పినపాక, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలన్ని మాఫీ చేయాలని పినపాక ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణాలన్ని మాఫీ చేస్తామని చెప్పి, ప్రభుత్వం ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ మాట మార్చడం పద్ధతి కాదన్నారు. రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల రుణమాఫీ కోసం ప్రజావాణి వినిపించనున్నట్లు తెలిపా రు.
రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు అసెంబ్లీలో పోరాడనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అంది చాలన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి, పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. గోదావరి నది, పెదవాగుపై ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అమరారం-కొత్తూరు గ్రామాల లిఫ్ట్ నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేపిం చినట్లు తెలిపారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై పూర్థిస్థాయిలో దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలి..
పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణ లోనే ఉంచాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణ లో ఉంచాలని పార్లమెంట్, అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉడుముల ల క్ష్మీరెడ్డి, వట్టం రాంబాబు, మండల కన్వీనర్ గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు వాగుబోయిన చందర్‌రావు, ఇర్పా సారమ్మ, నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, తోలెం అర్జున్, గట్ల శ్రీనివాసరెడ్డి, మద్దెల సమ్మయ్య, కీసర సుధాకర్‌రెడ్డి, పంతగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలి
Published Mon, Jun 9 2014 2:52 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement