పాయంకు ఘన స్వాగతం
బూర్గంపాడు : పినపాక నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండల పరిధిలోని పినపాకపట్టీనగర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయంను పూలదండలు వేసి ఘనంగా ఆహ్వానించారు. పినపాకపట్టీనగర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పాయం పూజలు చేశారు. అనంతరం భారీర్యాలీగా మోరంపల్లిబంజరకు చేరుకున్నారు. ఎంపీ బంజర, లక్ష్మీపురం గ్రామాలలోని వైఎస్‌ఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం, ముసలిమడుగు, క్రాస్‌రోడ్‌లలో మహిళలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ప్రజలను ఎమ్మెల్యే అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
పాయంకు స్వాగతం పలికిన వారిలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లానాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, సోమురోశిరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, బాలి శ్రీహరి, సర్వా శ్రీహరి, పొలగాని వెంకట్రావు, కైపు వెంకట్రామిరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, గాదె నర్సిరెడ్డి, పాండవుల దర్గయ్య, గనికల లక్ష్మయ్య, ప్రసన్నకుమార్, వర్సా చెటాక్, ఎంపీటీసీలు కైపు రోశిరెడ్డి, జక్కం సర్వేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, పాటి భిక్షపతి, తుమ్మల పున్నమ్మ, సర్పంచ్‌లు బొర్రా శ్రీను, బి భిక్షం తదితరులు పాల్గొన్నారు.