payam venkateshwarlu
-
కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి : ఎంపీ బలరాంనాయక్
ఖమ్మం: కాంగ్రెస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. బుధవారం మణుగూరులోని డీవీ గ్రాండ్ హాల్లో పినపాక నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో అక్రమాలకు పాల్పడి రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తాను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పినపాక, భద్రాచలం నియోజవర్గాల్లో రూ.కోట్ల నిధులతో రహదారి సౌకర్యం కల్పించానని, మణుగూరుకు అదనపు రైలు సౌకర్యం తన హయాంలోనే వచ్చిందని వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు పులుసుబొంత, సీతమ్మసాగర్, వట్టి వాగు తదితర సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, పార్లమెంట్ ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో మారుమూల గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు, రూ.20 కోట్లతో మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బలరాంనాయక్‌ను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. ఈ నెల 6న తుక్కగూడలో జరిగే భారీ బహిరంగ సభకు తరxలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు పీరినాకి నవీన్, గొడిశాల రామనాధం, ఓరుగంటి భిక్షమయ్య, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, పాయం రామనర్సయ్య, శివ సైదులు, నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు కొర్సా ఆనంద్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, మణుగూరు వైస్ ఎంపీపీ కేవీరావు, భద్రాద్రి జిల్లా కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు భోగినేని వరలక్ష్మి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు బషీరుద్దీన్, సామాశ్రీనివాసరెడ్డి, గాండ్ల సురేశ్ పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరామ్ నాయక్ అన్నారు. జ్వరంతో బాధపడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బట్టా విజయ్గాంధీని బుధవారం ఆయన పోలవరం గ్రామంలో పరామర్శించి మాట్లాడారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరుతాయన్నారు. అనంతరం బలరామ్ నాయక్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇవి చదవండి: ‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’ -
అబద్ధాలు కాదు.. అభివృద్ధిని చూసి ఓటు వేయండి
సాక్షి,కరకగూడెం: గడిచిన నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు టీఆర్ఎస్కు ఓటేయాలని పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన కరకగూడెం కొత్తగూడెం, పాయంవారి గుంపు, గొల్లగూడెం, అనంతారం, తుమ్మలగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు సీమాంద్రుల పాలనలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు సువర్ణపాలన అందించారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ఆయుధాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని, ప్రజల అవసరాల మేరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. విపక్షాలు కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొలేక కూటమి కట్టి ప్రజలను మోసం చేయడానికి గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే ఓటర్లు టీఆర్ఎస్ను మరోమారు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా గ్రామస్తులకు టీఆర్ఎస్ కరపత్రాలను అందజేసారు. కార్యక్రమాల్లో సార సాంబశివరావు, ఎర్ర సురేష్, భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, వట్టం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదు...!
ఆలసత్వం వహిస్తే సహించేది లేదు అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వాడివేడిగా మండల పరిషత్ సమావేశం బూర్గంపాడు:‘మీకు పనిచేతగాకపోతే వెళ్లిపోండి.. ఎవర్ని బద్నాం చేయటానికి పని చేస్తున్నారు... హరితహారాన్ని అభాసుపాలు చేయొద్దు.. ఫొటోలకు ఫోజులిస్తే సరిపోదు.. దేనికీ సరైనా సమాచారముండదు... అధికారుల మధ్య సమన్వయం ఉండదు... ఎవరికీ బాధ్యత లేదు’ అంటూ మండల అధికారులపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో మండల అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా మండలంలో 2.67 లక్షల మొక్కలు నాటాలనే ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోందన్నారు. ఇప్పటికి 50వేల మొక్కలు నాటామని చెబుతున్న అధికారులు... ఏ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారనే నివేదికలు కూడా లేని పరిస్థితుల్లో పని చేస్తున్నారన్నారు. కనీసం 25శాతం లక్ష్యాన్ని కూడా చేరువకాలేని స్థితిలో మండల అధికారులున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంపీడీఓ, ఈజీఎస్ ఏపీఓల అలసత్వంతోనే ఈ పరిస్థితి అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఐటీసీలాంటి కార్పొరేట్ సంస్థ ఉంటే హరితహారంలో ఎందుకు భాగస్వామ్యం చేయలేదని అధికారులను ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులంటే లెక్కలేదు, సర్వసభ్యసమావేశాలంటే లెక్కలేదని అధికారులతీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ.. కనీసం స్థానికంగా జరిగే అధికారిక కార్యక్రమాలకు కూడా తమని పిలవటం లేదని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, జెడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీ, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, వైస్ ఎంపీపీ కొనకంచి బసంతీదేవి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. -
అసెంబ్లీ జరుగుతున్న తీరును ఖండిస్తున్నాం
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో ప్రజా సమస్యలపై చర్చ లేకుండా పూర్తిగా అధికారపక్షం సొంత డబ్బా కొట్టుకుంటోంది. ప్రశ్నోత్తరాలను కూడా అధికార పక్షం, వారి మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే మాట్లాడుకుని మిగిలిన సభ్యులను విస్మరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని సభలో చర్చకు రాకుండా అధికారపక్షం బుల్డోజ్ చేస్తోంది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.8వేల కోట్లలో యాభై శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ -
'రాజన్న రాజ్యం కోసం చూస్తున్నారు'
వరంగల్: తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారని పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ సీపీ తరపున ఆదివారం ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. వరంగల్ ఉపఎన్నికలో ప్రజలు వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. -
హామీలు బారెడు.. కేటాయింపులు మూరెడు
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ధ్వజం ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: హామీలు బారెడుంటే కేటాయింపులు మాత్రం మూరెడున్నాయని, ఈ అంకెల గారడీ బడ్జెట్ బంగారు తెలంగాణ కు ఎలా బాటలు వేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన టీఆర్ఎస్ హామీలు బారెడు ఉంటే వాటి అమలుకు చేసిన కేటాయింపులు మూరెడు మాత్రమేనని దుయ్యబట్టారు. గతేడాది బడ్జెట్లో భూముల అమ్మకం, కేంద్రం పన్నుల వాటా, గ్రాంట్ల ద్వారా వస్తాయని అంచనా వేసుకున్న మొత్తం రాన ప్పటికీ ఈసారి కూడా ఆయా పద్దులను భారీగా అంచనా వేయటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. దళితుల భూ పంపిణీ కోసం 1400 ఎకరాల భూమి కొనుగోలు చేయాల్సిన తరుణంలో అందుకు చేసిన కేటాయింపులు సరిగా లేవన్నారు. 2018 నాటికి 23,600 మెగా వాట్లకు పైగా విద్యుదుత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవని విమర్శించారు. పినిపాక నియోజకవర్గంలో మణుగూరుకు 1080 మెగావాట్ల పవర్ ప్లాంట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ.. వెంటనే దాని పనులు మొదలు పెట్టాలని కోరారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. దుమ్ముగూడెం ఇందిర సాగర్, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, కిన్నెరసాని ఎడమ కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బిల్లులు ఆపడం సరికాదన్నారు. తెలంగాణ అమరవీరుల సంఖ్యను అప్పట్లో 1200గా పేర్కొని ఇప్పుడు 481 మందికే లబ్ధిచేకూర్చే ప్రయత్నం సరికాదన్నారు. రుణమాఫీ అమలు చేయాలని, అంతకు ముందుగానే రైతులకు దన్నుగా ప్రతి రైతు ఖాతాలో రూ. 10 వేల చొప్పున జమ చేయాలని కోరారు. యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. -
పాయంకు ఘన స్వాగతం
బూర్గంపాడు : పినపాక నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండల పరిధిలోని పినపాకపట్టీనగర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయంను పూలదండలు వేసి ఘనంగా ఆహ్వానించారు. పినపాకపట్టీనగర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పాయం పూజలు చేశారు. అనంతరం భారీర్యాలీగా మోరంపల్లిబంజరకు చేరుకున్నారు. ఎంపీ బంజర, లక్ష్మీపురం గ్రామాలలోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం, ముసలిమడుగు, క్రాస్రోడ్లలో మహిళలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ప్రజలను ఎమ్మెల్యే అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పాయంకు స్వాగతం పలికిన వారిలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లానాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, సోమురోశిరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, బాలి శ్రీహరి, సర్వా శ్రీహరి, పొలగాని వెంకట్రావు, కైపు వెంకట్రామిరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, గాదె నర్సిరెడ్డి, పాండవుల దర్గయ్య, గనికల లక్ష్మయ్య, ప్రసన్నకుమార్, వర్సా చెటాక్, ఎంపీటీసీలు కైపు రోశిరెడ్డి, జక్కం సర్వేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, పాటి భిక్షపతి, తుమ్మల పున్నమ్మ, సర్పంచ్‌లు బొర్రా శ్రీను, బి భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలి
పినపాక, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలన్ని మాఫీ చేయాలని పినపాక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణాలన్ని మాఫీ చేస్తామని చెప్పి, ప్రభుత్వం ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ పార్టీ మాట మార్చడం పద్ధతి కాదన్నారు. రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల రుణమాఫీ కోసం ప్రజావాణి వినిపించనున్నట్లు తెలిపా రు. రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు అసెంబ్లీలో పోరాడనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అంది చాలన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి, పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. గోదావరి నది, పెదవాగుపై ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అమరారం-కొత్తూరు గ్రామాల లిఫ్ట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేపిం చినట్లు తెలిపారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై పూర్థిస్థాయిలో దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలి.. పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణ లో ఉంచాలని పార్లమెంట్, అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉడుముల ల క్ష్మీరెడ్డి, వట్టం రాంబాబు, మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు వాగుబోయిన చందర్రావు, ఇర్పా సారమ్మ, నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, తోలెం అర్జున్, గట్ల శ్రీనివాసరెడ్డి, మద్దెల సమ్మయ్య, కీసర సుధాకర్‌రెడ్డి, పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.