుపొందిన సురేందర్‌రెడ్డి రామసహాయం సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1967, 1989, 1991లలో వరంగల్ ఎంపీగా, 1965లో ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1996లో వరంగల్ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు. మంత్రిగా కమలకుమారి భద్రాచలం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు కమలకుమారి గెలుపొందారు. 1989లో సోడే రామయ్యపై, 1991లోనూ ఆయనపైనే విజయం సాధించారు. ఒక్కసారి కేంద్ర మంత్రిగా సైతం పని చేశారు. కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009లో ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుత మంత్రి... ఒకప్పటి ఎంపీనే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో వరంగల్ ఎంపీగా పనిచేశారు. 2008లో ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపొంది, చంద్రబాబు కెబినేట్‌లో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. -
‘దేవాలయ భూములు ఆంధ్రకు అమ్ముకున్నారు’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మండలాలు అమ్ముకొని పూట గడపుతున్న కేటీఆర్‌కు తనను తప్పు పట్టే అర్హత లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కేవలం 180 గ్రామాలు మాత్రమే ఆంధ్రలో కలిశాయని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కూనవరం, వీఆర్ పురం, చింతూరు, భద్రాచలం రూరల్, అశ్వాపురం రూరల్ తదితర మండలాలను ఏపీలో కలిపారన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టు, పోడు భూములు, దేవాలయ భూములు ఆంధ్రకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులా తనపై ఆరోపణలు చేసేది అంటూ బలరాం నాయర్ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. -
రైతుల ఆందోళనలు పట్టని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్ యాక్ట్ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
ఓయూ బీఈడీ కళాశాల పేరు మార్పు
హైదరాబాద్: ఓయూ క్యాంపస్‌లోని బీఈడీ కళాశాల పేరును మార్పు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బలరామ్‌నాయక్ గురువారం తెలిపారు. గతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ గా ఉన్న పేరును యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యు కేషన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. ఎంహెచ్ఆర్డీ పథకం కింద 1996– 97లో ఐఏఎస్ఈగా నామకరణం చేసినట్లు చెప్పారు. బీఈడీ కళాశాల కొత్త భవనం నిర్మా ణం కోసం వీసీ రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.5 లక్షల వ్యయంతో లైబ్రరీని ఆధు నీకరించి ఈ–లైబ్రరీని ప్రారంభిం చామన్నారు. -
రిజర్వేషన్లపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు
బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్త శుద్ధి లేదని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నిజంగా కేసీఆర్‌కు చిత్త శుద్ధి ఉంటే ముందుగా రాష్ట్రంలో వాటిని అమలు చేశాక కేంద్రానికి పంపి ఉండేవార న్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులను దేశంలోనే నంబర్ వన్‌గా మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్‌కు రైతు సమస్యలను పరిష్కారించాలనే చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేత దొంతు మాధవరెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పుడో రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామనడం కాదని, ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. -
కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముందు మాటల యుద్ధం నెలకొని ఆ తర్వాత గిరిజన నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బలరాం నాయక్ పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ మండిపడ్డారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్యుద్థం చోటుచేసుకుని వెంటనే ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఇతర కాంగ్రెస్ సభ్యులు వారి వివాదంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. -
అటు కారు.. ఇటు ఆటో...
సాక్షి, హన్మకొండ: అనుకున్నట్లే అయింది... ఊహిం చిందే జరిగింది. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు కేంద్ర మాజీ మంత్రి బలరాం విజ యావకాశాలకు దెబ్బకొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన కారు జోరుకు ఆటో వేగం సైతం తోడయ్యింది. ఫలి తంగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యూరు. గత ఎన్నికల సమయానికి జిల్లాలో పెద్దగా ఎవరికి పరిచయం లేకుం డా చివరి నిమిషంలో మహబూబాబాద్ పార్లమెం ట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిల్చున్న బలరాం నాయక్... ఏకంగా కేంద్ర మం త్రి పదవిని దక్కించుకున్నారు. 2014 మార్చిలో ఎన్నికల సీజన్ మొదలయ్యే నాటికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లో కాంగ్రెస్ నుంచే కాకుండా ప్రత్యర్థి పార్టీ ల్లో సైతం ఆయనకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కనుచూపుమేరలో ఎవరూ లేరు. మానుకోట, నర్సంపేట, ములుగు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆయన హవానే కొనసాగింది. ఈ ఎన్నికల్లో బలరాంనాయక్ గెలుపు నల్లేరుపై న డకే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తీరా... ఎన్నికలు జరిగి ఫలితాలు ప్రకటించే సరికి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చేతిలో 30,654 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దొంతి దెబ్బ ఎన్నికలు సమీపించే నాటికి కేంద్రమంత్రి బలరాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతిమాధవరెడ్డి మధ్య సత్సంబంధా లు ఉండేవి. కాంగ్రెస్ చివరి నిమిషంలో దొంతిని కాదని నర్సంపేటలో కత్తి వెంకటస్వామిని బరిలో నిలిపింది. దీంతో దొంతి మాధవరెడ్డి రెబల్‌గా బరిలో నిలి చి ఆటో గుర్తుపై పోటీ చేశారు. ఆటో, కా రు రెండు గుర్తులు పోలి ఉన్న నేపథ్యం లో ఓటర్లు పొరబడే అవకాశముండడం తో దొంతి మాధవరెడ్డి తన ప్రచారంలో రెండు ఓట్లూ ఆటోకే వేయాలని ముమ్మర ప్రచారం చేశారు. దీర్ఘకాలంపాటు నర్సం పేట కేంద్రంగా రాజకీయాలు నెరిపిన దొంతి తనకంటూ సొంత వర్గాన్ని తయా రు చేసుకున్నారు. పైగా చివరి నిమిషం లో టికెట్ నిరాకరించడంతో ఆయనకు సానుభూతి కూడా తోడయింది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సైతం దొంతి వెంట న డిచాయి. ఫలితంగా నర్సంపేటలో దొం తి ప్రచారం చేసిన ఆటో గుర్తుకు భారీగా ఓట్లు వచ్చి పడ్డాయి. అసెంబ్లీకి పోటీ చేసిన దొంతి మాధవరెడ్డికి 76,144 ఓట్లు రాగా... కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కత్తి వెంకటస్వామికి కేవలం 6,638 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పార్లమెంట్‌కు సంబంధించి బలరాంనాయక్‌కు కేవలం 13,404 ఓట్లే వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డికి 66,777 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి 75,400 ఓట్లు వచ్చాయి. కానీ... పార్లమెంటుకు వచ్చే సరికి క్రాస్‌ఓటింగ్ జరిగి బలరాంనాయక్‌కు 5,633 ఓట్ల ఆ ధిక్యం వచ్చింది. ఈసారి పరిస్థితి తారుమారై కాంగ్రెస్ ఓట్లు పార్లమెంటు పరిధి లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పా యం చందర్రావుకు పడ్డాయి. ఇక్కడ ఆ యనకు కేటాయించిన ఆటో గుర్తుకు మొ త్తం 60,583 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో తొంభై శాతం దొంతి సానుభూతి పరులవే. ఈ ఓట్లన్నీ బలరాంనాయక్‌కు వచ్చి ఉంటే విజయం ఆయన పక్షానే నిలిచేది. చీలిన లంబాడ ఓట్లు గత ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన బల రాంనాయక్‌కు టికెట్ ఇవ్వగా... మహా కూటమి తరఫున కోయ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అ ప్పుడు చాలా నియోజకవర్గాల్లో లంబాడ ఓట్లు చీలి బలరాంనాయక్‌కు పడ్డాయి. ఇల్లందు, ములుగులో అసెంబ్లీకి సంబంధించి టీడీపీకి చెందిన కోయ ఎమ్మెల్యే గెలుపొందగా... ఈ రెండు చోట్ల పార్లమెంట్ మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. కానీ... ఈసారి కాంగ్రెస్తోపా టు టీఆర్ఎస్ లంబాడ వర్గానికి సీట్లు కేటాయించడం బలరాంకు కలిసిరాలేదు. -
కేసీఆర్‌తో ఒరిగేదేమీ లేదు: బలరామ్ నాయక్
కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ మణుగూరు, న్యూస్‌లైన్: కేసీఆర్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని కేంద్ర మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలన్నా, ఎస్సీలన్నా కేసీఆర్‌కు పడదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. దళిత మహిళను ముఖ్యమంత్రిగా చే స్తుందని పార్టీ నేత రాహుల్ ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. గిరిజనులను ముంచే పోలవరాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే నిరాహార దీక్ష చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను గెలిస్తే.. నియోకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలు తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కుడితిపూడి కోటేశ్వరరావు, సోమరాజు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
ఖమ్మం సీపీఐకే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పార్లమెంటు స్థానాల విషయంలో ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి ఇవ్వాలని, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు మళ్లీ అవకాశం కల్పించాలని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లేదంటే రాహుల్‌గాంధీ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ నిర్ణయంలో మార్పు ఉండదని, ఒకవేళ సీపీఐతో సీట్ల సర్దుబాటు లేకుంటే మాత్రం ఖమ్మం ఎంపీ అభ్యర్థిని బరిలో దింపుతారని అంటున్నారు. ఇక, అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి అనేక మార్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాల విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. పొత్తు కుదిరితే సీపీఐకి కొత్తగూడెం ఇవ్వాల్సి వస్తుందని, అలా జరిగితే వనమా వె ంకటేశ్వరరావును ఏం చేయాలన్నది ఢిల్లీ పెద్దలకు తలబొప్పి కట్టిస్తోంది. ఆయనను ఖమ్మం అసెంబ్లీకి పంపుదామనుకున్నా, యూనిస్‌సుల్తాన్, పువ్వాడ అజయ్‌లు ఆ సీటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక పొత్తులో భాగంగా పోయే మరో స్థానం పినపాకలో. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావును భద్రాచలం పంపుతారనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవతికి మొండిచేయి చూపినట్టే. పాలేరు, మధిర, సత్తుపల్లి స్థానాలకు రాంరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్‌ల పేర్లు అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని పార్టీ వర్గాలంటున్నాయి. వైరా కూడా సర్దుబాటులో సీపీఐ తీసుకుంటుంది కనుక ఇల్లెందు, అశ్వారావుపేట స్థానాల్లో అభ్యర్థులను తేల్చాల్సి ఉంది. వీరందరి పేర్లను నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ వెనుకబాటు
మహబూబాబాద్/నర్సంపేట/జనగామ, న్యూస్‌లైన్ : తెలంగాణ అన్ని విధాలుగా వెనుకబడటానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కార ణం.. ఆ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహబూబాబాద్, నర్సంపేట, జనగామ పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానుకోటలో హరీష్‌రావు మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమకు అవసరమైన వనరులు న్నా ఏర్పాటు చేయలేదు.. కేంద్రమంత్రి బలరా మ్ నాయక్ గిరిజనుడై ఉండి, గిరిజన సమస్యలను పట్టించుకోలేదు.. మానుకోట అన్ని విధా ల అభివృద్ధి కుంటుపడటానికి పాలకుల నిర్లక్ష్య మే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటున్న తరుణంలో పార్టీని బతికించుకోవడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టం ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం సీపీఐ కూడా ఉద్యమించిందని తెలిపా రు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మానుకోటలో ఐటీడీఏ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఏడాదిలోపే తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ నాయకులు మడత కాళిదాస్, తమ్మెర విశ్వేశ్వరరావు, విజయ్‌సారథి, అజయ్, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్, జి.అంజయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి అనిత నెహ్రూనాయక్, శంకర్‌నాయక్, సంగులాల్, నెహ్రూనాయక్, జిన్నారెడ్డి పద్మజ, జేరిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వారిని గెలిపిస్తే గులాంగిరీ చేస్తరు.. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే చంద్రబాబు వద్ద, కాంగ్రెస్ వారిని గెలిపిస్తే ఢిల్లీలో గులాంగిరీ చేస్తారే తప్ప ప్రజలను పట్టించుకోర ని హరీష్‌రావు విమర్శించారు. నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవూలలు వేసి నివాళులర్పించిన అనంతరం రోడ్ షోలో మాట్లాడారు. నర్సంపేటలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్‌లుగా పాలించి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కనీస సౌకర్యాలు కల్పించని మీరు ఏం ముఖా లు పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుండా టీడీపీ నాయుకులు అడ్డుకుని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఆయున వెంట పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీతారాంనాయుక్, రాంచాం దర్ నాయుక్, శ్రీజానాయుక్, నయీమొద్దీన్, వుర్రి యూదవరెడ్డి, శరత్చంద్ర, ఎంవీ.రావూరావు, నంద్యాల కృష్ణారెడ్డి, మోతె జైపాల్‌రెడ్డి, నారుుని నర్సయ్యు, కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, పుట్టపాక కువూరస్వామి, వుచ్చిక నర్సయ్యు, వూజీ సర్పంచ్ గుంటి కిష న్, దార్ల రవూదేవి, గుండె బోరుున కొంరయ్యు, తదితరులు పాల్గొన్నారు. జనగామకు ‘పొన్నాల’ చేసిందేమీ లేదు మంత్రిగా పదేళ్లపాటు కొనసాగిన ప్రస్తుత టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామ అభివృద్ధికి చేసిందేమి లేదు.. ఆడుకుందామంటే క్రీడా మైదానం లేదు.. కూర్చుందామంటే పార్కులేదు.. మోరీలు లేవు.. దోమలను చూసి ఇక్కడోళ్లకు పిల్లనిచ్చే పరిస్థితి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నేత హరీష్‌రావు విమర్శించారు. రాత్రి జనగా మ పట్టణంలోని 1, 11 వార్డుల్లో నిర్వహించి న రోడ్‌షోలో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం లో భాగంగా తెలంగాణను 24 జిల్లాలుగా.. అందులో జనగామన జిల్లా కేంద్రంగా చేసి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పా రు. కేసీఆర్‌ది కుటుంబపాలన అని విమర్శించే ముందు తన పరిస్థితి ఏమిటో పొన్నాల ఆలోచించుకోవాలన్నారు. కూట్లో రాయి తీయనోడు యేట్లో రాయి తీస్తాడా అని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలకు అవకాశం ఇచ్చాం.. అభివృద్ధి జరుగలేదు.. ఒక్కసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూసిప్తామని హరీష్‌రావు అన్నారు. రైతులకు 8 గంటల కరెంటు, ఎస్టీలకు ఉద్యోగ, విద్యలో 12 శాతం రిజర్వేషన్, మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు బక్క నాగరాజు, ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఉల్లెంగల కృష్ణ, ఆలూరి రమేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
'తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా'
వరంగల్: తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియా గాంధీ అని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో తెలంగాణ విజయోత్సవ ర్యాలీలో బలరాం నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ విజయోత్సవాలు జరపమనడం సిగ్గుమాలిన చర్య అని ఘాటుగా విమర్శించారు. రాజకీయ పునరావాసం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంటున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హైదరాబాద్‌లో అన్నారు. -
రెండు రాష్ట్రాల్లోను ఎన్నికలు : బలరాం నాయక్
సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ శనివారం ఉదయం తిరుమలలో తెలిపారు. శ్రీధర్‌బాబు రాజీనామా చేయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. అంతకుమందు ఆయన తిరుమలలో శ్రీవారిని విఐపీ ప్రారంభ దర్శన సమయంలో పాల్లొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో నాయక్‌కు వేదపండితుల ఆశ్వీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. -
కొత్త ఏడాది ఎన్నికల పరీక్ష
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాజకీయ పక్షాలకు నూతన సంవత్సరం ఎన్నికల పరీక్షగా మారనుంది. ఇప్పటికే ప్రధాన పక్షాల్లో ఎన్నికల వాతావరణం కన్పిస్తోంది. ఈ ఏడాది ప్రారం భం నుంచి నేతలు బిజీగా మారనున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ దిశగానే జిల్లా లో రాజకీయ పక్షాలు అంతర్గతంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, వామపక్షాలకు తెలంగాణ అంశం తేలడంమొక్కటే అడ్డంకిగా మారింది. విలీనం, పొత్తులు ఎలా ఉన్నా పార్టీ లు ఎన్నికల పావులు కదుపుతూనే ఉన్నాయి. పాగాకు వైఎస్సార్ సీపీ యత్నం తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేం దుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతు న్నా రు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు, కేడర్‌ను పెంచుకునేందుకు కదులుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లు, కమిటీలు ఏర్పా టు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ సంక్షేమ ఫలాలను ప్రజల ముందు కు తెచ్చేయోచనతో ఉన్నారు. కాంగ్రెస్‌కు కత్తిమీద సాము రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద గుదిబండగా మారనుంది. తెలంగాణకు కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఆ పార్టీ నేతలు ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమం, తెలంగాణ అంశాలే ప్రధానాయుధాలుగా జనంలోకి వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు లోక్‌సభ స్థానాలుండగా మహబూబాబాద్ నుంచి కేంద్రమంత్రి బలరామ్‌నాయక్, వరంగల్ నుంచి రాజయ్య తొలిసారి ఎన్నికైన వారే. మరోసారి తమ స్థానాలు ఎలా పదిలపరుచుకోవాలని యోచిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల తోపాటు కాంగ్రెస్సేతేర ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పోటీకి ఆశావహులు బెర్త ఖరారు చేసుకునే పనిలోపడ్డారు. టీడీపీలో ఊగిసలాట రెండు దఫాలు ప్రతిపక్షానికే పరిమితమైన టీడీపీకి నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అంశంపై పార్టీ నేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి తీవ్రప్రతి బంధకంగా మారుతుందనే ఆందోళన నెలకొం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ సెంటిమెంట్ తమ కొంప ముంచుతుందేమోననే బెంగపట్టుకుంది. ఇక కేడర్‌లో నెలకొన్న నిరుత్సాహం, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ ని వీడడం వారిని కలవరపరుస్తోంది. పట్టుకోసం టీఆర్ఎస్ యత్నం 2009 సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న టీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో పట్టును నిలుపుకోవాలని భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ ప్రధానాయుధంగా, పునర్నిర్మాణాన్ని ఎజెండా గా చేయాలని యోచిస్తున్నారు. ఉద్యమ ఫలి తాలు సానుకూలంగా ఉన్నా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వలోపం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, మొలుగూరి భిక్షపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా చేసిన అభివృద్ధి కంటే తెలంగాణ అంశంపైనే వీరు ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం పేరును ప్రకటించినప్పటికీ మహబూబాబాద్ అభ్యర్థి కోసం వేటసాగిస్తోంది. బీజేపీ విశ్వప్రయత్నం తెలంగాణ అంశం, మోడీ మంత్రం జపిస్తూ బీజేపీ జిల్లాపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నది. పాత సంబంధాలను పునరుద్ధరించుకుంటూ జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి నుంచే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల వేట కొనసాగిస్తోంది. బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేకపోవడం ఈ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇతర పక్షాల్లోని నేతలకు గాలం వేస్తున్నారు. జిల్లాలో పాగా వేయాలని తలపిస్తున్నారు. వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ నాయకులు తమకు బలమున్న రెండు, మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటున్నారు. ఈ దిశగా ఆ నియోజకవర్గాల్లో బలంతోపాటు ఈ దఫా ఓటింగ్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
వైభవంగా ముగిసిన కాకతీయ ఉత్సవాలు
కాకతీయుల స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేద్దామని కేంద్ర సామాజిక, సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ అన్నారు. కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుక ల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో ఆది వారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. గొలుసు కట్టు చెరువులతో సుభిక్షమైన పాలన కొనసాగించిన ఘన చరిత్ర కాకతీయులదన్నారు. వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రతి ఏటా కాకతీ య ఉత్సవాలు నిర్వహించేలా పార్లమెంటులో బిల్లు పెట్టి ప్రత్యేక నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడు తూ వివక్షతకు, అణిచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాటి కాలం నుంచి రాణిరుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య... నేటి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరు ల చరిత్ర ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం గత ఏడాది *64కోట్లు విడుదల చేయగా అందులో 44 కోట్లే ఖర్చయ్యాయని, ఈసారీ *100 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకున్న ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని.. అందుకు కాకతీయులే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ పరిపాలనకు ప్రతిరూపంగా కాకతీయలు నిలిచారని, వరంగల్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఉత్సవాలు దోహదం చేశాయని పేర్కొన్నారు. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, ఇకనుంచి టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. సోని యగాందీ, మన్మోహన్సింగ్ కృషితో 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడబోతోందని పేర్కొ న్నారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ జిల్లా చరిత్ర లో నూతన అధ్యాయం మొదలైందని, ఇప్పటినుంచి ప్రతీ ఏడాది కాకతీయుల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. భావితరాలకు సందేశాన్ని అందించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలోనే బెస్ట్ హెరిటేజ్ సిటీగా వరంగల్‌కు గుర్తింపు వచ్చిందని వివరించారు. కాకతీయుల చరిత్రతో కూడిన వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, పాపారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిం చడానికి *వంద కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలరించిన ప్రదర్శనలు ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పద్మశ్రీ మాధవి ముగ్దల్ బృందం ప్రదర్శించిన ఒడిస్సీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు రచయితల వ్యాసాలతో కూడిన 400ల పేజీల ‘కాకతీయ ఉత్సవాలు’ సంచికను, సీనియర్ జర్నలిస్టు గటి క విజయ్‌కుమార్ రూపొందించిన ‘మణి మా ణిక్యాలు’ సీడీని ఆవిష్కరించారు. కోటలో కిక్కిరిసిన జనం .. చారిత్రక ఖిలావరంగల్ మధ్యకోటలో మూడు రోజులుగా కొనసాగిన కాకతీయ ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగా యి. ఆదివారం ముగింపు వేడుకలను ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ అంజనేయులు ప్రారంభించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా నిర్వహిం చిందని చెప్పారు. కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వరంగల్ తహసీల్దార్ రవి, మిల్స్కాలని సీఐ జి.కృష్ణ, ఆర్ఐ నాగేంద్ర ప్రసాద్, ఏఈ దయాకర్, గైడ్స్ రవియాదవ్ తదితరులు హాజరయ్యారు. ముడో రోజు వేడుకలను తిలకించడానికి నగరంతోపాటు జిల్లా నలుమూల నుంచి ప్రజ లు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జియావుద్దీన్, తాడూరి రేణుక, పేరిణి సునీత ప్రకాశ్, కస్తూర్భా విద్యార్థినులు, కుప్పా పద్మజ, రుద్రవేను, కృష్ణ డాన్స్ కాలేజీ విద్యార్థినులు, కృష్ణదేవ్, ముగ్దు బృందాల ప్రదర్శనలు, సదాశివ్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి. -
భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక బీఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామని అన్నారు. గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రూ.350 కోట్లు మంజూరు చేసిందని, ఈ వివరాలు త్వరలో తెలుపుతామని అన్నారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వే లైన్ పొడగించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచేలా పోరాడి గెలిచామని అన్నారు. అనంతరం భద్రాచలంను తెలంగాణలో కొనసాగించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షలు చేసిన పాత్రికేయులను ఆయన సన్మానించారు. తొలుత భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జ్ఞాపికను, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఓ వీరపాండియన్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, పీఆర్వో సాయిబాబా, గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, పట్ణణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, భోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు పాల్గొన్నారు. -
2014లోపే తెలంగాణ: తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జీజోఎం) ఎదుట తెలంగాణ కేంద్ర మంత్రులు తమ వాదనలు వినిపించారు. ఎస్. జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఈ ఉదయం జీఓఎంతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన పూర్తి తెలంగాణ కావాలని జీఓఎంను కోరామని భేటీ అనంతరం ఎస్ జైపాల్‌రెడ్డి విలేకరులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరామన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని సూచించామన్నారు. కృష్ణా జలాలకు ట్రిబ్యునల్ అవసరమే కానీ, గోదావరికి అవసరం లేదన్నారు. 2014లోపే రాష్ట్ర విభజన జరుగుతుందని జైపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాచలం తెలంగాణలో భాగమని మరో కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉంచాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ వెల్లడించారు. డిసెంబర్ చివరినాటికి విభజన ప్రక్రియ పూర్తి చేయాలని జీఓఎంను కోరినట్లు మరో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా ఉమ్మడి రాజధాని లేదని గుర్తు చేశారు. సోనియా మాటను గౌరవించి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటామని సర్వే తెలిపారు. ఉమ్మడి రాజధాని పరిధి కూడా జీహెచ్ఎంసీ వరకే ఉండాలన్నారు. జీఓఎంకు12 పేజీలతో కూడిన నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే దీన్ని మీడియాకు విడుదల చేసేందుకు మంత్రులు నిరాకరించారు. -
భద్రాచలం తెలంగాణలో భాగమే: బలరాం నాయక్
న్యూఢిల్లీ : భద్రాచలం తెలంగాణలో భాగమని, ఆ ప్రాంతం ఖమ్మం జిల్లాలోనే ఉండాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భద్రాచలాన్ని సీమాంద్రలో కలిపేందుకు స్థానికులు ఒప్పుకోరని ఆయన తెలిపారు. వారికి అన్యాయం జరిగితే స్థానికులు ఒప్పుకోరని అన్నారు. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణలోనే ఉండాలని జీవోఎంకు నివేదిక ఇచ్చినట్లు బలరాం నాయక్ పేర్కొన్నారు.