మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, పక్కన ఎమ్మెల్యే పాయం
మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం: కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. బుధవారం మణుగూరులోని డీవీ గ్రాండ్ హాల్‌లో పినపాక నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో అక్రమాలకు పాల్పడి రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పినపాక, భద్రాచలం నియోజవర్గాల్లో రూ.కోట్ల నిధులతో రహదారి సౌకర్యం కల్పించానని, మణుగూరుకు అదనపు రైలు సౌకర్యం తన హయాంలోనే వచ్చిందని వివరించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు పులుసుబొంత, సీతమ్మసాగర్, వట్టి వాగు తదితర సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో మారుమూల గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు, రూ.20 కోట్లతో మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బలరాంనాయక్‌ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఈ నెల 6న తుక్కగూడలో జరిగే భారీ బహిరంగ సభకు తరxలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు పీరినాకి నవీన్, గొడిశాల రామనాధం, ఓరుగంటి భిక్షమయ్య, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, పాయం రామనర్సయ్య, శివ సైదులు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొర్సా ఆనంద్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, మణుగూరు వైస్ ఎంపీపీ కేవీరావు, భద్రాద్రి జిల్లా కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు భోగినేని వరలక్ష్మి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు బషీరుద్దీన్, సామాశ్రీనివాసరెడ్డి, గాండ్ల సురేశ్ పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ అన్నారు. జ్వరంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బట్టా విజయ్‌గాంధీని బుధవారం ఆయన పోలవరం గ్రామంలో పరామర్శించి మాట్లాడారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయన్నారు. అనంతరం బలరామ్ నాయక్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఇవి చదవండి: ‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’
Comments
Please login to add a commentAdd a comment